సమాన విద్య సాకారమయ్యేనా?


Sun,August 28, 2016 01:01 AM

దేశవ్యాప్తంగా కామన్ సిలబస్‌ను అమల్లోకి తెచ్చి, అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయడంతో పాటు కార్పొరేట్ విద్యాసంస్థలకు కళ్లెం వేసే ప్రక్రియను ఏకకాలంలో కొనసాగిస్తే సార్వత్రిక, సమాన విద్య సాకారం అవుతుంది.

mallesh
జాతీయ విద్యావిధానం-2016 ముసాయిదా విడుదల కావడంతో దీనిపై దేశవ్యాప్త చర్చ మొదలైం ది. 230పేజీల ఈ నివేదికను 2015 అక్టోబర్ 31నే సమర్పించినా, తాజాగా ముసాయిదా కాపీని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో అందరి కి అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ 15 వరకు ప్రజాభిప్రాయ వెల్లడికి గడువుండగా, అనంతరం కేంద్రం ఎలాంటి మార్పుచేర్పులతో అమలు చేయబోతుందనేది ఆసక్తి రేపుతున్నది. కొంత కాలంగా పౌరసమాజం, మేధావివర్గం కోరుతున్న సార్వత్రిక, సమాన విద్యావకాశాలవైపు అడుగులు వేసేలా సుబ్ర మణ్యన్ నేతృత్వంలోని కమిటీ కొన్ని కీలక సిఫార్సు లు చేసినా వాటి అమలు తీరు ఎలా ఉంటుందనేదే వెయ్యి డాలర్ల ప్రశ్న! ఉన్నత విద్యను పక్కనపెడితే పాఠశాల విద్యకు సంబంధించి కమిటీ చేసిన సిఫార్సుల్లో కొన్ని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండగా, మరికొన్నింటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. ముఖ్యంగా విద్యార్థి భవిష్యత్తుకు పునాదిలాంటి పూర్వ ప్రాథమికవిద్య(ప్రీ స్కూల్ ఎడ్యూకేషన్)కు సంబంధించి కమిటీ విలువైన సూచనలే చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఐసీడీఎస్ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 3 - 5 ఏళ్ల లోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందుతున్నది. కానీ అంగన్‌వాడీ కార్యకర్తలకు సరైన శిక్షణ లేకపోవడం వల్ల కేవలం పిల్లలకు ఆహారం అందించి, నిద్రపుచ్చడానికే పరిమితమౌతున్నారనే విమర్శలున్నాయి. ఈ కేంద్రాల్లో చాలా వాటికి పక్కా భవనాలు లేవు. కనీస వసతులు, ఆట వస్తువులు కరువై చిన్నారుల్లో మానసిక వికాసం మాట అటుంచి, బడి అం టేనే భయపడే పరిస్థితి ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల సమీపానికో, అదే ప్రాంగణాలకో తరలించాలని కమి టీ సూచించింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టినప్పు డు ఎదురైన సమస్యను ఇక్కడ ప్రస్తావించాలి.

ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనుకునే తల్లిదండ్రులు మూడేళ్లు నిండిన చిన్నారులను నర్సరీలో చేర్పించాల్సి వస్తున్నది. కానీ విద్యా హక్కు చట్టం ప్రకారం ఐదేళ్ల లోపు చిన్నారులను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్చుకునే అవకాశం లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చక తప్పడంలేదు. అలా చేర్చినవారు ఐదేళ్లు నిండాక ప్రభుత్వ పాఠశాలలకు పంపుతారన్న గ్యారెంటీ లేదు. తాజా ప్రతిపాదనతో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాలకు తరలిస్తే విద్యార్థులను నర్సరీ ఎల్‌కేజీ, యూకేజీ, పూర్తి చేయించి, ఐదేళ్లు నిండాక అక్కడే ఒకటో తరగతిలో చేర్చుకోవచ్చనే అభిప్రాయమున్నది. అలా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు బతికి బట్టకట్టే అవకాశమున్నది. ఈ దిశగా రాష్ట్రంలో ఇప్పటికే కసరత్తు మొదలైంది.

ప్రాథమికస్థాయిలో బోధనా మాధ్యమానికి సంబంధించి సుబ్రమణియన్ కమిటీ సైతం గత కమిటీల్లాగే మాతృభాషకు పట్టం కట్టింది. ఐదో తరగతి దాకా కచ్చితంగా మాతృ/ప్రాంతీయ భాషలోనే బోధించాలనీ, ఆంగ్లం ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉండాలని సూచించింది. పిల్లలకు మాతృభాషలో బోధిస్తేనే పునాదులు బలంగా పడతాయనీ, అప్పుడే ప్రాథమిక విద్యా లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడింది. అందువల్ల ఈ సిఫార్సును అమల్లోకి తెస్తే రాష్ట్రంలో కాన్వెంట్ల పేరిట సాగుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్టవేయవచ్చు. కమిటీ చేసిన మరో ముఖ్యమైన ప్రతిపాదన- నో డిటెన్షన్ విధాన సవరణ. ప్రస్తుతం 9తరగతి దాకా కొనసాగుతున్న నో డిటెన్షన్ విధానాన్ని ఐదో తరగతి వరకే పరిమితం చేసి, ప్రాథమికోన్నత దశ నుంచి డిటెన్షన్ విధానాన్ని కొనసాగించాలని పేర్కొన్నది. ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అకడమిక్‌గా రాణించలేకపోతున్న విద్యార్థులను ఎప్పటికప్పుడు గుర్తించి, వారికి సరై న పునర్బలనం ఇచ్చే వీలవుతుందని కమిటీ అభిప్రాయపడ్డా, వెనుకబడిన విద్యార్థులు చదువు మానేసి బాలకార్మికులుగా మారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు అంటున్నారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పదోతరగతి దాకా నో డిటెన్షన్ విధానాన్నే కొనసాగిస్తే మేలంటున్నారు. పాఠ్య ప్రణాళిక, పరీక్ష విధానంలోనూ పలు మార్పు లు అవశ్యమని కమిటీ పేర్కొన్నది. మారుతున్న సామాజిక పరిస్థితులకనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు అవసరమనీ, ఇది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియని చెప్పింది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని కుల,మతాలకు అతీతంగా పాఠ్యాంశాల రచన ఉండాలనీ, విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, పరమత సహనం పెంపొందించే లా, సమకాలీన సామాజిక పరిస్థితులపై అవగాహన కల్పించేలా పాఠాలుండాలని అభిప్రాయపడిం ది. చదువు పూర్తయ్యాక తమ కాళ్లపై తాము నిలబడేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించగలిగేలా పాఠ్య ప్రణాళిక ఉండాలని నిర్దేశించింది.

ఇక సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులకు జాతీయ స్థాయిలో ఉమ్మడి కరిక్యులమ్ రూపొందించాలన్న కమిటీ సూచనలో దూరదృష్టి దాగి ఉన్నది. కొంతకాలంగా అందరూ ఆకాంక్షిస్తున్న సార్వత్రిక విద్య(కామన్ ఎ్యకేషన్)కు ఇది నాంది కానుంది. దీన్ని జాగ్రత్తగా అమలుచేస్తే ప్రస్తుతం జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న మెడిసిన్, ఇంజినీరింగ్ ప్రవేశాల్లో, యూపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులు సులభంగా పోటీ పడే అవకాశముంటుంది. మరోవైపు ప్రస్తుత పరీక్షా పద్ధతి బట్టీ విధానానికి పెద్దపీట వేసేలా ఉన్నదన్న సుబ్రమణియన్ కమిటీ, విద్యార్థుల అవగాహన, గ్రాహకశక్తినీ,నైపుణ్యాలను పరీక్షించేలా మార్పు లు చేపట్టాలని సిఫార్సు చేసింది.

పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో సైన్స్, గణితం, ఆంగ్లం సబ్జెక్టులలో ఎక్కువ మం ది ఫెయిల్ అవుతున్న విషయాన్ని ఉటంకిస్తూ, ఈ మూడు సబ్జెక్టులను పార్ట్- ఏ కింద, మిగిలిన సామాజిక శాస్ర్తాలను పార్ట్-బీ కిందకు తెచ్చి పార్ట్-బీ పరీక్షలు పాసైన వారిని ఒకేషనల్, ఇతరత్రా సంప్రదాయ కోర్సులకు మళ్లించవచ్చని అభిప్రాయపడింది. అంటే సైన్స్, గణితం,ఆంగ్లంలో ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులు హెచ్‌ఈసీ, సీఈసీలాంటి గ్రూపులతో ఇంటర్మీడియెట్ చదువవచ్చు.

బీఏ, బీకాం, ఆ తర్వా త ఎంఏ, ఎంకాం, తెలుగు సాహిత్యంలో డిగ్రీలు, పీజీలు చేయవచ్చు. వివిధ ఒకేషనల్ కోర్సులనూ అభ్యసించవచ్చు. అలాగే పార్ట్-బీని ఆంగ్లంతో సం బంధం లేకుండా పూర్తిగా తెలుగు మాధ్యమంలోనే చదివే అవకాశమూ ఉంటుంది. ఇది సగటు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. అయితే ప్రస్తుత కమిటీ విద్యారంగ ప్రగతికిగానీ, విద్యా కార్పొరేటీకరణను అడ్డుకునేందుకు గానీ ఎలాంటి సూచనలూ చేయలేదనీ, పైగా విద్యా కాషాయీకరణకు పలుచోట్ల ప్రయత్నించిందనే విమర్శలున్నాయి.ఏదేమైనా దేశవ్యాప్తంగా కామన్ సిలబస్‌ను అమల్లోకి తెచ్చి, అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయడంతో పాటు కార్పొరేట్ విద్యాసంస్థలకు కళ్లెం వేసే ప్రక్రియను ఏకకాలంలో కొనసాగిస్తే సార్వత్రిక, సమాన విద్య సాకారం అవుతుంది.

1553

MALLESHAM CHILLA

Published: Tue,December 27, 2016 10:53 PM

ఆడపిల్లను బతికించుకుందాం

ఆడపిల్ల అనే కారణంతో కడుపులోనే కాలరాసినా, పుట్టిన ఏడాదిలోపు ఏదో రకంగా వదిలించుకోజూసినా కఠిన శిక్షలు విధించే అవకాశమున్నది. చట్టాలు ఇ

Published: Sat,October 15, 2016 11:19 PM

తుడుం అంకత్ కూ..కూ..!

కూసే కూకు కూ.. కూ.. (కూసే కోకిల కూ.. కూ..) కేడా మావయి కూ.. కూ.. (అడవి మనది కూ.. కూ..) బీడూ మావయి కూ.. కూ.. (బీడూ మనది కూ.. కూ..

Published: Sun,December 20, 2015 12:59 AM

ప్రైవేటు బళ్లకు కళ్లెం వేయాల్సిందే!

కొంతకాలంగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 90 శాతం ఫలితాలు నమోదవుతుంటే.. ప్

Published: Sun,January 5, 2014 02:39 AM

విద్యలో విలువల పతనం..

‘మేడిపండు చూడ మేలిమై ఉండు..’అన్న వేమన సూక్తి, నేటి మన విద్యావిధానానికి అతికినట్టు సరిపోతది. ‘విలువల’కు కనీస విలువ ఇవ్వని నేటి విద్

Published: Thu,August 29, 2013 12:06 AM

హైదరాబాద్ అభివృద్ధి- వివరణ

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది మేమే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కోం..’ అంటూ సీమాంవూధుల సామ్రాజ్యవాదపు గొంతుక కొంతకాలంగా అరిచి గీ

Published: Thu,January 24, 2013 11:38 PM

ఇదీ మా కరీంనగర్ చరిత్ర

కరీంనగర్‌లో శాతవాహన కళోత్సవాలు నిర్వహిస్తున్నాం.. ముగింపు వేడుకలకు రండి..’ అన్న మా ఆహ్వానాన్ని తిరస్కరించి, ఉత్సవాలకు ఒక్క రూపాయి

Published: Wed,October 10, 2012 07:59 PM

ఆదివాసీల ఆరోగ్యం పట్టదా?

రాష్ట్రంలో నరహంతక పాలన నడుస్తోంది. పిల్లల్ని, పెద్దల్ని దారుణంగా హతమారుస్తోంది. చేతులకు నెత్తురంటకుండా పనికానిస్తోంది. బాధ్యులను క

Published: Sat,October 6, 2012 05:13 PM

తెలంగాణ చరిత్ర పితామహుడు

ప్రఖ్యాత నైలు(ఈజిప్టు), యుప్రటిస్, టైగ్రిస్(ఇరాక్), సింధూ, గంగా(ఉత్తర భారతదేశం)నదీ పరివాహ ప్రాంతాల్లో మాదిరిగానే గోదావరి లోయలోనూ మ

Published: Sat,October 6, 2012 05:14 PM

ఇంతకీ తెలుగు ఎవరిది?

‘గుడ్డొచ్చి, పిల్లను వెక్కిరించడమంటే ఇదే! తెలుగు భాష పుట్టింది తెలంగాణలో. పెరిగింది తెలంగాణలో. ఇది చారివూతక సత్యం.కానీ తెలంగాణ భాష

Published: Sat,October 6, 2012 05:14 PM

గిరిజనంపై పంజా..!

నాన్నా పులి.. నాన్నా పులి..’ కొడుకు అరుస్తడు. ‘ఎక్కడ.. ఎక్కడ..?’ తండ్రి పరుగెత్తుకొస్తడు. ‘పులి లేదు.. గిలి లేదు.. అహ్హహ్హ..’ అన

Published: Sat,October 6, 2012 05:15 PM

ఆదివాసుల రగలఖ్ జెండా..

అడవిపై తమ ఆధిపత్యాన్ని ధిక్కరించి, యుద్ధసన్నాహాల్లో నిమగ్నమైన కొమురంభీంతో ‘రాజీ’కి నైజాం సర్కారు ఆసిఫాబాద్ నాజం(సబ్ కలెక్టర్)ను దూ

Published: Sat,October 6, 2012 05:15 PM

గడి పునాదులు కదిలిన వేళ..

ఆ రోజు బలవంతమైన సర్పం, చలి చీమల చేతచిక్కింది..! గడి పునాదులు కదిలి, పెత్తందార్ల పీచమణిగింది..! అంతకు ముందు ఓ ప్రశ్న పుట్టింది. ‘ఈ

Featured Articles