చైతన్యమే శక్తి


Sat,October 6, 2012 05:11 PM

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడంతో జనం ఆశ్చర్యానికి గురయ్యారు. లంపెన్ వర్గాల పాత్రను సమాజంలోని ప్రముఖ వర్గాలలో మనం చూస్తున్నాము. చివరకి న్యాయమూర్తులకు సైతం లంపెన్ వర్గాలు దగ్గర కావడం సామాజికవిలువలు తీవ్ర సంక్షోభానికి గురవుతున్నాయనడానికి నిదర్శంగా భావించవచ్చు.సామాజిక విలువలు కొరవడిన నాయకత్వం, స్వార్థపూరిత పెత్తందారీ కోటీశ్వర్ల ఆధిపత్యం ఫలితంగా రాష్ట్ర రాజకీయ సాంఘిక ముఖచిత్రం బీభత్సదృశ్యాన్ని చూపిస్తున్నది. లంపెన్ వర్గాలు సమాజం నుంచి ధనికంగా ఎదిగి రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. లంపెన్‌శక్తులలో దొంగలు, వ్యభిచారులు, రౌడీలు, జూద ర్లు, నేరస్థులు, జులాయిగా తిరిగే మనుషులు, వ్యభిచార గృహ నిర్వాహకులు ఒక్కమాటలో చెప్పాలంటే పూర్తిగా పరాన్నబుక్కుగా జీవించేవారు వస్తారు. లంపెన్ శక్తుల ఆసరాతో ఏదో సాధించాలనుకోవడం పతనానికి పరాకాష్ట.

లంపెన్ శక్తుల గురించి కారల్‌మార్క్స్ నిశితంగా విశ్లేషించి ‘కార్మికవర్గ ఉద్యమాలకు ద్రోహం చేసి విఘాతం కలిగించే ప్రమాదకర శక్తులు’గా అభివర్ణించారు. ఫ్రాన్స్‌లో మూడవ నెపోలియన్ అధికారంలోకి రావడానికి లంపెన్ శక్తుల బలాన్ని ఉపయోగించుకున్నాడు. తానే లంపెన్ అయిన మూడవ నెపోలియన్ అన్ని వర్గాలకు అతీతశక్తిగా ఫోజుబెట్టి, కార్మికవర్గాన్ని అణచివేసి, ధనిక వర్గాల అండతో బడాకోటీశ్వరులను అంతర్జాతీయ కోటీశ్వరులుగా అభివృద్ధి చేశాడు. వైఎస్ జగన్ పార్టీ తీరుతెన్నులను చూ స్తుంటే లంపెన్ శక్తులకు ప్రోత్సాహం, అతిగా ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనపడుతున్నది. ఇతర రాజకీయ పార్టీలలో లంపెన్ శక్తులు లేవని కాదు. జగన్ పార్టీలో మంచి వారు లేరని కాదు. వైఎస్ రాజశేఖర్‌డ్డి కేసీఆర్‌పై, తెలంగాణ ఉద్యమంపై దుష్పచారం చేసేందుకు, తీవ్రమైన అపనిందలు వేయడానికి ఏమాత్రం తార్కికంగా లేని అబద్దాలు చెప్పించడంలో లంపెన్ శక్తులను వినియోగించుకున్నాడు. వైఎస్ రాజశేఖర్‌డ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు ఉన్నప్పటికి లంపెన్ శక్తులే ప్రధానమైనవనేది వాస్తవం. అదే పద్ధతిలో వైఎస్ జగన్మోహన్‌డ్డి తన రాజకీయ లక్ష్యాలను సాధించడానికి లంపెన్ శక్తులను ఉపయోగించుకొని, రాజకీయ ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నాడు.

కొండా సురేఖ దంపతులు తెలంగాణ సమాజం యావన్మంది వ్యతిరేకించినా, నిర్లజ్జగా జగన్మోహన్‌డ్డికి వత్తాసు పలికి, మానుకోట ఉద్యమకారులపై దాడి చేశారు. తెలంగాణ ప్రజల గుండెలను గాయపర్చా రు.ఈ లంపెన్ శక్తుల దాడిని తెలంగాణ ప్రజానీకం వీరోచితంగా ప్రతిఘటించారు. అది వేరే సంగతి. ఈ ఉదంతం లో గమనించవలసిన అంశం ఏమిటంటే లంపెన్ వర్గాలు తమ బాస్ మెప్పు పొందేందుకు ఎంత తీవ్రమైన ఘాతకానికయినా ఒడిగడుతాయి. అమానుషంగా ప్రవర్తిస్తాయి. లంపెన్ శక్తులు సామాజిక ప్రయోజనానికి ఎంత మాత్రం ఉపయోగపడవు. వర్షాకాలం వరదల్లో చెత్త కొట్టుకు వచ్చినట్టుగా ఉద్యమ ప్రవాహంలో లంపెన్ శక్తులు కూడా కొట్టుకొని వచ్చి ఉద్యమ ప్రవాహానికి అడ్డుపడడానికి ప్రయత్నిస్తాయి. నీటిని కలుషితం చేస్తాయి. సామాజిక విలువలపై దాడి చేస్తాయిపపంచంలో డబ్బు తప్పించి వేరే ఏమీ లేవని నిరూపించడానికి ప్రయత్నిస్తాయి.

లంపెన్ వర్గాలు పైకి బలంగా కనిపిస్తూ ఉంటాయి. సమాజంపై పెత్తనం చేసేందుకు ప్రయత్నించే దురాశ పూరిత పాలకవర్గాలు లంపెన్ వర్గాలను పెంచిపోషిస్తాయి. అధికారం అండ లేకుండా అవినీతితో సంపాదించిన ధన ప్రవాహం లేకుండా లంపెన్ వర్గాల ఉనికి లేదు. పైకి క్రూ రంగా, బలంగా కనిపించే లంపెన్ శక్తులు వాస్తవంగా పిరికివి. ప్రజలు గట్టిగా నిలబడితే లంపెన్ శక్తులు తోకముడుస్తాయి. జగన్మోహన్‌డ్డి అరెస్టు సందర్భంలో ఇచ్చిన బంద్‌కు ప్రజల సహకారం లేకపోవడంతో బంద్ విఫలమవ్వడం మాత్రమే కాదు గూండా శక్తుల ఆటలకు కళ్లెం పడ్డట్లైంది. అదే సమయంలో పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ ‘మిలియన్ మార్చ్’ ను విఫలం చేయలేకపోయిన సందర్భాన్ని మనం చూశాం.

ప్రజల మీద ఆధారపడకుండా, ప్రజల తరఫున నిలబడే వీరులపై ఆధారపడకుండా లంపెన్‌శక్తులపై ఆధారపడడం ఎంత మాత్రం సత్ఫలితాలను ఇవ్వదని మిలియన్ మార్చ్ నిరూపించింది. మాటల్లో కాకుండా చేతల్లో ప్రజలపై విశ్వాసాన్ని, ప్రజల విజ్ఞతపై నమ్మకాన్ని ప్రదర్శించినప్పుడే, రాజకీయ నాయకత్వం దీర్ఘకాలికంగా మనగలు గుతుంది. ప్రజలు కేవలం వారి తక్షణ ప్రయోజనాలకే ప్రాముఖ్యం ఇస్తారనేది పాక్షిక సత్యం మాత్రమే.ఒక ఆకాంక్ష కోసం ఎంత సుధీర్ఘ కాలమైనా పోరాడుతారన్నదానికి చరిత్రలో ఎన్నో ఉదాహర ణలున్నా యి. రాష్ట్రసాధన ఉద్యమంలో తెలంగాణ సమాజం చేసిన వీరోచిత త్యాగాలను, ఉద్యమాలను చూస్తున్నాం. ప్రజా ఉద్యమాలు, ప్రజా చైతన్యం మాత్రమే లంపెన్ శక్తులను అరికట్ట కలుగుతుంది.

-పెండ్యాల మంగళాదేవి

35

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ-లౌకికవాదం

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగా

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ

Featured Articles