ప్రైవేటు బళ్లకు కళ్లెం వేయాల్సిందే!


Sun,December 20, 2015 12:59 AM

కొంతకాలంగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో
90 శాతం ఫలితాలు నమోదవుతుంటే.. ప్రైవేట్ పాఠశాలల్లో ఫలితాలు 60 శాతం మించడం లేదని విద్యాశాఖ నిర్వహించిన సర్వేలే స్పష్టం చేయడం పరిస్థితి తీవ్రతను కళ్లకుగడుతున్నది. ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు కూడా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం.. ప్రైవేట్ పాఠశాలలకు కళ్లెం.. అనే ద్విముఖ వ్యూహంతో ముందుకు కదులుతున్నది. ప్రతిష్ఠాత్మక కేజీ టు పీజీ ఆంగ్ల ఉచిత విద్య కోసం నియోజకవర్గాల వారీగా గురుకులాలను తెరిచే ప్రయత్నాల్లో ఉన్నది. ఇదే సమయంలో రాష్ట్ర స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటుకూ సన్నద్ధమవుతున్నది. ఈ రెండు చర్యలను ఏకకాలంలో సమాంతరంగా కొనసాగిస్తే ప్రైవేట్ విద్యాసంస్థల
ఆగడాలకు అడ్డుకట్టపడటంతో పాటు సర్కారు ఆశించిన సార్వత్రిక, సమాన విద్య సాకారమవుతుంది.

chilla


పిల్లలను పిల్లలుగా ఎదగనివ్వాలనే విశ్వకవి పలుకులకు మన విద్యావిధానం ఏనాడో మంగళం పలికినా, కొంతకాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పలు పరిణామాలు బుద్ధిజీవులను ఆందోళనపరుస్తున్నాయి. యాంత్రికీకరణ, ప్రపంచీకరణ పుణ్యమాని దశాబ్దాల క్రితమే విద్య, వ్యాపార సరుకై కూర్చున్నది. పాఠశాలలు మొదలు కళాశాలల దాకా విద్యార్థులను మరమనుషుల్లా మార్చే ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతున్నది. తాజాగా కార్పొరేటీకరణపాలైన ప్రైవేట్ విద్య, అందమైన బాల్యాన్ని ఆదిలోనే చిదిమేస్తున్నది. ఒకరకంగా ప్రైవేట్ విద్యాసంస్థల లాభాపేక్ష, తల్లిదండ్రుల అర్థం లేని ఆకాంక్షల ఉచ్చులో చిన్నారిలోకం చితికిపోతున్నది. నా కూతురిని ఐఏఎస్ అకాడమీలో వేశాను.. ఆరో తరగతిలోనే డిగ్రీ స్థాయిలో భూగోళం, చరిత్ర, రాజ్యాంగం, జాతీయ, అంతర్జాతీయ విషయాలు చెబుతున్నారు..

కరెంట్ ఎఫేర్స్, జనరల్ నాలెడ్జ్‌లో ఆమె ప్రతిభ అమోఘం.. ఏ ప్రశ్న అడిగినా టక్కున సమాధానం చెప్పేస్తుంది.. కరీంనగర్‌లో నాకు మిత్రుడు కూడా అయిన ఓ వైద్యుడు చెబుతుంటే నాకు ఆ చిన్నారిపై జాలేసింది. మీ కూతురును అడిగే నిర్ణయం తీసుకున్నారా..? ఒకవేళ ఐఏఎస్ కాకుంటే ఏం చేస్తారు..? అన్న నా వరుస ప్రశ్నలకు ఆయన నుంచి సరైన సమాధానం కరువైంది. ఏదో ఒకటి అవుతుంది కదా? అంటూ అనుమానంగానే ముక్తాయించడం నన్ను ఆశ్చర్యపరచింది. సైన్స్ చదివి, వైద్యవృత్తిలో స్థిరపడిన ఆయన, తన కూతురు ఆర్ట్స్ చదువుతుంటే చూసి మురిసిపోవడమే ఒక వింతయితే, ఏదో ఒకటి అవుతుంది.. అంటూ వేదాంత ధోరణిలో ముగించడం మరో వింత.

నేటి కరెంట్ ఎఫేర్స్ రేపటి చరిత్ర అనీ, జనరల్ నాలెడ్జ్ ఉపాధ్యాయులు చెబితే వచ్చేది కాదన్న సంగతి ఉన్నత చదువులు చదివిన వైద్యుడికే తెలియకపోతే ఇక సామాన్యుల సంగతేంటి? ఇంటర్మీడియెట్, డిగ్రీ తర్వాత మాత్రమే విద్యార్థుల జ్ఞాన నేత్రం విశాల ప్రపంచం వైపు తెరుచుకుంటుందనీ, ఆ సమయాన జిజ్ఞాసతో నేర్చుకున్నది మాత్రమే మెదడులో నిక్షిప్తమవుతుందనీ, అంతకుముందు చదివి, అప్పగించేదంతా తాత్కాలిక జ్ఞాపకశక్తికి సంబంధించిన అంశం మాత్రమేనని మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏనాడో చెప్పిన విషయం మన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఇంకెప్పుడు అర్థమవుతుందో తెలియదు. ఇది చూడండి.. స్పల్పకాలం పాటు సమాచారాన్ని నిల్వ చేసుకోగలిగే జ్ఞాపకాన్ని మనం అవగాహనగా పొరబడుతున్నాం.

ఈ పరిస్థితి మారాలి. ఎందుకంటే కాలం మారింది. మన పిల్లలు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సమాచారం అంతకంతకూ పెరుగుతున్నది. అందువల్ల గుర్తుపెట్టుకోవడం కంటే ఆలోచించడంలోని మాధుర్యాన్ని మన పిల్లలకు నేర్పాలి. ఫలితంగా వాళ్లు స్వీయ జ్ఞానాన్ని ఆర్జించగలుగుతారు. ప్రపంచాన్ని, జీవితాన్ని ఎదుర్కొన్నప్పుడు సొంతంగా వ్యవహరించగలుగుతారు. సమగ్ర, సృజనాత్మక, సంతోషకర వ్యక్తులుగా ఎదిగి, సమాజానికి ఉపయోగపడుతారు.

కానీ కేవలం పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు లేనిపోని సమాచారాన్నంతా మెదడులో కుక్కుకోవడం విద్య కానేకాదు.. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం(national curriculum frame work-2005)ముందుమాటలో ప్రఖ్యాత విద్యావేత్త యశ్‌పాల్ వెలిబుచ్చిన విలువైన అభిప్రాయమిది. కానీ దురదృష్టవశాత్తూ భారతీయ విద్యావిధానం మొదటి నుంచీ శృతులు, స్మృతులు అంటూ బట్టీయ విధానానికే పెద్దపీట వేస్తూ వచ్చింది. ఆ క్రమంలో స్వీయ జ్ఞానాన్వేషణ మన మెదళ్లలోని అట్టడుగు పొరల్లోకి జారిపోయింది. చిన్నతనం నుంచే వీలైనన్ని పుస్తకాలు బట్టీపడితే ఏదో ఒక ఉద్యోగం ఖాయమనే అభిప్రాయం నేటికీ పలువురు విద్యావేత్తల్లో ఉన్నది. ఇవాళ దేశంలోని నూటికి 99 శాతం తల్లిదండ్రులు తమ పిల్లల వ్యక్తిగత సామర్థ్యాలతో సంబంధం లేకుండా ఐఏఎస్‌లో, ఐపీఎస్‌లో, వైద్యులో, ఇంజినీర్లో కావాలని కలలు కంటున్నారంటే కారణం ఇలాంటి లోపభూయిష్ట విద్యావిధానమే! కానీ ఈ ప్రమాదాన్ని దశాబ్దాల క్రితమే పసిగట్టిన పలు విద్యా కమిటీలు ఇచ్చిన నివేదికల సారం పాలకులకు పట్టలేదు ఫలితంగా జనబాహుళ్యానికీ చేరలేదు.

సరిగ్గా ఆ అవగాహనాలేమినే కార్పొరేట్ విద్యాసంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. సర్కారీ బళ్ల నిర్వహణలో ఉన్న పలు బలహీనతలూ వీటికి వరంగా మారుతున్నాయి. ఇదే అదునుగా రెచ్చిపోతున్న ఆయా ప్రైవేట్ పాఠశాలలు డీజీ,వరల్డ్, గ్లోబల్, ఇంటర్నేషనల్ , టెక్నో,కాన్సెప్ట్, ఒలింపియాడ్ అంటూ పలు రకాల తోకపేర్లు తగిలించుకొని ఆర్భాట ప్రచారాలతో ఊదరగొడుతున్నాయి. ఏసీ గదులు, ఏసీ బస్సులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. ఈ ప్రయోగం కాస్తా పాతబడిందనుకున్నాయో ఏమో పలు ప్రైవేట్ పాఠశాలలు తాజాగా కొత్త పల్లవి అందుకున్నాయి. ఐఏఎస్ అకాడమీ, ఐఐటీ ఫౌండేషన్ లాంటి పేర్లతో రాజధాని సహా అన్ని జిల్లాల్లో దుకాణాలు తెరిచాయి. ఏబీసీడీలు కూడా సరిగ్గా పలకడం రాని నర్సరీ పిల్లలకు సూటూ, బూటూ వేయించి జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఎఫేర్స్, మెంటల్ ఎబిలిటీ అంటూ వాళ్ల చిట్టి బుర్రలను చితక్కొడుతున్నాయి. ఈ అనవసరపు చెత్తకు అడ్వాన్స్‌డ్ స్టడీస్ అనే పేరుపెట్టి, తల్లిదండ్రుల నుంచి లక్షలకు లక్షలు గుంజుతున్నాయి.

ఈ క్రమంలో నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నాయి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం విధివిధానాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పాఠ్యపుస్తకాలను కాకుండా ఎల్‌కేజీ నుంచి ఐదో తరగతి దాకా సొంత సిలబస్ బోధిస్తున్నాయి. పైగా ఇవే అడ్వాన్స్‌డ్ అంటూ తల్లిదండ్రులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పబ్లికేషన్స్ పుస్తకాలంటూ విద్యార్థుల వయస్సు, వ్యక్తిగత అవగాహనా సామర్థ్యాలతో సంబంధం లేకుండా అశాస్త్రీయంగా బోధిస్తున్నాయనీ, తద్వారా అసలుకే ఎసరు వస్తున్నదని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వయస్సుకు మించిన చదువుల వల్ల 10 నుంచి 15 శాతం మంది విద్యార్థులు కూడా రాణించడం లేదని అధికారిక సర్వేలూ నిగ్గుతేలుస్తున్నాయి. ఒక్క వరంగల్‌లోనే పదికి పైగా పాఠశాలలు ఐఏఎస్ అడ్వాన్స్‌డ్ కోర్సు పేరిట నర్సరీ విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష దాకా వసూలు చేస్తున్నట్లు ఇటీవల అక్కడి విద్యాధికారులు గుర్తించినట్లు వార్తలొచ్చాయి.

రాష్ట్రవ్యాప్తంగానూ అడ్మిషన్ ఫీజుల పేరిట ప్రారంభంలోనే లక్షలకు లక్షలు కట్టించుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, తరగతులను బట్టి ఏటా రూ.50 వేల నుంచి రూ.2 లక్షల దాకా తల్లిదండ్రుల ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ఇంకా బస్సుకనీ, పుస్తకాలకనీ, సూటుకనీ, బూటుకనీ, ప్రయోగాలకనీ వేలకు వేలు గుంజుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేకపోవడంతో యాజమాన్యాల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఆయా పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను విధిగా ఆవరణలోని నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలనే నిబంధన ఉన్నా, ఎక్కడా అమలు కావడం లేదు. ఎంట్రెన్స్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, లైబ్రరీ ఫీజు అంటూ తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో గుంజుతున్నా రికార్డుల్లో మాత్రం చూపడం లేదు. వసూలు చేసిన ఫీజులో ఎంత శాతం దేనికి వినియోగించాలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994 జనవరి1న విడుదల చేసిన జీవో నంబర్ 1లో స్పష్టంగా ఉన్నది.

దీని ప్రకారం, ఫీజు మొత్తంలో 5 శాతం మాత్రమే లాభాల కింద ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈ జీవోలోని ఏ నిబంధననూ మెజార్టీ యాజమాన్యాలు పాటించడం లేదు. మరోవైపు దోపిడే లక్ష్యంగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు బోధించే చదువుల్లో నాణ్యతా ప్రమాణాలూ దిగజారుతున్నాయనే విమర్శలున్నాయి. ర్యాంకుల కోసం అవలంబిస్తున్న బట్టీ విధానం వల్ల విద్యార్థుల్లో స్వీయజ్ఞానాన్వేషణ లక్షణం మంటగలుస్తున్నదనే వాదనలూ లేకపోలేదు. ఫలితంగా తల్లిదండ్రుల ఆశాకిరణాలు, భవిష్యత్‌లో ఐఏఎస్‌లు కాదుకదా, కనీసం వారి కింద బంట్రోతు ఉద్యోగాలకూ పనికి రాకుండా పోయే ప్రమాదమున్నది. తాజాగా తెలంగాణ సర్కారు, బట్టీ విధానానికి ఏమాత్రం ఆస్కారం లేని సిలబస్‌ను రూపొందించడంతోపాటు పరీక్షా విధానాల్లోనూ మార్పుచేర్పులకు శ్రీకారం చుట్టింది.

పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇప్పటికే గ్రేడింగ్ విధానం అమలవుతుండగా, విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్నీ, అవగాహనా సామర్థ్యాన్నీ పరీక్షిస్తుండటంతో ప్రైవేట్ పాఠశాలల అసలు రంగు బయటపడుతున్నది. కొంతకాలంగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 90 శాతం ఫలితాలు నమోదవుతుంటే.. ప్రైవేట్ పాఠశాలల్లో ఫలితాలు 60 శాతం మించడం లేదని విద్యాశాఖ నిర్వహించిన సర్వేలే స్పష్టం చేయడం పరిస్థితి తీవ్రతను కళ్లకుగడుతున్నది. ఈ క్రమంలో రాష్ట్ర సర్కా రు కూడా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం.. ప్రైవేట్ పాఠశాలలకు కళ్లెం.. అనే ద్విముఖ వ్యూహంతో ముందుకు కదులుతున్నది. ప్రతిష్ఠాత్మక కేజీ టు పీజీ ఆంగ్ల ఉచిత విద్య కోసం నియోజకవర్గాల వారీగా గురుకులాలను తెరిచే ప్రయత్నాల్లో ఉన్నది. ఇదే సమయంలో రాష్ట్ర స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటుకూ సన్నద్ధమవుతున్నది. ఈ రెండు చర్యలను ఏకకాలంలో సమాంతరంగా కొనసాగిస్తే ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలకు అడ్డుకట్టపడటంతో పాటు సర్కారు ఆశించిన సార్వత్రిక, సమాన విద్య సాకారమవుతుంది.

పువ్వులు ఎలా వికసిస్తాయో, సీతాకోక చిలుకలు ఎలా విహరిస్తాయో చిన్నారులను అలా స్వేచ్ఛగా ఎదగనివ్వాలి.. అదే మన ప్రాథమిక విద్యా లక్ష్యం కావాలి.. వారి శక్తిసామర్థ్యాలు, అభిరుచులకు అనుగుణంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయాలి.. అప్పుడే విద్యార్థులు, తాము అనుకున్న విజయ శిఖరాలు అధిరోహిస్తారు.. అలాగాక పెద్దలే తమ అర్థం లేని ఆకాంక్షలను ఆ పసి మనసులపై రుద్దితే కుంగి, కృషించి ఎందుకూ పనిరాకుండా పోతారు..

1634

MALLESHAM CHILLA

Published: Tue,December 27, 2016 10:53 PM

ఆడపిల్లను బతికించుకుందాం

ఆడపిల్ల అనే కారణంతో కడుపులోనే కాలరాసినా, పుట్టిన ఏడాదిలోపు ఏదో రకంగా వదిలించుకోజూసినా కఠిన శిక్షలు విధించే అవకాశమున్నది. చట్టాలు ఇ

Published: Sat,October 15, 2016 11:19 PM

తుడుం అంకత్ కూ..కూ..!

కూసే కూకు కూ.. కూ.. (కూసే కోకిల కూ.. కూ..) కేడా మావయి కూ.. కూ.. (అడవి మనది కూ.. కూ..) బీడూ మావయి కూ.. కూ.. (బీడూ మనది కూ.. కూ..

Published: Sun,August 28, 2016 01:01 AM

సమాన విద్య సాకారమయ్యేనా?

దేశవ్యాప్తంగా కామన్ సిలబస్‌ను అమల్లోకి తెచ్చి, అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయడంతో పాటు కార్పొరేట్ విద్యాసంస్థలకు కళ్

Published: Sun,January 5, 2014 02:39 AM

విద్యలో విలువల పతనం..

‘మేడిపండు చూడ మేలిమై ఉండు..’అన్న వేమన సూక్తి, నేటి మన విద్యావిధానానికి అతికినట్టు సరిపోతది. ‘విలువల’కు కనీస విలువ ఇవ్వని నేటి విద్

Published: Thu,August 29, 2013 12:06 AM

హైదరాబాద్ అభివృద్ధి- వివరణ

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది మేమే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కోం..’ అంటూ సీమాంవూధుల సామ్రాజ్యవాదపు గొంతుక కొంతకాలంగా అరిచి గీ

Published: Thu,January 24, 2013 11:38 PM

ఇదీ మా కరీంనగర్ చరిత్ర

కరీంనగర్‌లో శాతవాహన కళోత్సవాలు నిర్వహిస్తున్నాం.. ముగింపు వేడుకలకు రండి..’ అన్న మా ఆహ్వానాన్ని తిరస్కరించి, ఉత్సవాలకు ఒక్క రూపాయి

Published: Wed,October 10, 2012 07:59 PM

ఆదివాసీల ఆరోగ్యం పట్టదా?

రాష్ట్రంలో నరహంతక పాలన నడుస్తోంది. పిల్లల్ని, పెద్దల్ని దారుణంగా హతమారుస్తోంది. చేతులకు నెత్తురంటకుండా పనికానిస్తోంది. బాధ్యులను క

Published: Sat,October 6, 2012 05:13 PM

తెలంగాణ చరిత్ర పితామహుడు

ప్రఖ్యాత నైలు(ఈజిప్టు), యుప్రటిస్, టైగ్రిస్(ఇరాక్), సింధూ, గంగా(ఉత్తర భారతదేశం)నదీ పరివాహ ప్రాంతాల్లో మాదిరిగానే గోదావరి లోయలోనూ మ

Published: Sat,October 6, 2012 05:14 PM

ఇంతకీ తెలుగు ఎవరిది?

‘గుడ్డొచ్చి, పిల్లను వెక్కిరించడమంటే ఇదే! తెలుగు భాష పుట్టింది తెలంగాణలో. పెరిగింది తెలంగాణలో. ఇది చారివూతక సత్యం.కానీ తెలంగాణ భాష

Published: Sat,October 6, 2012 05:14 PM

గిరిజనంపై పంజా..!

నాన్నా పులి.. నాన్నా పులి..’ కొడుకు అరుస్తడు. ‘ఎక్కడ.. ఎక్కడ..?’ తండ్రి పరుగెత్తుకొస్తడు. ‘పులి లేదు.. గిలి లేదు.. అహ్హహ్హ..’ అన

Published: Sat,October 6, 2012 05:15 PM

ఆదివాసుల రగలఖ్ జెండా..

అడవిపై తమ ఆధిపత్యాన్ని ధిక్కరించి, యుద్ధసన్నాహాల్లో నిమగ్నమైన కొమురంభీంతో ‘రాజీ’కి నైజాం సర్కారు ఆసిఫాబాద్ నాజం(సబ్ కలెక్టర్)ను దూ

Published: Sat,October 6, 2012 05:15 PM

గడి పునాదులు కదిలిన వేళ..

ఆ రోజు బలవంతమైన సర్పం, చలి చీమల చేతచిక్కింది..! గడి పునాదులు కదిలి, పెత్తందార్ల పీచమణిగింది..! అంతకు ముందు ఓ ప్రశ్న పుట్టింది. ‘ఈ

Featured Articles