సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు


Sun,April 10, 2016 12:58 AM

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తరగతి గది, నిత్యనూతనంగా లేని ఉపాధ్యాయుల బోధన విద్యార్థికి ఏ విధంగానూ ఉత్సాహాన్ని, కుతూహలాన్ని నింపలేక పోతున్నది. మార్కుల కోసం సాగుతున్న పోటీ చదువులో యాంత్రికత పెరిగి చదువులపై అయిష్టత, వ్యతిరేకత ఏర్పడుతున్నది. ఇది ఇంకా ముందుకు పోయి కుటుంబ అనుబంధాలను, గురు-శిష్యుల సంబంధాలను శత్రుపూరితం చేస్తున్నది.

sama
భాషలోని శబ్దాలకు సంజ్ఞలు గా అక్షరాలు అనుకుంటే.. ఆ అక్షరాలను గుదిగుచ్చి పలకడమే చదువు అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదేని పనిలోని ప్రావీణ్యా న్ని విద్య అని చెప్పుకునే క్రమంలోనే విలువిద్యలో ఏకలవ్యుడు, అర్జునుడు అగ్రగణ్యులుగా చెప్పుకున్నాం. అలాగే జేబులు కత్తిరించి దొంగతనాలు చేయడంలో దిట్ట అయిన వాడిని కూడాచోర విద్య లో ఘనుడుగా మన పోలీసులు చెబుతుంటారు. నిజ జీవితంలో చదువు,విద్య మాటలను ఎలా ఉపయోగిస్తున్నా.. సమకాలీన సమాజంలో.. చదువు, విద్య అను పదాలను సమానార్థాలుగా చెప్పుకుంటు న్నాం. చారిత్రక పరిణామక్రమంలో.. సమాజ పరిణామంలో అంధయుగం నుంచి ఆధునిక యుగంలోకి మనిషి అడుగిడటానికి ఆసరాగా నిలిచిందీ, ఆయుధంగా ఉపయోగపడిందీ చదువే. అందుకే సమాజాభివృద్ధిని అక్షరాస్యతతో కొలుస్తున్న స్థితి ఉన్నది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన చదువును.. దృగ్గోచర ప్రపంచం గురించి అవగాహన కలుగజేసి, మూఢ విశ్వాసాల అశాస్త్రీయ అంధకార ప్రపంచంలో మనిషికి వెలుగు దారి చూపేదే విద్య అని నిర్వచించుకున్నాం.

మనిషి వ్యక్తిత్వ వికాసానికీ, సమగ్రాభివృద్ధికీ మూలమైన చదువులో ప్రాథమిక విద్యాబోధన అతి కీలకమైనది. మన విద్యావ్యవస్థలోని అశాస్త్రీయత, అసమగ్రత అంటుంచి.. చదువులో అత్యంత ప్రాధాన్యం కలిగినది ప్రాథమిక విద్యాదశ. ఈ దశలో గరిపే విద్యాబోధనే విద్యార్థిని భావిపౌరునిగా తీర్చిదిద్దుతుంది. మూడునుంచి అయిదేళ్ల పసి ప్రాయంలో నిండైన జీవకళతో సృజనాత్మక శక్తులతో బడిలో అడుగుపెడుతున్న విద్యార్థులకు విద్యాబోధన ఎలా చేయాలో.. ఎంతో పరిశోధన జరిగింది. మరెంతో సాహిత్యం, సారవంతమైన అనుభవాలతో కూడిన విజయ గాథలు ఎన్నో ఉన్నాయి. గిజూబాయి మొదలుకొని పాఠశాల విద్యలో శాస్త్రీయ, విప్లవాత్మక విధానాలకు అంకురార్పణ చేసిన లుచనార్‌స్కీ దాకా దేశ దేశాల్లో ఎంద రో విద్యావేత్తల అనుభవాలున్నాయి. వీటన్నింటి సారం జీర్ణం చేసుకుని విద్యార్థులకు చదువులు చెప్పే ఉపాధ్యాయులు మరింత సృజనాత్మకంగా ఉండాలి. ప్రతి విద్యార్థి పట్ల శ్రద్ధతో, ప్రత్యేకతతో నేర్పుతో వ్యవహరించాలి.

ప్రాథమిక విద్యలో భాగంగా బోధనా పద్ధతిలో.. మొదట విద్యార్థులకు అక్షరాల గుర్తింపు, ఆ తర్వాత చదవడం, చివరగా రాయటాన్ని నేర్పడం అనే క్రమం పాటించాలి. కానీ మన ఉపాధ్యాయులు పాఠశాలల్లో చేస్తున్నదేమిటో అందరికీ అనుభవమే. పాఠశాలకు పోయిన విద్యార్థికి వెంటనే పలకమీద ఏబీసీడీ లు కానీ, అ,ఆ లు కానీ రాసి దిద్దిస్తున్నారు. ఒక సారి పలక మీద రాసిన అక్షరాలను విద్యార్థి ఆ పూటంతా దిద్దుతూనే ఉండాలి. దీంతో ఉపాధ్యాయులు ఏం సాధించ దలచారో అంతుపట్టని విషయం. పలక మీద అక్షరాలను దిద్దటం ద్వారా అక్షరాలు నేర్చుకుంటారనే భ్రమ తెలిసో తెలియకో అందరిలోనూ నాటుకుపోయింది. పలక మీది అక్షరాలను ఎంత మందంగా దిద్దితే పిల్లవాడు అంతగా నేర్చుకుంటున్నట్లు భ్రమపడుతున్నారు. దీనికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మినహాయింపు కాదు.

అయిదేళ్ల పసిబాలుడు తన చిట్టి చేతులతో తన శక్తినంతా కూడదీసుకుని, బలపాన్ని చేతిలో క్రమంగా పట్టుకుని దిద్దడం ఎంతటి కష్టతరమైందో, క్లిష్టతరమైందో ఎవరూ ఆలోచించకపోవడం, అర్థం చేసుకోకపోవడం ఇవ్వాళ్టి విషాదం. అయితే పలకమీద అక్షరాలు దిద్దించడంలో ఉన్నది ఏమంటే.. పిల్లవాడు పలకమీది అక్షరాలను దిద్దుతున్నంత సేపు టీచర్ సేద దీరొచ్చు. లేదా పట్టణ ప్రాంతం నుంచి దూర భారాల కోర్చి స్కూలుకు వచ్చిన టీచర్ బడలిక తీర్చుకోవడానికి ఓ కునుకు కూడా తీయొచ్చు. ఇది తప్ప అక్షరాలను దిద్దించడంలోని అర్థం, పరమార్థం మరొకటి ఉన్నదని ఎవరైనా చెబితే అదొక ఆవిష్కరణగానే పరిగణించాలి.

విద్యార్థి బడిలో చేరింది మొదలు ప్రాథమిక పాఠశాల తరగతుల్లో దిద్దించడం, రాయించడం, చదివించడంలోనే విద్యార్థిని బందీ చేస్తున్నారు. ప్రకృతి, పరిసరాల్లోని ప్రాణులు వృక్షాలు, జంతువులు, నిత్యజీవితంలోఉపయోగిస్తున్న పరికరాల జ్ఞానమే ప్రాథమిక తరగతుల్లో ఉంటుంది. వీటిని పరిశీలన, అవగాహనతోనే అర్థం చేయించే బదులు రాయించడాలు, చదివించడాలతో విద్యార్థి పరిశీలనాశక్తిని చిదిమేస్తున్నారు. ఉదాహరణకు- మనిషికి కాళ్లతో ఉపయోగమేమి? అనే మూడో తరగతిలోని ప్రశ్నకు.. జవాబుగా.. మనిషి కాళ్లతో పరిగెత్తును అని జవాబు రాయించి చదివిస్తున్నారు. కాళ్లతో ఏమి చేస్తాడో ఆ విద్యార్థికి తెలియనట్లు, కాళ్లపై ఓ ప్రశ్న, దానికో జవాబు! దాన్ని మన టీచర్లు బట్టీ పట్టించడం. ఇంతకన్నా బండ చదువులు ఉంటాయా? కళ్లముందుండీ, అనుభవంలోని విషయమే అయినా కానీ.., మన ఉపాధ్యాయులు జవాబు రాయించడాలు, చదివించడాలను బోధనా పద్ధలని ఎవరూ అనలేరు. ఉపాధ్యాయులు ఇంతగా అశాస్త్రీయంగా ఎందుకుంటున్నారో అంతుపట్టదు.

పై తరగతులకు పోతా వుంటే.. స్కూళ్లలో పొద్దున్నుంచీ రాత్రి దాకా చదివిందే వంద సార్లు చదవడంగా విద్యార్థి జీవితం ఉంటున్నది. ఇవ్వాళ.. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల దాకా ఇదే తంతు కొనసాగుతున్నది. ఒక పాఠాన్ని ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఎందుకు చదవాలో ఎవరికీ పట్టదు. దీంతో చదివిందే చదువుతూ.. అనివార్యంగా విద్యార్థి బట్టీ చదువుల్లోకి నెట్టబడుతున్నాడు. ఈ క్రమంలో జరుగుతున్నదేమంటే.. విద్యార్థికి తరగతిలో ఉపాధ్యాయుడు చెప్పిం ది విని అర్థం చేసుకుని, ఆ అవగాహనను మరింత విస్తృత పరచుకునేందుకు మాత్ర మే పుస్తకాన్ని (అవసరం అనుకుంటేనే) చదవాలనేది పోయి.. చదవడమే పనిగా మారిపోయింది. మన స్కూళ్లలో జరుగుతున్నదంతా.. పుస్తకాలను పుస్తకాలనే కంఠ స్తం చేయిస్తూ.. విద్యార్థికి సహజంగా ఉండే పరిశీలనా, అవగాహనా శక్తినీ బండబారుస్తున్నారు.

ఈ విధమైన బట్టీయం చదువులతో విద్యార్థి తనదైన సహజ వ్యక్తీకరణకు దూరమైపోతున్నాడు. మక్కికి మక్కీ తప్ప మరో విధంగా తనదైన పరిశీలనా అనుభవంతో వ్యక్తీకరణతో రాయడం అనేది మటుమాయం అయిపోతున్నది.
ఈ మొత్తం క్రమంలో మరో తీరని నష్టం జరుగుతున్నది. సహజమైన గ్రహణ (వినికిడి) శక్తి దూరమవుతున్నది. మన పాఠశాలల్లో చదివిస్తున్న తీరుతో.. విద్యార్థి కి సహజంగా ఉండే గ్రహణ (వినికిడి)శక్తికి ఎనలేని నష్టం చేస్తున్నారు. సహజంగా విద్యార్థికి పాఠాన్ని ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు వినడంతోనే తొంభై శాతం అవగాహన అవుతుంది. ఇంకా చిన్న తరగతుల్లోని పిల్లలకు అయితే ఒక సారి చెబితే.. వింటే చాలు.. అది గుర్తుండి పోతుంది. దానిలోని సారం, సారాంశం గ్రహించగలుగుతారు. తనదైన పద్ధతిలో తాను వ్యక్తీకరిస్తాడు. అంతెందుకు.. మన ఊళ్లల్లో రాత్రంతా ఒగ్గు కథా కళాకారులు చెప్పిన మల్లన్న కథనో, ఎల్లమ్మ కథనో.. విని, తెల్లారి ఉదయం అదే కథను కలుపు చేన్లలో మన గ్రామీణ స్త్రీలు గానం చేస్తారు. ఎంత ప్రభావ వంతంగా కథ చెబుతారంటే.. ఆ కథ విని కొందరికి పూనకం కూడా పూనుతుంది. ఇది సహజంగా ఉండే వినికిడి శక్తికి తార్కానం.

బట్టీ పద్ధతిలో ఉన్నది ఉన్నట్లు చెప్పే అవసరం ఏ సబ్జెక్టులోనూ ఉండదు. అన్ని సబ్జెక్టులనూ విషయాన్ని అర్థం చేసుకుని తనదైన వ్యక్తీకరణతో రాయొచ్చు. కానీ లాంగ్వేజెస్.. తెలుగు, ఇంగ్లీషులో పద్యాలను ఉన్నది ఉన్నట్లు చెప్పడం, రాయడం అవసరం ఉంటుంది. దీనికి కూడా బట్టీ అవసరం ఉండదు. టీచర్ ఆ పద్యాల అర్థ, తాత్పర్యాలను ప్రతిభావంతంగా విద్యార్థులకు అర్థమయ్యే పద్ధతుల్లో బోధిస్తే.. క్లాసులో పాఠం చెప్పడం అయిపోయే సరికి మెజారిటీ విద్యార్థులకు ఆ పద్యాలు నోటికి వస్తాయి. నిజానికి విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది ఏక సంథాగ్రాహుల్లాగానే ఉంటారు. అయితే పాఠం బోధించే ఉపాధ్యాయుడు ఎంత ప్రతిభావంతంగా బోధిస్తే.. అంతగా విద్యార్థులకు ఆ పీరియడ్ అయిపోయే లోపుగానే వస్తాయి.

వచ్చిన సందర్భాలున్నాయి. ఇది అనేక మార్లు రుజువు కూడా అయ్యింది. దీనికి కావలసింది ఉపాధ్యాయుల నిబద్ధత, ప్రతిభ మాత్రమే.మొత్తంగా చూస్తే.. పాఠశాల విద్యతో జరుగుతున్నదేమిటి? అని ప్రశ్నించుకుం టే.. మిగిలేది కడుపుకోతే. సహజ సిద్ధ నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలతో పాఠశాలలో అడుగు పెట్టిన పిల్లలు మన విద్యా విధానం, ఉపాధ్యాయుల బోధనా పద్ధతులతో బండబారి పోతున్నారు. వారి గ్రహణ శక్తి, వ్యక్తీకరణ అణచివేయబడుతున్నది. బట్టీ చదువులతో విద్యార్థికుండే సహజ లక్షణాలన్నీ ఆవిరై పోయి వాడిపోయిన కాడలా డీలా పడుతున్నారు. మరో మాటలో చెప్పాలంటే.. సహజ సృజనశక్తులు, ప్రావీణ్యా లతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్ని విధాలా బండబారుతున్నాడు.

సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తరగతి గది, నిత్యనూతనంగా లేని ఉపాధ్యాయుల బోధన విద్యార్థికి ఏ విధంగానూ ఉత్సాహాన్ని, కుతూహలాన్ని నింపలేక పోతున్నది. మార్కుల కోసం సాగుతున్న పోటీ చదువులో యాంత్రికత పెరిగి చదువులపై అయిష్టత, వ్యతిరేకత ఏర్పడుతున్నది. ఇది ఇంకా ముందుకు పోయి కుటుంబ అనుబంధాలను, గురు-శిష్యుల సంబంధాలను శత్రుపూరితం చేస్తున్నది. ఈ పరిస్థితులు పోవాలంటే మన విద్యావిధానం శాస్త్రీయం కావాలి. బోధనా పద్ధతులు సజీవంగా, నత్యనూతనంగా ఉండాలి.

బుద్ధి మాంద్యం లాంటి వైకల్యం ఉన్న పిల్లలు తప్ప తొంభై తొమ్మిది శాతం పిల్లలు సహజ శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలతో ఉంటారు. పదునైన గ్రహణశక్తితో, సున్నితమైన సృజనాత్మక శక్తి సామర్థ్యాలతో ఉంటారు. ఇలాంటి సహజ నైపుణ్యాలున్న వారికి పరిసరాలను, ప్రకృతినీ పరిశీలించే, అనుభవించే పరిస్థితులను కల్పించాలి. పరిసరాలతో అనుభూతి చెందే స్వేచ్ఛనివ్వాలి. ప్రకృతి సంపర్కంతోనే సహజ నైపుణ్యాలు వృద్ధిచెందుతాయి. పిల్లలను స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలి.. పాడుకోనివ్వాలి. ప్రకృతి ఒడిలో ఒదిగిపోనివ్వాలి. అప్పుడే ఒక్కో విద్యార్థి ఒక్కో విప్పారిన మందారంలో వికసిస్తాడు. మల్లె పూవు స్వచ్ఛతతో..పరిమళాలను వెదజల్లుతాడు. మానవీయతతో అత్యున్నత మానవుడుగా నిండైన వ్యక్తిత్వంతో భాసిల్లుతాడు.

2047

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప