మానవీయతకే.. పరీక్ష


Sun,March 6, 2016 12:43 AM

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్నది. ఫిట్‌నెస్ పేర, పోటీ పరీక్షల పేర జరుగుతున్న హింసాత్మక పద్ధతులకు ఇకనైనా స్వస్థి పలకాలి. ఎంతో శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన సమయంలో ఫిట్‌నెస్‌ను సులువుగా తెలుసుకునే వీలున్నది. అయినా పరుగు పందాలను నిర్వహించి ప్రాణాలను తోడేయడం మానేయాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయడానికి వీలు లేని విధానాలను ఆచరణాత్మకంగా ఉండేట్లు చూడాలి.

mallesh


బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించిన పరీక్ష సందర్భంగా మిలిటరీ అధికారులు చేసిన నిర్వాకం మరిచిపోక ముందే.., రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షల సందర్భం గా జరుగుతున్న అమానవీయ ఘటనలు మరింత కలచివేస్తున్నా యి. పరీక్షల నిర్వాహకులుగా ఉన్నతాధికారుల తీరు అంత అమానుషంగా ఎందుకుంటున్నది అనేది ఒకటైతే.., రూపొందించుకున్న నిబంధనలన్నీ మనుషుల కోసమా లేక నిబంధనలు నిబంధనల కోసమేనా అన్న అనుమానం కలుగుతున్నది.

ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభానికి ముందు నుంచి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమని పెద్ద ఎత్తున ప్రచారంతో హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇది విద్యార్థులను అప్రమత్తంగా ఉంచ డం కోసం, ఇతరత్రా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూడటం కోసం అని అందరూ అర్థం చేసుకున్నారు. ఇంటర్ ద్వితీయ పరీక్ష రోజు ఓ కాలేజీ ఆవరణలో ఇంటర్ పరీక్షల తీరు తెన్నులను, విద్యార్థుల అవస్థలను ఓ టీవీ ఛానెల్ ప్రసా రం చేసింది. అందులో.. పరీక్షా కేంద్రం ఉన్న కాలేజీ ఆవరణ చాలా పెద్దది. ఆ కాలేజీ మెయిన్ గేట్ నుంచి పరీక్ష హాల్ ఉన్న బిల్డింగ్ కనీసం కిలోమీటర్ దూరం ఉన్నట్లున్నది.

పరీక్ష రాసే విద్యార్థిని మెయిన్ గేట్ నుంచి పరుగెత్తు తూ పరీక్ష హాలు దగ్గరకి చేరుకునే సరికి నిమిషం లేట్ అయ్యావని.. గేట్ మూసేశారు. గేటు తెరువాలని ఆ అమ్మాయి ఎంత బతిమిలాడినా ఎవరూ పట్టించుకోలేదు. నెత్తీ నోరు కొట్టుకున్నా గేట్ కీపర్, అక్కడున్న పరీక్షా నిర్వాహకులు కనికరించలేదు. దాంతో ఆ విద్యార్థిని ఏడుపు వర్ణానాతీతం. రెండేళ్లు కష్టపడి చదివిందంతా వృథా కావడం పట్ల ఆ విద్యార్థి ఆవేదన అంతులేనిది. ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. టీవీలో చూస్తున్న వారికే హృదయం తరుక్కుపోయే దృశ్యం. కానీ.. అక్కడున్న పరీక్షా నిర్వాహకులు మాత్రం అదేమీ పట్టనట్లు వ్యవహరించడం అమాను షం. అంతకుమించీ.. ఆ అమ్మాయి రెండేళ్లు కష్టపడి చదివి, భవిష్యత్తుపై కోటి ఆశలతో పరీక్షలకు హాజరువుతున్నప్పుడు చివరి క్షణంలో ఇలా పరీక్ష రాయకుండా అడ్డుకుంటే.. అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుంది?

ఇంటర్ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో జరుగుతాయి. హైదరాబాద్‌లాంటి మహానగరంలో పరీక్షా కేంద్రం తెలుసుకోవడమే పెద్దపని. దాన్ని తెలుసుకుని పరీక్షా సమయానికి చేరుకునేందుకు బస్సులు, ఇతర ప్రయాణ సాధనాలపై ఆధారపడి అక్కడికి చేరుకోవడమే పెద్ద పరీక్ష. ఈ క్రమంలో ఎవరికో ఒకరికి నిమిషం ఆలస్యమైతే.. అదే పెద్ద నేరంగా చేసి పరీక్ష రాయకుండా అడ్డుకోవడం ఎంత మేరకు సబబు? ఈ క్రమంలో.. చట్టాలు చట్టాల కోసం కాదు, నిబంధనలు నిబంధనల కోసం కాద నీ.., అవన్నీ మనుషుల కోసమనీ అర్థం చేసుకునే వారేరి?
ఇక ముజఫర్‌పూర్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. అదికారుల తీరు అమానవీయమంటూ.. స్వచ్ఛంద సంస్థలు ఆందోళన చేస్తేగానీ ఆర్మీ అధికారులకు తాము చేసిందేమిటో తెలిసిరాలేదు.

విషయమేమంటే.. సైనికుల నియామకం కోసం ఆర్మీ అధికారులు ముజఫర్‌పూర్‌లో ప్రవేశపరీక్ష నిర్వహించారు. దానికోసం వందలాదిగా తరలివచ్చిన ఉద్యోగార్థులను కాపీ కొట్టడం, చూచిరాతలు, ఇతరత్రా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా చేయడం కోసం వారందరినీ బట్టలిడిసి అండర్‌వేర్ (డ్రాయర్)పైనే పరీక్ష రాయాలనే నిబంధన విధించారు. దీంతో ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న 1100మంది యువకులు డ్రాయర్‌తోనే మైదానంలో కింద కూర్చొని పరీక్ష రాశారు. ఆ పరిస్థితుల్లో వారు ఎంత మానసిక ఆందోళనకు గురై ఉంటారు? మానసికంగా ఎంత కుంగిపోయి ఉంటారు? అలాంటి స్థితిలో ఎవరైనా ప్రశాంతంగా పరీక్ష రాయగలరా? అసలు అలా నిబంధనలు, నియంత్రణలు విధించేటప్పుడు ఉన్నతాధికారుల ఆలోచనాసరళి ఏమిటై ఉంటుంది?

ఇక్కడే సాధారణంగా ఉన్న మానవ నైజాన్ని గురించి చెప్పుకోవాలి. ప్రతి ఒక్క రూ తామున్న, సాధించిన స్థానం గొప్పదని భావిస్తుంటారు. ఇతరులెవరైనా ఆ స్థానాల్లోకి రావాలంటే.. అసాధారణ ప్రతిభా పాటవాలు ఉండాలంటూ.., తాము అలాంటి అసాధారణ వ్యక్తులమని చాటుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ ఆధిక్యతా భావంలోంచే..విద్యార్థులను, ఉద్యోగార్థులను హీనంగా చూడటం, వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించటం జరుగుతున్నది. పోటీ పరీక్షలంటేనే వడపోత సాధానాలై పోయిన పరిస్థితుల్లో వడపోత కోసం ఎంతటి కఠినాతి కఠినమైన పరీక్షలు పెట్టడానికైనా, అమానవీయ పద్ధతులు అవలంబించడానికైనా వెనుకాడటం లేదు. ఇది ఎంతో ఉన్నత చదువులు చదువుకున్నామని చెప్పుకుంటున్న ఉన్నతాధికారులే చేస్తున్నారు. దీనివెనుక ఉన్నది ఉద్యోగార్థులను తక్కువ వారుగా, నీచంగా చూడటం అనే అమానవీయ దృక్పథమే.

ఈ నేపథ్యంలోనే.. ఒకసారి మన రాష్ట్రంలో నిర్వహించిన పోటీ పరీక్షల పరిస్థితి చూస్తే.. గతంలో పోలీస్ ఎస్సై నియామకాల కోసం ఉద్యోగార్థులకు ఐదు కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహించేవారు. ఈ పరుగు పందెంలో ఎంతో మంది మార్గ మధ్యంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలిన వారూ ఉన్నారు. ఈ క్రమంలో నోటిఫికేషన్లు పడ్డప్పుడల్లా ఇలాంటి పరుగు పందెంలో చనిపోవడం పరిపాటైంది. చివరికి.. దీనిపై పెద్ద దుమారం రేగడంతో ఉన్నతాధికారులు దాన్ని రద్దు చేసి 100, 800మీటర్ల పరుగు పందెంగా మార్చారు. ఈ పరుగు పరీక్ష నెగ్గడానికి 15 సెకన్లు, 170సెకన్లు నిర్ణయించారు. ఇది కూడా చాలా సంక్లిష్టమైనదే. ఇదిలా ఉంటే.. సింగరేణిలో భూగర్భంలో బొగ్గు తవ్వే సాధారణ కూలీ నియామకాల కోసం కూడా అభ్యర్థులకు కిలోమీటర్ల దూరం పరుగు పందెం నిర్వహించేవారు. ఇలాంటి కఠినాత్మకమైన పరీక్షలు ఎందుకు నిర్వహిస్తారో, దానికి సహేతుకత ఏంటో ఎవరూ చెప్పరు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్న సందర్భంగా పోలీస్ శాఖ కానిస్టేబుల్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిం ది. వందల సంఖ్యలో ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం లక్షల సంఖ్యలో ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్ కాగా.. వేల సంఖ్యలో డిగ్రీ, పీజీలు చేసిన వారు, పీహెచ్‌డీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మీద ఉద్యోగాలు వందల్లో ఉంటే.. ఉద్యోగార్థులు లక్షల్లో దరఖాస్తు చేసుకుంటున్న తీరు కనిపిస్తున్నది. ఇది నిరుద్యోగ తీవ్రతను తెలియజేస్తున్నా.., వీరందరికీ పరుగు పందాలో, మరొకటో పోటీ నిర్వహించి జల్లెడ పట్టే విధానం అనుసరించడం అమానుషం, అశాస్త్రీయం.

ఇక ఉద్యోగ నియామకాల కోసం జరుగుతున్న పోటీ పరీక్షల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దేనికీ శాస్త్రీయత, హేతుబద్ధత ఉండదు. ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిగా అటెండర్ ఉద్యోగానికి కూడా ప్రాచీన భారత చరిత్ర నుంచి భార త రాజ్యాంగం దాకా, ఆర్థమెటిక్స్ పేర రీజనింగ్, మాథమేటిక్స్ పేపర్ ఎంతో కఠినాత్మకంగా పరీక్షపేపర్ ఉంటుంది. ఓ అటెండర్ ఉద్యోగానికి, రాజ్యాంగం, భారతీయ, ప్రపంచ చరిత్ర పరిజ్ఞానికి సంబంధం ఏమిటో ఎవరూ చెప్పరు. ఇలాంటి కఠినాత్మక పరీక్షలన్నీ లక్షల్లో ఉన్న ఉద్యోగార్థులను జల్లెడ పట్టడం కోసమే తప్ప మరో ప్రయోజనం, అర్థం లేదని వేరే చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు ఫిట్‌నెస్ పేరుతో జరుగుతున్న వన్నీ పాతకాలపు బానిస పోటీలను తలపించేవిగా ఉండటం ఉన్నతాధికారుల్లో కిందిస్థాయి ఉద్యోగుల పట్ల ఉన్న తేలిక(చులకన) భావనకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఉన్నతాధికారుల పిల్లలు కూడా బొగ్గు తవ్వే కార్మికులుగా, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడితే ఇలాంటి పరీక్షలు నిర్వహించే వారేనా..? అనుమానమే.

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్నది. ఫిట్‌నెస్ పేర, పోటీ పరీక్షల పేర జరుగుతున్న హింసాత్మక పద్ధతులకు ఇకనైనా స్వస్థి పలకాలి. ఎంతో శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన సమయంలో ఫిట్‌నెస్‌ను సులువుగా తెలుసుకునే వీలున్నది. అయినా పరుగు పందాలను నిర్వహించి ప్రాణాలను తోడేయడం మానేయాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయడానికి వీలు లేని విధానాలను ఆచరణాత్మకంగా ఉండేట్లు చూడాలి. నిబంధనల పేర ఏళ్ల తరబడి చదివిన చదువులకు అన్యాయం చేయడం ఆపేయాలి.

1563

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Featured Articles