ఆడపిల్లను బతికించుకుందాం


Tue,December 27, 2016 10:53 PM

ఆడపిల్ల అనే కారణంతో కడుపులోనే కాలరాసినా, పుట్టిన ఏడాదిలోపు ఏదో రకంగా వదిలించుకోజూసినా కఠిన శిక్షలు విధించే అవకాశమున్నది. చట్టాలు ఇంత పటిష్ఠంగా ఉన్నా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలుకాకపోవడం, సంబంధిత అధికారుల అలసత్వంతో అన్ని జిల్లాలు భ్రూణహత్యలకు నిలయాలుగా మారాయి.

అ అంటే అమ్మ అని చదువుకునే చోట ఆడపిల్ల మనుగడ ప్రమాదంలో పడింది. పుట్టేది ఆడపిల్ల అని తెలిసిన మరుక్షణం కడుపులోనే కాలరాసే విష సంస్కృతి ఇటీవలి కాలంలో కోరలు చాస్తున్నది. అక్షరాస్యత పెరిగినకొద్దీ ఆడపిల్లల పై వివక్ష తగ్గిపోతుందనే ఆశ కాస్తా అడియాసే అవుతున్నది. అక్షరాస్యత కూ భ్రూణహత్యలకూ అనులోమ సంబంధం ఆశ్చర్యపరుస్తున్నది. ఈ కోణంలో చూసినప్పుడు కొత్త రాష్ట్రంలో ఆరేళ్లలోపు లింగనిష్పత్తి ఆందోళన రేకెత్తిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఆరేళ్లలోపు పిల్లల జనాభా 38 లక్షల 99 వేల 166గా ఉంటే ఇందులో 20 లక్షల 17 వేల 935 మంది బాలు రు కాగా, బాలికలు 18 లక్షల 81 వేల 231 మంది మాత్రమే! అంటే ప్రతి వెయ్యిమంది బాలురకు 932 మంది మాత్రమే బాలికలున్నారన్నమాట! know your district.. plan your district పేరిట ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఇందుకు 2011 జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ స్త్రీ, పురుష నిష్పత్తి కూడా ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.

సగటున మన రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 988 మం ది మాత్రమే మహిళలున్నారు. ఈ నిష్పత్తి (988)తో పోల్చిచూసినప్పుడు ఆరేళ్ల లోపు బాలికల నిష్పత్తి (932) పెరుగాల్సింది పోయి క్రమేణా తగ్గుతుండటం సమాజంలో వస్తున్న విపరీత పోకడకు అద్దం పడుతున్నది. భారతదేశంలో ప్రతి రోజూ రెండు వేల మంది ఆడపిల్లలు చంపబడుతున్నారు.. సాక్ష్యాత్తూ మహిళా శిశు అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి మేనకాగాంధీ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇక్కడ ప్రస్తావనార్హం. అబార్షన్ల ద్వారా కడుపులో, ప్రసవం తర్వాత రకరకాల మార్గాల్లో ఆడశిశువులను కాలరాస్తున్నారనీ, ఆఖరికి దిండుతో నులిమి చంపేస్తున్న ఘటనలూ పెరుగుతున్నాయని ఒప్పుకున్నారు. యావత్ దేశం సిగ్గు పడాల్సిన ఇలాంటి విషయాన్ని ఆమె అంత బహిరంగంగా చెప్పడానికి కారణాలు లేకపోలేదు.

2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 927 మంది బాలికలుండగా, 2011 నాటికి బాలికల సంఖ్య 918కి పడిపోయింది. 2015లో ఐరాస వెల్లడించిన ఓ నివేదిక ప్రకారం, 124 దేశాల్లో పురుషులకంటే మహిళల జనాభే అధికంగా ఉన్నది. 201 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారతదేశం 192వ స్థానంలో ఉండటం శోచనీయం. ఇలాంటి లెక్కలే కేంద్రమంత్రితో అలా మాట్లాడించాయని అర్థం చేసుకోవచ్చు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2001 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది బాలురకు 961 మంది బాలికలు ఉంటే, 2011 నాటికి ఈ సంఖ్య 939 పడిపోయింది. అదే సమయంలో సమైక్య రాష్ట్ర అక్షరాస్యత 2001లో 60.47శాతం ఉం డగా, 2011లో 67.66 శాతానికి చేరింది. ఇలా ఓ వైపు అక్షరాస్యత పెరుగుతూ ఉంటే అదే స్థాయిలో భ్రూణహత్యలూ పెరుగుతూ, బాలికల జనాభా తగ్గుతున్నదని స్పష్టమవుతున్నది. అదే సమయంలో తెలంగాణలో బాలికల నిష్పత్తి (1000: 932), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (1000: 939)కంటే తక్కువగా ఉండటం విచారించదగిన విషయం. ఇక్కడో ఆసక్తికర అంశం గురించి ప్రస్తావించాలి. అక్షరాస్యత తక్కువగా ఉండే ఎస్సీలు, ఎస్టీలు ఈ విషయంలో మిగిలిన వర్గాలకు ఆదర్శంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది ఎస్సీ పురుషులకు 1008 మంది మహిళలుండగా, ప్రతి వెయ్యి మంది ఎస్టీ పురుషులకు 977 మంది మహిళలున్నారు.

నాగరిక సమాజానికి దూరంగా ఉండే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లో ప్రతి వెయ్యి మంది ఎస్టీ పురుషులకు 1029 మంది మహిళలుండ టం విశేషం. దీనిని బట్టి మగ బిడ్డ కోసం ఆడబిడ్డలను కడుపులోనే చిదిమేసేవారిలో నిరక్షరాస్యులకంటే అక్షరాస్యులే ముందు వరుసలో ఉన్నారని భావించాల్సి వస్తున్నది. అడిగినంత చేతిలో పెడితే చాలు, పుట్టబోయేది ఆడో, మగో చెప్పే పరీక్షా కేంద్రాలకు, ఆబార్షన్లు చేసే నర్సింగ్‌హోమ్‌లకు లెక్కలేదు. వాస్తవానికి భారత ప్రభుత్వం 1971లో గర్భవిచ్ఛిత్తిపై(ఎంటీపీ ఆక్ట్), 1994లో ప్రసవపూర్వక లింగనిర్ధారణ పరీక్షలపై (పీఎన్‌డీటీ ఆక్ట్) రెండు కీలక చట్టాలు చేసింది. వీటి ప్రకారం, ప్రత్యేక సందర్భాల్లో మినహా గర్భవిచ్ఛిత్తి (అబార్షన్), లింగనిర్ధారణ రెండూ శిక్షించదగిన నేరాలు.

కడుపులో బిడ్డకు ఏదైనా పరీక్షా కేంద్రంలో లింగనిర్ధారణ చేస్తే నిర్వాహకులకు మూడేళ్ల దాకా ఖైదు, జరిమానా విధించే అవకాశముంది. ఒక అధ్యయనం ప్రకారం రూ.3 వేల నుంచి రూ.8 వేలలోపు తీసుకుంటూ పుట్టబోయే బిడ్డ ఆడో, మగో చెబుతున్న పరీక్ష కేం ద్రాలు దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని ఉన్నాయని తేలింది. ఇక తల్లీబిడ్డల్లో ఎవరో ఒకరికిగానీ, ఇద్దరికిగానీ ప్రాణహాని ఉన్నప్పుడు, పుట్టబోయే బిడ్డ కు తీవ్ర శారీరక, మానసిక లోపాలున్నట్లు వైద్యులు నిర్ధారిస్తే గానీ గర్భవిచ్ఛిత్తికి వీలులేదు. ఇక ఆడపిల్ల అనే కారణంతో కడుపులోనే కాలరాసినా, పుట్టిన ఏడాదిలోపు ఏదో రకంగా వదిలించుకోజూసినా కఠిన శిక్షలు విధించే అవకాశమున్నది. చట్టాలు ఇంత పటిష్ఠంగా ఉన్నా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలుకాకపోవడం, సంబంధిత అధికారుల అలసత్వంతో అన్ని జిల్లాలు భ్రూణహత్యలకు నిలయాలుగా మారాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ బచావో.. భేటీ పడావో, కల్యాణ లక్ష్మీ లాంటి పథకాలతో ఆడపిల్లలను కాపాడ చూస్తున్నా, క్షేత్రస్థాయిలో లైంగిక దాడులు, వరకట్న వేధింపులు, మూఢ నమ్మకాలు పసిపాపలకు మరణ శాసనం లిఖిస్తున్నాయి. ఈ లెక్కన ప్రభుత్వం ఒకవైపు ముమ్మర అవగాహన కార్యక్రమాలతో సంఘ సంస్కరణకు పూనుకుంటూనే, భేటీ బచావో.. భేటీ పడావో, కల్యాణ లక్ష్మీ లాంటి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాలి. వీలైతే బిడ్డ పుట్టి న వెంటనే ఆమె పేరిట బ్యాంకు ఖాతాలో కొంత నగదు వేసే కార్యక్రమంతో ప్రోత్సహించాలి. అదే సమయంలో అన్ని జిల్లాల్లో ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లు, వైద్య పరీక్షా కేంద్రాలపై దాడులను నిరంతర ప్రక్రియగా కొనసాగించి, అక్రమార్కులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. ఇప్పటికే చాలా కులాల్లో పెళ్లీడు అబ్బాయిలకు అమ్మాయిలు దొరుకడం లేదు. ఇకనైనా ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలకు దిగకపోతే భవిష్యత్‌లో ఆడపిల్ల ల సంఖ్య మరింత దిగజారి, సాంఘిక అరాచకానికి దారి తీస్తుందనడం లో ఎలాంటి అనుమానం లేదు.
chillam

937

MALLESHAM CHILLA

Published: Sat,October 15, 2016 11:19 PM

తుడుం అంకత్ కూ..కూ..!

కూసే కూకు కూ.. కూ.. (కూసే కోకిల కూ.. కూ..) కేడా మావయి కూ.. కూ.. (అడవి మనది కూ.. కూ..) బీడూ మావయి కూ.. కూ.. (బీడూ మనది కూ.. కూ..

Published: Sun,August 28, 2016 01:01 AM

సమాన విద్య సాకారమయ్యేనా?

దేశవ్యాప్తంగా కామన్ సిలబస్‌ను అమల్లోకి తెచ్చి, అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయడంతో పాటు కార్పొరేట్ విద్యాసంస్థలకు కళ్

Published: Sun,December 20, 2015 12:59 AM

ప్రైవేటు బళ్లకు కళ్లెం వేయాల్సిందే!

కొంతకాలంగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 90 శాతం ఫలితాలు నమోదవుతుంటే.. ప్

Published: Sun,January 5, 2014 02:39 AM

విద్యలో విలువల పతనం..

‘మేడిపండు చూడ మేలిమై ఉండు..’అన్న వేమన సూక్తి, నేటి మన విద్యావిధానానికి అతికినట్టు సరిపోతది. ‘విలువల’కు కనీస విలువ ఇవ్వని నేటి విద్

Published: Thu,August 29, 2013 12:06 AM

హైదరాబాద్ అభివృద్ధి- వివరణ

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది మేమే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కోం..’ అంటూ సీమాంవూధుల సామ్రాజ్యవాదపు గొంతుక కొంతకాలంగా అరిచి గీ

Published: Thu,January 24, 2013 11:38 PM

ఇదీ మా కరీంనగర్ చరిత్ర

కరీంనగర్‌లో శాతవాహన కళోత్సవాలు నిర్వహిస్తున్నాం.. ముగింపు వేడుకలకు రండి..’ అన్న మా ఆహ్వానాన్ని తిరస్కరించి, ఉత్సవాలకు ఒక్క రూపాయి

Published: Wed,October 10, 2012 07:59 PM

ఆదివాసీల ఆరోగ్యం పట్టదా?

రాష్ట్రంలో నరహంతక పాలన నడుస్తోంది. పిల్లల్ని, పెద్దల్ని దారుణంగా హతమారుస్తోంది. చేతులకు నెత్తురంటకుండా పనికానిస్తోంది. బాధ్యులను క

Published: Sat,October 6, 2012 05:13 PM

తెలంగాణ చరిత్ర పితామహుడు

ప్రఖ్యాత నైలు(ఈజిప్టు), యుప్రటిస్, టైగ్రిస్(ఇరాక్), సింధూ, గంగా(ఉత్తర భారతదేశం)నదీ పరివాహ ప్రాంతాల్లో మాదిరిగానే గోదావరి లోయలోనూ మ

Published: Sat,October 6, 2012 05:14 PM

ఇంతకీ తెలుగు ఎవరిది?

‘గుడ్డొచ్చి, పిల్లను వెక్కిరించడమంటే ఇదే! తెలుగు భాష పుట్టింది తెలంగాణలో. పెరిగింది తెలంగాణలో. ఇది చారివూతక సత్యం.కానీ తెలంగాణ భాష

Published: Sat,October 6, 2012 05:14 PM

గిరిజనంపై పంజా..!

నాన్నా పులి.. నాన్నా పులి..’ కొడుకు అరుస్తడు. ‘ఎక్కడ.. ఎక్కడ..?’ తండ్రి పరుగెత్తుకొస్తడు. ‘పులి లేదు.. గిలి లేదు.. అహ్హహ్హ..’ అన

Published: Sat,October 6, 2012 05:15 PM

ఆదివాసుల రగలఖ్ జెండా..

అడవిపై తమ ఆధిపత్యాన్ని ధిక్కరించి, యుద్ధసన్నాహాల్లో నిమగ్నమైన కొమురంభీంతో ‘రాజీ’కి నైజాం సర్కారు ఆసిఫాబాద్ నాజం(సబ్ కలెక్టర్)ను దూ

Published: Sat,October 6, 2012 05:15 PM

గడి పునాదులు కదిలిన వేళ..

ఆ రోజు బలవంతమైన సర్పం, చలి చీమల చేతచిక్కింది..! గడి పునాదులు కదిలి, పెత్తందార్ల పీచమణిగింది..! అంతకు ముందు ఓ ప్రశ్న పుట్టింది. ‘ఈ

Featured Articles