చదువు-జ్ఞానం


Wed,December 26, 2018 03:51 PM

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం లేదు. అక్షరాల ఎరుకతో చదువులు సాగే క్రమంలో జ్ఞానానికి తావే లేకుం డాపోయింది. చదువుల సారమం తా పరీక్షలు, మార్కులు, ఉద్యోగాలైనప్పుడు.. జ్ఞానం అవసరంలేనిదయ్యింది. అందుకే.. ఎవరెంత పెద్ద చదువులు చదినా..అవి (వి)జ్ఞానానికి కొలమానంగా ఉం డటం లేదు. ఆ చదువుల ప్రభా వం జీవితాచరణలో కనిపించడం లేదు. చదువురా(లే)ని సాధారణ వ్యక్తికి, చదువుకున్న శాస్త్రవేత్తకు ప్రాపంచిక జ్ఞానం విషయంలో, దృగ్గోచర ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో, మూఢవిశ్వాసాల్లో తేడా ఉండటం లేదు. భౌగోళిక శాస్ర్తాలు, జంతు-వృక్ష శాస్ర్తాలు, భౌతిక- రసాయన శాస్ర్తాల్లో పీహెచ్‌డీలు చేసి శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లుగా చెలామణి అవుతున్న వారు కూడా తమ జీవితాచరణలో కనీస శాస్త్రీయ విషయాలు కూడా తెలియనిత నంతో వ్యవహరిస్తున్నారు. పొద్దున లేవగానే సూర్య నమస్కారాలు మొదలు గ్రహపూజలు చేస్తున్నారు. నాగుల చవితి వచ్చిందనగానే పుట్ట చుట్టూ తిరిగి పాముకు పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సూర్యగ్రహణమో, చంద్రగ్రహణమో ఏర్పడిందనగానే.. గాబరా పడిపోయి వండిన ఆహారపదార్థాల్లో గడ్డిపరకలు వేసి అశుభాన్ని తొలగించుకుంటున్నారు. గ్రహనం గ(వి)డిచిందాక అన్నపానీయాలు మాని పూజలు, పునస్కారాల్లో మునిగితేలుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతి అడుగూ అశాస్త్రీయమే, మౌఢ్యమే. చదువులకూ, జీవితాచరణకు పొంతనలేని తనమే జీవితమంతా నిండి ఉంటున్నది.

మన పాఠ్యాంశాల్లో శాస్త్రీయ వివరణ, విజ్ఞానం లేదా అంటే.. ఉన్నది. గ్రహణా లు ఎందుకు ఎలా ఏర్పడుతున్నాయో ఆరో తరగతి సాంఘిక, సామాన్యశాస్ర్తాల్లోనే ప్రయోగాత్మకంగా రుజువు చేసే పాఠాలున్నాయి. ఏడో తరగతి సామాన్యశాస్త్రంలోనే పాములు, బల్లుల లాంటి సరీసృపాల జాతికి చెందిన జీవులన్నింటికీ గొంతు (గ్లాటిస్) ఉండదనీ, వాటి నాలుక చీలి రెండు ధారాల రూపంలో ఉంటుంది కాబట్టి ద్రవపదా ర్థాలను తాగలేవనీ ఉంటుంది. ఎవరైనా ప్రేమతో పాముకు పాలు పోసినా అది తాగలేదు. నోట్లో పోసినా.. అవి ట్యూబు నుంచి బయటకు వచ్చిన విధంగా బయటికే వచ్చేస్తాయి. సరీసృపాలన్నీ ద్రవపదార్థాలను ఆహారపదార్థాలుగా తీసుకోలేవు. ఘనపదార్థాలనే అంటే క్రిమి కీటకాలనే ఆహారంగా తీసుకుంటాయి. ఈ విషయమంతా మనకు జ్ఞానం కాకుండాపోయింది. పరీక్షల కోసం, మార్కుల కోసం చదివి పై తరగతులకు వెళ్లడానికి అవసరమైనవిగా మాత్రమే ఆ పాఠ్యాంశాలను చూసిన ఫలితమే ఇది. ఈ అర్థంలో.. నేటి చదువుల్లో అక్షరజ్ఞానం తప్ప జ్ఞానం లేదని తేలిపోతున్నది.

mallareddyఅశాస్త్రీయ జీవితాచరణలకు మూలాలు వ్యక్తుల్లో గాక మొత్తంగా విద్యావిధానం లో చూడాలి. అంతకన్నా ముఖ్యంగా సామాజిక జీవనం వ్యక్తులపై అది కలుగజేస్తున్న ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. విద్యార్థులుగా వ్యక్తిత్వం రూపుదిద్దుకునే వయస్సులో బడిలో ప్రవేశిస్తున్న విద్యార్థులకు పరస్పర విరుద్ధ భావనలతో కూడిన పాఠాలు బోధిస్తున్నాం. తెలుగు వాచకంలో భూమిని చాపలా చుట్టి తలపైకెత్తుకున్న కూర్మావతారం కథ చెబితే.., తరువాతి పీరియడ్‌లోనే భూమి గుండ్రంగా ఉన్నదనీ, సహజంగా ఏర్పడిన ఒక గ్రహమనీ చెబుతాం.గ్రహాల ఉనికిని, గ్రహణా లు ఏర్పడుతున్న క్రమాన్ని బోధిస్తాం. పదార్థాన్ని సృష్టించలేం, నాశనం చేయలేమని చెప్తూ.. న్యూటన్ గమన సూత్రాలను ఏకరువు పెడతాం. ద్రవ్యనిత్యత్వ సూత్రాన్ని వల్లెవేస్తాం. పిల్లవానికి ఇవన్నీ పరీక్ష కోసం అవసరమయ్యే పాఠ్యాంశాలే తప్ప వాటికి మరో ప్రాధాన్యం ఉన్నట్లు కనపడదు. మన టీచర్లు చెప్పే విధానంలోనూ నిజ జీవితంలో ఉన్న తప్పుడు భావనలను ఖండిస్తూ.. శాస్త్రీయంగా వాస్తవం ఇది అని చెప్పే విధానమూ ఉండదు. టీచర్లు కూడా పూజలు, పునస్కారాలు చేసే వారే కాబట్టి మన ఉపాధ్యాయులకూ అంతకన్నా అర్థవంతంగా, ప్రయోజనాత్మకంగా చెప్పే విధానమూ ఉండట్లేదు.

మరోవైపు.. మనిషి జీవితంపై, ముఖ్యంగా బాల బాలికలపై పాఠ్యాంశాల్లో చదువుకున్న విషయాల కన్నా ప్రభావవంతంగా, శక్తివంతంగా సామాజిక జీవన ప్రభావం ఉంటున్నది. ఈ కారణంగా కుటుంబంలోనూ, సమాజంలోనూ అనుసరిస్తున్న ఆచారవ్యవహరాల ప్రభావమే ఎక్కువగా ఉంటున్నది. దీంతో.. బాల్య దశ నుంచీ ప్రతి విద్యార్థి భావనా ప్రపంచం మౌఢ్యంతోనే నిండి ఉంటున్నది. ఈ క్రమం ముందుకు సాగి.. డిగ్రీలు, పీజీలు చేసి న వారైనా మత మౌఢ్యాలు దూరం కావడం లేదు. పాఠ్యాంశాల నుంచి శాస్త్రీయ జ్ఞానాన్ని గ్రహించడమనేదే ఉండటం లేదు. అయితే మన చదువులతో ప్రయోజనమేదీ ఉండటం లేదా? శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో మన చదువుల పాత్ర ఏమిటన్న ప్రశ్నలు ముందుకువస్తాయి. అంటే.. మన శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు, ఇస్రో శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయాలన్నీ సాధించిన శాస్త్రప్రగతిని పునాదిగా చేసుకుని దాన్ని విస్తృత పర్చడం, మెరుగుపర్చడం తప్ప సరికొత్త ఆవిష్కరణలుగా చెప్పుకోవడానికేమీ లేదు.

ఇక్కడే చదువుల అర్థం, పరమార్థం గురించి చెప్పుకోవాలి. ప్రయోజనం గురించి మాట్లాడుకోవాలి. ఇవ్వాళ మన చదువుల ప్రయోజనమంటే ఉద్యోగం తప్ప మరోటి లేదు. అది కూడా చదివిన చదువుకూ చేస్తున్న పనికీ సంబంధం అసలే ఉండదు. చేస్తున్న పనిలోని అనుభవంతో.. సమకూరిన నైపుణ్యాలతో ఎవరైనా ఏ పని అయినా చేయవచ్చు అనేది అనుభవంలోని విషయమే. సార్వత్రిక నియమమే. అది ఏ స్థాయి ఉద్యోగమైనా.. జీవితానుభవానికి మించిన పరిజ్ఞానం మరోటి అక్కరలేదని మానవ వికాస చరిత్ర చెబుతూనే ఉన్నది. దీన్నే ప్రపంచంలో అనన్యత్యాగాలతో అద్భుత ఆవిష్కరణలు చేసి వెలుగు బాటలు వేసిన వారెందరో నిరూపించారు. ఈ నేపథ్యంలోనే ఒకానొక సందర్భంలో.. మహా కవి శ్రీశ్రీ.. దేశంలో ఉన్న పలాన అందరూ చదువులు మర్చిపోతే ఏమవుతుందీ? అంటే.. ఏమీ కాదు అని చదువుల డొల్లతనాన్ని చెప్పుకొస్తాడు.

శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి ఎంతగా ఉన్నా.. అంధయుగంనాటి విశ్వాసాలతో బుద్ధివైకల్యం పుష్కలంగా ఉన్న దేశం మనది. శాస్త్రవిజ్ఞాన ఉత్పత్తి పరికరాలతో విలాసాలు చేస్తున్న మనమే, ఆంజనేయ చాలీసా యంత్రాలను కట్టుకుని ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నాం. మానసిక ఒత్తిడుల నుంచి విముక్తి కోసం ఇంటి ఎదుటనున్న రావిచెట్టు చుట్టూ పది వారాలు ప్రదక్షిణలు చేసి ప్రాణాలను నిలుపుకోవాలనుకుంటున్నాం. మనిషి సుఖశాంతులన్నీ వాస్తులు, సాంఖ్యాశాస్త్ర సుడిగుండాల్లో చిక్కుకొని వైరుధ్యాల జీవితం తెల్లవారుతున్నది. వైవిధ్యభరిత మానవ జీవితమంతా ఏకోన్ముఖ సాంస్కృతిక దాడితో తల్లడిల్లుతున్నది. ఇంటింటికీ ఇంటర్నెట్ అంటున్న దేశంలోనే పరువు హత్యలు, కుల కట్టుబాట్లు కత్తులు దూస్తున్నాయి.

మనిషిని మానవీకరించి మూఢ విశ్వాసాల చెర నుంచి విముక్తి చేయనిది ఏదైనా కావచ్చు కానీ చదువు మాత్రం కాదు. ఈ నేపథ్యంలో చదువుకు ఉద్యోగానికి మించిన మరో పరమార్థం ఉన్నదని చెప్పక తప్పదు. అదే మనిషి ఉన్నతి. ఉన్నతి అంటే పెద్ద ఉద్యోగం, అధికారం, కార్లు, బంగళాలు కాదు.., మనిషి వ్యక్తిత్వ ఉన్నతి. చదువు మనిషిని సమూన్నతంగా మెట్టు మెట్టుగా ప్రాపంచిక జ్ఞానంతో పాటు శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచి జీవితాన్ని విస్తృతం చేయాలి, విశాలం చేయాలి. అన్నిరకాల అంధ విశ్వాసాలను ధ్వంసం చేసి సశాస్త్రీయ జీవనమార్గానికి బాటలు వేయా లి. ప్రకృతిని, మనిషిని అత్యున్నతంగా ప్రేమించే, గౌరవించే ఆలోచనలివ్వాలి. అన్నింటికి మించి మనిషిని సమస్త ప్రకృతిలో అత్యున్నతమైన అద్భుత ఆవిష్కరణగా, శక్తిగా గుర్తించే దృక్పథాన్నివ్వాలి. ప్రతి వ్యక్తీ తనను తాను ప్రేమించుకున్నంతగా ఎదుటి మనిషిని గౌరవించే చూపునివ్వాలి. మనుషుల మానవీయానుబంధా ల మధ్య అడ్డుగోడలుగా నిలిచిన అమానవీయ కుల,మత, లింగ వర్ణ వివక్షలను కాలదన్నే విచక్షణాజ్ఞానాన్ని వ్వాలి. ఇలాంటి పరిపూర్ణ శాస్త్రీయ దృక్పథంతో ఉన్నత మానవీయ విలువలతో ఎదిగిన వ్యక్తి మాత్రమే సహజ, సంపూర్ణ మానవుడు. అలా కాకుండా.. ఛాందస భావాల జీవితాచరణతో ఉన్న ఎంతటి వ్యక్తి అయినా జ్ఞానపరంగా అవిటివాడే. ఈ అవిటి తనానికి కారణం అవిద్యే.
[email protected]

4038

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Featured Articles