ఫాసిజం నీడలు


Sun,May 15, 2016 01:04 AM

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి సమాధానంగా.. ముస్లిం మతోన్మాదం భారత సమాజంలో అధిపత్యస్థానానికి వచ్చి ఫాసిజాన్ని అమలు చేయజాలదు. ఆ పని చేయగలిగేది హిందూ మతోన్మాదమేనని 1947లోనే నెహ్రూ అన్నాడు.

sama
అమెరికా అధ్యక్షపీఠాన్ని ఎక్కాలని ఆరాటపడు తున్న డోనాల్డ్ ట్రంప్.. హిట్లర్‌లా కాదు, హిట్లర్‌కు పెద్దన్నలా వ్యవహరిస్తున్నాడు. తన వదురుబోతు మాటలతో అమెరికన్లనే కాదు, ప్రపంచ ప్రజలను వణికిస్తున్నాడు. కానీ హిందూ వాహిని కార్యకర్తలు మాత్రం విచిత్రంగా అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ గెలవాలని ఏకంగా యజ్ఞాలే చేస్తున్నారు. గుడి గోపురా ల్లో పూజలు చేస్తున్నారు! హిందూ వాహినికి ట్రంప్ ఎందుకు ప్రీతిపాత్రుడయ్యాడు? ఇంటా బయటా అందరూ అసహించుకుంటున్నా మనవారికి మాత్రం ఎందుకు ఆరాధ్యుడయ్యాడు? హిందూ వాహిని కార్యకర్తలకు, ట్రంప్‌తో బంధుత్వానికి మూలాలు ఎక్కడున్నాయి?

ఈ మధ్యనే సోహ్రాబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు పోలీస్‌అధికారి వంజారాను హిం దుత్వ వాదులు దేశభక్తునిగా కీర్తిస్తూ పెద్ద ఊరేగింపు తీశారు. రోడ్డు ప్రయాణమంతటా పూలవర్షం కురిపి స్తూ.. ఘనస్వాగతం పలికారు. దేశభక్తిని చాటిన హీరో గా వేనోళ్ల కొనియాడు తూ రాజకీయాల్లోకి ప్రవేశించి దేశాన్ని రక్షించాలని కోరారు! ఇది మరిచిపోకముం దే.. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న మిలిటరీ అధికారి కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌పై ప్రభుత్వం నేరారోపణ కేసులో కొన్ని సెక్షన్లను ఉపసంహరించుకున్నది. పురోహిత్‌తో పాటు పదేళ్లు గా జైలులో ఉన్న సాధ్వి ప్రజ్ఞాఠాకూర్‌పై కూడా తీవ్రమైన సెక్షన్లను ఉపసంహరించుకున్నది. హిందు త్వ వాదులకు వంజారా, పురోహిత్, ప్రజ్ఞాఠాకూర్ లాంటి నేరస్థులు దేశ భక్తులుగా కనిపించడం వెనక ఓ తాత్త్వికత ఉన్నది. అదే ఫాసిజం.
కాలానుగుణంగా ఫాసిజం రూపం మార్చుకుని మన మధ్యనే ఉన్నది.

పచ్చి అబద్ధాలను నెత్తికెత్తుకుని అచరిత్రకాలను చరిత్రగా, సత్యాలుగా ప్రచారం చేస్తూ ప్రజాసమ్మతిని ఉత్పత్తి చేస్తున్నది. అది అమెరికా యుద్ధ దాహం రూపంలోనూ కనిపిస్తుంది. దేశంలో హిందూ మతోన్మాదం జాతీయవాదం రూపంలో నూ కనిపించవచ్చు. హిట్లర్ తన యుద్ధోన్మాదంతో రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైతే.., నేడు అమెరికా సహజ వనరులపై గుత్తాధిపత్యం కోసం ఇరాక్, అఫ్ఘానిస్థాన్, లిబియా మొదలు సిరియా దాకా దేశ దేశాలను కబలించింది. ఆత్మగౌరవాన్ని ప్రకటించి అమెరికా ఆధిపత్యాన్ని ఎదిరించినందుకు సద్దాం హుస్సేన్, గడాఫీ లాంటి దేశాధ్యక్షులు ఉరికంబాలెక్కారు. సమకాలీన ఫాసిజం ఇవ్వాళ.. మన మధ్యనే ఇస్లామిక్ టెర్రరిజాన్ని అణచివేసే పేర, మెజారిటీ వాదం పేర ఇరుగు పొరుగునే మాటుగాసి ఉన్నది. మన ప్రజాస్వామిక ఆకాంక్షలను అనుమానిస్తున్నది. అణచి వేస్తున్నది.

కొంత కాలంగా దేశంలో జరుగుతున్న ఘటనలు మెజారిటీ వాదుల ప్రయాణాన్ని చెప్పకనే చెబుతున్నా యి. యాదృచ్ఛికంగానే.. 1930- 40ల నాటి నాజీల పోకడలను తలపిస్తున్నాయి. నాజీలు పరిశుద్ధమైన జర్మనీజాతికి తామే వారసులమని చెప్పుకొని జాతీ య ఉన్మాదాన్ని రెచ్చగొట్టారు. సరిగ్గా అలాగే.. ఇక్కడ మెజారిటీవాదులు సిసలైన జాతీయ వాదులంటే తామేనని చెప్పుకుంటూ.. దేశభక్తులంటే తామేనని చాటుకుంటున్నారు. మిగతా వారంతా కుహనా సెక్యులరిస్టులంటూ..పరీక్షలు పెడుతున్నారు. ఎవరు దేశ భక్తులో ఎవరు కాదో.. తామే నిర్ణయిస్తామని అంటు న్నారు. తమ వాదనలను, ఆచరణలను తప్పు అన్న వారందరినీ జాతి వ్యతిరేకులుగా ముద్ర వేసి హతమారుస్తున్నారు. శంకర్‌గుహ నియోగి నుంచి.. కలబుర్గి, పన్సారే దాకా ప్రజాస్వామికవాదులపై దాడులన్నీ జాతీయతను కాపాడేందుకేనని తమ చర్యలను సమర్థించుకుంటూ ప్రజాస్వామికవాదులను హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే దాద్రిలో మహమ్మద్ అఖ్లాక్ హత్యపై ఆర్‌ఎస్‌ఎస్ అధికార పత్రిక పాంచజన్యలో.. అఖ్లాక్‌ను హత్య చేయడం నిర్హేతుకం కాదు. ఆవు మాంసం తిన్నవాళ్లను చంపవచ్చని వేదా లు కూడా చెప్పాయి అని సమర్థించుకుంటున్నారు. రాజ్యాంగబద్ధంగా అధికారం చేపట్టామని, మెజారిటీ సమ్మతిని సృష్టించి ఫాసిజం బాటలో నడుస్తున్నారు. ఆ మాటకొస్తే.. హిట్లర్ కూడా 1933 జనవరి 30న రిచ్‌స్టాగ్‌లో మెజారిటీ సీట్లతో అధికారం చేపట్టాడు. నాటి జర్మనీ అధ్యక్షుడు హిండెన్‌బర్గ్ స్వయంగా హిట్లర్‌ను ఛాన్స్‌లర్ పదవి చేపట్టవలసిందిగా కోరాడు. ఇదంతా రాజ్యాంగబద్ధమే. అయితే దీని వెనుక ఉన్న ఉన్మాద మంత్రాంగం చూడాలి. అలాగే.. మోదీ కూడా 31 శాతం ఓట్లతో.. 69శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా అధికారం చేపట్టవచ్చు. కానీ.. ఈ 91 ఏళ్లలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ శక్తులు నాటిన విషబీజాలు ఎంతగా విస్తరించి ఎలా వికటాట్టహాసం చేస్తున్నాయో అనుభవంలోకి వస్తూనే ఉన్నది. నాజీల కాలాన్నీ మరిపిస్తూనే ఉన్నది.

ఫాసిజం ఏ సమాజాన్ని జయించాలనుకుంటుం దో ఆ సమాజపు పురాతన ఇతిహాస వీరగాథలను నెత్తికెత్తుకుంటుంది.వాటన్నింటినీ ప్రశంసనీయమైనవిగా, ఆదర్శాలుగా ప్రకటించి సొంతం చేసుకుంటుంది. సమకాలీన సామాజిక విలువలన్నింటినీ కొట్టిపారేస్తూ గత ఘనకీర్తే వెలుగుబాట అంటుంది. ఇంకా ఏం చేస్తుందంటే.. వీధుల్లో బహిరంగ హింసను ప్రోత్సహిస్తూ.. చట్టాలను ఉల్లంఘిస్తూ, చట్టాలను గౌరవించాలని ఇల్లెక్కి అరుస్తుంది. ఫాసిజం.. తన ఆధిక్య భావజాలాన్ని పోలీసు, మిలిటరీ, సమస్త ప్రభుత్వ యంత్రాంగంలోకి చొప్పించి తన నియంతృత్వానికి సమ్మతిని, మద్దతును సమకూర్చుకుంటుంది. సరిగ్గా ఇదే ఇప్పడు బీజేపీ చేస్తున్నది. తన ఎంచుకున్న లక్ష్యాలను నిర్మూలించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు, మిలిటరీని ఉపయోగిస్తున్నది. ఈ క్రమంలోంచే.. పోలీసు అధికారుల్లోంచి వంజారాలు, మిలిటరీ అధికారి శ్రీకాంత్ పురోహిత్‌లు పుట్టుకొచ్చారు. ప్రజా కార్యకర్తలను, ప్రజాస్వామిక వాదులను హతమారుస్తున్నారు.

ఇదంతా శాంతి భద్రతల కోసమం టూ, చట్టాన్ని అమలు చేస్తున్నామనే పేరుతో ప్రజల జీవించే హక్కును హరిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వర్సెయిల్స్ సంధితో జర్మనీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడిందని ప్రజలను రెచ్చగొట్టింది నాజీయిజం. జర్మన్ల కష్టాలకు కారణం యూదులని రెచ్చగొట్టి కళ్లముందు ఓ (యూదు)దిష్టి బొమ్మను సృష్టించింది. యూదులపై ఆధిపత్యమే జర్మన్ల లక్ష్యమని చెప్పింది. పరిశుద్ధమైన జర్మన్ జాతికే ప్రపంచాన్నేలే అర్హత, హక్కు ఉన్నదని జాతీయవాదాన్ని ఉన్మాదంగా తీర్చిదిద్దింది.

సరిగ్గా ఈ కోవలోనే హిందుత్వవాదం ముస్లిం (టెర్రరిస్టు) దిష్టిబొమ్మను సృష్టించింది. 1925లో పుట్టిన ఆర్‌ఎస్‌ఎస్ 1950ల నాటి నుంచి అనేక అనుబంధ సంఘాలతో సమాజంలోని అన్నివర్గాల్లో చొచ్చుకుపోయింది. తెచ్చిపెట్టుకున్న ఓపిక, సంస్కృతి, సంఘసేవ ముసుగులో చేసిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆర్‌ఎస్‌ఎస్ సమ్మతిని ఉత్పత్తి చేసుకున్నది. మతోన్మాద సమ్మ తి ఇవ్వాళ.. ఎన్నో అపోహలతో, ముందస్తు అభిప్రాయాలతో, పుక్కిటి పురాణాలతో తయారై నేడు లోకజ్ఞానంగా మారిపోయింది. అందుకే ఇవ్వాళ.. ముస్లిం అంటేనే ఓ టెర్రరిస్టుగా మెజారిటీ ప్రజలు నమ్మే పరిస్థితి దాపురించింది. సామాజిక కార్యకర్తలంటేనే హిం సావాదులుగా భావించే స్థితి వచ్చింది.

అయితే.. మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి సమాధానంగా.. ముస్లిం మతోన్మాదం భారత సమాజంలో అధిపత్యస్థానానికి వచ్చి ఫాసిజా న్ని అమలు చేయజాలదు. ఆ పని చేయగలిగేది హిందూ మతోన్మాదమేనని 1947లోనే నెహ్రూ అన్నాడు. ఇదిలా ఉంటే.. కోడి గుడ్డుకు వెంట్రుకలు పీకే మేధావిత్వాన్ని వదిలిపెట్టి హృదయాన్ని, విశ్వాసాన్ని, అంతరాత్మ ప్రభోదాన్ని వినమని ప్రజలను కోరుతున్నాను. మేధో విశ్లేషణల పేరుతో జాతి వ్యతిరేక రాతలు రాస్తున్న కుహనా మేధావుల అంతు చూడండి.. ఈ మాటలు మన ఆర్‌ఎస్‌ఎస్ నాయకులో, నరేంద్ర మోదో అన్నట్లు అనిపిస్తుంది కదా! కాదు.., ఈ మాటలు 1934లో ఓ నాజీల సభలో హిట్లర్ అన్నాడు!! కాలం వేరైనా.., సందర్భం వేరై నా.. ఫాసిజం సారంలో ఒకేలా ఉన్నది, ఉంటున్నది.

1706

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Featured Articles