ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం


Sun,May 22, 2016 01:17 AM

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల
ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్రామ గ్రామాన నాటి ఉద్యమ స్ఫూర్తిని పునికి పుచ్చుకోవాలి. ఆధిపత్య రాజకీయాలను తుత్తునియలు చేస్తూ.. తెలంగాణ పునర్నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయాలి. అప్పుడే తెలంగాణ పల్లెలు పునర్వికాసం పొందుతాయి. అంకాపూర్, గంగదేవిపల్లి, ప్రొద్దుటూరు బాటలో పయనిస్తాయి.

sama
అరవై ఏళ్ల అలుపెరుగని పోరాటాలు, అనన్య త్యాగాల ఫలంగా ఆవిష్కృతమైన తెలంగాణ రాష్ట్రం ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ కాలగమనంలో గెలిచి నిలుస్తున్నది. వలసవాద ఆధిపత్యపాలన, వివక్షల నుంచి విముక్తి పొంది అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. ఈ క్రమంలో నికార్సయిన తెలంగాణ వాదులుగా సాధించిన దానితో సంబురపడిపోకుండా.. సాధించాల్సినదాన్ని గుర్తించాలి.తెలంగాణ రాష్ట్ర సాధనతోనే అంతా అయిపోలేదు. అది మాత్రమే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాదు. మలిదిశ తెలంగాణ పోరాటంలో అంతకు మించి ప్రజల ఆకాంక్షలున్నాయి. ఈ నేపథ్యంలోంచే సామాజిక జీవనానికి సంబంధించి ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో దశాబ్దన్నర కాలం సబ్బండ వర్గాల ప్రజలు అలుపెరుగని పోరాటం చేశారు. సకలజనుల సమ్మెలై, సాగార హారాలై.. అలలు అలలుగా పోరాట కెరటాలై ఉద్యమించారు. సీమాంధ్ర వలస పీడనను పారదోలారు.

అయితే.. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం ఆవిష్కృతమై రెండేళ్లు పూర్తి కావస్తున్న వేళ.. ఉద్యమ కాలం నాటి ఆకాంక్షలకు, నేటి పరిస్థితులకూ బేరీజు వేసుకోవాల్సి ఉన్నది. 1996లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన కాన్నుంచి ఎన్ని రకాల అవహేలనలు, నిర్బంధాలు ఎదుర్కొని మొక్కవోని పోరాటచైతన్యంతో, సంఘటిత శక్తితో నిలిచి గెలిచామో.. నేడది కనిపించడం లేదు. రాష్ట్రం వచ్చేసింది కదా.. అనే అలసత్వం అలుముకుంటున్నది. కాకపోతే.. అవసరమైన ప్రతి సందర్భంలోనూ సీమాంధ్ర మూలాలున్న పార్టీలను ఓడించడంలో చూపిస్తున్న పరిణతి తెలంగాణ పునర్నిర్మాణంలో చూపించడం లేదు.

ప్రాంతీయతకు పట్టం గట్టడంలో చూపిస్తున్న చైత న్యం, సంఘటిథ శక్తి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడంలో కనిపించడం లేదు. అం తా అధికారం అప్పగించిన పార్టీయే చూసుకుంటుందన్న ధోరణి కనిపిస్తున్నది. అంతా పై నుంచి.. అసెం బ్లీ, సెక్రటేరియట్‌ల నుంచే కావాలని అనుకోవ డం నిష్క్రియా పరత్వానికి నిదర్శనమే. ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం, స్పృహ ఉన్న పార్టీగా విధానాలు, పథకాల రూపకల్పనలో అధికార పార్టీ ఎంత నిబద్ధతతో ఉన్నా .. ఆ పథకాల అమలులో, విధానాలు విజయవంతం కావడంలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరమైన శర తు. ఇక్కడే రాష్ట్రం సాధించుకోవడంలో చూపించిన చైతన్యం.. కొరవడింది.

రాష్ట్రసాధనోద్యమంలో ఊరూ వాడా కదిలి, ఇల్లి ల్లూ కదిలి.. పల్లెను, పట్నాన్ని ఏకం చేసి సీమాంధ్ర సర్కారును మెడలు వంచిన ప్రజల ఐక్యత.. తెలంగా ణ పునర్నిర్మాణంలో అవసరం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మొదలు గ్రామ జ్యోతి పథకాల దాకా అన్నింటిలో గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరం. పథకాలు ఎంతగొప్పవైనా ప్రజలు వాటిని స్వంతం చేసుకుని వాటి అమలులో భాగస్వా ములు కాకపోతే ఆశించిన ఫలితాలు ఏ నాటికీ సాధ్యం కావు. ప్రజల జీవితాల్లో మార్పు కనిపించదు. ప్రజల నిత్య జీవితానికి సంబంధించిన మౌలిక సమస్యలు తీరవు. దీనికి కావలసింది ప్రజల చైతన్యపూరిత భాగస్వామ్యమే.

ప్రజల సమిష్టి భాగస్వామ్యంతో అద్భుతాలు సాధించ వచ్చని ప్రపంచానికి చాటిన గ్రామాలు మన మధ్యనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం మొదలు, వరంగల్ జిల్లా గంగదేవిపల్లి, మెద క్ జిల్లా మల్కాపూర్, నల్లగొండ జిల్లా వలిగొండ మం డలం ప్రొద్దుటూరు దాకా ఆదర్శ గ్రామాలుగా తెలంగాణకు దారిచూపుతున్నాయి. సమిష్టి ప్రయోజనాలు, అవసరాల కోసం అంతా కలిసి ఐకమత్యంగా కలిసి నడిస్తే.. సాధించలేనిదేదీ లేదని చాటిచెబుతున్నాయి. ఇవ్వాళ కావాల్సింది అంకాపూర్ అడుగుజాడ. ప్రొద్దుటూరు వెలుగు దారి.

ఆదర్శ గ్రామం ప్రొద్దుటూరు ఎందరికో స్ఫూర్తినిచ్చింది. మరెందరికో కర్తవ్య బోధను చేసింది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసి, కష్టాలకోర్చి పని చేసిన యువతకు ప్రేరకంగా నిలిచింది. తమ గ్రామాన్నికూడా ప్రొద్దుటూరులా తీర్చి దిద్దడం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎదురవుతున్న చేదు అను భవాలను కూడా చెప్పుకోవాలి. వాటికి మూలమైన సామాజిక మూలాలను పరిశీలించి, పరిష్కారాలను వెతుక్కోకపోతే సాధించుకున్న తెలంగాణకు అర్థం ఉండదు. ఏ ఆకాంక్షలతో, కలలతో రాష్ర్టాన్ని సాధించుకున్నామో అవన్నీ అడియాశలయ్యే ప్రమాదమున్నది.

రాష్ట్ర సాధన తర్వాత జరిగిన, జరుగుతున్న రాజకీయ పునరేకీకరణ అనేది రాష్ట్రస్థాయిలో ప్రాంతీయ అస్తిత్వ శక్తికి తిరుగులేని బలాన్ని చేకూర్చి పెట్టింది. ఇదే సందర్భంలో రాజకీయ పునరేకీకరణలో భాగం గా గ్రామ స్థాయిలో జరిగిన రాజకీయ సమీకరణలు గ్రామాభివృద్ధికి, వికాసానికి ఇవ్వాళ పెద్ద గుదిబండగా, అడ్డంకిగా మారుతున్న సందర్భాలు కనిపిస్తు న్నాయి. దశాబ్దకాలం రాష్ట్రసాధనోద్యమంలో కష్టకాలంలో క్రీయాశీలకంగా పనిచేసిన వారంతా రాజకీయ పునరేకీకరణలో చిట్టచివరి స్థానంకూడా దక్కని స్థితి ఒకటి ఏర్ప డుతున్నది. ఉద్యమకాలమంతా సీమాం ధ్ర ఆధిపత్య పార్టీల్లో ఉండి తెలంగాణను అవహేళన చేసినవారూ, అడ్డంకులు సృష్టించిన వారంతా ఇప్పు డు మందువరుసలో చేరి పాత కాలపు ఆధిపత్య రాజకీయాలకు తెరతీస్తున్న తీరు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే.. ప్రొద్దుటూరు గ్రామానికి కొద్ది దూరంలోనే ఉన్న ఓ గ్రామంలో ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకోవాలి.

తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి శతజయంతి ఉత్సవాల్లో భాగం గా ఆయన సహచరుడు, స్వాతంత్య్ర సమరయోధు డు భువనగిరికి చెందిన జైని మల్లయ్య గుప్త, ప్రముఖ కవి నాళేశ్వరం శంకరం గార్ల నేతృత్వంలో గ్రంథాలయోద్యమ ప్రచారకమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఊరూరా గ్రంథాలయాల స్థాపనకు పూనుకున్నారు. ఇప్పటికే పన్నెండు గ్రామాల్లో గ్రంథాలయాలను స్థాపించారు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరుకు కూతవేటు దూరంలో ఉన్న ఓ గ్రామంలో గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రజావికాసం కోసం గ్రంథాలయా న్ని స్థాపించాలని భావించారు. దీనికి ఔత్సాహికుల ప్రోత్సాహంతో ఇరవై వేల రూపాయాలతో విలువైన పుస్తకాలు, గ్రంథాలయానికి అవసరమైన సామాగ్రి సమకూర్చారు.

వీటితో ఆ గ్రామంలో గ్రంథాలయా న్ని స్థాపించడానికి ప్రయత్నిస్తే ఆగ్రామంలో ఎవరూ సహకరించని దుస్థితి! పుస్తకాలు, సామాగ్రి అంతా ఆ ఊరుకు తరలించి కూడా అక్కడ లైబ్రరీని ప్రారంభించలేని పరిస్థితి. గ్రంథాలయానికి కావలసిన భౌతి క వసతులు అన్నీ ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాయి. నిరుపయోగంగా నాలుగు గదులున్నాయి. అయినా గ్రంథాలయాన్ని ప్రారంభించ డానికి ఎవరూ ముందుకురాని దుస్థితి ఎందుకున్న ది? స్వచ్ఛందంగా గ్రంథాలయాన్ని గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెస్తూ.. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలంతా చదువుకోవడానికి వీలుగా నాలుగు దినపత్రికలు వేయిస్తామన్నా సహకరించని కారణాలు ఏమై ఉంటాయి? ఇది కేవలం చైతన్య రాహిత్యమని అనుకోవడానికి వీలులేదు. తప్పకుం డా ఇది సంప్రదాయ ఆధిపత్య రాజకీయాల క్రీనీడ. ఈ సంప్రదాయ ఆధిపత్య రాజకీయ బల్లూకపు పట్టునుంచి గ్రామాలను విముక్తం చేయడమే ఇప్పుడు కావాల్సింది.

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగా ణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్రామ గ్రామాన నాటి ఉద్యమ స్ఫూర్తిని పునికి పుచ్చుకోవాలి. ఆధిపత్య రాజకీయాలను తుత్తునియలు చేస్తూ.. తెలంగాణ పునర్నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయాలి. అప్పుడే తెలంగాణ పల్లెలు పునర్వికాసం పొందుతాయి. అంకాపూర్, గంగదేవిపల్లి, ప్రొద్దుటూ రు బాటలో పయనిస్తాయి. తెలంగాణ పునర్నిర్మాణం అంటే..ఏ గ్రామానికాగ్రామం సమిష్టి శక్తితో, స్వయం నిర్ణయాధికారంతో ముందుకు సాగడం. అభివృద్ధిఫలాలను అందిపుచ్చుకోవడం. పైరుపచ్చని తెలంగాణలో సుఖశాంతుల తెలంగాణ ఆవిష్కరించుకోవడం.

1439

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Featured Articles