ఏదీ ప్రకృతి నియమం?


Wed,December 26, 2018 03:34 PM

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస మానవీయ స్పందన, విచక్షణ ఉన్న వారెవరైనా జింక పక్షంఅంటారు. కానీ.. ఈ మధ్య ఈ విషయంపై ఆసక్తికరమైన చర్చ సాగింది. సామాజిక అధ్యయన వేదిక చర్చావేదికలో ఓ మిత్రుడు ఈ ప్రశ్నను లేవనెత్తి.., ఎవరూ విప్పలేని చిక్కుప్రశ్న సంధించిట్లుగా అందరివైపు చూశారు. సహజంగానే అందరూ జింక పక్షమని అన్నారు. దాంతో ఆ మిత్రు డు ఓ చిరునవ్వు నవ్వి.. ఇంతేనా మీ హ్రస్వదృష్టి అన్నట్లుగా అందరి వైపు చూసి..ఇందులో (పులి, జింకలో) దేనిది న్యాయమనేది చూసే చూపులోని సమస్యే కానీ..న్యాయాన్యాయాల చర్చ అర్థం లేనిద ని అన్నారు! ఇంకా ఒక అడుగు ముందుకేసి.. ఆకలితో అలమటిస్తున్న పులి.. జింకను వేటాడకుండా ఎలా బతకాలి?ఆకలితో చావాల్సిందేనా..? అంటూ నిలదీశారు. అది ప్రకృతి నియమం అంటూ.. పులిది అన్యాయమెలా అంటారని ఆశ్చర్యపోయారు. జింక నో మరేదో సాదు జంతువు బలికాకుండా పులులు ఎలా బతుకుతాయని ధర్మ సందేహం వ్యక్తం చేశా రు. మరి అమాయక జింకలు లేదా అలాంటి చిన్న, సన్న జీవులు పులులకు బలికావాల్సిందేనా.. అంటే ప్రకృతి నియమాన్ని అన్యాయమని, హింస అని ఎలా అంటారని ఎదురు ప్రశ్నిస్తూ..తనదైన తర్కవాదాన్ని కొనసాగించారు.

ఇది అమాయక చర్చకాదు. అర్థంలేని చర్చ కూడా కాదు. ఈ ప్రశ్న వేసి.. పులిది సహజ న్యాయమని అంటున్న మిత్రుడు సగటు జీవి కాదు. ఉన్నత విద్యావంతుడు. పెద్ద ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. భారతీయ పురాణ ఇతిహాసాలపై అపారమైన భక్తి విశ్వాసాలున్నవారు. ఆధునిక యువతకోసం వ్యక్తిత్వ వికాసంపై పుస్తకాలు రాశారు. అలాంటి పెద్దమనిషి నోటివెంట ఇలాంటి చర్చ వచ్చి.. పులిది సహజన్యాయమనే వాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేదే సమస్య. ఇక్కడ ఆకలిగొన్న పులి, బలి అవుతున్న జింక విషయంకాదు. పులి ఆకలిని మాత్రమే చూస్తూ.. బలహీనమైన సన్నజీవం జింక బలవుతున్న తీరు కనిపించకపోవటం, లేదా చూడ నిరాకరించటం అసలు సమస్య.

mallaredddyపులి న్యాయాన్ని దానికదిగా ప్రకృతి నియమంగా చూసే చూపు ఓ నిర్దిష్టమైన ఘటనకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. అలాంటి చూపు అక్కడ నే ఆగదు గనుక.. దాని మూలాల్లోకి వెళ్లాల్సిందే. పులి న్యాయం చూపు వెనుక.. ఓ తాత్విక దృక్పథమున్నది. ఆ తాత్విక మూలాల్లోకి వెళ్లి చర్చించుకోక పోతే.. శుద్ధ తర్కవాదంలో కొట్టుకుపోయే ప్రమాదమున్నది. అలాగే ఇలాంటి తాత్విక దృక్పథం తేలిక గా తీసి పారేయదగిందీ కాదు. ఎందుకంటే.. అది సామాజిక జీవనంలోకి వచ్చి.. అది చుట్టూరా జరుగుతున్న సామాజిక ఘటనల పట్ల, సమస్యల పట్ల అవగాహనను నిర్దేశిస్తుంది. ఈ తాత్విక దృష్టి కోణంలోంచే ఎవరైనా ఈ భౌతికప్రపంచాన్ని, సమాజాన్ని చూస్తారు, అర్థం చేసుకుంటారు. అనేకానేక సామాజిక సమస్యల పట్ల తమదైన భాష్యం చెబుతారు.
చరిత్రలో సామాజిక జీవనంలో అనాదిగా.. పులిన్యాయంపై ఎడతెగని చర్చ సాగుతూనే ఉన్నది. ఆధిపత్య ఆలోచనల్లోంచి పులిన్యాయం చరిత్ర పొడుగునా అనేక రూపాల్లో బోధించబడుతున్నది, అమలు చేయబడుతున్నది. పులి న్యాయాన్ని ప్రశ్ని స్తూ.. జింక పక్షాన నిలిచి జింకలాంటి జీవులు సమాజంలో బలి కాకుండా ఉండాలని కోరుకోవడమే కాదు, బలహీన ప్రాణుల (ప్రజల)రక్షణ కోసం కొట్లాట సాగుతూనే ఉన్నది.

భావజాల పరంగానూ ఈ రెండు వాదాల మధ్య అలుపెరుగని సంఘర్షణ కొనసాగుతున్నది. కాకుంటే.. పులి ఆకలి తీర్చుకోవ డం కోసం జింకను తినడం సహజ న్యాయమనే చూపు.. చరిత్రపొడుగునా ఈ సమాజాన్ని అదుపాజ్ఞల్లో పెట్టుకొని శాసిస్తున్నది, ఏలుతున్నది. అందుకే రాచరిక పాలనాకాలం నుంచీ.. నేటిదాకా అనేక రూపాల్లో ఆ వాదం కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే తమ ఆధిపత్యాన్ని, అధికారాన్ని ప్రశ్నించకుండా, ఎదిరించకుండా ఉండటం కోసం ప్రజల ను మానసిక బానిసలుగా, బలహీనులుగా చేసే భావజాలం పెంచి పోషించబడుతున్నది. అలా ఉనికిలోకి వచ్చి వ్యవస్థీకృతం చెయ్యబడిందే మతం. ముక్తి సంగతి పక్కనబెడితే, ఎవరి ధర్మం వారు నిర్వర్తించాలని మతం బోధిస్తున్నది. రాజు పాలిం చాలని, ప్రజలు సేవ చేయాలని బోధిస్తూ ధర్మం తప్పడం మహాపాపమని భయపెడుతుంది. రాజు దైవాంశ సంభూతుడు అంటూ.. పాలితులు పాలకులను ప్రశ్నించడం పాపమన్నది. జింకలాంటి సాదు జనులు త్యాగాలు చేస్తూ.. సేవలు చేయాలని బోధిస్తున్నది. నిజానికి ధర్మం నాలుగు పాదాల నడిచే ఆదర్శపాలనలో వర్ణాశ్రమ ధర్మాల పరిరక్షణ పేరిట సాగిందంతా ఆధిపత్యాన్ని నిలుపుకోవడం, బలహీ నులను అణచిపెట్టడమే. కాదని ఎప్పుడైనా ఎక్కడైనా సాదుజనులు ఎదురు తిరిగితే శిలువ వేసి చంపింది పులి న్యాయమే. స్పార్టకస్, జీసస్ నుంచి మొదలు మనకాలపు వీరుల దాకా పులి న్యాయాన్ని ప్రశ్నించిన వారే.

విషాదమేమంటే.. సమాజంలో చాలాభాగం ఇలాంటి పులిన్యాయం చూపుతోనే ఉన్నారు. ఆధిపత్య మతవాద పులిన్యాయం ప్రాకృతిక విషయాలను, సామాజిక సమస్యలనూ తమదైన దృక్కోణం తో అర్థం చేసుకుంటూ.. సహజ న్యాయ సూత్రాలు కొన్ని ఉంటాయనీ, వాటిని మార్చడానికి యత్నించడం వృథా ప్రయాస అంటున్నారు. అంతే కాదు, వాటిని మార్చాడానికి ప్రయత్నించటం అసహజం, అసమంజసం అంటున్నారు. చరిత్రలో అనాది నుం చి నేటి దాకా.. జరిగిన, జరుగుతున్న సామాజికాం శాలను సహజమైనవిగా, ప్రశ్నించడానికి వీలులేనివి గా చెప్పుకొస్తున్నారు. రాముడు శంభూకున్ని వధించినా, ద్రోణుడు ఏకలవ్యుని బొటనవేలును నరికేసి నా..ఓ ధర్మకర్తృత్వంలో భాగంగా జరిగినవిగా నమ్మిస్తున్నారు. ఆధునిక కాలంలోకి వచ్చి.. ఆర్థిక అంతరాలనూ, కుల అణిచివేతలు హెచ్చుతగ్గులను ప్రశ్ని స్తే.. చేతికున్న అయిదు వేళ్లు సమంగా ఉన్నాయా? అని గద్దిస్తున్నారు. అంటే.. అయిదు వేళ్లు సమంగా ఎప్పుడూ ఉండవు.., కాబట్టి మనుషులందరూ ఎప్పుడూ, ఏ రూపంలోనూ సమానులు కారని, కాబోరని చెప్పుకొస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. పులి న్యాయపు చూపు ఎంత ప్రమాదకరమైనది అంటే.. సకల ఆధిపత్యాలన్నీ సహజ పరిణామాల ని, అనివార్యమైనవని చెప్పుకొస్తుంది.చివరికి ప్రపం చీకరణను అభివృద్ధి క్రమంలో అనివార్యమని అం టున్నది. అసమ సమాజంలో సమన్యాయం గురిం చి ప్రబోధిస్తూ పబ్బం గడుపుకుంటున్నది ప్రజలు తమ మనుగడ కోసం చేస్తున్న సంఘర్షణలన్నింటినీ శాంతిని భగ్నంచేసే చర్యలుగా చూస్తుంది. కార్మికులు, రైతులు, ఆదివాసులు తమ మనుగడ కోసం, హక్కుల కోసం గొంతెత్తితే.. చట్ట ఉల్లంఘనలుగా, అసాంఘిక హింసాయుత చర్యలుగా చూస్తుంది. ఆకలి, దారిద్య్రం, నిరక్షరాస్యత, కుల అణచివేతల లాంటి వ్యవస్థీకృత హింసలను చూడ నిరాకరిస్తూ.. అవి పోవాలనడాన్ని మాత్రం అశాంతి అంటుంది.

నవనాగరిక సమాజంలో పులిన్యాయం ఎలా తిష్టవేసి ఉన్నదో ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇది ఇవ్వాళ.. అనేకరూపాల్లో ఆధునిక జీవనాన్ని శాసి స్తూ యథాతథవాదాన్ని బోధిస్తున్నది. నేటి మధ్య తరగతి భద్రలోక జీవులంతా.. ఈ యథాతథ వాదం మాటున దాగి పులి న్యాయాన్ని ఆచరిస్తున్నా రు. ప్రాచీన కాలం చెల్లిన భావజాలంతో నిండిఉం టూ అత్యాధునిక వేషభాషలతో ముస్తాబవుతున్నా రు. బూజుపట్టిన భావజాలాన్ని అత్యాధునిక టెక్నాలజీతో సమాజంలోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇవ్వాళ్టి ప్రమాదమంతా ఈ ధోరణితోనే. అత్యాధునిక టెక్నాలజీతో అత్యంత వెనుకబాటు భావజాలాన్ని మనుషుల మెదళ్లలో నింపే ప్రక్రియ బాహాటంగా సాగుతున్నది. వర్తమాన సమాజంలో తమ కళ్లెదుట సాగుతున్న సామాజిక ఉద్యమాల్లో తమ పాత్ర ఏమిటో చెప్పకుండా, నిర్వహించకుండా పోరాటాలకు వక్రభాష్యాలు చెబుతారు. సంఘటిత, సామాజిక ఉద్యమాలను నిరాకరిస్తూ వ్యక్తివాద పోకడలతో ఊరేగుతారు. అభ్యుదయానికీ, ఆధునికతకూ తామే ప్రతీకలమని చాటుకుంటారు. ఇప్పటిదాకా ఏ సామాజికోద్యమమూ సాధించని ఘనతను సాధించి చరిత్ర నిర్మిస్తున్నది తామేనని అంటున్నారు. సమిష్టి కార్యాచరణను నిరాకరిస్తూ వ్యక్తివాద పోకడలనే ఆధునిక సమాజపు ఆచరణాత్మక విధానమని చెప్పుకొస్తారు.ఎవరెంత అందమైన పరిభాషతో చెప్పినా.. ఇదంతా పులిన్యాయపు పాయలు తప్ప మరేమీ కాదు. దీనికి విరుగుడు.. పులిన్యాయపు నీలినీడలను నిర్మూలించి, శాస్త్రీయ భావజాలం పునాదిగా మానవీయ సమాజం నిర్మా ణం చేయడమే. సమిష్టి కార్యాచరణతో సామాజికోద్యమాలతో కలిసి నడవటమే.

990

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Featured Articles