పరీక్షా కాలం!


Sat,October 6, 2012 05:10 PM

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసిపోతాయనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీలతో కలిసి టీడీపీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తుందనే అనుమానాలు తెలంగాణవాదులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా 2009డిసెంబర్ 9న వచ్చిన ప్రకటన తర్వాత సీమాంధ్ర పాలక వర్గాలు చేసిన కుట్రను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు. తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి నాటి ముఖ్యమంత్రి రోశ య్య, చంద్రబాబులు కలిసి తెలంగాణను ఎలా అడ్డుకున్నారో విదితమే. అందుకే తాజా రాజకీయ పరిణామాలు ఈ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.తెలంగాణపై చిదంబరం ప్రకటన తర్వాత సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ ధన బలంతో అడ్డుకున్నారు. అయితే ఈ ప్రాంత కాంగ్రెస్, టీడీ పీ నేతలు వచ్చిన తెలంగాణను నిలబెట్టుకోలేకపోయారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తేలుస్తుందని వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా ‘కోటలో వీస్తున్న గాలి కొండల్లో లేచిన తుపానుకు చిహ్నం’అనే చైనా సామెత గుర్తుకు వస్తున్నది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చే ప్రతీసారి సీమాంధ్ర మీడియా వ్యతిరేక ప్రచారం చేస్తూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషవూపచారంతో ప్రజలను గందరగోళపరచడం వారికి అలవాటే. యువతను రెచ్చగొట్టి, హింసను రెచ్చగొట్టి దాన్ని శాంతిభవూదతల సమస్యగా చిత్రించే కుటిల యత్నాలకు సీమాంధ్ర మీడియా ఇంతకు ముందు చేసింది, ఇప్పుడూ చేస్తున్నది.

తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ఈ మీడియా ఎంతకైనా తెగిస్తున్నది. ఈ సమయంలోనే తెలంగాణవాదులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా స్థిరంగా నిలబడాలి.వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ బలపరిచిన అభ్యర్థికి మద్దతు పలకడం ద్వారా వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నటికైనా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందనే వాదనలు వినపడుతున్నాయి. మొన్న టి ఉప ఎన్నికల వరకు వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోసుకుని ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం ఆ వాదనలకు బలం చేకూరుతున్నది. ఇది అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. ఈ రెండు పార్టీలు ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారు.చంద్రబాబు కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడడం ద్వారా ప్రధానవూపతిపక్ష పార్టీ పాత్రను మరిచిపోయారు. అలాగే జగన్ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్లకార్డు పట్టి ఈ ప్రాంతంలో ఉనికి కోల్పోయారు. ఇప్పుడు సోనియాగాంధీ, కాంగ్రెస్ పట్ల తాను వ్యవహరిస్తున్న తీరుతో అటు సీమాంవూధలో తన రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నాడు.త్వరలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని టీఆర్‌ఎస్ అధినేత భావిస్తున్నారు. అదేవిశ్వాసంతో ఈ ప్రాం త ప్రజలు కూడా ఉన్నారు. అయితే దీనిపై కొంతమంది తెలంగాణవాదులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు గతంలో చేసిన మోసం ఇందుకు కారణం. ఆ భయాందోళనతోనే కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. 2014తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే మోసం జరిగే ప్రమాదమూ లేకపోలేదు. ఎందుకంటే సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణలో తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. అయితే పరిస్థితి గతం లో కంటే ఇప్పుడు భిన్నంగా ఉన్నది. తెలంగాణ ప్రజలు ఇప్పుడు మోసపోయే పరిస్థితిలో లేరు. సీమాంధ్ర నేతలు, వారి మీడియా చేస్తున్న తప్పు డు ప్రచారాలకు మోసపోకుండా ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వక తప్పదనే పరిస్థితులు కల్పించాలి. దీని కోసం రాజకీయాలకతీతంగా ప్రజలంతా ఏక తాటిపై రావాలి. ఇందు కోసం ప్రజా పోరాటాలు, ఎన్నికలు, రాజకీయ ప్రక్రియ అనే మూడు పద్ధతుల ద్వారా ఒత్తిడి తేవాలి. దశాబ్దాల మన ఆకాంక్షను నెరవేర్చుకోవాలి.

-పెండ్యాల మంగళాదేవి

35

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ

Featured Articles