మోత్కూర్ చూపుతున్న మార్గం


Wed,December 26, 2018 03:53 PM

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువులు చదివినా మానవత్వం లోపించిన వారే ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. కానీ జ్ఞానం పునాదిగా గల చదువులు చదివితే ఈ సమాజం ఎంత మానవీయంగా ఉండేదో మోత్కూరు విద్యార్థులను చూస్తే తెలిసి వస్తున్నది.

malla
ఆధునిక ప్రచార ప్రసార సాధనాల భావ కాలుష్యం బారిన పడకుండా మనుషులు ఉంటే ఎంత స్వచ్ఛంగా, సహజంగా, సృజనశీలంగా ఉంటారో మరోమారు తెలిసి వచ్చింది. తమవైన సహజ జీవనాల్లోంచి సమాజాన్ని చూసే విధానం అబ్బురపరిచింది. ముఖ్యంగా ఒక తరం విద్యార్థులు ఎదిగే క్రమంలో వారు పడుతున్న సంఘర్షణ, తపన చూస్తే రాబోయే కాలానికి వారధులుగానే కాదు సారథులు అని సంతృప్తినిచ్చింది. చాలా ఏళ్లుగా జవాబులేని ప్రశ్నలుగా వేధిస్తున్న అనేకానేక ప్రశ్నలకు సమాధా నం దొరికిన అనుభూతి కలిగింది. ఈ భరోసా నిచ్చింది నవనాగరిక జీవన విధానానికి కొంచెం దూరంగా ఉన్న నల్లగొండ జిల్లా మోత్కూర్ జూనియర్ కళాశాల విద్యార్థు లు, లెక్చరర్లు. ఎక్కడ చూసినా బాధ్యతారాహిత్యం, నిబద్ధతలేని తనం రాజ్యమేలుతున్న ఈరోజుల్లో మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అన్నింటిలో ఆదర్శంగా ముందుకుపోతున్నది. అందరూ తమదైన కర్తవ్యాన్ని గుర్తెరిగి నడుచుకుంటున్న నిబద్ధ త్యాగ జీవనం అడుగడుగునా కనిపించింది.

నల్లగొండ జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థుల స్వాగత సమావేశంలో పాల్గొనే అవకాశం దొరికింది. ఫ్రెషర్స్ డే సందర్భంగా సాధారణంగా ఉండే రణగొనధ్వ నుల డీజే చప్పుళ్లు లేవు. అరుపులు, కేకలతో నిండిన తీన్‌మార్ డ్యాన్సులు లేవు. రాష్ట్ర సాధన తర్వాత పునికి పుచ్చుకున్న స్ఫూర్తి కావచ్చు అటు లెక్చరర్లలోనూ, విద్యార్థులలోనూ తీవ్రమైన పట్టుదల, తామేంటో రుజువు చేసుకోవాలనీ, ప్రపంచానికి చాటాలనే తపన కనిపించింది. కళాశాల ప్రిన్సిపాల్ చొప్పరి పరమేశ్ గారు కళాశాల గత సంవత్సర రిపోర్టు చదువుతుంటే.. ఒకింత గర్వం గా కూడా అనిపించింది. కాలేజీలోని అన్ని గ్రూపుల్లో గణనీయమైన రిజల్ట్స్ సాధించారు. ఎంపీసీ గ్రూపులోనైతే వందశాతం రిజల్ట్స్ సాధించారు. మిగతా బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో సైతం 98 శాతం రిజల్ట్స్ సాధించి కార్పొరేట్ కాలేజీలకు తామేమీ తీసిపోమని చాటిచెప్పారు. ఈ రెండు శాతం రిజల్ట్స్ కూడా తక్కువ రావడానికి గ్రామీణ వాతావరణంలో చదివిన విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టు ఒకటే కొరకరాని కొయ్యగా మారుతున్న తీరును ఇంగ్లీష్‌ను బోధిస్తున్న లెక్చ రర్ మంజుల గారు వివరించారు. రాబోయే రోజుల్లో దీన్ని కూడా అధిగమించి అన్నివిధాలుగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించి కళాశాల విద్యార్థులను అగ్రశ్రేణిలో నిలుపుతామని మేడం చేసిన వాగ్దానం స్ఫూర్తి దాయకమైనది.

మారుమూల గ్రామాల నుంచి ఇంటర్ చదువుల కోసం వచ్చిన విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల కోసం కళాశాలలోని లెక్చరర్ల బృందం పడుతు న్న తపన అంతా ఇంతా కాదు. నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ, షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయడమే కాకుండా.. ఎప్పటికప్పుడు సబ్జెక్టులను విద్యార్థులతో చదివిస్తూ ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తున్నారు. వేలు, లక్షలు పోసి కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న వారికి దీటుగా మా విద్యార్థులు కూడా ఉండేలా తీర్చిదిద్దుతున్నామన్న ప్రిన్సిపాల్ మాటలు అందరికీ స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా విద్యార్థిని కావ్య, పరిమళ చొరవ ఆలోచనా సర ళి, సృజనాత్మక విధానం అభినందనీయం. విద్యార్థిలోకానికి ఆదర్శప్రాయం.

ఇక సభా సమయంలో విద్యార్థులు వ్యవహరించిన తీరు మరింత స్ఫూర్తిదాయకంగా ఉన్నది. డయాస్‌పైకి ఎక్కిన విద్యార్థినులు నేటి సామాజిక స్థితిగతులను తమవైన జీవితానుభవాల నుంచి చెప్పుకొచ్చి వాటిని అధిగమించడం కోసం తాము పడుతున్న తపనను వివరించారు. తమ ఇళ్లల్లో ఆడ పిల్లలను ఎలా తక్కువ చేసి చూస్తున్నదీ, తమ్ముళ్లను, అన్నలను లక్షలు పోసి కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తూ.. అమ్మాయిలుగా తమను మాత్రం ఈ ప్రభుత్వ కాలేజీలో చదివిస్తున్న తీరును, అనుసరిస్తున్న వివక్షను ఒకింత ఆవేదనతో, ఆగ్రహం తో వివరించారు. అయినా తాము న్యూనతాభావానికి గురి కావడం లేదనీ, తక్కువ చేసి చూసిన పరిస్థితుల్లోంచే తామేంటో చాటుకుంటామని ప్రతినబూ నారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివిన వారి కన్నా ఎక్కు వ మార్కులతో, నైపుణ్యాలతో ప్రతిభా పాఠవాలను చాటుకుంటామన్న బాలికల మనో ధైర్య వికాసాలకు ప్రతీకలుగా నిలిచారు.

కొన్నేళ్లుగా అనేక కాలేజీల్లో విద్యార్థుల స్థితిగతులను, మనో వికాసాలను చూస్తే.. ఎంతో నిరాశాజ నకంగా ఉన్నాయి. ఏ ఒక్కరికీ భావ ప్రకటనా నైపు ణ్యాలు కనీసంగా కూడా లేని దుస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా కార్పొరేట్ కళాశాల చదువుల్లోనైతే మరింత అధ్వాన్నంగా ఉన్నది. ఏ ఒక్కరికీ కనీస భావ వ్యక్తీకరణ కొరవడిన స్థితులు ఉన్నాయి. ఈ అంశంలో నగరాల్లోని కాలేజీ విద్యార్థినీ విద్యార్థుల కన్నా మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల మనో వికాసం ఎంతో గొప్పది. సాధారణంగా కుటుంబాల్లో జరుగుతున్న వివక్ష, అణిచివేతలను సాధారణీకరించి సామాజిక రుగ్మతలుగా గుర్తించి వాటి పై పోరాటం చేయాల్సిన అవసరాన్ని విద్యార్థినులు గుర్తించడమే కాదు, ఎదిరిస్తున్న తీరు గొప్పది. బహుశా వీరి పరిణతికీ, స్వచ్ఛతకూ వారి సహజ గ్రామీణ జీవితమే ఆలంబనం అనుకోక తప్పదు. ఆధునిక నగర జీవితంలో సహజ స్పందనలనూ, దృక్కోణాలను కోల్పతున్న యువత ఇవ్వాళ అన్ని విధాలుగా పరాయీకరణకు బలవుతున్నది. నవ నాగరికత పేర విశృంఖల వికృత జీవన విలాసాల్లో కొట్టుకుపోతున్నది. ఎన్నోవిధాలుగా హిం సా దౌర్జన్యాలకు గురవుతున్నది. మరోవైపు ఎలాంటి పరాయీకరణలేని గ్రామీణ సహజ జీవన సౌందర్యంలోంచి మోత్కూర్ విద్యార్థులు ఆలోచిస్తున్న, ఆచరిస్తు న్న తీరు విద్యార్థిలోకానికి ఆదర్శం.

ఇక్కడే మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఇవ్వాళ్టి విద్య నెయ్యి తీసిన టోన్డ్ మిల్క్ లాంటిది. నెయ్యి, పోషకాలు తీసేసిన పాలతో పెరుగులాంటిది పొందవచ్చునేమో కానీ, దాన్నుం చి నెయ్యి పొందలేం. అందుకే తెల్లని వన్నీ పాలుకావన్నారు. సరిగ్గా ఇలాగే జ్ఞానం కొరవడిన (ప్రయత్న పూర్వకంగా దూరం చేయబడిన) మన చదువులతో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ జ్ఞానమున్న, మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు. అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువులు చదివినా మానవత్వం లోపించిన వారే ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. జ్ఞానం పునాదిగా గల చదువులు చదివితే ఈ సమాజం ఎంత మానవీయంగా ఉండేదో మోత్కూర్ విద్యార్థులను చూస్తే తెలిసివస్తున్నది. నేటి నిస్సారమైన చదువుల పునాదితోనే గ్రామీణ విద్యార్థిలోకం ఇంత సృజనాత్మకంగా ఉంటే చదువులన్నీ జ్ఞాన కేంద్రంగా సాగే చదువులుంటే దేశం ఎంతగా అభివృద్ధి చెందేదో! అందుకే మానవ సహజ సృజనాత్మక శక్తులను చాటి చెప్పిన మోత్కూర్ ప్రభుత్వ కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు అభినందనీయులు. నూతన మానవీయ తెలంగాణ నిర్మాణానికి ఆదర్శ ప్రాయులు.

1448

MALLA REDDY

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Featured Articles