తెలంగాణ చరిత్ర పితామహుడు


Sat,October 6, 2012 05:13 PM

VK-SHSASTRIప్రఖ్యాత నైలు(ఈజిప్టు), యుప్రటిస్, టైగ్రిస్(ఇరాక్), సింధూ, గంగా(ఉత్తర భారతదేశం)నదీ పరివాహ ప్రాంతాల్లో మాదిరిగానే గోదావరి లోయలోనూ మానవ నాగరికత పరిణామ క్రమం అదేరీతిన సాగిందని నిరూపించిన మహనీయుడు, తెలంగాణ ప్రాక్‌చరివూతను ప్రపంచానికి చాటిన మేధావి, రాష్ట్ర పురావస్తు, మ్యూజియం శాఖ మాజీ సంచాలకులు డాక్టర్ వీవీ కృష్ణశాస్త్రి ఇక లేరనే విషయాన్ని తెలంగాణ చరివూతకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీమాంవూధుల వివక్షతో పాఠ్యపుస్తకాలకెక్కని తెలంగాణ అసలైన చరిత్ర గుట్టు విప్పిన ఈ కార్యశూరుడిని తలుచుకుంటూ కన్నీరుపెడుతున్నారు.

వీవీ కృష్ణశాస్త్రి అసలు పేరు వెల్లూరి వేంకట కృష్ణశాస్త్రి. కృష్ణా జిల్లాలోని చిరివాడలో 1934 అక్టోబరు 23న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ (చరిత్ర) పూర్తి చేశారు. దర్వార్‌లోని కర్నాటక విశ్వవిద్యాలయంలో చరిత్ర పరిశోధక విద్యార్థిగా ఉంటూనే గోదావరి తీరంలోని కరీంనగర్ జిల్లా ప్రాక్‌చరివూతను అధ్యయనం చేశారు. ఈ క్రమంలో అనేక చారివూతక ప్రదేశాలను, వాటి విశేషాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు తన పరిశోధక వ్యాసా న్ని కర్నాటక యూనివర్సిటీకి సమర్పించి డాక్టరేట్ పొందారు. ఈ పరిశోధనా వ్యాసానికి ‘ది ప్రోటో అండ్ ఎర్లీ హిస్టారికల్ కల్చర్స్ ఆఫ్ ఏపీ’ అనే పేరుతో గ్రంథ రూపమిచ్చారు. కృష్ణశాస్త్రికి కరీంనగర్ జిల్లా పై ప్రేమ ఎక్కువ.

1980వ దశకంలో రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌గా ఉద్యోగం లో చేరడంతోనే ఇక్కడ పురావస్తు తవ్వకాలను విస్తృత పరిచారు. పెద్దపల్లికి చెంది న ప్రముఖ న్యాయవాది, చరివూతకారుడు ఠాకూర్ రాజారాంసింగ్‌తో కలిసి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులోని గోదావరి తీరాన్ని అణువణువూ శోధించారు. అనేక శిలాజాలను, రాతియుగపు మానవుడి అవశేషాలను వెలికితీసి, ఉత్తర తెలంగాణలో1,50,000 ఏళ్ల కిందే ఆదిమ మానవుడు సంచరించాడని శాస్త్రీయంగా రుజువు చేశారు. వీరి ఆధ్వర్యంలో జరిగిన పురావస్తు తవ్వకాల్లో ఆదిమమానవుడి ఉనికికి సంబంధించి అనేక ఆనవాళ్లు బయటపడ్డాయి.

కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలోని రామగుండం, బసంతనగర్, గోదావరిఖని, జనగాం, మంథని, కాళేశ్వరంతో పాటు పెద్దపల్లి, కనగర్తి.. ఇలా వివిధ చోట్ల విస్తృతంగా జరిగిన తవ్వకాల్లో పాత రాతియుగానికి నకీ.పూ.1,50,000మకీ.పూ.10,000 వరకు) చెందిన ఆదిమ మానవుడు వాడిన గులకరాతి పనిముట్లు, రాతితో చేసిన చేతిగొడ్డళ్లు, చక్రాల్లాంటి ఇతర పనిముట్లు, క్లీవర్లు, మధ్య పాతరాతియుగానికి నకీ.పూ.50,000- క్రీ.పూ. 30,000)చెందిన కత్తి ఆకారపు అంచు, ముక్కోణాకారపు బల్లెపు మొనలు, చర్మపు వస్తువులు, తర్వాతి పాత రాతియుగం నకీ.పూ.30,000- క్రీ.పూ.10,000), సూక్ష్మరాతియుగానికి నకీ.పూ.10,000- క్రీ.పూ.3000 వరకు) చెందిన బ్లేడ్ల లాంటి పరికరాలు వెలుగుచూశాయి. ఇవన్నీ ప్రస్తుతం కరీంనగర్, హైదరాబాద్ మ్యూజియాల్లో భద్రంగా ఉన్నాయి. ఈయన ఆధ్వర్యంలోనే పురావస్తుశాఖ, తెలంగాణ వ్యాప్తంగా కొత్తరాతి యుగానికినకీ.పూ.3000-1000) సంబంధించి ఎన్నో రాక్‌షెల్టర్లు, రాక్ పేయింటింగ్‌లను కనుగొంది.

నిజానికి కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో ఈయన నేతృత్వంలో 1979-84 మధ్య కాలంలో జరిగిన తవ్వకాలకు ముందు సీమాంధ్ర చరివూతకారులంతా శాతవాహనుల తొలిరాజధాని ప్రతిష్ఠానపురం(పైఠాన్) అనీ, మలిరాజధాని ధాన్యకటకం(అమరావతి) అని వాదిస్తూ వచ్చారు. చరివూతపుస్తకాల్లోనూ అదే రాశారు. ఎక్కడా కోటిలింగాల పేరు ప్రస్తావించలేదు. అయితే 1979-84 తవ్వకాల తర్వాత కోటిలింగాలే ఆంధ్రుల అతివూపాచీన రాజధాని నగరమని తేలింది. ఇంకా ఇదే జిల్లా ఎలిగేడు మండలంలోని ధూళికట్ట, పెద్దపల్లి సమీపంలోని పెద్దబొంకూర్ కూడా అప్పుడే వెలుగు చూశాయి. మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో పేర్కొన్న ఆంధ్రుల 30 దుర్గాల్లో కోటిలింగాల, ధూళికట్ట రెండని మొదట ప్రకటించింది కూడా కృష్ణశాస్త్రే కావడం గమనార్హం. ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాడైనప్పటికీ తన సొంత జిల్లాలోని అమరావతి స్తూపం కంటే, ధూళికట్ట స్తూపమే అతి ప్రాచీనమైనదని ప్రకటించి, విమర్శకుల నోళ్లూ మూయించారు! ఎట్టి పరిస్థితుల్లోనూ కోటిలింగాలే శాతవాహనుల తొలిరాజధాని అనీ, ధాన్యకటకం(అమరావతి) కాదని వాదించి, తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టే, విష్ణుకుండినుల రాజధాని అని నిరూపించడం కూడా ఇలాంటిదే!

కరీంనగర్ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్, నల్గొండ, రంగాడ్డి, ఇలా తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని అనేక ప్రాచీన స్థావరాలను వెలుగులోకి తేవడమే కాదు..వాటిని పరిరక్షణకు ఎనలేని కృషి చేశారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మ్యూజియాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు కూడా! కరీంనగర్ జిల్లాలోని బౌద్ధ క్షేత్రాలపై పలు గ్రంథాలను వెలువరించారు.పురావస్తు శాస్త్రంలో కృష్ణశాస్త్రి చేసిన పరిశోధనలకు గాను బీఎన్ శాస్త్రి, ఎస్‌ఎస్‌వీ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, తదితర అవార్డులు ఆయనను వరించాయి.

-చిల్ల మల్లేశం

35

MALLESHAM CHILLA

Published: Tue,December 27, 2016 10:53 PM

ఆడపిల్లను బతికించుకుందాం

ఆడపిల్ల అనే కారణంతో కడుపులోనే కాలరాసినా, పుట్టిన ఏడాదిలోపు ఏదో రకంగా వదిలించుకోజూసినా కఠిన శిక్షలు విధించే అవకాశమున్నది. చట్టాలు ఇ

Published: Sat,October 15, 2016 11:19 PM

తుడుం అంకత్ కూ..కూ..!

కూసే కూకు కూ.. కూ.. (కూసే కోకిల కూ.. కూ..) కేడా మావయి కూ.. కూ.. (అడవి మనది కూ.. కూ..) బీడూ మావయి కూ.. కూ.. (బీడూ మనది కూ.. కూ..

Published: Sun,August 28, 2016 01:01 AM

సమాన విద్య సాకారమయ్యేనా?

దేశవ్యాప్తంగా కామన్ సిలబస్‌ను అమల్లోకి తెచ్చి, అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయడంతో పాటు కార్పొరేట్ విద్యాసంస్థలకు కళ్

Published: Sun,December 20, 2015 12:59 AM

ప్రైవేటు బళ్లకు కళ్లెం వేయాల్సిందే!

కొంతకాలంగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 90 శాతం ఫలితాలు నమోదవుతుంటే.. ప్

Published: Sun,January 5, 2014 02:39 AM

విద్యలో విలువల పతనం..

‘మేడిపండు చూడ మేలిమై ఉండు..’అన్న వేమన సూక్తి, నేటి మన విద్యావిధానానికి అతికినట్టు సరిపోతది. ‘విలువల’కు కనీస విలువ ఇవ్వని నేటి విద్

Published: Thu,August 29, 2013 12:06 AM

హైదరాబాద్ అభివృద్ధి- వివరణ

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది మేమే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులు కోం..’ అంటూ సీమాంవూధుల సామ్రాజ్యవాదపు గొంతుక కొంతకాలంగా అరిచి గీ

Published: Thu,January 24, 2013 11:38 PM

ఇదీ మా కరీంనగర్ చరిత్ర

కరీంనగర్‌లో శాతవాహన కళోత్సవాలు నిర్వహిస్తున్నాం.. ముగింపు వేడుకలకు రండి..’ అన్న మా ఆహ్వానాన్ని తిరస్కరించి, ఉత్సవాలకు ఒక్క రూపాయి

Published: Wed,October 10, 2012 07:59 PM

ఆదివాసీల ఆరోగ్యం పట్టదా?

రాష్ట్రంలో నరహంతక పాలన నడుస్తోంది. పిల్లల్ని, పెద్దల్ని దారుణంగా హతమారుస్తోంది. చేతులకు నెత్తురంటకుండా పనికానిస్తోంది. బాధ్యులను క

Published: Sat,October 6, 2012 05:14 PM

ఇంతకీ తెలుగు ఎవరిది?

‘గుడ్డొచ్చి, పిల్లను వెక్కిరించడమంటే ఇదే! తెలుగు భాష పుట్టింది తెలంగాణలో. పెరిగింది తెలంగాణలో. ఇది చారివూతక సత్యం.కానీ తెలంగాణ భాష

Published: Sat,October 6, 2012 05:14 PM

గిరిజనంపై పంజా..!

నాన్నా పులి.. నాన్నా పులి..’ కొడుకు అరుస్తడు. ‘ఎక్కడ.. ఎక్కడ..?’ తండ్రి పరుగెత్తుకొస్తడు. ‘పులి లేదు.. గిలి లేదు.. అహ్హహ్హ..’ అన

Published: Sat,October 6, 2012 05:15 PM

ఆదివాసుల రగలఖ్ జెండా..

అడవిపై తమ ఆధిపత్యాన్ని ధిక్కరించి, యుద్ధసన్నాహాల్లో నిమగ్నమైన కొమురంభీంతో ‘రాజీ’కి నైజాం సర్కారు ఆసిఫాబాద్ నాజం(సబ్ కలెక్టర్)ను దూ

Published: Sat,October 6, 2012 05:15 PM

గడి పునాదులు కదిలిన వేళ..

ఆ రోజు బలవంతమైన సర్పం, చలి చీమల చేతచిక్కింది..! గడి పునాదులు కదిలి, పెత్తందార్ల పీచమణిగింది..! అంతకు ముందు ఓ ప్రశ్న పుట్టింది. ‘ఈ

Featured Articles