ప్రకృతిలోనే పాఠాలు


Wed,December 26, 2018 04:44 PM

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్థపై విస్తృతంగా చర్చ సాగుతున్నది. ఈ క్రమంలోనే గత పాలకులకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా 2016- 17 విద్యాసంవత్సరానికి 10,738కోట్లు కేటాయించి ప్రాధా న్యాన్ని చాటుకున్నది. నూతన విద్యావిధానం గురించి ప్రభుత్వం నిపుణులు, విద్యావేత్తల నుంచి సూచనలు, సలహాలు ఆహ్వానిస్తున్న తరుణంలో విద్యావ్యవస్థపై అర్థవంతమైన చర్చ సాగాల్సి ఉన్నది.
అయితే ఎప్పటిలాగానే.. విద్యావ్యవస్థ విషయంలో పాత మూసపద్ధతిలోనే సమస్యలను ఎత్తిచూపడం చుట్టూనే చర్చంతా తిరుగుతున్నది. తరగతి గదులు, మంచినీళ్లు, ప్రహరీ గోడ.. తదితర మౌలిక వసతులు ఏవీ లేకుండా విద్యాప్రమాణాలు ఎలా పెరుగుతాయని ప్రశ్నిస్తున్నారు! చెట్ల కింది చదువులతో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలతో పోటీ ఎలా పడగలుగుతామని అంటున్నారు. నిజమే.. ఇలాంటి మౌలిక వసతులు తప్పకుండా ప్రతి పాఠశాలలో ఉండాల్సిందే. వీటి కల్పనకు కృషి చేయాల్సిందే. అయితే.. ఈ మౌలిక వసతుల కల్పనతోనే విద్యా ప్రమాణాలు పెరుగుతాయా? విద్యా ప్రమాణాలు సన్నగిల్లడానికి ఇవే కారణాలా? ఎప్పుడైనా ఏకాలంలోనైనా విద్యా ప్రమాణాలు ఇప్పడున్న దానికంటే ఏదో మేర బాగున్నాయంటే.. అప్పుడు ఈ వసతులన్నీ ఉన్నకారణంగానే సాధ్యమయ్యాయా? నాణ్యమైన విద్యకు వసతులే ప్రధానమా? బోధకుల పాత్ర ఏమీ లేదా?
ఉంటే..ఉపాధ్యాయుల పనితీరులో రావాల్సిన మార్పు ఎలా ఉండాలి? ఇప్పుడెలా ఉన్నది.. లాంటి ప్రశ్నలతో విద్యావ్యవస్థ గురించి లోతైన చర్చ జరగాలి. అలాగే అసలు.. విద్య లక్ష్యం ఏమై ఉండాలి? ఇప్పుడెలా ఉన్నది.. అన్న మౌలిక విషయాల్లోకి వెళ్లాలి. ఒక శాస్త్రీయమైన సమగ్ర విద్యావిధానం రూపొందే దిశగా చర్చలు సాగాలి. అన్నింటికన్న ముఖ్యంగా.. విద్యారంగంలో వ్యవస్థీకృతమైన అలసత్వం, నిజాయితీ నిబద్ధత లేమితనం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఎప్పటికప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న అభివృద్ధికి అనుగుణంగా టీచర్లు కూడా అప్‌డేట్ కావడం గురించి, ఉపాధ్యాయుల పనితీరు, నైపుణ్యాల గురించి మర్చిపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఒక్కొక్క విషయం గురించి చర్చించుకోవాలి. మౌలిక వసతులు, తరగతి గదుల గురించి, విద్యాబోధన గురించి మాట్లాడుకోవాలి.

తరగతి గదుల్లేక, చెట్లకింద చదువులు ఎలా చెప్పాలని చాలా మంది వాపోతున్నారు! తమ వృత్తి నిబద్ధత, నిజాయితీ లేమి తనాన్ని సమస్యల చాటున దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి విద్యార్థులను ప్రకృతి సహజ వాతావరణానికి దూరం చేసి, నాలుగు గోడల మధ్య బంధించి పాఠాలు బోధిస్తామనడమే అసంబద్ధం, అశాస్త్రీయం. పాఠశాల విద్యలో ఎప్పుడో ఒకసారి బ్లాక్ బోర్డు అవసరం ఉంటుంది. ఒకటి నుంచి ఐదు తరగతుల దాకా పాఠ్యాంశాల్లో 90 శాతం తరగతి బయటనే విద్యార్థులతో ఆడుతూ పాడుతూ బోధించాలి. ప్రకృతి శాస్ర్తాలనూ, సాంఘిక జీవనానికి సంబంధించిన పాఠ్యాంశాలనూ స్వేచ్ఛగా ఆరుబయట విద్యార్థులను వెంటేసుకుని తిరుగుతూ ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రకృతిని పరిచయం చేస్తూ, పరిశీలన చేయిస్తూ అర్థం చేయించాలి. సజీవులు- నిర్జీవుల గురించీ, మొక్కలూ- పక్షుల గురించీ, పెంపుడు జంతువులూ-అడవి జంతువుల గురించీ ప్రకృతిని పరిశీలింపజేస్తూ అర్థం చేయించాలి. అలాగే హైస్కూల్ స్థాయిలోనూ లాంగ్వేజెస్‌తో సహా పాఠ్యాంశాలను ఆరుబయటనే అర్థవంతంగా బోధించడానికి అవకాశం ఉన్న ది. కాళిదాసు కవితా సౌందర్యమైనా, గాలి తెమ్మెరల సంగీతమైనా ప్రకృతి ఒడిలో మాత్రమే అర్థం చేయించవచ్చు. అంతేకానీ తరగతి గదుల్లో నిర్బంధించి ప్రకృతి శాస్ర్తాలనూ, సాంఘిక శాస్ర్తాలనూ అర్థం చేయించాలనుకోవడం అర్థరహితం.

mallareddy డూన్ స్కూల్ మొదలు శాంతినికేతన్ దాకా ప్రఖ్యాత విద్యాలయాలన్నింటా తరగతి కన్నా, ఆరుబయటనే ఎక్కువ సేపు విద్యార్థి గడుపుతాడు. పాఠ్యాంశాలు వింటాడు. పరిసరాలను, ప్రపంచాన్ని అవలోకిస్తాడు, అవగాహన చేసుకుంటాడు. వాస్తవానికి బీఈడీ, డీఈడీ లాంటి వృత్తి విద్యాకోర్సులు కూడా ప్రకృతి ఒడిలో విద్యాబోధన గురించే చెబుతాయి. విద్యార్థుల మానసిక, సామాజిక స్థితిగతులను అర్థం చేసుకుని విద్యాబోధన ఎలా చేయాలో నేర్పుతాయి. కానీ నేటి టీచర్లలో ఆ అవగాహనతో పనిచేస్తున్నవారు ఉన్నారంటే అనుమానమే. మార్కుల కోసం, పరీక్షల కోసం, ఉద్యోగాల కోసం చదివే వారికి ఆ విద్యాబోధనలోని సారం అర్థమవుతుందని ఆశించడం అత్యాశ. దీనికి తోడు నిత్య విద్యార్థిగా ఉండాల్సిన ఉపాద్యాయులు ఉద్యోగం రావడంతోనే సబ్జెక్టు విషయమే కాదు, ఏ పుస్తకాన్నీ చదవడం లేదు. మరో రకంగా చెప్పాలంటే అవసరం లేదనుకుంటున్నారు. చదువు లక్ష్యం పరీక్షలు, ఉద్యోగం అయినప్పుడు.. ఉద్యోగం వచ్చిన తర్వాత చదవాల్సిన అవసరమేముంది? అన్నది మెజారిటీ టీచర్ల భావన. పుస్తక పఠనం అనేదే అక్కరకు రాని వృథాకలాపంగా భావిస్తున్న స్థితి ఉన్నది. అందుకే మెజారిటీ టీచర్లలో తాము బోధిస్తున్న సబ్జెక్టులో కూడా పరిపూర్ణత, ప్రావీణ్యత ఉండటం లేదు. కనీసం తరగతిలో పాఠం చెప్పే ముందు అయినా టెక్స్‌బుక్‌లో సంబంధిత లెసన్‌ను చదివి విద్యార్థులకు పాఠం చెప్పాలి. ఈ కనీస నియమాన్ని పాటిస్తున్న వారు చాలా అరుదుగా ఉన్నారు.

1980 దశకానికి ముందు పాఠశాల చదువులు, విద్యాప్రమాణాలు బాగున్నాయని, ఆ తర్వాతి కాలంలోనే దిగజారాయని అందరూ ఒప్పుకుంటున్న విషయం. కానీ కారణాలు చెప్పడానికి ఎవరూ సాహసించడం లేదు. ఎనభైల దాకా ఉపాధ్యాయులంతా ఎక్కువ శాతం పనిచేసే చోటనే ఉండేవారు. ఉపాధ్యాయుల పిల్లలు కూడా స్థానిక పాఠశాలల్లోనే చదివారు. అప్పటి ఉపాధ్యాయులంతా అన్నివిధాలుగా స్థానిక ప్రజలతో, విద్యార్థులతో సజీవ సంబంధాల్లో ఉండి ఆ సమాజంలో భాగమైపోయారు. దీంతో విద్యార్థులంతా ఉపాధ్యాయులతో మానవీయ బంధాలతో పెనవేసుకుని విద్యాబుద్ధులు నేర్చారు. ఉపాధ్యాయుల కొరత, వనరులు, వసతుల కొరత విద్యాప్రమాణాలపై ప్రభావం చూపలేదు. ప్రతిబంధకం కాలేదు. కానీ ఆ తర్వాత కాలంలోనే పరిస్థితి అంతా తారుమారైంది. నూతన ఆర్థిక విధానాలూ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలు సామాజిక స్థితిగతులను మార్చేశాయి. ప్రైవేటీకరణ భూతానికి పాఠశాల విద్య బలైపోయింది. ఉపాధ్యాయులంతా తమ పిల్లలను ప్రైవేటు బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదివించడమే గొప్పతనంగా పట్టణాలకు తరలి పోయారు. ఫలితంగా పనిచేసేచోట ఉండటం అనే వృత్తి నిబద్ధ జీవితం కనుమరుగైపోయింది. పరిస్థితి ఎలా అయిపోయిందంటే.. ప్రభుత్వ టీచర్లంతా పట్టణాల్లో నే మకాం వేశారు. ఏకంగా నివాస నగరాల నుంచి 100 నుంచి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పనిచేసే పాఠశాలలకు చేరుతున్నారు! దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య మానవీయ అనుబంధాలు తెగిపోయాయి. ఫలితంగా విద్యాప్రమాణాలు అడుగంటాయి.

ఈ పరిస్థితుల్లో విద్యాప్రమాణాలు పెరగాలంటే.. పాఠశాలల్లో ఉన్న సమస్యలు, వసతుల గురించి మాత్రమే పట్టించుకుంటే సరిపోదు. ఈ సమస్యల పరిష్కారంతో పాటు, అంతకన్నా ముఖ్యంగా ఉపాధ్యాయుల పనితీరులో గుణాత్మకమార్పు రావాలి. వృత్తి నిబద్ధత పెరగాలి. అయితే ఉపాధ్యాయ సంఘాల్లో గుర్తింపు పొందిన సంఘాలన్నీ హక్కుల గురించి మాట్లాడుతున్నంతగా విద్యాప్రమాణాల గురించీ, దానిలో ఉపాధ్యాయుల పాత్ర గురించి మాట్లాడటం లేదు. వృత్తి నిబద్ధత-సామాజిక బాధ్యత గురించి మాట్లాడుతూ.. జీతం రాళ్లు తీసుకుంటున్నందుకు పనిచేయాలంటున్న డీటీఎఫ్, ఏపీటీఎఫ్ లాంటి సంఘాలకు ఆదరణ ఉండటంలేదు. జీతభత్యాల పెంపుదల గురించి, హక్కుల గురించి మాట్లాడి సరిపెట్టుకోకుండా.. పని చేయాలంటున్నదే ఈ సంఘాలకు శాపమైంది. ఈ సందర్భంగానైనా ఉపాధ్యాయ సంఘాలు వృత్తి నిబద్ధత, నైపుణ్యాల గురించి పట్టించుకోవాలి.
సమాజాభివృద్ధి రథానికి వ్యవసాయం (సాగు విధానం), విద్య (జ్ఞానంతో కూడిన చదువు) రెండు చక్రాలు. ఈ రెండింటికీ సమపాళ్లలో ప్రాధాన్యం ఇచ్చి, సమాజవసరాలకు అనుగుణంగా రూపొందించుకుని ప్రోత్సహించిన సమాజమే ముందుకుపోతుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ రెండు చక్రాల్లో ఏది సరిగా లేకు న్నా, శిథిలమైనా ఆ సమాజాభివృద్ధి రథం చతికిలపడుతుంది. సమాజాభివృద్ధిలో కీలక భూమిక పోషించే విద్య గురించి ఇన్నాళ్లకైనా ఓ గుణాత్మక మార్పు దిశగా అడుగులు పడాలి. తెలంగాణ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకోవడానికి ఉపాధ్యాయులు తమదైన బాధ్యతను నిర్వర్తించాలి. ఈ నూతన విద్యావిధానంలో.. జ్ఞాన సమాజానికి పునాదులు పడాలి.
[email protected]

2312

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Featured Articles