సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?


Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమని మన పెద్దలు చెబుతూ.. జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అన్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో నే.. ఈ మధ్య ఢిల్లీలో ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రజలకు న్యాయం అం దుతున్న తీరు పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులపై పనిభారం పెరిగిపోయి.. కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యం పట్ల, కోర్టులపై వస్తున్న విమర్శల పట్ల తీవ్ర మనస్థాపానికి గురై కన్నీ రు పెట్టుకున్నారు. ఆ దృశ్యం ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాల పట్ల ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేసింది.

దేశంలో అత్యున్నత న్యాయస్థాన అధిపతిగా జస్టిస్ ఠాకూర్ ఆవేదన అర్థవంతమైనదే. న్యాయమూర్తుల పై పెరిగిన పనిభారం, విమర్శల నేపథ్యంలోంచే ఆయన అంతగా కలత చెంది కన్నీరు కారిస్తే.., నిజం గా న్యాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజల బాధలు, నిందితులుగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీల కన్నీటి గాథ లు వింటే కడివెడు కన్నీరు కార్చేవారేమో. అయితే ఈ పరిస్థితికి కేవలం కోర్టులనే నిందిస్తే ప్రయోజనం లేదు. కోర్టులు, న్యాయమూర్తుల పని పరిస్థితులు, ప్రాసిక్యూషన్ విధానాలు మొత్తంగా న్యాయం అందించే వ్యవస్థ పనితీరు కాలానుగుణంగా మారా లి. కొన్నేళ్లుగా దేశంలో న్యాయమూర్తుల నియామకాలు జరగడం లేదు. దీంతో.. ఉన్న న్యాయమూర్తులే రాత్రింబగళ్లు పనిచేసినా గుట్టలుగా పేరుకుపోయిన అపరిష్కృత కేసులు తరగడం లేదు. ఇప్పటికే దేశంలోని వివిధ కోర్టుల్లో అపరిష్కృత (పెండింగ్)కేసులు మూడు కోట్లకు మించిపోయాయి. ఈ క్రమంలోంచే.. సుప్రీంకోర్టులో 58,879 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే హైకోర్టుల్లో 40,05,704 కేసులు, సబార్డినేట్ కోర్టుల్లో 3,11,61,724 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులన్నింటి పరిష్కారానికి ఇప్పుడున్న పరిస్థితుల్లోంచే మన కోర్టులు పనిచేస్తే.. మరో మూడొందల ఏళ్లు పడుతుందని అంచనా. ఇదంతా ఇక ముందు ఒక కేసు కూడా నమోదు కాకుండా ఉంటేనే.

పెండింగ్ కేసులు.., ప్రజల అవస్థల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కోర్టు కేసులో ఓడిన వాడు కోర్టులోనే ఏడిస్తే.., గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడని మన కోర్టుల పనితీరుతో ప్రజలకు జరుగుతు న్న న్యాయం గురించి ఓ సామెత ఉన్నది. అంటే న్యాయం కోసం కోర్టుమెట్లు ఎక్కిన వారు ఎవరైనా న్యాయం చేతిలో ఓడిపోతున్నారు. అలాగే కేసుల్లో ముద్దాయిలుగా జైల్లో ఉంటున్న వారి పరిస్థితి మరిం త దయనీయం. చిన్న చిన్న దొంగతనాలు, క్షణికావేశాలతో జరిగే కొట్లాటలు, నేరాలు, ఆర్థిక వ్యవహారా ల్లో మోసాలు లాంటి కేసుల్లో నిందితులుగా ప్రతి జైళ్లో వందలు, వేలల్లో ఉంటారు. నిజానికి వారు చేసి న నేరానికి పడే శిక్ష కంటే.., వారు జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా జైలులో ఉన్న కాలం ఎక్కువగా ఉం టున్నది. ఇలాంటి చిన్నా, చితకా నేరాలతో జైలులోకి వచ్చిన వారిని ఎస్కార్టు కొరత పేరుతో కోర్టుకు తీసుకుపోయే పరిస్థితే ఉండదు. ఇలా ప్రతి జైలులో ఎక్కు వ మంది మగ్గిపోతున్న స్థితి ఉన్నది. ఒకానొక అధ్యయనం ప్రకారం.. జైలులో ముద్దాయిలుగా ఉన్న వారు, వారి నేరాలను ఒప్పుకుంటే.. శిక్షా కాలం గడిచిపోయి విడుదలయ్యే వారి సంఖ్య సగానికన్నా ఎక్కువగా ఉంటుంది. ఉన్న ఫలానా మన జైళ్లన్నీ సగం ఖాళీ అవుతాయి. అదే సంఖ్యలో పెండింగ్ కేసు లు కూడా తగ్గిపోతాయన్నమాట.

samamallareddyకోర్టుల్లో అపరిష్కృత కేసుల సంఖ్య పెరిగిపోవడానికి వ్యవస్థాగతంగా అనేక కారణాలున్నాయి. కొన్నేళ్లుగా.. దేశంలో న్యాయమూర్తుల నియామకాలే జరగడం లేదు. అలాగే.. పెరుగుతున్న పనిభారానికి అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉన్నదని ఎంతో కాలంగా న్యాయకోవిదులు అంటున్నారు. అంతే కాకుండా జనాభా నిష్పత్తికి అనుగుణంగా కూడా న్యాయస్థానాల సంఖ్యను పెం చాలని కోరుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు నుంచి సత్వర న్యాయం పొందేందుకు అటు కేరళ మొదలు కొని త్రిపుర, గుజరాత్‌ల నుంచి ఢిల్లీకి రావాలంటే దూరభారం సామాన్యులకు మోయలేనిది. దీనికోసం దేశంలో నలుమూలలా నాలుగు సుప్రీంకోర్టు బేం చీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా మోదీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు బేంచీలను ఏర్పాటు చేయడానికి నిరాకరించి అందరికీ అందుబాటులో సత్వర న్యాయానికి మోకాలొడ్డింది. ఇలాంటి విషయాలన్నింటినీ మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కానీ.. సందర్భమొచ్చినప్పుడల్లా సత్వర న్యాయం గురించి చెప్పుకొస్తూ న్యాయమూర్తుల వైపు చూపుడు వేలు ఎత్తుతున్నారు. దీంతో ఆయా కోర్టుల్లోని న్యాయమూర్తులు పనిగంటలు పెంచుకుని రాత్రింబగళ్లు పనిచేసినా ఫలితం ఉండటం లేదు. ఈ నేపథ్యంలోంచి ఆలోచిస్తే.. అపరిష్కృత కేసులు, న్యాయవ్యవస్థలోని సమస్యల విషయంలో న్యాయమూర్తుల పాత్రకన్నా.. పాలకుల బాధ్యతే ఎక్కువ.

కోర్టుల్లో గుట్టలుగా పెండింగ్ కేసులు పేరుకుపోవడానికి ప్రధాన కారణం చిన్నా చితకా గల్లీ కొట్లాటల నుంచి, ఆర్థిక లావాదేవీలు, చెల్క దగ్గరి గెట్టు పంచాయితీల దాకా అన్నీ ఒకే దగ్గరికి చేరడమే. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఫ్యామిలీ కోర్టులు, సైనిక దళాల వ్యవహారాలకు ప్రత్యేక ట్రిబ్యునళ్లు, లోక్‌అదాలత్‌లు ఏర్పర్చి నా.. కేసుల ప్రవాహం ఏటా పెరిగిపోతూనే ఉన్నది. ఈ పరిస్థితి మారాలంటే.. కేసుల స్వరూప, స్వభావాలను అనుసరించి వర్గీకరించి, వాటికి అనుగుణంగా కోర్టుల విభజన, ఏర్పాటు జరగాలి. ఇలాంటి విభజన ఆస్ట్రియా, ఇటలీ లాంటి దేశాల్లో ఎప్పటి నుంచో అమల్లో ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అభివృద్ధిచెందిన దేశా ల్లో ఉన్న న్యాయవ్యవస్థలను, పనితీరును అధ్యయ నం చేసి మన న్యాయ వ్యవస్థలో సమూల మార్పుల కు శ్రీకారం చుట్టాలి. అలాగే బ్రిటిష్ కాలం నాటి ఫ్యూడల్ సంప్రదాయ వ్యవహారాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మన న్యాయ వ్యవస్థను ఆధునీకరించాలి. యూరప్, అమెరికా లాంటి దేశాల్లో జరుగుతున్న న్యాయవ్యవస్థల పనితీరు, కోర్టు వ్యవహారాలు ఆధునిక కాలానికి అనుగుణంగా ఆచరణాత్మకంగా ఉంటున్నాయి. కాలానుగుణంగా కోర్టుల పనితీరును సరళీకరించి, ప్రజాస్వామీకరించాలి. ఈ దిశగా పాలకులు ఆలోచించి అడుగులు వేయాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కంటనీరు సారాంశం ఇదే.
[email protected]

1335

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప