అఖిలపక్షం చర్చలు-పరిణామాలు


Sat,December 29, 2012 11:08 PM

అఖిల పక్షంతో తెలంగాణ సమస్యకు పరిష్కారం వస్తుందని ప్రజలు ఆశించారు.కానీ చాలా మంది అనుమానపడుతున్నట్టే అఖిలపక్షం చర్చలు నిష్ఫలమైనవని దాదాపు అన్ని పార్టీల నాయకులు, విశ్లేషకులు చెప్పారు. కేసీఆర్ అఖిలపక్షం చర్చలు బూటకం అన్నారు. కేంద్రం పిలిచింది కాబట్టి మర్యాదకు వెళ్తున్నామని ఆయన స్పష్టంగా ప్రకటించారు. కానీ కాంగ్రెస్ ఎప్పటిలాగానే సిగ్గులేకుండా కప్పదాటు ధోరణి ప్రదర్శించి ‘నెలరోజుల్లో నిర్ణయం’ అని ప్రకటించింది. అందుకే దీన్ని అందరూ ‘నెల’‘వంక’గా అభివర్ణించారు. తెలంగాణ ప్రజలకు అఖిలపక్షం చర్చల పట్ల ఎలాంటి భ్రమలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రం తక్షణం ఏర్పడాలని కోరుతున్నారు.

ఆ ప్రజా వాంఛ అనేక రూపాల్లో బయటపడుతున్నది. నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటనను అంగీకరించే పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదు. తెలంగాణ జనాభివూపాయం త్వరగా రాష్ట్ర ఏర్పాటు కావాలని. రూసో మహాశయుడు చెప్పినట్టు ‘జనాభివూపాయం సకల రాజకీయాలను శాసిస్తుంది’.ఈ విషయాన్ని కేసీఆర్ సరిగ్గా అర్థం చేసుకున్నారు. కనుకనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోవడంతో దానికి నిరసనగా ‘తెలంగాణ బంద్’కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసే కుట్రను భగ్నం చేశారు. ప్రజల ఆశలకు అద్దంపట్టే కార్యాచరణకు పిలుపు ఇవ్వడంతో, తెలంగాణ ఉద్యమశక్తులన్నీ కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బంద్‌ను వ్యతిరేకించడం వారి అమాయకత్వం, లేదా దురుద్దేశం కావచ్చు.

వాదన కోసం నిజంగానే నిజాయితీగా నెలరోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకుంటే, తిరిగి సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలను, ప్రతిఘాతుక ఉద్యమాలను ఎదుర్కొనే సంకల్ప బలం కేంద్రానికి లేదు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర పెట్టుబడిదారులను కట్టడి చేయడం చాలా చిన్న విషయం. కానీ కేంద్రానికి ఎఫ్‌డీఐ లాంటి ప్రజావ్యతిరేక విధానాలపై ఉండే సంకల్ప బలం తెలంగాణ ప్రజల వాంఛ పట్ల లేదు. డిసెంబర్ 9 ప్రకటన అందుకే నీరుగారిపోయింది. వచ్చిన తెలంగాణ వెనక్కిపోయింది.
తెలంగాణ ఉద్యమం ఒత్తిడి మూలంగా మాత్రమే రాష్ట్ర ఏర్పాటు అంశం కేంద్ర ప్రభుత్వ ఎజెండాగా మారింది. సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలను భగ్నం చేయడానికి, తెలంగాణ ప్రజలను కదిలించాల్సిన అవసరం ఈ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు గుర్తించకపోవడం దౌర్భాగ్యం. ఏ లాబీయింగ్ కేంద్రం మెడలు వంచలేదు. తెలంగాణ జనశక్తి మాత్రమే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతుంది.

అఖిలపక్షం చర్చల్లో అందరూ ఊహించినట్టుగానే టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐలు స్పష్టంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రకటించాయి. వైఎస్‌ఆర్‌సీపీ అందరికి అనుకూల నిర్ణయం తీసుకోవాలనడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. ఉష్ట్రపక్షి తన తలను ఇసుకలో దాచుకున్నట్టు ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖలో టీడీపీ తన ముఖాన్ని దాచుకున్నది. విచివూతమేమంటే టీడీపీ చెబుతున్న ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి అస్తిత్వం లేదు. లేని కమిటీకి ఇచ్చిన ఉత్తరాన్ని టీడీపీ వైఖరిగా చెప్పడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తున్నది. దాన్నే గొప్పతనంగా వర్ణించడం బానిసలైన తెలంగాణ టీడీపీ నాయకులకే చెల్లుతుంది. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు తెలంగాణపై టీడీపీ విధానాన్ని అస్పష్ట, అవకాశవాద విధానంగా వర్ణిస్తున్నారు. ‘హిందూ’ ఆంగ్ల దినపవూతిక తన సంపాదకీయంలో రాష్ట్ర విభజనపై టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల విధానాలు అస్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నది.
టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నాయకులతో కూలంకషంగా చర్చించి, తెలంగాణకు అనుకూలంగా మహానాడులో తీర్మానం చేసింది.

ఆ తర్వాత టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నది. తెలంగాణపై డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ‘యూటర్న్’ తీసుకుని, కృత్రిమ సమైక్య ఉద్యమాన్ని, రాజకీయ డ్రామాలు నడిపించిన చంద్రబాబు మాటమీద నిలబడని నాయకునిగా రుజువు చేసుకున్నారు. తీర్మానం, ఆచరణకు విరుద్ధంగా ఉన్న పార్టీలను ప్రజలు విశ్వసించరు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ శత్రుత్వం మరిచి తెలంగాణకు వ్యతిరేకంగా అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులు కలిసి చేసిన కుట్రలు జనం మరిచిపోలేదు. ప్రతిపక్షంగా పనిచేయవలసిన టీడీపీ దొంగ అవిశ్వాస తీర్మానం పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడిన విషయం ప్రజలు చూశారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం మరిచిపోయారు. అఖిలపక్ష భేటీలో ‘సీల్డ్ కవర్’ ద్వారా అభివూపాయం చెప్పే దౌర్భాగ్య పరిస్థిథి చంద్రబాబు ప్రదర్శించారు.
ఈ ఆత్మవంచన, పరవంచన విధానాల వల్ల ప్రయోజనం లేదు. సీపీఎం సమైక్య రాష్ట్రమే తమ విధానం అని చెప్పడం ద్వారా సీమాంధ్ర పెట్టుబడిదారుల పట్ల సేవాభావాన్ని బయటపెట్టుకున్నది. భాషా ప్రయుక్త రాష్ట్రమే సీపీఎం విధానమైతే గూర్ఖాలాండ్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు? ‘తెలుగు జాతి’ అనే మిథ్యా భావనను ఎందుకు సమర్థిస్తున్నట్టు? తెలుగు భాష నిజం. తెలుగు జాతి అబద్ధం. భారతజాతి భావన వాస్తవం. ఒకవేళ వాదన కోసం చర్చిస్తే, తెలంగాణ, ఆంధ్ర ప్రజలు తాము ఒకే జాతికి చెందిన వారమనే భావనతో ఎప్పుడైనా ఉన్నారా? స్టాలిన్ (జాతిపై మార్క్సిస్టు సిద్ధాంతం) చెప్పిన జాతి సిద్ధాంతం అనుసరించి జాతి భావనలో భాష ముఖ్యమైనది కాదు అని సీపీఎం నాయకత్వానికి తెలియదా? తెలంగాణ, ఆంధ్ర ప్రజలలో భాష విషయంలో తప్ప మరే విషయంలో పోలికలు లేవు.
భాషల్లో కూడా ఉన్న తేడాలను సాహితీవేత్తలు చర్చిస్తున్న విషయం మరువకూడదు. సోదరకమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, న్యూడెమోక్షికసీ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బలపరుస్తున్నప్పుడు సీపీఎం ఎందుకు వ్యతిరేకిస్తున్నది? తెలంగాణ నిధులను, వనరులను నిలువు దోపిడీ చేస్తున్న సీమాంధ్ర పెట్టుబడిదారులను సమర్థించే విధానమే, సీపీఎం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించే విధానం. ఈ పార్టీని నమ్ముతున్న తెలంగాణ కమ్యూనిస్టు కుటుంబాలను వంచించడం సీపీఎం చేస్తున్న దుర్మార్గం. కనుక సీపీఎం తన విధానాన్ని సమీక్షించుకోవాలి. లేదంటే కమ్యూనిస్టు కుటుంబాలే సీపీఎంను శాశ్వతంగా తెలంగాణలో నిర్మూలిస్తారు.

తెలుగుదేశం పార్టీ అవకాశవాద విధానాలను ప్రజల్లో బహిర్గతపరచాలి. వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే సీమాంధ్ర రాజకీయశక్తి అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వైఎస్‌ఆర్ ముఖ్యమంవూతిగా తెలంగాణ ప్రజలను దోచి, జగన్‌కు లక్షలకోట్లు ఆర్జించిపెట్టిన దుర్మార్గాలను ఎండగట్టాలి. చంద్రబాబు, జగన్, ముఖ్యమంత్రి కిరణ్ అందరూ తెలంగాణ విషయానికి వస్తే ఒక్కటే. సీమాంధ్ర నయా వలసవాదులు తెలంగాణ ప్రజాశక్తి ముందు కాగితపు పులులే. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఉద్యమబాటలో ఏ సందర్భమైనా అది ఉద్యమం కానీ, ఎన్నికలు కానీ ఐక్యంగా ఉండాలి. తెలంగాణ ప్రజల ఐక్యతే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఐక్యతను మించిన ఆయుధం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యం.
-పెండ్యాల మంగళాదేవి

35

MANGALADEVI PENDYALA

Published: Sun,November 4, 2012 02:06 AM

తెలంగాణ ఉద్యమం- తక్షణ కర్తవ్యం

తెలంగాణ రాష్ట్ర అవతరణ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే రాజ్యాంగబద్ధమైన డిమాండు పార్లమెంటులో బిల్లు పెట్టి, స