ఇదీ మా కరీంనగర్ చరిత్ర


Thu,January 24, 2013 11:38 PM

kotiకరీంనగర్‌లో శాతవాహన కళోత్సవాలు నిర్వహిస్తున్నాం.. ముగింపు వేడుకలకు రండి..’ అన్న మా ఆహ్వానాన్ని తిరస్కరించి, ఉత్సవాలకు ఒక్క రూపాయి సైతం కేటాయించకుండా మమ్మల్ని అవమానపరచిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డిగారికి..

అయ్యా.. కరీంనగర్ జిల్లాకో ఘనమైన చరిత్ర ఉందనీ, అది దక్షిణభారత చరిత్ర గతినే మలుపుతిప్పిందనీ బహుశా మీకు తెలిసుండదు. చాలామందికి తెలిసే అవకాశం లేదు. కారణం ఘనత వహించిన మీ సీమాంధ్ర మేధావులు, అక్కడి రచయితలు! వారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న చరిత్ర పుస్తకాలు. వాటిలో మా చరివూతకు స్థానం లేదు. మీ సమైక్యాంవూధలో మా చరివూతకు అన్యాయం జరిగింది. అందుకే ఇప్పుడు మా చరివూతను మేమే తవ్వుకోవాల్సి వస్తున్నది. ఉత్తర తెలంగాణలో గోదావరి నదికి దక్షిణంగా వ్యాపించి ఉన్న మా కరీంనగర్ జిల్లాకు అనాదిగా ఉజ్వల చరిత్ర ఉన్నది.

మహోన్నతమైన సంస్కృతి, నాగరికతలకు నిలయంగా భాసిల్లింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన గోదావరినదికి ఇరువైపులా పూర్వచారివూతక, తొలిచారివూతక కాలాలకు సంబంధించిన అనేక మానవావశేషాలు వెలుగుచూశాయి. దేశంలోనే అరుదైనదిగా భావిస్తున్న డైనోసార్ శిలాజం కూడా ఇక్కడే(కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులోనే) దొరికింది. క్రీస్తుపూర్వం 1,50,000 నాటికే ఈ జిల్లాలోని నదీ పరివాహ ప్రాంతాల్లో ఆదిమ మానవుడు నివసించిన దాఖలాలున్నాయి. వందలాది పాతరాతి యుగపు పనిముట్లతో పాటు వాటి తయారీ కేంద్రాలు బయటపడ్డాయి. మధ్యరాతియుగంనకీ. పూ.10000-3000),కొత్తరాతి యుగంలో ఆదిమ మానవుడు నివసించిన రాక్‌షెల్టర్లను ఇక్కడ (కదంబాపూర్, తొగపూరాయి, రేగొండ, బూడిగపల్లి, మొలంగూర్ మొదలగు చోట్ల)గుర్తించారు. కదంబాపూర్ వద్ద రాతిగొడ్డళ్లు, బండబాడిశలు, ఉలులు, రాతిగుండ్లు, ధాన్యం దంచే, నూరేరాళ్లు అనే కం లభ్యమయ్యాయి. బూడిగపల్లిలో రాక్‌షెల్టర్లు, రాక్‌పేయింటింగ్స్‌నూ కనుగొన్నారు. బృహత్‌శిలాయుగపునకీ.పూ.1000 నుంచి క్రీ.శ 200) అనేక శిలా సమాధులు జిల్లాలో ఇప్పటికీ నిలిచి ఉన్నాయి.

కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గుట్టల వద్ద మాత్రమే ఉన్నాయి. దేశంలో శిలాయుగానంతరమే(కంచు యుగానికి ముందే) ఇక్కడ ఇనుము వాడుకలోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదట ఇనుమును వాడింది మేమే! జగిత్యాల సమీపంలోని రంగపేట, కోనాపురం, మెట్‌పల్లి సమీపంలోని కోనసముద్రం, ఇబ్రహీంపట్నంలో, కరీంనగర్, పెద్దపల్లి, మంథని సమీపంలోని ఎల్గందల్, ముల్కనూరు, కల్లూరు, అనంతగిరి వివిధ ప్రాంతాల్లో ఇనుమును కరిగించి పనిముట్లు తయారు చేసినట్లు పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇప్పటికి 2,500 ఏళ్ల కిందటే రోమన్, పర్షియన్ వర్తకులు ఇక్కడి ఇనుమును కొని, పశ్చిమాసియాలోని డెమాస్కస్‌కు ఎగుమతి చేసేవారని చారివూతక ఆధారాలతో సహా రుజువైంది. భారతదేశంలోకి ఆర్యుల రాక తర్వాత క్రీ.పూ.6వ శతాబ్దం నాటికి ఏర్పడ్డ షోడష మహాజనపదాల్లో దక్షిణభారతదేశానికి సంబంధించిన ఒకే ఒక రాజ్యం అశ్మక. ఇది నేటి నిజమాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రాం తం.

దీని రాజధాని పోతలి(నేటి బోధన్). ఆ కాలంలో మీ సీమాంధ్ర ప్రాంతంలో రాజ్యం కాదుకదా.. మానవుడు ఉన్న ఆనవాళ్లూ దొరకలేదు. ఐతరేయ బ్రాహ్మణం లో ప్రస్తావించిన మొట్టమొదటి ఆంధ్ర రాజులు(రాణా సమగోప, రాణా గోభద, రాణా నారన, రాణా కంపయ) మా కోటిలింగాల( మండలం) రాజధాని గా ఈ ప్రాంతాన్ని పాలించారని చారివూతక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. క్రీ.పూ. 500 నుంచి క్రీ.పూ.400 మధ్య ఆంధ్ర గోపులు, శబరులు, మహాతలవరులకు కోటిలింగాల రాజధానిగా ఉందని ఇక్కడి అనేక చారివూతక దిబ్బల్లో జరిగిన తవ్వకాలు వెల్లడిస్తున్నాయి. అంటే శాతవాహనుల నకీ.పూ. 230 నుంచి క్రీ.శ. 220 వరకు 450 ఏళ్లు)కంటే ముందే ఇక్కడ రాజ్య పరిపాలన సాగిం ది. శాతవాహనుడు కోటిలింగాల కేంద్రంగా శాతవాహన సామ్రా జ్యం ఏర్పాటు చేశాడు. కోటిలింగాలతో పాటు ధూళికట్ట, పెద్దబొంకూరు తవ్వకాల్లో కూడాఇదే విషయం తేలింది.

శాతవాహనుడి తర్వాత శాతకర్ణి, ఆ తర్వాత సిముఖుడు కోటిలింగాల రాజధానిగానే రాజ్య పాలన చేశారు. సిముకుడి కాలంలో (కోస్తా చరివూతకారులు చెబుతున్న శ్రీముఖుడు) కొన్ని కారణాల రీత్యా రాజధానిని ప్రతిష్ఠానపురం(పైఠాన్)నకు మార్చినా కోటిలింగాలను వదులుకోలేదు. అతని తర్వాత వచ్చిన శాతవాహన రాజులు, రాజధానిని తూర్పున ధాన్యకటకానికి మార్చా రు. సీమాంధ్ర చరివూతకారులు, పుస్తక రచయితలు మాత్రం శాతవాహనుల రాజధాని, మొదట ప్రతిష్ఠానపురం, తర్వాత ధాన్యకటకం అంటూ వక్రీకరించారు. కోటిలింగాలలో తవ్వకాలకు (1979-84) ముందు ‘తెలివాహ’ నదిని కృష్ణానది(తైలం లాంటి నల్లని నది) అనీ, దాని తీరంలోని ఆంధ్రపురం అమరావతి అని చరివూతకారులు భావించారు. కోటిలింగాల తవ్వకాల తర్వాత ఈ అభివూపాయం తప్పని తేలిం ది. కృష్ణ అంటే నల్లనిది, తెలి అంటే తెల్లనిది అనీ, తెలివాహ అంటే తెల్లని ప్రవాహం, అదే గోదావరి అనీ, దాని ఒడ్డున ఉన్న ఆంధ్రపురమే కోటిలింగాల అని చరివూతకారులు తేల్చారు. ఇలా తెలంగాణలోని శాతవాహనుల ఉజ్వల చారివూతక ఘట్టానికి వేదికైన కోటిలింగాలను మీ సీమాంధ్ర చరివూతకారులు కావాలనే విస్మరించారు.

శాతవాహనుల తర్వాత కరీంనగర్ జిల్లా ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, బహమనీసుల్తానులు, గోలకొండ కుతుబ్‌షాహీలు, మొగలులు, అసఫ్‌జాహీలు వరుసగా, స్థానికంగా పొలవాస రాజులు, నగునూరు, మంథని రాజులు కూడా పరిపాలించా రు. ఆయా కాలాల్లో భాషా, సాహిత్య వికాసం అనివార్యంగా జరిగింది. ఇదే జిల్లాలో మునులగుట్టనుంచి కోటిలింగాలకు పోయే దారిలో ఉన్న శిలాఫలకాలపై క్రీ.పూ.2 వ శతాబ్ది నాటి లక్షణాలతో బ్రాహ్మీలిపిలో శాసనాలున్నాయి.పెద్దబొంకూర్ తవ్వకా ల్లో లభ్యమైన టెర్రకొట్ట ముద్రికపై క్రీ.పూ. 2వ శతాబ్ది నాటి బ్రాహ్మీలిపి లక్షణాలతో ‘విజయ పురహర కస రథస’ అని చెక్కి ఉంది.

10వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజధానిగా ‘సపాదలక్ష’ నేలిన రెండో అరికేసరి ఆస్థాన కవి, పంపడు(కన్నడ కవివూతయ ఆద్యుడు) వ్యాస మహాభారతాన్ని ‘విక్షికమార్జున విజ యం’ పేరుతో కన్నడలో రచించాడు. ఇది కన్నడ సాహిత్యంలో ఆదికావ్యం. అతని తమ్ముడు జినవల్లభుడు, జిల్లాలోని గంగాధర, కురిక్యాల గ్రామాల మధ్య ఉన్న బొమ్మలమ్మగుట్టపై వేయించిన శాసనంలో తొలి తెలుగు కందపద్యాలున్నాయి. అస లు కందం పుట్టిందే కరీంనగర్ జిల్లా లో! అదీ క్రీ.శ.946లో! ఈ విషయాన్ని మీ సీమాంవూధులు ఎక్కడా ప్రస్తావించిన పాపా న పోలేదు. త్రిలింగ దేశం అని ఆంధ్రవూపదేశ్‌ను పిలవడానికి కారణమైన శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరంలలో కాళేశ్వరం ఇక్కడిదే! ఇదే మన రాష్ట్రంలో అత్యంత ప్రాచీన శైవ క్షేత్రం. దక్షిణ కాశీగా పిలుచుకు నే వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రానికీ సుమా రు వెయ్యేళ్ల చరిత్ర ఉన్నది. గోదావరి తీరమందున్న ధర్మపురి లక్ష్మీనర్సింహ క్షేత్రం, పుణ్యస్నానాలకు ప్రసిద్ధి. కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి కోట్లాది మంది భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతున్నది.


కరీంనగర్ సమీపంలోని ఎల్గందల్‌కోట, శంకరపట్నం మండలంలోని మొలంగూర్ కోట, కమాన్‌పూర్ మండలంలోని రామగిరి కోట ప్రఖ్యాత గిరిదుర్గాలుగా ప్రసిద్ధి గాంచాయి. ఈ తరహా శత్రుదుర్భేద్యమై కోటలు, మహారాష్ట్రలో తప్ప మరెక్కడా లేవు. మా మాటే పాటలాగుంటది. మా పల్లెల్లో ఇంటికో పాటగాడు, ఆటగాడుంటడు. అందుకే మా జిల్లా జానపద కళాకారుల ఖిల్లాగా వినతికెక్కింది. ఇంకా ఒగ్గు కథలు, చిందు బాగోతాలు, యక్షగానాలు, కాకిపడగల భారతాలతో వీధివీధీ మారుమోగుతూ ఉంటుంది. కరీంనగర్ జిల్లా వెండి ఫిలిగ్రీ కళకు పెట్టింది పేరు. అద్భుత శిల్పకళకు రామడుగు, అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన చేనేతన్నకు సిరిసిల్ల ప్రఖ్యాతిగాంచాయి. ఈ గడ్డపై అడుగుపెడితే మీ జన్మే పావనమవుతుంది తప్ప, మీ లాంటి వారు అడుగుపెట్టకపోతే మా జిల్లాకొచ్చిన లోటేమీ లేదు. అందుకే ముఖ్యమంత్రి గారూ.. చరిత్ర తెలుసుకొని స్పందించండి. మా శాతవాహన కళోత్సవాలకు కనీసం కోటి రూపాయలైనా కేటాయించండి.

-చిల్ల మల్లేశం

35

MALLESHAM CHILLA

Published: Tue,December 27, 2016 10:53 PM

ఆడపిల్లను బతికించుకుందాం

ఆడపిల్ల అనే కారణంతో కడుపులోనే కాలరాసినా, పుట్టిన ఏడాదిలోపు ఏదో రకంగా వదిలించుకోజూసినా కఠిన శిక్షలు విధించే అవకాశమున్నది. చట్టాలు ఇ

Published: Sat,October 15, 2016 11:19 PM

తుడుం అంకత్ కూ..కూ..!

కూసే కూకు కూ.. కూ.. (కూసే కోకిల కూ.. కూ..) కేడా మావయి కూ.. కూ.. (అడవి మనది కూ.. కూ..) బీడూ మావయి కూ.. కూ.. (బీడూ మనది కూ.. కూ..

Published: Sun,August 28, 2016 01:01 AM

సమాన విద్య సాకారమయ్యేనా?

దేశవ్యాప్తంగా కామన్ సిలబస్‌ను అమల్లోకి తెచ్చి, అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయడంతో పాటు కార్పొరేట్ విద్యాసంస్థలకు కళ్

Published: Sun,December 20, 2015 12:59 AM

ప్రైవేటు బళ్లకు కళ్లెం వేయాల్సిందే!

కొంతకాలంగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 90 శాతం ఫలితాలు నమోదవుతుంటే.. ప్

Published: Sun,January 5, 2014 02:39 AM

విద్యలో విలువల పతనం..

‘మేడిపండు చూడ మేలిమై ఉండు..’అన్న వేమన సూక్తి, నేటి మన విద్యావిధానానికి అతికినట్టు సరిపోతది. ‘విలువల’కు కనీస విలువ ఇవ్వని నేటి విద్

Published: Thu,August 29, 2013 12:06 AM

హైదరాబాద్ అభివృద్ధి- వివరణ

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది మేమే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కోం..’ అంటూ సీమాంవూధుల సామ్రాజ్యవాదపు గొంతుక కొంతకాలంగా అరిచి గీ

Published: Wed,October 10, 2012 07:59 PM

ఆదివాసీల ఆరోగ్యం పట్టదా?

రాష్ట్రంలో నరహంతక పాలన నడుస్తోంది. పిల్లల్ని, పెద్దల్ని దారుణంగా హతమారుస్తోంది. చేతులకు నెత్తురంటకుండా పనికానిస్తోంది. బాధ్యులను క

Published: Sat,October 6, 2012 05:13 PM

తెలంగాణ చరిత్ర పితామహుడు

ప్రఖ్యాత నైలు(ఈజిప్టు), యుప్రటిస్, టైగ్రిస్(ఇరాక్), సింధూ, గంగా(ఉత్తర భారతదేశం)నదీ పరివాహ ప్రాంతాల్లో మాదిరిగానే గోదావరి లోయలోనూ మ

Published: Sat,October 6, 2012 05:14 PM

ఇంతకీ తెలుగు ఎవరిది?

‘గుడ్డొచ్చి, పిల్లను వెక్కిరించడమంటే ఇదే! తెలుగు భాష పుట్టింది తెలంగాణలో. పెరిగింది తెలంగాణలో. ఇది చారివూతక సత్యం.కానీ తెలంగాణ భాష

Published: Sat,October 6, 2012 05:14 PM

గిరిజనంపై పంజా..!

నాన్నా పులి.. నాన్నా పులి..’ కొడుకు అరుస్తడు. ‘ఎక్కడ.. ఎక్కడ..?’ తండ్రి పరుగెత్తుకొస్తడు. ‘పులి లేదు.. గిలి లేదు.. అహ్హహ్హ..’ అన

Published: Sat,October 6, 2012 05:15 PM

ఆదివాసుల రగలఖ్ జెండా..

అడవిపై తమ ఆధిపత్యాన్ని ధిక్కరించి, యుద్ధసన్నాహాల్లో నిమగ్నమైన కొమురంభీంతో ‘రాజీ’కి నైజాం సర్కారు ఆసిఫాబాద్ నాజం(సబ్ కలెక్టర్)ను దూ

Published: Sat,October 6, 2012 05:15 PM

గడి పునాదులు కదిలిన వేళ..

ఆ రోజు బలవంతమైన సర్పం, చలి చీమల చేతచిక్కింది..! గడి పునాదులు కదిలి, పెత్తందార్ల పీచమణిగింది..! అంతకు ముందు ఓ ప్రశ్న పుట్టింది. ‘ఈ

Featured Articles