చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా


Tue,July 12, 2016 12:05 AM

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద
దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్లేయర్ మొదలు నేటి ఒబామా దాకా యుద్ధ నేరస్థులుగా ప్రపంచం ముందు నిలుచున్న వీరికి ఏ శిక్ష వేయాలి?

sama
ఇరాక్‌పై దాడి నేపథ్యంలో ఇంగ్లండ్ పాత్రపై చిల్కా ట్ రిపోర్టు సంచలనం సృష్టిస్తున్నది. నాడు ప్రపంచమంతా చెప్పినా వినకుండా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణసేనలు చేసిన అక్రమయుద్ధం అసలు రంగును చిల్కాట్ రిపోర్టు బహిర్గతం చేసింది. ఇరాక్‌పై దాడిచేసే క్రమంలో అమెరికాకు అంటకాగి అన్యాయంగా, అసత్యపు ఆరోపణలతో ఇరాక్‌పై దాడి చేశారని ఈ రిపోర్టు తేల్చిచెప్పింది. ఇంగ్లండ్ ప్రజల డిమాండ్ మేరకు ఏర్పా టు చేసిన చిల్కా రిపోర్టు అగ్రరాజ్యాల ఆధిపత్య రాజకీయాల క్రూరత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది.

ఇరాక్‌పై ఇంగ్లండ్ ప్రధాని టోనీ బ్లేయర్ అమెరికాకు వంతపాడి అనవసరంగా ఇంగ్లండ్‌ను యుద్ధంలోకి దిం చారని బ్రిటిష్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనసవర సైనికజోక్యానికి దిగి వేలాది బ్రిటిష్ సైనికుల ప్రాణా లు పణంగా పెట్టాల్సి వచ్చిందని.. దీనిపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏడేళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం.. సర్ జాన్ చిల్కాట్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏడేళ్లు సుదీర్ఘ అధ్యనం చేసి 6,275 పేజీల నిజనిర్ధారణ రిపోర్టును ప్రకటించింది. ఈ రిపోర్టులో అమెరికా సంకీర్ణసేనలు అసత్య ఆరోపణలతో అనవసర సైనిక జోక్యానికి దిగాయని తేల్చిచెప్పింది.ఇరాక్‌లో సామూ హిక మానవ విధ్వంసక రసాయనిక, అణ్వాయుధాలున్నాయన్న నేపం మోపి దాడి చేశారని స్పష్టం చేసింది. సరియైన రుజువులు లేకుండానే ఇరాక్‌లో విధ్వంసక ఆయుధాలున్నాయని ప్రపంచాన్ని నమ్మించారని తేల్చిచెప్పింది.

ఇరాక్ పాలకుడు సద్దాం హుసేన్ ప్రపంచ శాంతికి భంగం కలిగించే చర్యలు చేస్తుం టే.. ఆ చర్యల నివారణకు చేయాల్సిన శాంతికోసం చర్చల ప్రయత్నమంటూ ఏమీ చేయకుండానే మిలిటరీ చర్యకు ఒడిగట్టారని చిల్కాట్ రిపోర్టు ఎండగట్టింది. ఇరాక్‌పై దాడి క్రమంలో ఇంగ్లండ్ ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలకు తావివ్వకుండా.., బ్లేయర్ అమెరికాకు తానున్నానని ఇంగ్లండ్ సేనలను అనవసర యుద్ధంలోకి దించారని ప్రకటించింది.యూఎన్‌ఓ భద్రతా సమితి కూడా సద్దాంతో ప్రపంచానికి ముంచుకొచ్చిన ప్రమాదమేమీ లేదని, సద్దాం హుసేన్ సమస్యాత్మకంగా ఏమీ కనిపించడంలేని వివరించింది. కాకుంటే.. అణ్వాయుధాలున్నాయను కుంటే తనఖీలు చేసుకోవచ్చని చెప్పినా వినకుండా.. అమెరికా సంకీర్ణసేనలు దాడి చేశాయని పేర్కొన్నది. ఐక్యరాజ్య సమితి అనుమతి, అంగీకారం లేకుండానే ఇరాక్‌పై దాడికి ఒడిగట్టారని వాపోయింది. అంతేకాదు ఈ రీపోర్టులో అమెరికా తన ఆధిపత్యం కోసం ఆడిన అబద్ధ్దాలను, సంకీర్ణ సేనలు చేసిన దురాగతాలను ఏకరువు పెట్టింది. చమురు నిల్వల కోసం అమెరికా చేసిన అక్రమ యుద్ధమని తేల్చి చెప్పింది.

ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా, చివరికి ఐక్యరాజ్య సమితి కూడా వద్దంటున్నా.. అమెరికా ఎందుకు ఈ దాడులకు పాల్పడింది? దాంతో అమెరికా సాధించదలచిన లక్ష్యం ఏమిటో స్పష్టమే. మధ్య ఆసియా దేశాలు సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్‌లలోనే ప్రపంచ చమురు నిల్వలలో 60 శాతం ఉన్నది. ఈ చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా ఆయిల్ కంపెనీలు ఈ దేశ భూభాగాలపై ఆధిపత్యం కోరుకున్నాయి. దీనికోసం అమెరికాను ఎగదోసి మధ్యాసియా దేశాల ఆక్రమణకు పావులు కదిపాయి. మొదట నమ్మిన బం టుగా ఉన్న కువైట్‌లో తిష్ట వేసిన అమెరికా చమురు నిల్వలను వెలికి తీసే పేరిట ఇరాక్ భూభాగాల్లోని చమురును దొంగతనంగా వెలికితీయడం ప్రారంభించింది. ప్రపంచంలోనే మరే దేశం దగ్గర లేనటువంటి స్లాంట్ డ్రిల్లింగ్ యంత్రాలున్న అమెరికా, ఇరాక్ భూభాగాల్లోని చమురును దొంగచాటుగా తవ్వడానికి పూనుకున్నది.

డ్రిల్లింగ్ మిషిన్‌లు చూడటానికి కువైట్ భూభాగంలోనే ఉంటాయి, కానీ.. అవి స్లాంట్ డ్రిల్లింగ్ ద్వారా అంటే.. వంకరగా భూగర్భంలోకి వెళ్లి, ఇరాక్ భూభాగంలోని బావులనుంచి చమురును తవ్వి తీయడం ప్రారంభించాయి. దీంతో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ అమెరికా దుశ్చర్యలను వ్యతిరేకించాడు. చమురు తవ్వకాలను నిలిపేయాలని డిమాండ్ చేశాడు. అయినా అమెరికా తన వక్రబుద్ధితో కువైట్ భూ భాగా ల్లో తవ్వుకుంటుంటే.. సద్దాంకు అభ్యంతరమేమిటని మరింత రెచ్చిపోయింది.దీంతో చేసేదిలేక..కువైట్ భూ భాగంలోంచి అక్రమ తవ్వకాలను నిల్వరించేందుకు ఆ భూ భాగాలను ఇరాక్ స్వాధీనం చేసుకున్నది. దీన్ని.. చిన్న దేశం కువైట్‌పై ఇరాక్ దాడి చేసిందని చెప్తూ అమెరి కా ఇల్లెక్కి గోల చేసింది. సద్దాం హుసేన్ నియంతగా చిన్న దేశాలపై దాడులకు పాల్పడుతున్నాడని దుష్ప్రచారానికి దిగింది. చిన్నదేశాల రక్షణ బాధ్యత తనదని అమెరికా తనకు తాను ప్రకటించుకుని ఇరాక్‌పై యుద్ధానికి దిగింది.ఈ క్రమంలో అమెరికా చేయని అబద్ధ ప్రచా రం లేదు. సద్దాం పెద్ద ఎత్తున రసాయన, అణ్వాయుధా లు నిల్వ చేశాడనీ, వాటితో ప్రపంచ మానవాళికే ప్రమాదం పొంచి ఉన్నదని చెబుతూ ప్రపంచ రక్షకుడిగా తన బాధ్యతగా చేస్తున్న ఇరాక్‌పై దాడికి ప్రపంచ దేశాలన్నీ సహకరించాలని చెప్పుకొచ్చింది.

అమెరికా, దాని అనుంగు దేశాల దన్నుతో 1991లో ఇరాక్‌పై దాడి చేసి ఆక్రమించి లక్షలాదిమందిని ఊచకోత కోసింది. ఐదులక్షల మంది చిన్నపిల్లలు, స్త్రీలు చనిపోయారు. ఇరాక్‌లో తన తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి షియా వర్గీయులపై అకారణంగా హత్యాకాండ కొనసాగించాడన్న ఆరోపణతో 2006 డిసెంబర్ 30న సద్దాం ను ఉరితీసి హత్య చేసింది. అమెరికా ఇంతటితోనే ఆగలేదు.చమురు నిక్షేపాలున్న ఆఫ్ఘ నిస్థాన్‌ను కబలించింది. లిబియాను దురాక్రమించి ఆదేశ పాలకుడు గడాఫీని హత్యచేసింది. సిరియాలో ఆ దేశ పాలకుడిని కూలదోసేందుకు ఐఎస్‌ఐఎస్‌ను ఎగదోసిం ది. చమురు నిల్వలపై ఆధిపత్యంకోసం అమెరికా దేశ దేశాలను కబలించడంతో పాటు, శియా,సున్నీల మధ్య వైషమ్యాలను ఎగదోసి నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఉగ్రభూతానికి పురుడు పోసి, పెంచి పోషించింది.

ఇన్నాళ్లకైనా.. ఇరాక్‌పై అమెరికా నేతృత్వంలో చేసిన దాడి అక్రమమని, అన్యాయమైనదని దాడికి పాల్పడిన ఓ దేశం (ఇంగ్లండ్) ఒప్పుకున్నట్లయిం ది. ఇరాక్‌పై దాడి ప్రారంభరోజుల నుంచీ అమెరికాలోనూ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనోద్యమాలు జరిగాయి. యుద్ధభూమిలో ఎడారి మంటల్లో తమ బిడ్డలు పడుతున్న కష్ట నష్టాలు చూసి అమెరికా ప్రజలు తల్లడిల్లిపోయారు. యుద్ధం దేనికోసమని, ఎవరికోసమని నిలదీశారు. అనవసరంగా మా బిడ్డలను యుద్ధభూమిలోకి పంపిస్తున్న బుష్ గారూ.. మీ బిడ్డను కూడా యుద్ధభూమికి పంపిస్తావా..? అంటూ.. పోస్టు కార్డుల ఉద్యమంతో వేలాదిమంది సైనికుల తల్లులు జార్జిబుష్‌ను నిలదిశారు. అయినా అమెరికా పాలకులు ఇవేమీ పట్టించుకోలేదు. దురాక్రమణ యుద్ధాలు చేసి వేలాది అమెరికన్ల చావుకు కారణమవడమే కాదు, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, లిబియా, సిరి యా దేశాల్లో లక్షలాది ప్రాణాలను బలిగొన్నది. ఈ అన్యాయ యుద్ధాలకు, అకారణ మారణహోమాలకు కారణమైన అమెరికా పాలకులు కూడా తమ దేశంలో ఇంగ్లండ్‌లో లాగానే ఇరాక్ యుద్ధంపై ఓ విచారణ సంఘాన్ని ఏర్పాటు చేస్తే.. చిల్కాట్ రిపోర్టును తలదన్నే నిజాలను వెల్లడించడమే కాదు, అమెరికా దురాగతాలను ఏకరువు పెడుతుంది.

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్లేయర్ మొదలు నేటి ఒబామా దాకా యుద్ధ నేరస్థులుగా ప్రపంచం ముందు నిలుచున్న వీరికి ఏ శిక్ష వేయాలి? అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్ లాంటి టెర్రరిస్టు సంస్థలకు ఆర్థిక, ఆయుధ సాయం చేసిన అమెరికా పాలకులను దోషులుగా ప్రపంచ ప్రజల ముందు ఎవరు నిలబెట్టాలి? ఇవ్వా ళ ప్రపంచ శాంతి కాముకుల ముందున్న ప్రశ్న!

583

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Featured Articles