గిరిజనంపై పంజా..!


Sat,October 6, 2012 05:14 PM

15utr01-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
నాన్నా పులి.. నాన్నా పులి..’ కొడుకు అరుస్తడు. ‘ఎక్కడ.. ఎక్కడ..?’ తండ్రి పరుగెత్తుకొస్తడు. ‘పులి లేదు.. గిలి లేదు.. అహ్హహ్హ..’ అని వెకిలి నవ్వు నవ్వుతడు కొడుకు. నాన్న కోపంతో వెనుదిరుగుతడు. ఆ తర్వాత నిజంగానే పులి వస్తది. కొడుకు అరుస్తడు. ఏడుస్తడు. కానీ నాన్న రాడు. పులి మేకల మందపై పడుతది. జరగాల్సిన నష్టం జరిగిపోతది. ఇది కథ. ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యంలో అచ్చు ఈ కథలోలాగే జరుగుతోంది. ఇక్కడి అటవీ అధికారులు, సిబ్బంది కొద్ది కాలంగా ‘అదిగో పులి.. ఇదిగో పులి..’ అంటున్నరు. ‘అవిగో వస్తున్నయ్.. చంపేస్తయ్.. బాగో.. బాగో.. పొండి.. వెళ్లిపొండి.. దూరంగా వెళ్లిపొండి..’ అంటూ అరుస్తున్నరు. గోలగోల చేస్తున్నరు. అక్కడి 40 గిరిజన గ్రామాల మీద పడ్తున్నరు. గుడిసెల్లోంచి కొలాంలు, గోండులను బయటకు లాగేస్తున్నరు. తరుముతున్నరు. ‘ఏవి? ఎక్కడ? పులుపూక్కడ?’ ఆ అమాయక గిరిజనులు ప్రశ్నిస్తున్నరు. పులుల కోసం వెతుకుతున్నరు. పనులు మానేసి, వాటి గురించి మాట్లాడుకుంటున్నరు. కానీ పులులు కనిపించ డం లేదు. ఇంతకుముందెన్నడూ వాళ్లు పులులను చూడలేదు.

ఉట్నూరు మండలం కుమ్మరికుంటకు చెందిన భీమ్‌రావ్ ఇలా అంటున్నడు.. ‘నేనిక్కడ 70 ఏళ్ల నుంచి బతుకుతున్న. ఎప్పుడూ పులిని చూడలె.. పులిని చూసినట్లు మా నాయినె కూడ చెప్పలె.. పులుల పేరుతో మమ్మల్ని ఈ అడవిలోంచి తరిమికొడితె ఎక్కడికి పోవాలె.. ఎట్లా బతకాలె!’ అని కన్నీరుమున్నీరవుతున్నడు. కవ్వాల్ అడవుల్లోని వేలాది మంది గిరిజనులు ఇలాగే ఏడుస్తున్నరు. ‘ఇక్కడ పులులు లెవ్వు.. గిలు లు లెవ్వు.. మా బతుకు మమ్మల్ని బతుకనియ్యిన్రి’ అని వేడుకుంటున్నరు. తీరా ఇప్పుడు అధికారులు మాటమార్చిన్రు. ‘పులి లేదు.. గిలి లేదు..’ అని పళ్లికిలిస్తున్నరు. ‘వేరే చోటు నుంచి తెచ్చి పెంచుతం.. ఖాళీ చేయకపోతే మీకే నష్టం..’ అని బెదిరిస్తున్నరు. పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తంది. తట్టాబుట్టా సర్దుకొని పోకపోతే ‘నాన్న.. పులి’ కథలాగే అయ్యేటట్టున్నది. బతుకు నాశనమయ్యే టట్టున్నది.

కానీ అడవిని విడిచిపెట్టి ఎక్కడకు పోవాలె? ఎట్లా బతకాలె? ప్రశ్నలు. ప్రశ్నల మీద ప్రశ్న లు. అందుకే జన్నారం, ఉట్నూర్, కడెం, సిర్పూర్(యూ) మం డలాలకు చెందిన వేలాది గిరిజనులు ఏకమైన్రు. రాంజీ గోండు ఉరికొయ్యను ముద్దాడాక.. కొమురం భీం, నిజాం తూటాకు నేలకొరిగాక.. ఇంద్ర నెత్తుటి మరకలు ఆరిపోయాక.. తాజా గా మరోసారి మనుగడ కోసం పోరా టం మొదలుపెట్టిన్రు. ర్యాలీలు, రాస్తారోకోలతో జిల్లాను హోరెత్తిస్తున్నరు. డిసెంబర్ 1న ఉట్నూర్ ఐటీడీఏను ముట్టడించిన్రు. కానీ అధికారులివేవీ పట్టించుకోవడం లేదు. వారి పనులు వారు చేసుకుపోతున్నరు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కవ్వాల అభయారణాన్ని 41వ పులుల సంరక్షణ కేంద్రం(టైగర్ షెల్టర్ జోన్)గా గుర్తిస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది.

అందుకనుగుణంగా జిల్లా అటవీశాఖ ₹45 కోట్ల తో ప్రతిపాదనలు సిద్ధం చేసి, పంపింది. ఈ మేరకు అధికారులు, ఇతర ప్రాంతాల నుంచి పులులు, జింకలను తెప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన్రు. 2014 లోగా టైగర్ షెల్టర్‌జోన్‌ను పూర్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలక నుగుణంగా పనులు చేస్తున్నరు. అడవిలో పశుక్షిగాస పెంపకంతో పాటు నీటి కోసం వివిధ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు తవ్విస్తున్నరు. ఈ క్రమంలో 1100 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణంలోని 40 గిరిజన గ్రామాలను ఖాళీ చేయించే కార్యక్షికమ మూ వేగంగా జరిగిపోతున్నది. నవంబర్4 నుంచే గిరిజనుల గుడిసెలన్నింటికీ నంబర్లు వేయడం మొదలైంది. అధికారులు, అంతటా చెప్పినట్లే ఇక్కడా చెబుతున్నరు. కుటుంబానికి ₹10 లక్షల పరిహారం ఇస్తమంటున్నరు. మైదాన ప్రాంతంలో పునరావాసం కల్పిస్తమని ఊదరగొడుతున్నరు. కానీ గిరిజనులకు మోసాలు కొత్తకాదు.

అడవి దాటితే తమ బతుకేందో వారికి తెలియంది కాదు. చేపకు చెరువు, పక్షికి చెట్టు ఎట్లాగో గిరిజనుడికి అడవి అట్లాగ! చెరువులోంచి చేపను ఒడ్డున పడేస్తే ఎట్లా గిలగిలా కొట్టుకొని చచ్చిపోద్దో, అడవిలోంచి బయటకొస్తే తమ జాతి కూడా అలాగే అంతరిస్తదని వారికి తెలుసు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి! ఆదిలాబాద్ జిల్లాలోని కొలాంలది, నల్లమ ల అటవీ ప్రాంతంలోని చెంచుల్లాగే ప్రపంచంలోనే అరుదైన జాతి. వజ్రాల వెలికితీత పేరుతో నల్లమలను డిబీర్స్ అనే బహు ళ జాతీ కంపెనీకి అప్పగించేందుకు ఇటీవలే అక్కడి చెంచులను అడవి నుంచి తరిమికొ సర్కారు కుట్రపన్నింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయినా చాప కింద నీరులా తనపని తాను చేసుకుపోతంది. ఈ విషయంలో ఆంగ్లేయులకున్న సోయి కూడా మన ప్రభుత్వాలకు లేకపోయింది. 1920-30 ప్రాంతంలో నల్లమలను కూడా టైగర్‌జోన్‌గా ఏర్పాటు చేయాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సంకల్పించింది.


ఈ మేరకు చెంచుల తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. కానీ మైదాన ప్రాంతాలకు వెళ్లగానే చెంచులు పిట్టల్లా రాలిపోవడాన్ని సీరియస్‌గా పరిగణించింది. సుందరన్ అనే ఐఏఎస్ అధికారి ఆధ్వర్యం లో ఓ బృందాన్ని నల్లమలకు పంపి, చెంచుల జీవన విధానంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయించింది. ఆయనిచ్చిన నివేదిక మేరకు టైగర్‌జోన్ ఆలోచనను విరమించి, చెంచుల పరిరక్షణ కోసం ‘చెంచు రిజర్వ్’ ఏర్పాటు చేసింది. ఆ అరుదైన ఆదిమజాతిని బతికించుకునేందుకు 1930 లో మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట ప్రాంతంలోని అప్పాపూర్‌లో ఓ ఆసుపవూతిని కూడా నిర్మించింది. ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చిన ఆంగ్లేయులు చెంచుల సంరక్షణ కోసం ఇంత కృషి చేస్తే, ఓ బహుళ జాతీ సంస్థ ప్రయోజనం కోసం, మన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదిమ జాతి మనుగడకే ముప్పు తెచ్చేందుకు సిద్ధపడుతంది. తాజాగా ఆదిలాబాద్‌లో టైగర్ జోన్ పేరు తో ఆదివాసీల బతుకులను ఆగం చేసేందుకు సీమాంధ్ర సర్కా రు ప్రయత్నిస్తోంది. పులుల సంరక్షణను ఎవరూ తప్పు పట్టడం లేదు. కానీ ఆ పేరుతో గిరిజనుల బతుకులను ఆగం చేయడం ఎందుకో అంతుచిక్కడం లేదు.

టైగర్‌జోన్‌ను తమ ప్రాంతంలోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నరనీ, తమ గూడాలనే ఎందుకు ఖాళీ చేయిస్తున్నరనీ, తమ జీవితాలతోనే ఎందుకాడుకుంటున్నరని ఆ అమాయక గిరిజనులు ప్రశ్నిస్తున్నరు. బంజారాహిల్స్ నో, జూబ్లీ హిల్స్‌నో ఖాళీ చేయించి, అక్కడ టైగర్‌జోన్ ఏర్పాటు చేయగలరా అని మానవతావాదులు నిలదీస్తున్నరు. సర్కారు పెద్దలూ.. సమాధానం చెప్పగలరా?

-చిల్ల మల్లేశం


35

MALLESHAM CHILLA

Published: Tue,December 27, 2016 10:53 PM

ఆడపిల్లను బతికించుకుందాం

ఆడపిల్ల అనే కారణంతో కడుపులోనే కాలరాసినా, పుట్టిన ఏడాదిలోపు ఏదో రకంగా వదిలించుకోజూసినా కఠిన శిక్షలు విధించే అవకాశమున్నది. చట్టాలు ఇ

Published: Sat,October 15, 2016 11:19 PM

తుడుం అంకత్ కూ..కూ..!

కూసే కూకు కూ.. కూ.. (కూసే కోకిల కూ.. కూ..) కేడా మావయి కూ.. కూ.. (అడవి మనది కూ.. కూ..) బీడూ మావయి కూ.. కూ.. (బీడూ మనది కూ.. కూ..

Published: Sun,August 28, 2016 01:01 AM

సమాన విద్య సాకారమయ్యేనా?

దేశవ్యాప్తంగా కామన్ సిలబస్‌ను అమల్లోకి తెచ్చి, అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయడంతో పాటు కార్పొరేట్ విద్యాసంస్థలకు కళ్

Published: Sun,December 20, 2015 12:59 AM

ప్రైవేటు బళ్లకు కళ్లెం వేయాల్సిందే!

కొంతకాలంగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 90 శాతం ఫలితాలు నమోదవుతుంటే.. ప్

Published: Sun,January 5, 2014 02:39 AM

విద్యలో విలువల పతనం..

‘మేడిపండు చూడ మేలిమై ఉండు..’అన్న వేమన సూక్తి, నేటి మన విద్యావిధానానికి అతికినట్టు సరిపోతది. ‘విలువల’కు కనీస విలువ ఇవ్వని నేటి విద్

Published: Thu,August 29, 2013 12:06 AM

హైదరాబాద్ అభివృద్ధి- వివరణ

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది మేమే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కోం..’ అంటూ సీమాంవూధుల సామ్రాజ్యవాదపు గొంతుక కొంతకాలంగా అరిచి గీ

Published: Thu,January 24, 2013 11:38 PM

ఇదీ మా కరీంనగర్ చరిత్ర

కరీంనగర్‌లో శాతవాహన కళోత్సవాలు నిర్వహిస్తున్నాం.. ముగింపు వేడుకలకు రండి..’ అన్న మా ఆహ్వానాన్ని తిరస్కరించి, ఉత్సవాలకు ఒక్క రూపాయి

Published: Wed,October 10, 2012 07:59 PM

ఆదివాసీల ఆరోగ్యం పట్టదా?

రాష్ట్రంలో నరహంతక పాలన నడుస్తోంది. పిల్లల్ని, పెద్దల్ని దారుణంగా హతమారుస్తోంది. చేతులకు నెత్తురంటకుండా పనికానిస్తోంది. బాధ్యులను క

Published: Sat,October 6, 2012 05:13 PM

తెలంగాణ చరిత్ర పితామహుడు

ప్రఖ్యాత నైలు(ఈజిప్టు), యుప్రటిస్, టైగ్రిస్(ఇరాక్), సింధూ, గంగా(ఉత్తర భారతదేశం)నదీ పరివాహ ప్రాంతాల్లో మాదిరిగానే గోదావరి లోయలోనూ మ

Published: Sat,October 6, 2012 05:14 PM

ఇంతకీ తెలుగు ఎవరిది?

‘గుడ్డొచ్చి, పిల్లను వెక్కిరించడమంటే ఇదే! తెలుగు భాష పుట్టింది తెలంగాణలో. పెరిగింది తెలంగాణలో. ఇది చారివూతక సత్యం.కానీ తెలంగాణ భాష

Published: Sat,October 6, 2012 05:15 PM

ఆదివాసుల రగలఖ్ జెండా..

అడవిపై తమ ఆధిపత్యాన్ని ధిక్కరించి, యుద్ధసన్నాహాల్లో నిమగ్నమైన కొమురంభీంతో ‘రాజీ’కి నైజాం సర్కారు ఆసిఫాబాద్ నాజం(సబ్ కలెక్టర్)ను దూ

Published: Sat,October 6, 2012 05:15 PM

గడి పునాదులు కదిలిన వేళ..

ఆ రోజు బలవంతమైన సర్పం, చలి చీమల చేతచిక్కింది..! గడి పునాదులు కదిలి, పెత్తందార్ల పీచమణిగింది..! అంతకు ముందు ఓ ప్రశ్న పుట్టింది. ‘ఈ