తెలంగాణ-లౌకికవాదం


Sat,October 6, 2012 05:11 PM

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని తెలంగాణవాదం కోరుతున్నది. ప్రగతిపథంలో పయనించడం కోరుకుంటున్నది. తెలంగాణ వర్గాల, సబ్బండవర్ణాల అభివృద్ధి తెలంగాణ సాధనతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. దీనికోసం వలసాం ధ్ర పాలన నుంచి విముక్తి కోరుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణవాదం లౌకికవాదం ఆలంబనంగా ముందుకుపోతున్నది. కానీ ఈ మధ్యన తెలంగాణవాదా న్ని మతదృష్టితో చూస్తూ తెలంగాణవాదంపై బురదజల్లే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. మరికొందరు తమ స్వార్థ రాజకీయాలకోసం తెలంగాణ వాదానికి లేని అపవాదులు అంటగడుతున్నారు.మత తత్వవాదానికి చేరువ అవుతున్న దని, లౌకికవాదాన్ని విడనాడతున్నదని ఆరోపిస్తున్నారు. నిజానికి లౌకికవాదం అంటె ఏమిటి? లౌకికవాదాన్ని అనేకమంది అనేక విధాలుగా నిర్వచించి దానిని ఒక బ్రహ్మపదార్థంగా మార్చారు. మరికొందరు తమకు తోచిన విధంగా, తమకు అను కూలంగా భాష్యం చెప్పుకున్నారు. రకరకాల భాష్యాలతో లౌకికవాదాన్ని ఆచరణలోమిథ్యావాదంగా చేశారు. మరో మాటలో చెప్పాలంటే.. లౌకికవాదాన్ని ‘మాటల వరకే పరిమితమయ్యే, అమలు చేయలేని భావనగా దిగజార్చారు.’ నిజానికి లౌకికవాదమంటే..‘రాజకీయాలపై మత ప్రభావం ఉండకపోవటం’గా చెప్పుకోవచ్చు. ఏ రాజకీయ కార్యకలాపమైనా అది అధికార పార్టీ వ్యవహారమై నా కానీ, ప్రతిపక్షాల వ్యవహారమైనా కానీ మత ప్రభావం లేకుండా ఉండటమన్నమాట. కానీ దేశంలోని రాజకీయ పార్టీలు ఓట్లకోసం లౌకకవాదం జపం చేస్తూనే ఆచరణలో లౌకికవాదానికి తూట్లు పొడుస్తున్నాయి. మతవాద రాజకీ యాలు చేస్తూనే..

లౌకికవాదం జపం చేస్తున్నాయిపాచీనకాలంలో దేవుళ్ల పేరిట, మతం పేరిట యుద్ధాలు నడిచేవి. రాజకీయాలతో మతానికి విడదీయరాని సంబంధం ఉండేది. ప్రాచీన భారతంలో మతాన్ని రాజకీయానికి దూరంగా ఉంచి, మతాన్ని రాజకీయానికి వేరుగా చూసి మహా సామ్రాజ్య నిర్మాణానికి కారణమైన చాణక్య, విష్ణు గుప్తుడు మినహాయస్తే మతా న్ని రాజకీయాలను వేరుగా చూసిన వారు చరి త్రలో తక్కువ. ఆధునిక కాలంలో ఇటలీ దేశస్తు డు, రాజనీతి తత్వవేత్త మాకియ మతము, రాజకీయాలు వేరువేరుగా ఉండాలని, మత ప్రభావము, రాజకీయాలపై ఉండకూడదని భావించాడు. గొప్ప దేశభక్తితో ఇటలీ జాతి భావానికి నాంది పలికాడు. యూరప్‌లో దేశం, జాతి భావన అభివృద్ధి చెందాయి. దీంతో రాజకీయ వ్యవహారాలలో మత ప్రాబల్యం తగ్గింది. కాలక్షికమంలో ఇదే లౌకికవాదంగా అభివృద్ధి చెందింది. భారతదేశం బహుళ జాతి సమాజం. ఇంగ్లిష్ వలసవాదం కారణంగా, వారు అవలంబించిన విభజించు పాలించు నీతి కారణంగా ప్రజలు మత ప్రాతిపదికన విడిపోయారు. దేశ విభజన సందర్భంగా తలెత్తిన మత కలహాలు భారతీయులను విడదీశాయి. దేశం రెండు ముక్కలై భారతదేశం, పాకిస్థాన్ అవతరించాయి. హిం దూ, ముస్లిం మతోన్మాదం వల్ల దేశ విభజన సమయంలో జరిగిన దారుణ మారణకాండ మాయని మచ్చలా మిగిలింది. అం దుకే భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకికవాద ఆలోచనలతో ఆధునిక భారత నిర్మాణాని కి కృషిచేశారు. లౌకికవాదం భారత రాజ్యాంగ లక్ష్యంగా ప్రకటించారు.

లౌకికవాదానికి వ్యతిరేకంగా మాట్లాడ టం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం అవుతుంది. తెలంగాణ సమాజంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఉన్నారు. అన్నిమతాల వారు శాంతితో సహజీవనం చేస్తూ ఎలాంటి భయాలు, అనుమానాలు లేకుండా జీవిస్తున్నారు. ఎన్నో తరాలుగా హైదరాబాద్ సంస్కృతి మత సహనానికి పెట్టింది పేరు. పలుజాతుల, మతాల సంస్కృతి సమ్మేళనానికి హైదరాబాద్ జీవితమే ఉదాహరణ. తెలంగాణ అభివృద్ధికి ఇది ఆవశ్యకం. లౌకికవాదం లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధించడం, సమక్షిగాభివృద్ధి సాధించడం సాధ్యం కాదు. కావున తెలంగాణ వాదానికి లౌకిక భావన, మౌలిక భావన అవుతుంది. కేసీఆర్ ఒక సందర్భంలో తల ‘నరుక్కుంటాను కానీ తల వంచను’ అన్నారు. దీని అర్థమేమిటో తెలంగాణవాదులకు తెలుసు. తెలంగాణవాదాన్ని విడిచిపెట్టడం కన్నా చావు మేలని అర్థం. తెలంగాణలోని ఎవరైనా.. తలవంచటం కన్నా, తెలంగాణ వాదాన్ని విడిచిపెట్టడం కన్నా చావటం మేలని భావించాలి. సీమాం ధ్ర వలసవాదుల కుట్రలకు, ఎరలకు, దుష్ప్రచారాలకు లోబడి తెలంగాణ సాధ న పట్ల నీరుగారవద్దు. పోరాటాన్ని వదలొద్దు. తెలంగాణ అంటే.. సబ్బండ వర్ణా లు. నక్సలైట్లు మొదలు ఆర్‌ఎస్‌ఎస్ వరకూ అందరూ కలిసి తెలంగాణ సాధన లో అందరూ కలిసి ఐక్యంగా ముందుకుపోవాలి. ఈ కలయికకు నిదర్శనంగా టీఆర్‌ఎస్‌లో విభిన్నవాదాలు, భావాలు కలిగిన వారు నాయకత్వ స్థానంలో కూడా ఉన్నారు. ఎవరికి ఏవిధమైన భావజాలం ఉన్నా తెలంగాణ సాధనకోసం కలిసి పనిచేస్తున్నారు. సమష్టి ప్రయోజనం కోసం తమ వ్యక్తిగత భావజాలాలను వదిలి పనిచేస్తున్నారు. తెలంగాణ సాధనకోసం అలుపెరుగని పోరు చేస్తున్నారు.

ఇలాంటి ఉద్యమానికి మతం రంగు పూయడం అసంబద్ధం. అన్యాయం. అలాగే రాజకీయ జేఏసీ కూడా అన్ని వర్గాల కలయికతో ఏర్పడింది. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నది. దీంట్లో బీజేపీ కూడా కలిసి ఉదార స్వభావాన్ని ప్రదర్శించింది. అయితే.. కాలక్షికమంలో ఎన్నికల సందర్భాలలో తన మతవాదాన్ని తెరమీదికి తెస్తున్నది. దీంతో మైనారిటీ మతాలవారు బీజేపీ అనుసరిస్తున్న మతవాద పోకడలను చూపి టీఆర్‌ఎస్ పార్టీని హెచ్చరించారు. మతవాదులతో జత కడితే టీఆర్‌ఎస్ మౌలిక విధానాలకే ప్రమాదమని హెచ్చ రించారు. ఇక్కడ ఏ మతోన్మాదమైనా తెలంగాణకు ఆటంకమని అందరూ గ్రహించాలి. నిజామాబాద్‌లో డి. శ్రీనివాస్ ఓటమిలో చూపిన చైతన్యం తెలంగాణవాదానికి ఆదర్శవంతమైనది. కానీ మహబూబ్‌నగర్ ఎన్నికల్లో ఆ స్ఫూర్తి దెబ్బతిన్నది. బీజేపీ తాను ఎన్నికల ప్రచారంలో వాడిన పదజాలం, చేసిన ప్రచా రం తీరు దాని భవిష్యత్తును అది చేజేతులా చేజార్చుకున్నది. పైగా ‘పాలమూరు నుంచి పరకాల దాకా’ అంటూ సరికొత్త నినాదాన్ని ఎత్తుకొని తెలంగాణవాదం స్థానంలో మతవాదాన్ని జొప్పించేందుకు ప్రయత్నిస్తున్నది. కుల, మత రాజకీయాలను బహిరంగంగా ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో బీజేపీ గెలిచి అదే తమ బలమని భావిస్తున్నది. ఇది బలుపు కాదు వాపు మాత్రమేనని బీజేపీ గ్రహిస్తే దానికే మంచిది. మరోవైపు అవకాశవాదానికి, ఫిరాయింపులకు పెద్దపీట వేసి అనైతిక రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది. ఎవరైతే ఏమి తమ పార్టీ జెండా పట్టుకుంటే చాలని, గెలుపు గుర్రం పేరిట అనేకులకు గాలం వేస్తున్నది.

కులం, వర్గం కార్డును ప్రయోగిస్తున్నది. అవస రానికి ఏది తమకు లాభిస్తుందనుకుంటే దాని ని నినాదంగా ఎత్తు కుంటున్నది. అవసరమను కుంటే మతం, సామాజిక వర్గం కార్డులను ప్రయోగించి ఓటర్లను ప్రలోభ పెడుతున్నది. ఓట్ల కోసం పాలమూరులో రజాకార్ నినాదం ఇచ్చి పచ్చి మతోన్మాదపు చర్యలకు దిగింది. అనైతిక రాజకీయాలు ఎలా ఉంటాయో రాష్ట్ర ప్రజలకు రుచి చూపించింది. పాలమూరులో బీజేపీ గెలుపుతో నిజమైన తెలంగాణవాదులు ఒకింత నిరాశకు గురయ్యా రు. దీని గుణపాఠాలతోనైనా పరకాలలో బీజేపీకి తగిన బుద్ధి చెప్పి తెలంగాణ వాదానికున్న లౌకికవాద భావనను ప్రపంచానికి చాటాల్సి ఉన్నది. ఈ క్రమంలో సీమాంధ్ర మీడియా సందట్లో సడేమియాలా ఇదే అదనుగా తెలంగాణ వాదంపై విష వూపచారం చేస్తున్నది. దీనిని తెలంగాణ ప్రజలు ఎంతగా అర్థం చేసుకుంటే అంత మంచిది. బీజేపీ లాంటి మతోన్మాద శక్తులను ఓడించడం ద్వారా తరతరాల లౌకిక చరివూతకు తెలంగాణ సంకేతంగా నిలవాలి. ఈ సంక్లిష్ట సమయంలో తెలంగాణలోని సబ్బండ వర్ణాలు, అన్ని రాజకీయ పక్షాలు, శక్తులన్నింటినీ ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. అనన్య త్యాగాలు చేసిన, చేస్తున్న తెలంగాణ ప్రజల మీద ప్రేమతో, అమరవీరుల పట్ల గౌరవంతో మనం రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలి. తెలంగాణ వాదాన్ని నిలబెట్టాలి. మతోన్మాదాన్ని ఓడించాలి. అప్పుడు మాత్రమే తెలంగాణ సాధ్యమై.., సుఖశాంతులతో కూడిన తెలంగాణ అవతరిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. సీమాంధ్రుల కుట్రలను తప్పికొట్టి, ఉద్యమ చైతాన్యాన్ని మరోసారి ఎలుగెత్తి చాటాలి.

-పెండ్యాల మంగళాదేవి

35

MANGALADEVI PENDYALA

Published: Fri,September 2, 2016 12:18 PM

తెలంగాణ పునర్వ్యవస్థీకరణ

రాష్ట్ర సాధన పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించే దిశలో కేస

Published: Tue,March 25, 2014 12:28 AM

పునర్నిర్మాణం-పటిష్ట నాయకత్వం

సీమాంధ్ర వలస పాలన నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, స్వయంపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే

Published: Tue,January 14, 2014 12:06 AM

సీమాంధ్ర-తెలంగాణ ఉద్యమాల తేడాలు

తెలంగాణ రాష్ట్ర నిధులను, నీళ్లను, వనరులను దోపిడీ చేస్తూ ఆర్థికంగా బలపడిన సీమాంధ్ర వలసవాదుల ఆధిపత్యం పోకుండా సీమాంధ్ర ప్రజలకు విమ

Published: Wed,July 24, 2013 11:59 PM

స్వరాష్ట్రంలో పునర్నిర్మాణం

తెలంగాణ రాష్ట్రం అవతరించాక పునర్నిర్మాణం వివిధ రంగాల్లో ఏవిధంగా చేయాలని కేసీఆర్ తెలంగాణవాదులతో, మేధావులతో వివరంగా చర్చిస్తున్నారు.

Published: Thu,July 11, 2013 12:05 AM

తెలంగాణ-నాలుగు ప్రశ్నలు

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నది. ఈ సమయంలో తెలంగాణవాదులు, ప్రజల మనస్సుల్లో నాలుగు ప్రశ్నలు మెదులుతున్నాయి. 1) కాంగ్రెస్ తెలంగా

Published: Sat,May 11, 2013 12:44 AM

గులామీ చోడో, గులాబీ బనో

సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరంతర పోరాటం చేస్తున్నది. తెలంగాణ తన నిధులను, నీళ్లను, ఉపాధ

Published: Fri,April 19, 2013 02:16 AM

బీజేపీతో పొత్తు టీఆర్‌ఎస్‌కు ముప్పు

కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీలో పడి, వెంటిలేటర్‌పై ఉన్నాయని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు

Published: Thu,April 4, 2013 12:04 AM

ఉద్యమంతో పాటు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎలా అనే సమస్య తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. కొందరు ఉద్యమ ద్వారానే తెలంగాణ అని, మరికొందరు తీవ్రమైన ఉద్య

Published: Fri,March 1, 2013 11:23 PM

ఆకాంక్ష-ఐక్యత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఈ ప్రాంత ప్రజలు సీమాంధ్ర పెట్టుబడిదారుల, రాజకీయ నాయకుల ధన, రాజకీ య పెత్తనాన్ని అధిగమించలేరన

Published: Sun,December 2, 2012 11:27 PM

పాదయాత్రలు- అస్తిత్వ ఆరాటాలు

రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల పాదయావూతలు ఎందుకు అవసరమయ్యాయి? జగన్ ఎన్నికల దిశగా రాష్ట్ర రాజకీయాలను ఎందుకు తీసుకుపోతున్నాడు

Published: Sun,November 18, 2012 12:07 AM

ఫిరాయింపులా? ధర్మ పోరాటమా?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలలోకి వలసలు పోతున్నారు. వీటిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు పార్టీ

Published: Sat,October 27, 2012 05:45 PM

రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుకున్నదనేది జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్ట

Published: Mon,October 15, 2012 02:58 PM

తెలంగాణ ఉద్యమం: తప్పొప్పులు

రాష్ట్ర రాజకీయాల్లో జగన్, చంద్రబాబు, కేసీఆర్‌ల వ్యూహాత్మక విధానాల్లో చేసిన తప్పులేమిటి ? ఏం చేయకుండా ఉంటే లేదా ఏం చేస్తే రాష్ట్ర

Published: Sat,October 6, 2012 05:10 PM

చారిత్రక అనివార్యత: తెలంగాణ

అనేక ఆలోచనలు, దృక్పథాలు, భిన్న కోణాలు, నిరంతర ఘర్షణతో రాష్ట్రసాధన కోసం తెలంగాణ సమాజం ముందుకు సాగుతున్నది. ఆశయసాధనలో ఏకాభిప్రాయంతో

Published: Sat,October 6, 2012 05:10 PM

పరీక్షా కాలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి వైఎస్‌ఆర్ సీపీ ఓటేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వై

Published: Sat,October 6, 2012 05:11 PM

చైతన్యమే శక్తి

గా లి జనార్దన్‌డ్డి బెయిల్ కుంభకోణంలో న్యాయాధికారికి భారీ ముడుపులు అందచేయడంలో ఇతరులతోపాటు పాత నేరస్తుడు యాదగిరి పాత్ర వెల్లడి కావడ

Published: Sat,October 6, 2012 05:11 PM

వైరుధ్యాలకు అతీతంగా...

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా ఉన్న శక్తు లు ఏమిటి? అనే విషయం స్పష్టమైంది. తెలంగాణలోని వివిధ వర్గాల, వర్ణాల అ

Published: Sat,October 6, 2012 05:12 PM

చరిత్రను మలుపు తిప్పే మహోద్యమం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విశాఖ పట్నం జిల్లాలోని నక్కపల్లి సభలో నిస్తేజం, నిరాశ, నిర్వేదం ప్రదర్శించి తన పదవి స్వీకార ముహూర్తమ

Featured Articles