సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!


Sun,June 19, 2016 01:37 AM

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను
కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు కంటే కీడే ఎక్కువని అనేక ఘటనలు
తేటతెల్లం చేస్తున్నాయి. క్షేమ సమాచారాల కోసం, సంబంధాల కోసం వీలైనంత మేరకు బేసిక్ మోడల్ మొబైల్స్‌నే ఉపయోగిస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.

sama
ఇవ్వాళ.. ప్రపంచాన్నంతా ఒకే ఒక సమస్య వేదిస్తున్నది. అది ఓ మహమ్మారిలా వ్యాపించి సమాజా న్ని అతలాకుతలం చేస్తున్నది. అదే.. మొబైల్ (సెల్). మొబైల్ అంటే.. ఇవ్వాళ మనం ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళుతూ మాట్లాడుకోవడానికి అనువుగా పనికి వచ్చే పరికరం మాత్రమే కాదు. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత సెల్ అర్థం, పరమార్థం మారిపోయింది. అత్యాధునికమైన వీడియో కెమెరాగానే గాకుండా.., వాట్సప్, ఫేస్‌బుక్‌లు, ఎస్‌ఎంఎస్, ఎంఎంఎస్‌లు మొబైల్‌తో అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని వినియోగం మారిపోయింది. దుర్వినియోగం పెరిగిపోయింది.

మొబైల్ ఫోన్(సెల్) మనిషికి ఎంతటి భద్రత, సౌకర్యాన్ని చేకూరుస్తుందో, ప్రపంచంతో అనుసంధా నం చేస్తుందో కానీ.., వ్యక్తిని ప్రపంచం నుంచే కాదు, సమూహం నుంచీ, కుటుంబం నుంచీ వేరు చేసి ఒం టరిని చేస్తున్నది. బానిసను చేసి పీడిస్తున్నది. ఇవ్వా ళ.. ఏ ఇల్లూ, ఏ కుటుంబమూ సెల్ బాధిత కుటుంబంగా లేదంటే అతిశయోక్తి కాదు. ఎవరికి వారు తమ కుటుంబంలో వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటున్న దుస్థితి ఉన్నది.

ఎప్పుడూ చలాకీగా ఆడుతూ పాడుతూ గలగల పారే సెలయేరులా ఉండే తొమ్మిదో తరగతి అమ్మాయి అకస్మాత్తుగా డల్ అయిపోయింది. ఎవరితో మాట్లాడకుండా తన రూములోనే ఉండిపోతున్నది. ఎవరితో మాట్లాడకుండా మూడీగా మారిపోయింది. స్కూల్‌కు డుమ్మా కొట్టడం ఎరుగని అమ్మాయి పాఠశాలకు పోవడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నది. ఈ పరిస్థితి ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలవర పర్చింది. ఎంతో కష్టపడి ఆ అమ్మాయిని విషయం అడిగి తెలుసుకుం టే.. తన క్లాస్‌మేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ లిస్టులో తన పేరు లేదట. ఆ విషయం.. తన ఫ్రెండ్స్ దగ్గరున్న సెల్‌ఫోన్ మెసేజ్‌లో చూస్తే బయట పడిందట. అంతే.. ఆ అమ్మాయి మానసికంగా అంతగా కుంగిపోయింది.

ఇంకో కుటుంబం సమస్య ఇంకా తీవ్రమైనది. ఎనిమిదేళ్ల బాలుడు. మూడో తరగతి చదువుతున్నాడు. మొన్నటి దాకా బాగానే ఉన్నాడు. స్కూలు నుంచి వచ్చిన తర్వాత కాళ్లూ చేతులు కడుక్కొని హోం వర్క్ చేసుకునే వాడు. ఈ మధ్యన అదంతా మానేశాడు. మొబైల్‌ఫోన్‌తో ఆడుకోవడం ప్రారంభించాడు. రాత్రి కూడా సెల్‌తో ఆడుకుంటుంటే వద్దన్నందుకు అలిగి అన్నం మానేశాడు. నిద్ర పోరా.. అంటే నిద్రరావటం లేదు.. ఆడుకుంటే ఏమైందంటాడు. ఇక విసిగిపోయి న తల్లిదండ్రులు సెల్‌తో ఆడొద్దన్నందుకు అన్నపానీయాలు బంద్ చేయడమే కాదు, స్కూల్‌కు పోనంటున్నాడు. ఎంత నచ్చజెప్పినా, కొట్టినా మార్పులేదు. దీంతో ఆ కుటుంబం పడుతున్న వేదన వర్ణనాతీతం.

కార్పొరేట్ మహానగరాల్లోని సెల్ బాధిత గాథలు, గాయాలు తీవ్రమైనవి. ఢిల్లీ గుర్‌గాంలోని ప్రఖ్యాత స్కూల్‌లో శరణ్య సమస్య విచిత్రమైనది. తన స్నేహితులంతా తన శరీరం నుంచి ఏదో బ్యాడ్‌స్మెల్ వస్తుందని మెసేజ్ పంపించుకున్నారట. అది తన స్నేహితురాలి మెసేజ్‌లో చూసిందట.అంతే ఆ స్కూల్ కు పోనని ఆ అమ్మాయి మొండికేసి కూర్చున్నది. ముంబాయిలో ఓ ప్రముఖస్కూల్‌లో 17 ఏళ్ల మంద్ర అనే అబ్బాయి చేరాడు. ఈ మధ్యనే ఉత్తర భారతం నుంచి తన తండ్రి ఉద్యోగరీత్యా ముంబాయికి మారి తే.. ఆస్కూలులో చేరాడు.అతని తరగతిలోని స్టూడెం ట్స్ అతని ఉత్తర భారత యాసను చూసి నవ్వారట. అంతే.. నొచ్చుకున్న ఆ విద్యార్థి బిల్డింగ్ పైనుంచి దుం కి ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. ఢిల్లీలో ఓ పాఠశాలలో చదువుతున్న 16 ఏళ్ల అనిత.. తన క్లాస్‌మేట్స్‌లోని ఓ అబ్బాయి.. అనిత ఫోటోను అభ్యంతరకర రీతిలో ఫోటో తీసి ఫోన్‌తో ఎంఎంఎస్ ద్వారా పంపాడట. అది స్నేహితుల ద్వారా తెలుసుకున్న అనిత ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.

మోబైల్ ఫోన్లలో ఉన్న ఆప్షన్ల కారణంగా ఫోటో లు, వీడియోలు తీసి ఇతరులకు పంపడం, షేర్ చేయ డం మామూలైపోయింది. ఈక్రమంలో సైబర్ ర్యాగిం గ్ పెరిగిపోయింది. గిట్టని వారిపై అభ్యంతర వాఖ్యలు రాయడం, ఫోటోలు పంపడం చేస్తూ వేధింపులకు దిగుతున్నారు. ఒకానొక అధ్యయనం ప్రకారం ఇండియాలో 81 శాతం స్కూల్ పిల్లలు సెల్ నెట్‌వర్క్‌లో తీరిక లేకుండా ఉంటున్నారట.విద్యార్థుల్లో 51 శాతం మంది తమ దగ్గరున్న స్మార్ట్ ఫోన్‌ల సాయంతో ఇతరులను ఏడిపించుకు తింటున్నారు. లేదా బ్లాక్ మెయి ల్ చేస్తూ.. అనేక రూపాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

ఆంధ్రాలో ఓ యువకుడు పాఠశాల విద్యార్థినిని అవాంఛనీయ పద్ధతిలో ఫోటో తీశాడు. ఆఫోటోతో బాలిక తల్లిదండ్రులను బ్లాక్‌మెయిల్ చేసి లక్షల రూపాయలు గుంజాడు. అయినా అతని వేధింపులు ఆగక పోవడంతో పోలీసులకు చెప్పుకోవడంతో విష యం బయటపడింది. హైదరాబాద్‌లో ఓ ప్రఖ్యాత పాఠశాలలోని విద్యార్థులను మాయమాటలతో స్నేహం చేసి.. వారి ఫోటోలను అవాంఛనీయంగా తీసి బ్లాక్ మెయిల్ చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో విద్యార్థినులను మాయ చేశారంటే.. ఫోన్‌ల ద్వారా జరుగుతున్న నిర్వాకం తెలుస్తూనే ఉన్నది.

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు కంటే కీడే ఎక్కువని అనేక ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. క్షేమ సమాచారాల కోసం, సంబంధాల కోసం వీలైనంత మేరకు బేసిక్ మోడల్ మొబైల్స్‌నే ఉపయోగిస్తే మంచిదని నిపుణులు అంటున్నారు. ఎవరైనా.. ముఖ్యంగా పిల్లలు మొబైల్స్‌తో ఎక్కువ కాలం గడుపుతుంటే దాన్ని మొదట్లోనే గుర్తించి వ్యసనంగా మారకముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూలు పిల్లలు అయితే సెల్‌తో ఆటల కన్నా.. ఇతర ఆట, పాటలపైకి దృష్టి మరల్చేటట్లు చేయాలి. విద్యార్థి, యువతలో స్మార్ట్ ఫోన్‌ల ద్వారా సాగుతున్న కార్యకలాపాల పట్ల నిరంత పర్యవేక్షణ అత్యవసరం.

ఈ క్రమంలోనే సెల్‌ఫోన్ వేధింపులు, సైబర్ ర్యాగింగ్‌ల నుంచి కాపాడు కునేందుకు త్రిషాప్రభు అనే స్వచ్ఛంద కార్యకర్త రీ థింక్‌అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఎవరి నుం చైనా అవాంఛనీయ మెసేజ్‌లు వచ్చినప్పుడు అది మనల్ని హెచ్చరిస్తుంది. ఆ మెసేజ్‌లో అవాంఛనీయ మాటలు, విషయం ఉన్నదని చెబుతుంది. దీంతో ఆ మెసేజ్‌లను మన ఫోన్‌కు రాకుండా నిరోధించుకోవచ్చు. అలాగే అమెరికాకు చెందిన లాయర్ ఫెర్రీ అఫ్తాబ్ వైర్డ్ సేఫ్టీ అనే సంస్థను స్థాపించి ఫోన్ వినియోగదారుల హక్కుల రక్షణ కోసం పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 76దేశాల్లో తన సేవలు అందిస్తూ ఫోన్ వాడకం దారుల హక్కులను కాపాడుతున్నది. ఫోన్ దుర్వినియోగాన్ని అడ్డుకుంటున్నది. ఈ పరిణామాల నేపథ్యంలోనైనా స్మార్ట్ ఫోన్‌ల వాడకం స్టేటస్ సింబల్‌గా కాకుండా అవసరంగా ఉపయోగిస్తే సం బంధిత వ్యక్తులకూ, సమాజానికి మంచిది. అవసరం కోసం వచ్చే ఏవస్తువు, పరికరమైనా విలాసంగా మారిపోకూడదు. కొత్త సమస్యలు సృష్టించకూడదు.

1504

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Featured Articles