తుడుం అంకత్ కూ..కూ..!


Sat,October 15, 2016 11:19 PM

కూసే కూకు కూ.. కూ.. (కూసే కోకిల కూ.. కూ..)
కేడా మావయి కూ.. కూ.. (అడవి మనది కూ.. కూ..)
బీడూ మావయి కూ.. కూ.. (బీడూ మనది కూ.. కూ..)
గోండు రాజ్యం కూ.. కూ.. (గోండు రాజ్యం కూ.. కూ..)
మైసి వాకట్ కూ.. కూ.. (గెలిచి వస్తాం కూ.. కూ..)
తుడుం అంకత్ కూ.. కూ.. (తుడుం మోగించాలె కూ.. కూ..)

chilla
ఈ పాటను కుమ్రం భీం ఎన్నోసార్లు పాడాడు. కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా పాడాడు. చివరిఊపిరి ఉన్నంతవరకు పాడుతూనే ఉన్నాడు. తన లాంటి అమాయక గిరిజనులపై జంగ్లాతోళ్లు(ఫారెస్ట్ అధికారులు), మైదానపు తోడేళ్లు సాగించిన అరాచకాలకు తాళలేక, నిరంకుశ నిజాం సర్కారుపై ధిక్కార స్వరం వినిపించి, నిజాం కర్కశ తూటాలకు బలయ్యాడు. జల్, జంగల్, జమీన్ కోసం నేలకూలిన 76 ఏళ్ల తర్వాత ఈ గోండువీరుడికి స్వరాష్ట్రంలో అరుదైన గుర్తింపు దక్కింది. ఆసిఫాబాద్ కేంద్రంగా ఇటీవల ఏర్పడ్డ కొత్త జిల్లాకు కుమ్రం భీం పేరు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. ఇదో చరిత్ర!

సామాన్య గోండు భీముడి అసామాన్య పోరాట పటిమ అనిర్వచనీయమైనది. నేటి తరం తెలుసుకోదగినది. అది సుమారు 1915. అప్పటికి కుమ్రం భీం వయస్సు ఇంచుమించు 15 ఏళ్లు. కుటుంబంతో సహా సంకెపల్లి(ప్రస్తుత ఆసిఫాబాద్ మండలం)లో నివాసముండేవాడు. అడవిలో సెలయేరులా, స్వేచ్ఛగా జీవించాడు. కాల క్రమంలో జంగ్లాతోళ్లు, షావుకార్లు, జాగీర్దా ర్ల అకృత్యాలు కళ్లారా చూశాడు. మేకల కోసం చెట్టుకొమ్మ కొట్టిన తన స్నేహితుడు పైకు చేతివేళ్లను సారేదార్ నరికించడం చూశాడు. పది రూపాయల అప్పిచ్చి, వడ్డీతో కలిపి వందలు, వేలు చేసి పండిన పంటనంతా షావుకారు ఊడ్చుకెళ్లడం.. లాంటి ఘటనలతో తీవ్రంగా కలత చెందాడు. ఈ క్రమంలో భీమ్ తండ్రి చిన్ను విషజ్వరం బారినపడి చనిపోయాక, అన్నలు సోము, బొజ్జు, చిన్నాయనలు కుర్దు, యేసుతో కలిసి, సంకెపల్లి వీడి, సుర్దాపూర్ అనే గూడానికి చేరుకున్నాడు.

chilla1
అక్కడ వారంతా నెలల తరబడి అడవి నరికి సేద్యం చేశారు. తీరా పంట పండాక, సిద్దిక్ అనే ముస్లిం జాగీర్దార్ వచ్చి, సుర్దాపూర్ భూములన్నీ తనవే అంటాడు. దీంతో అక్కడ జరిగిన గొడవలో భీం, సిద్దిక్ తలపై బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో భీం భయంతో పారిపోయి బలార్షా మీదుగా చాందా చేరుకుంటాడు. అక్కడ విఠోబా అనే ఉద్యమకారుడు ఆశ్రయమివ్వగా, ఆయన ప్రెస్‌లో కొంతకాలం పనిచేస్తాడు. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాడు. విఠోబాను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడి నుంచి చాయ్‌పత్తదేశం (అస్సాం) వెళ్లి, తేయాకు తోటల్లో ఐదేళ్ల పాటు కూలీగా పనిచేస్తాడు.

ఈ కాలంలోనే భీం, ఉర్దూ సహా పలుభాషల్లో మాట్లాడటం, చదవడం, రాయడం నేర్చుకుంటాడు. తేయాకు తోటలో పరిచయమైన ఓ వ్యక్తి ద్వారా అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన మన్నెం పోరాటం గురించి తెలుసుకుని ఉత్తేజం పొందుతాడు. భీమ్ అస్సాం తేయాకు తోటల్లో జరిగిన తిరుగుబాటులో పాల్గొనటంతో ఆంగ్లేయులు నిర్బంధిస్తారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని, మళ్లీ చందా మీదుగా కాకన్‌ఘాట్ చేరుకుంటాడు. ఆ సమయంలోనే భీం సోమి, పైకు బాయిని పెళ్లి చేసుకుంటాడు. బాబేఝరీ కేంద్రంగా అడవి నరికి 12 గ్రామాలు పొందిస్తారు. సర్కారు రంగంలోకి దిగి, గూడాలను తగులబెట్టి, పంటలు నాశనం చేసి, వారిపై పలు కేసులు పెడుతుంది. అప్పుడు ఆ పన్నెండు గ్రామాల ప్రజలు, తమపై పెట్టిన కేసుల నుంచి విముక్తి కోసం, భూమిని దక్కించుకోవడం కోసం భీంను ఆశ్రయిస్తారు. జనకపురం సాలె పంతులు లాంటి వాళ్లు, సమస్యను నైజాం నవాబుకు నివేదించుకుంటే భూములు దక్కుతాయనీ, కష్టాలు తీరుతాయని భీమ్‌కు సలహా ఇస్తారు. దీంతో మహదు, రఘు అనే ఇద్దరిని వెంటేసుకొని, భీం హైదరాబాద్ వెళ్తాడు.

అక్కడ రాజు దర్శనం దొరక్క అవమా న భారంతో తిరుగుముఖం పడతారు. తిరిగి వచ్చేసరికి, జంగ్లాతువాళ్లు 12 గ్రామాలపై విరుచుకుపడి తగలబెడతారు. దీంతో కలత చెందిన భీం,గోండుల సాయం తో జోడేఘాట్‌లో అటవీ అధికార్ల పై తిరగబడి, తరిమి కొడతాడు. అరెస్టు చేయాలనుకున్న పోలీసులను తన్ని తరిమేస్తారు. అలా భూమి సమస్య కాస్తా ప్రభుత్వానికి, గోండు- కొలామ్ గిరిజనులకూ మధ్య యుద్ధంగా రూపుదాల్చింది. చివరి ప్రయత్నంగా ప్రభు త్వం, సబ్ కలెక్టర్‌ను చర్చలకు జోడేఘా ట్ పంపుతుంది.

12గ్రామాలకు పట్టాలు ఇస్తామనీ, అప్పులన్నీ మాఫీ చేయిస్తామని కలెక్టర్ ప్రతిపాదిస్తాడు. కానీ, కొమురం భీం ఆ 12 గ్రామాల మీద రాజ్యాధికారం డిమాండ్ చేస్తాడు. చర్చలు విఫలమవుతాయి. ఇరుపక్షాలు జోడేఘాట్ కొండల్లో ప్రత్యక్ష యుద్ధానికి తలపడగా, 1940లో దాదాపు ఏడు నెలల పాటు నిజాం సైన్యానికి, భీమ్ అనుచరులకు మధ్య యుద్ధం జరుగుతుంది. చివరికి నైజాం సర్కారు, భారీ మందుగుండు సామగ్రితో 300కు పైగా సైనికులను జోడేఘాట్ పంపుతుంది. అక్టోబర్ 15 (భాద్రపద మాస పౌర్ణమి)న అయిదు గంటలపాటు జరిగిన భీకర యుద్ధంలో భీం, అతడి అనుచరులు నిజాం సైనికు ల చేతుల్లో నేలకొరిగారు.

భీమ్ అస్తమయం తర్వాత 12 గ్రామాల ప్రజలు చెల్లాచెదురుకాగా, జోడేఘాట్ పోరాటాన్ని ప్రభుత్వం అన్నిరకాలుగా అణచివేస్తుంది. భీమ్ ప్రాణాలర్పించి 76 ఏళ్లు గడుస్తున్నా జల్, జంగల్, జమీన్‌పై హక్కుల కోసం అడవి బిడ్డలు నేటికీ పోరాడుతున్నారు. నిజాం అనంతరం సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు ఏనాడూ గిరిజనుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ తొలిసారి 2014 అక్టోబర్8న ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ రెండేళ్ల క్రితం పోరుగడ్డ జోడేఘాట్‌పై అడుగుపెట్టారు. భీం ఆశయ సాధనలో భాగంగా అడవిబిడ్డల తల రాతను మార్చే బాధ్యత తనదేనని ప్రతినపూనారు.

అక్కడిక్కడే భీం సృృతి చిహ్నం, గిరిజన మ్యూజియం, రోడ్డు సౌకర్యం కోసం 20కోట్లు మంజూరు చేశారు. హట్టి నుంచి జోడేఘాట్ వరకు తారు రోడ్డు, 81 ఎకరాల్లో భీం స్మారక చిహ్నం, మ్యూజియం నిర్మాణం పూర్తయ్యాయి. అన్నింటికీ మించి కుమ్రం భీం పేరిట కొత్త జిల్లా అవతరించింది. ఇప్పుడిది పూర్తిగా ఆదివాసీ జిల్లా కావాడంతో తమవైన సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించేందుకు, తమదైన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు గిరిజనులకు అవకాశం చిక్కింది. జల్, జంగల్, జమీన్‌పై హక్కులతో తమ జీవితాల్లో వెలుగులు పూస్తాయనే ఆశ, అడవిబిడ్డల కళ్లల్లో తొణకిసలాడుతున్నది.

979

MALLESHAM CHILLA

Published: Tue,December 27, 2016 10:53 PM

ఆడపిల్లను బతికించుకుందాం

ఆడపిల్ల అనే కారణంతో కడుపులోనే కాలరాసినా, పుట్టిన ఏడాదిలోపు ఏదో రకంగా వదిలించుకోజూసినా కఠిన శిక్షలు విధించే అవకాశమున్నది. చట్టాలు ఇ

Published: Sun,August 28, 2016 01:01 AM

సమాన విద్య సాకారమయ్యేనా?

దేశవ్యాప్తంగా కామన్ సిలబస్‌ను అమల్లోకి తెచ్చి, అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయడంతో పాటు కార్పొరేట్ విద్యాసంస్థలకు కళ్

Published: Sun,December 20, 2015 12:59 AM

ప్రైవేటు బళ్లకు కళ్లెం వేయాల్సిందే!

కొంతకాలంగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 90 శాతం ఫలితాలు నమోదవుతుంటే.. ప్

Published: Sun,January 5, 2014 02:39 AM

విద్యలో విలువల పతనం..

‘మేడిపండు చూడ మేలిమై ఉండు..’అన్న వేమన సూక్తి, నేటి మన విద్యావిధానానికి అతికినట్టు సరిపోతది. ‘విలువల’కు కనీస విలువ ఇవ్వని నేటి విద్

Published: Thu,August 29, 2013 12:06 AM

హైదరాబాద్ అభివృద్ధి- వివరణ

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది మేమే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కోం..’ అంటూ సీమాంవూధుల సామ్రాజ్యవాదపు గొంతుక కొంతకాలంగా అరిచి గీ

Published: Thu,January 24, 2013 11:38 PM

ఇదీ మా కరీంనగర్ చరిత్ర

కరీంనగర్‌లో శాతవాహన కళోత్సవాలు నిర్వహిస్తున్నాం.. ముగింపు వేడుకలకు రండి..’ అన్న మా ఆహ్వానాన్ని తిరస్కరించి, ఉత్సవాలకు ఒక్క రూపాయి

Published: Wed,October 10, 2012 07:59 PM

ఆదివాసీల ఆరోగ్యం పట్టదా?

రాష్ట్రంలో నరహంతక పాలన నడుస్తోంది. పిల్లల్ని, పెద్దల్ని దారుణంగా హతమారుస్తోంది. చేతులకు నెత్తురంటకుండా పనికానిస్తోంది. బాధ్యులను క

Published: Sat,October 6, 2012 05:13 PM

తెలంగాణ చరిత్ర పితామహుడు

ప్రఖ్యాత నైలు(ఈజిప్టు), యుప్రటిస్, టైగ్రిస్(ఇరాక్), సింధూ, గంగా(ఉత్తర భారతదేశం)నదీ పరివాహ ప్రాంతాల్లో మాదిరిగానే గోదావరి లోయలోనూ మ

Published: Sat,October 6, 2012 05:14 PM

ఇంతకీ తెలుగు ఎవరిది?

‘గుడ్డొచ్చి, పిల్లను వెక్కిరించడమంటే ఇదే! తెలుగు భాష పుట్టింది తెలంగాణలో. పెరిగింది తెలంగాణలో. ఇది చారివూతక సత్యం.కానీ తెలంగాణ భాష

Published: Sat,October 6, 2012 05:14 PM

గిరిజనంపై పంజా..!

నాన్నా పులి.. నాన్నా పులి..’ కొడుకు అరుస్తడు. ‘ఎక్కడ.. ఎక్కడ..?’ తండ్రి పరుగెత్తుకొస్తడు. ‘పులి లేదు.. గిలి లేదు.. అహ్హహ్హ..’ అన

Published: Sat,October 6, 2012 05:15 PM

ఆదివాసుల రగలఖ్ జెండా..

అడవిపై తమ ఆధిపత్యాన్ని ధిక్కరించి, యుద్ధసన్నాహాల్లో నిమగ్నమైన కొమురంభీంతో ‘రాజీ’కి నైజాం సర్కారు ఆసిఫాబాద్ నాజం(సబ్ కలెక్టర్)ను దూ

Published: Sat,October 6, 2012 05:15 PM

గడి పునాదులు కదిలిన వేళ..

ఆ రోజు బలవంతమైన సర్పం, చలి చీమల చేతచిక్కింది..! గడి పునాదులు కదిలి, పెత్తందార్ల పీచమణిగింది..! అంతకు ముందు ఓ ప్రశ్న పుట్టింది. ‘ఈ