హైదరాబాద్ అభివృద్ధి- వివరణ


Thu,August 29, 2013 12:06 AM

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది మేమే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కోం..’ అంటూ సీమాంవూధుల సామ్రాజ్యవాదపు గొంతుక కొంతకాలంగా అరిచి గీపెడుతోంది. రాష్ట్ర విభజన ఖాయమైన తరుణంలో ఈ స్వరం మరింత హెచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలనుకుంటున్న శక్తులకు ఈ ‘భాగ్యనగరి అభివృద్ధి’ అంశం, ఇప్పుడొక పాశుపతాస్త్రమై కూచుంది. ఈ నేపథ్యంలో అసలు ‘అభివృద్ధి అంటే ఏమిటి?’ అన్న ప్రశ్న తెరపైకి వచ్చి, సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా మిగులు నిధులతో చేపట్టిన ప్రజోపయోగ కార్యక్షికమమో, బృహత్తర నిర్మాణమో అభివృద్ధిలో భాగమనిపించుకుంటుంది. కానీ ఈ యేడాది మార్చి నాటికి రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.54 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపిన ఈ సీమాంధ్ర సర్కారు చేసిన అభివృద్ధి ఏ రకమైనదో అర్థం చేసుకునేందుకు పెద్ద తెలివితేటలు అక్కర్లేదు! రాష్ట్ర విలీనానికి ముందే సుమారు రూ.60 కోట్ల మిగులు నిధులున్న హైదరాబాద్ ఆదాయం, ప్రస్తుతం వేల కోట్లు దాటింది.

నాటి నుంచి నేటి వర కు ఈ నిధులను సైతం సీమాంధ్ర సర్కారు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్షికమాలకు మళ్లిస్తూనే ఉంది. ఈ లెక్కన సీమాంవూధలో జరిగిన అభివృద్ధిలోనూ హైదరాబాద్‌కు ఎంతో కొంత వాటా ఉంది. ఇక ఇక్కడికి వచ్చి వివిధ పరిక్షిశమలు, వ్యాపారాలు, ఉన్నతోద్యోగాలతో లబ్ధిపొందిన సీమాంవూధులకు లెక్కలేదు! అంటే హైదరాబాద్ వల్లే సీమాంధ్ర లాభపడింది తప్ప, సీమాంధ్ర వల్ల హైదరాబాద్‌కు ఒరిగిందేమీ లేదని స్పష్టమవుతోంది. అదే సమయంలో అంతర్జాతీయ నగరాలకు దీటుగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో సీమాంధ్ర సర్కారు దారుణంగా విఫలమైందనే విమర్శలను మూటకట్టుకుంది. ఫలితంగా విలీనానికి ముందు అప్పటి జనాభాకనుగుణంగా నిర్మించిన విశాలమైన రోడ్లు, కూడళ్లు, ఉద్యానవనా లు, ప్రజోపయోగ కట్టడాలతో అత్యంత విలాసవంతమైన నగరంగా నాడు లండన్‌తో పోటీపడ్డ భాగ్యనగరి, నేడు నలువైపులా కమ్ముకున్న కాలుష్యపు విష మేఘాలతో, చినుకు పడితే చిత్తడయ్యే రోడ్లతో, అడుగడుగునా దర్శనమిచ్చే మురికివాడలతో అభాగ్యనగరంలా మారిపోయింది.

ఇవన్నీ పక్కనబెట్టి, అభివృద్ధి అంటే ఒక హైటె క్ సిటీ, ఒక అంతర్జాతీయ విమానాక్షిశయం, ఒక ఔటర్ రింగ్‌రోడ్డు మాత్రమే అనుకునే సీమాంవూధు ల అజ్ఞానాన్ని చూస్తే జాలేస్తోంది. హైటెక్ సిటీని కట్టిన ఎల్ అండ్ టీ కంపెనీ, వ్యాపారం పేరిట కోట్లు కుమ్మరించుకుంటున్నదనీ, శంషాబాద్‌లో రూ.2500 కోట్లతో అంతర్జాతీయ విమానాక్షిశయాన్ని నిర్మించిన జీఎంఆర్ సంస్థ, అప్పనంగా ఇచ్చిన ఐదు వేలఎకరాల భూమిలో కార్పొరేట్ వ్యాపారం చేసుకుంటున్నదనీ, ఔటర్ రింగ్‌రోడ్డు పుణ్యమా అని రాష్ట్ర ప్రజలపై రూ.6688 కోట్ల అప్పుల భారం పడిందని వీరికి ఎలా చెబితే అర్థమవుతుందో తెలియక తెలంగాణ మేధావి వర్గం ఇప్పుడు తలలు పట్టుకుంటోంది.

ఇక లాభార్జనే ధ్యేయంగా సీమాంధ్ర పెట్టుబడీదారులు కట్టిన ఫ్యాక్టరీలు, పెట్టిన సినీ పరిక్షిశమ ఆదా యం ఎవరి జేబులను నింపిందో, అప్పనంగా కేటాయించిన కోట్లాది విలువైన భూములు, చెల్లించిన పన్నుల కంటే వందల రెట్లు మినహాయింపులు పొందిన ఈ సీమాంధ్ర పారిక్షిశామికవేత్తలు హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేంటో అందరికీ తెలిసిందే! ఇక ప్రపంచంలోని ఏ గ్రామమైనా, పట్టణమైనా, నగరమైనా సహజసిద్ధంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాథమిక పరిజ్ఞానాన్ని మరచి, తామే ఇంటికింత వాటాలేసుకొని తెచ్చి మరీ హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్లు మాట్లాడుతున్న సీమాంవూధుల తీరు నిజంగా సిగ్గు చేటు. హైదరాబాద్‌కు చారివూతక నగరంగా గుర్తింపు తెచ్చిన అపురూప కట్టడాలన్నీ నిజానికి కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో నిర్మించినవే! ఈ సంగతి వీరికి ఎలా చెప్పేది? మద్రాస్ నుంచి విడిపోయాక గుడారాల్లో అసెంబ్లీ, కార్యాలయాలు నడిపించుకున్న నిర్భాగ్యులకు, 1869లోనే సొంతంగా ‘హైదరాబాద్ స్టేట్ రైల్వే’ను ఏర్పాటు చేసుకున్న శ్రీమంతులు నిజాం ప్రభువులని ఇంకెలా చెబితే అర్థమవుతుంది? అంతెందుకు.
.ండో ప్రపంచ యుద్ధ (1939-45) కాలంలో ఆర్థికంగా చతికిలపడ్డ బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పటి నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్, ఏకంగా 25 మిలియన్ పౌండ్ల ధన సాయం అందజేయడం, అలనాటి హైదరాబాద్ స్టేట్ ఉజ్వల ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టేది కాదా? నిజానికి హైదరాబాద్ అభివృద్ధి అనేది కుతుబ్‌షాహీల కాలంలోనే మొదలైంది. 1578లోనే గోల్‌కొండ కోట నుంచి పట్టణ విస్తరణకు ప్రణాళిక రచించిన ఇబ్రహీం కుతుబ్‌షా మూసీ నదిపై పురానాపూల్ నిర్మించా డు. అనంతరం కులీకుతుబ్‌షా కాలం(1580-1612)లో ఆయన ప్రియురాలు భాగ్‌మతి పేరిట భాగ్యనగరానికి పునాది వేశాడు. 1592-94 మధ్య ప్రఖ్యాత చార్మినార్, చార్‌కమాన్‌ల నిర్మాణం పూర్తయిం ది. అప్పట్లో రత్నాలను రాసులుగా పోసి, అమ్మిన చరిత్ర ఈ పట్టణానికి ఉంది. అటుపై ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ (1869-1911), ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో అనేక చారివూతక, ప్రజోపయో గ కట్టడాల నిర్మాణం జరిగింది. తెలంగాణ రైతు బిడ్డలు, కూలీల చెమట, నెత్తురుతోటే ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఒకవేళ హైదరాబాద్ అభివృద్ధికి నగరంలోని ప్రముఖ కట్టడాలే ప్రాతిపదిక అయితే అవి ఎవరి కాలంలో, ఎప్పుడు నిర్మించారో ఒక్కసారి చూద్దాం..

గోల్‌కొండ కుతుబ్‌షాహీల కాలం(1518-1687)లో..
1578: గోల్‌కొండ కోట నుంచి పట్టణ విస్తరణకు ప్రణాళిక.. మూసీ నదిపై పురానాపూల్ నిర్మాణం.1562: ఇబ్రహీంకుతుబ్‌షా అల్లుడు హుస్సేన్‌షావలి పేరిట హుస్సేన్‌సాగర్ నిర్మాణం.1591: కులీకుతుబ్‌షా ప్రియురాలు భాగ్‌మతి పేరిట భాగ్యనగర్(హైదరాబాద్) పట్టణ నిర్మాణం షురూ. 1592: చార్‌మినార్, 1594: చార్ కమాన్‌ల నిర్మాణం. 1595: దార్-ఉల్- షిఫా (మొట్టమొదటి జనరల్ ఆసుపత్రి) నిర్మాణం. 1694: మక్కా మసీద్. మహమ్మద్ కుతుబ్‌షా భార్య (హయత్‌బక్షీ బేగమ్) పేరిట హయత్‌నగర్ ఏర్పాటు. ఆమె పేరిటే మాసాబ్ ట్యాంక్ నిర్మాణం.

అసఫ్‌జాహీల(నిజాం ప్రభువుల) కాలంనకీ.శ.1724-1948)లో..
1869: నిజాం స్టేట్ రైల్వేశాఖ స్థాపన.1878: హైదరాబాద్-వాడి రైల్వేలైన్ పూర్తి. 1870: తొలి ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు.1870: సిటీ హైస్కూల్ స్థాపన.1872: చాదర్‌ఘాట్ హైస్కూల్ ఏర్పాటు.1887: నిజాం కళాశాల ఏర్పాటు.1908: మహబూబియా బాలికల పాఠశాల ప్రారంభం.1880: తపాలాశాఖ ఏర్పాటు.1891: ఆసఫియా లైబ్రరీ స్థాపన.1893: ఫలక్‌నుమా ప్యాలెస్ నిర్మాణం.1864: పబ్లిక్ గార్డెన్స్ స్థల సేకరణ.1905: టౌన్‌హాల్ నిర్మాణానికి శంకుస్థాపన, 1913లో పూర్తి. ఇదే నేటి మన అసెం బ్లీ. 1905: విక్టోరియా మెమోరియల్ ఆర్ఫనేజ్ (శరణాలయం) స్థాపన. 1905: హైదరాబాద్ విద్యుత్‌శాఖ (హెచ్‌ఈడీ) ఏర్పాటు. జంటనగరాల్లో తొలిసారి విద్యుద్దీప కాంతులు. 1914 లో పురావస్తుశాఖ ఏర్పాటు. 1914లో నూతన రాజ్యాంగం, కార్యనిర్వాహక మండలి ఏర్పా టు. 1914 సాలార్‌జంగ్ మ్యూజియం స్థాపన. 1914లో గండిపేట చెరువు, హిమాయత్‌సాగర్‌ల నిర్మాణం ప్రారంభం,1920లో పూర్తి. 1915లో ఉన్నత న్యాయస్థాన (హైకోర్టు) భవ న శంకుస్థాపన, 1920 ఏప్రిల్ 20న ప్రారం భం.1919లో ఉస్మానియా విశ్వవిద్యాలయాని కి శంకుస్థాపన,1939లో పూర్తి.

1922లో స్వ తంత్ర న్యాయవ్యవస్థ ఏర్పాటు. 1927లో ఉస్మానియా వైద్యకళాశాల ఏర్పాటు. 1929లో ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల స్థాపన. 1930లో రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాల ఏర్పాటు. 1932లో విమాన సర్వీసుల బోర్డు స్థాపన.1933లో ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ నిర్మాణం. 1935లో విమానాక్షిశయం ఏర్పాటు.1935లో హైదరాబాద్‌లో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటు. 1935లో మొజాంజాహీ మార్కెట్ నిర్మాణం. 1936లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవన నిర్మాణం.1937లో జూబ్లీహాల్ నిర్మాణం.
ఇవేగాక, ఉస్మానియా, నీలోఫర్ పిల్లల ఆసుపత్రి, యునాని దవాఖానా, పబ్లిక్ గార్డెన్స్‌లోని రాష్ట్ర పురావస్తు మ్యూజియం, హెల్త్‌మ్యూజియం, బాల్‌భవన్‌లాంటి ఎన్నో భవనాలు ఏడో నిజాం కాలంలోనే నిర్మించారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ పారిక్షిశామికాభివృద్ధికి సైతం విశేష కృషి చేశాడు. కాగజ్‌నగర్‌లో సిర్పూర్ పేపర్‌మిల్, బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ, వరంగల్‌లోని అజాంజాహీ బట్టల మిల్లు స్థాపించి, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి చూపాడు. చరిత్ర ఇలా ఉంటే తాము లేకుంటే అసలు హైదరాబాదే లేదనట్లు మాట్లాడుతున్న సీమాంవూధుల తీరు తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్న చందంగా ఉంది.

-చిల్ల మల్లేశం

283

MALLESHAM CHILLA

Published: Tue,December 27, 2016 10:53 PM

ఆడపిల్లను బతికించుకుందాం

ఆడపిల్ల అనే కారణంతో కడుపులోనే కాలరాసినా, పుట్టిన ఏడాదిలోపు ఏదో రకంగా వదిలించుకోజూసినా కఠిన శిక్షలు విధించే అవకాశమున్నది. చట్టాలు ఇ

Published: Sat,October 15, 2016 11:19 PM

తుడుం అంకత్ కూ..కూ..!

కూసే కూకు కూ.. కూ.. (కూసే కోకిల కూ.. కూ..) కేడా మావయి కూ.. కూ.. (అడవి మనది కూ.. కూ..) బీడూ మావయి కూ.. కూ.. (బీడూ మనది కూ.. కూ..

Published: Sun,August 28, 2016 01:01 AM

సమాన విద్య సాకారమయ్యేనా?

దేశవ్యాప్తంగా కామన్ సిలబస్‌ను అమల్లోకి తెచ్చి, అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయడంతో పాటు కార్పొరేట్ విద్యాసంస్థలకు కళ్

Published: Sun,December 20, 2015 12:59 AM

ప్రైవేటు బళ్లకు కళ్లెం వేయాల్సిందే!

కొంతకాలంగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 90 శాతం ఫలితాలు నమోదవుతుంటే.. ప్

Published: Sun,January 5, 2014 02:39 AM

విద్యలో విలువల పతనం..

‘మేడిపండు చూడ మేలిమై ఉండు..’అన్న వేమన సూక్తి, నేటి మన విద్యావిధానానికి అతికినట్టు సరిపోతది. ‘విలువల’కు కనీస విలువ ఇవ్వని నేటి విద్

Published: Thu,January 24, 2013 11:38 PM

ఇదీ మా కరీంనగర్ చరిత్ర

కరీంనగర్‌లో శాతవాహన కళోత్సవాలు నిర్వహిస్తున్నాం.. ముగింపు వేడుకలకు రండి..’ అన్న మా ఆహ్వానాన్ని తిరస్కరించి, ఉత్సవాలకు ఒక్క రూపాయి

Published: Wed,October 10, 2012 07:59 PM

ఆదివాసీల ఆరోగ్యం పట్టదా?

రాష్ట్రంలో నరహంతక పాలన నడుస్తోంది. పిల్లల్ని, పెద్దల్ని దారుణంగా హతమారుస్తోంది. చేతులకు నెత్తురంటకుండా పనికానిస్తోంది. బాధ్యులను క

Published: Sat,October 6, 2012 05:13 PM

తెలంగాణ చరిత్ర పితామహుడు

ప్రఖ్యాత నైలు(ఈజిప్టు), యుప్రటిస్, టైగ్రిస్(ఇరాక్), సింధూ, గంగా(ఉత్తర భారతదేశం)నదీ పరివాహ ప్రాంతాల్లో మాదిరిగానే గోదావరి లోయలోనూ మ

Published: Sat,October 6, 2012 05:14 PM

ఇంతకీ తెలుగు ఎవరిది?

‘గుడ్డొచ్చి, పిల్లను వెక్కిరించడమంటే ఇదే! తెలుగు భాష పుట్టింది తెలంగాణలో. పెరిగింది తెలంగాణలో. ఇది చారివూతక సత్యం.కానీ తెలంగాణ భాష

Published: Sat,October 6, 2012 05:14 PM

గిరిజనంపై పంజా..!

నాన్నా పులి.. నాన్నా పులి..’ కొడుకు అరుస్తడు. ‘ఎక్కడ.. ఎక్కడ..?’ తండ్రి పరుగెత్తుకొస్తడు. ‘పులి లేదు.. గిలి లేదు.. అహ్హహ్హ..’ అన

Published: Sat,October 6, 2012 05:15 PM

ఆదివాసుల రగలఖ్ జెండా..

అడవిపై తమ ఆధిపత్యాన్ని ధిక్కరించి, యుద్ధసన్నాహాల్లో నిమగ్నమైన కొమురంభీంతో ‘రాజీ’కి నైజాం సర్కారు ఆసిఫాబాద్ నాజం(సబ్ కలెక్టర్)ను దూ

Published: Sat,October 6, 2012 05:15 PM

గడి పునాదులు కదిలిన వేళ..

ఆ రోజు బలవంతమైన సర్పం, చలి చీమల చేతచిక్కింది..! గడి పునాదులు కదిలి, పెత్తందార్ల పీచమణిగింది..! అంతకు ముందు ఓ ప్రశ్న పుట్టింది. ‘ఈ