ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష


Sun,May 29, 2016 01:20 AM

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతుపట్టకుండా ఉన్నది. విద్యాసంవత్సరం ఆరంభం నుంచే నీట్‌కు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయొచ్చని చాలామంది భ్రమపడుతున్నారు. నీట్ అంటే సిలబస్ సమస్య మాత్రమే కాదు. భాషా ప్రతిబంధకాన్ని ఎలా అధిగమిస్తారనడానికి సమాధానం ఉండటం లేదు. ఉన్న పలంగా వైద్య విద్య అభ్యసించాలనుకున్న విద్యార్థులంతా ఇంగ్లీష్ మీడియంలోకి మారి జాతీయ స్థాయిలో పోటీ పడటం
సాధారణ విషయం కాదు. ఆచరణలో సాధ్యమయ్యేది కాదు.

sama
నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ అండ్ ఎంట్రెన్స్ టెస్ట్ -ఎన్‌ఈఈటీ) భారం ఈ సంవత్సరం అయితే తప్పిందని చాలా మంది సంతోషిస్తున్నారు. నీట్‌ను ఈ ఒక్క సంవత్సరం మినహాయించి, వచ్చే ఏడాది నుంచి ఉంటుందన్నందుకు ఈ సారైతే గట్టెక్కామని ఆనందపడుతున్నారు. కానీ రాబోయే కాలంలో వచ్చి పడే ప్రమాదం గురించి ఆలోచించడం లేదు, లేదా పట్టించుకోవటం లేదు! మరోవైపు నీట్‌తో ఎదుర య్యే సాధక బాధకాలేమిటనే విషయంలో విద్యావేత్తలు కానీ, ఉపాధ్యాయ, మేధావివర్గం కానీ ఆలోచించకపోవటం, స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. నిజానికి నీట్ విషయంలో మన రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో జరగాల్సినంత చర్చ జరగడం లేదు. నీట్‌తో ముంచుకొచ్చే ప్రమాదాన్ని పసిగట్టడం లేదు.

నీట్ అమలులోకి వచ్చిందంటే.. వివిధ రాష్ర్టాల్లోని విద్యార్థి లోకమంతా అధిగమించలేని అవరోధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న ది గుర్తించడం లేదు.దేశంలో విద్యార్థులంతా వైద్య విద్యను అభ్యసించాలంటే తప్పనిసరిగా నీట్ ద్వారానే ప్రవేశం పొం దాలని సుప్రీంకోర్టు ఈ మధ్య సూచించింది. వైద్య విద్యలో దేశవ్యాప్తంగా ఒకే విద్యాప్రమాణాలు, నాణ్యతలు ఉండాలనే పేరుతో భారత అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. ఇది చూడటానికి అందం గా (విద్యా ప్రమాణాలు, నాణ్యతల విషయంలో సమంజసంగా) కనిపిస్తున్నా.. దాని అమలులో తీవ్ర అపసవ్యాలు, సమస్యలున్నాయి. నీట్ పరీక్ష విధిగా ఇంగ్లీష్‌లోగానీ, హిందీలో గానీ మాత్రమే రాయాల్సి ఉంటుంది. మరో ప్రాంతీయ భాషలో రాయడానికి వీలులేదు. కానీ.. సువిశాల దేశంలో వివిధ జాతులు, తమ భాషా సంస్కృతుల నేపథ్యంతో వివిధ రాష్ర్టాల్లో విద్యనభ్యసిస్తున్న లక్షలాదిమంది విద్యార్థులు ఇంగ్లీ ష్, హిందీ భాషల్లోనే పరీక్ష రాయాలంటే.. విద్యార్థులు వారి వారి రాష్ర్టాల్లో తమ మాతృభాషల్లో చదువుకున్న వారు నీట్‌ను ఎలారాస్తారో ఎవరూ ఆలోచించటం లేదు!

ఉత్తర భారతంలోని నాలుగైదు రాష్ర్టాలు మినహా ఏ రాష్ట్రంలోనూ హిందీ బోధనా భాషగా లేదు. దక్షిణ భారతంలోని రాష్ర్టాలన్నీంటితో పాటు, ఈశాన్యభారతం, తూర్పుభారతం అంతా ప్రతి రాష్ట్రంలో ఓ ప్రాంతీయ భాషామాధ్యమం ఉన్న ది. ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన జరుగుతున్నది. ప్రాంతీయ భాషలు.. తెలుగు, కన్న డం, తమిళం, మలయాళం, బెంగాళీ, అస్సామీ, గుజరాతీ, కాశ్మీరీ తదితర భాషల్లో చదివిన విద్యార్థులు హిందీ భాషలో నీట్‌పరీక్ష ఎలారాస్తారు? అలా గే.. మరో వైపు ఇంగ్లీష్ భాష అంటున్నారు! ఇంగ్లీష్ చదువులు అంటే.. ఎగువ మధ్య తరగతి నుంచి ఆ పై వర్గాలే ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుతారు.

వారికి మాత్రమే ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో వేలకు వేలు ఫీజులు కట్టి చదివించే స్థోమత ఉన్నది. ఇలా ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిన వారు మాత్రమే నీట్ పరీక్ష ఎదుర్కోగలరు. మరి ఆర్థిక స్థోమత లేక ప్రాంతీయ భాషల్లో, తమ మాతృభాషల్లో చదివిన విద్యార్థులు నీట్ ఎలా రాయాలి? ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం 9,64,664 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో తెలంగాణలోని 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకున్న లక్షా యాభై వేల మంది విద్యార్థులు కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే.. దాదాపు పదిలక్షల మంది విద్యార్థుల్లో సింహభాగం తెలుగు మీడియం విద్యార్థులే ఉంటారనడంలో సందేహం లేదు. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా మరో పదిలక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు.

అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనే ఇరవై లక్షల మంది ఇంటర్ విద్యార్థుల్లో ద్వితీయ సంవత్సరం చదివిన విద్యార్థులు పదిలక్షల మంది ఉంటారు. వీరిలో మెడికల్ స్ట్రీం అంటే ఇంటర్‌లో సైన్స్ గ్రూప్ చదివిన వారు కనిష్టంగా ఆరేడు లక్షల మంది ఉంటారు. వీరిలో గరిష్టంగా తెలుగు మీడియంలో చదివిన వారై ఉంటారు. వీరంతా హిందీలో నీట్ పరీక్ష ఎలాగూ రాయలేరు. ఇంగ్లీష్ మీడియం చదివిన వారికే నీట్ రాసే స్థోమత ఉంటుందంటే.. తెలుగు మీడియంలో చదివిన ప్రభు త్వ, రెసిడెన్షియల్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు కూడా నీట్ పెద్ద గుది బండ కానున్నది. మరో మాట లో చెప్పాలంటే.. విద్యార్థుల పాలిట నీట్ ఒక శాపంగా మారనున్నది.

నీట్ అమలు ఈ విద్యా సంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతుపట్టకుండా ఉన్నది. విద్యాసంవత్సరం ఆరంభం నుం చే నీట్‌కు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయొచ్చని చాలామంది భ్రమపడుతున్నారు. నీట్ అంటే సిలబస్ సమస్య మాత్రమే కాదు. భాషా ప్రతిబంధకాన్ని ఎలా అధిగమిస్తారనడానికి సమాధానం ఉండ టం లేదు. ఉన్న పలంగా వైద్య విద్య అభ్యసించాలనుకున్న విద్యార్థులంతా ఇంగ్లీష్ మీడియంలోకి మారి జాతీయ స్థాయిలో పోటీ పడటం సాధారణ విషయం కాదు. ఆచరణలో సాధ్యమయ్యేది కాదు. ప్రాథమిక స్థాయి నుంచి జూనియర్ కాలేజీ విద్య దాకా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఇంగ్లీష్‌లో చదివిన విద్యార్థులకు మాత్రమే నీట్ పరీక్ష అనుగుణంగా ఉన్నది. ఆయా రాష్ర్టాల్లో ఇంటర్‌మీడియట్ బోర్డులు రూపొందించిన సిలబస్, హైస్కూలు స్థాయిలోని సిలబస్ నీట్ పరీక్షకు పూర్తి భిన్నంగా ఉంటున్నది. కాబట్టి ఆయా రాష్ర్టాల్లో మాతృ భాషల్లో చదివిన విద్యార్థులు నీట్ పరీక్ష రాయడం, అర్హత సాధించడం కష్టసాధ్యం.

వైద్య విద్యకు దేశ వ్యాప్తంగా నీట్ పేరుతో ఒకే విధమైన పరీక్ష ఎందుకో ఎవరి దగ్గరా శాస్త్రీయ వివర ణ లేదు. భాషా సమస్యను పట్టించుకోకుండా హిం దీ, ఇంగ్లీష్ భాషలనే ప్రామాణికం చేయడం అంతకన్నా అన్యాయం. దేశంలో ఇప్పటిదాకా విద్యాభివృద్ధికోసం నియమించిన కమిటీలన్నీ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని చెప్పాయి. రాధాకృష్ణన్ కమిషన్ మొదలు.. మొదలియార్ కమిషన్, కొఠారీ కమిషన్ లాంటి వన్నీ మాతృభాషలో విద్యాబోధననే నొక్కి చెప్పాయి. ఈ వెలుగులోనే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో రూపొందించబడి కొనసాగుతున్న విద్యా విధానాన్ని అప్రధానం చేయడం అవహేళనకు గురిచేయడమే. ఇంకా చెప్పాలంటే.. కొన్ని భాషా ప్రాంతాల విద్యార్థులకు విద్యాహక్కును దూరం చేయడమే.

మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అస్తిత్వ చైతన్యాలు, ఉద్యమాల పూనికగా వికాసం పొందుతున్న జాతుల హక్కులను హరించడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ఇంగ్లీష్ భాషా చదువుల్లోనే నైపుణ్యాలున్నాయనడం ఏ శాస్త్రీయతకూ నిలిచేది కాదు. కాకుంటే.. ఇంగ్లీష్ చదువులతో మన విద్యార్థులు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల అవసరాలను తీరుస్తున్నారు. లేదా వారిని అనుకరిస్తున్నారు, అనుసరిస్తున్నారు. కానీ మనదైన జాతీయ అవసరాలు పునాదిగా సాధించిన విద్యాభివృద్ధి శూన్యమనే చెప్పవచ్చు. ఇంగ్లీష్ భాషను కాదని తమదైన దేశీయ విద్యావిధానంతో, తమదైన భాషా వికాసంతో రష్యా, చైనా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు సాధించిన శాస్త్ర, సాంకేతి అభివృద్ధి అంతా ఇంగ్లీష్ భాషా చదువులతో కాదని అర్థం చేసుకోవాలి.

నిజానికి మన జాతీయ విద్యావిధానం, దానికి మనం ఇచ్చుకున్న అర్థమే అసమంజసమైనది. మన విద్యాశాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖ అం టున్నాం. వనరు అంటే ఉపయోగితా విలువగా చూ డటం. మనుషులను వనరులుగా, ఉపయోగ వస్తువులుగా చూడటమే అమానవీయం. మానవతా విలువలు కలిగిన జ్ఞానసమాజ నిర్మాణమే విద్య లక్ష్యం అని నిర్వచించుకుంటే.. మానవ వికాసానికి మరేది ప్రతిబంధకం కాకూడదు. మరీ ముఖ్యంగా భాష అవరోధంగా చేయడం, మారడం అప్రజాస్వామికం . ఈ అర్థంలో నీట్ సువిశాల భారతావనిలోని విద్యార్థుల పాలిట తీవ్రమైన ప్రతిబంధకమే.

1147

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Featured Articles