ఆకలి తీర్చని అభివృద్ధి..


Sun,February 14, 2016 12:05 AM

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్నది. ఈ స్థితి నుంచి దేశం బయటపడాలంటే.. ఇంటింటికీ ఇంటర్నెట్ అంటున్న పాలకులు ప్రతి ఇంట పాడి పంట అన్న నినాదంతో ముందుకుపోవాలి. అన్నం లేని అభివృద్ధి అమానవీయమైనది. కూడు, గూడుకు దూరం చేసే అభివృద్ధి విధానాల్లో మార్పురావాలి. మనిషి కేంద్రంగా, మానవ వికాసానికి దోహదం చేసేదిగా అభివృద్ధి ఉండాలి.

sama


మొన్న.. ఉల్లి కొరత. నిన్న.. కందిపప్పు కొరత. ఇలా ఏటా ఏదో ఒక నిత్యావసర సరకు విషయంలో కొరత ఏర్పడుతూనే ఉన్నది. చుక్కలంటుతున్న నిత్యావసర సరకుల ధరలతో జనం గగ్గోలు పెడతారు. ఆకాశాన్నంటుతున్న ధరలకు పాలక పక్షంపై ప్రతిపక్షాలు విమర్శనాస్ర్తా లు సంధిస్తాయి. ప్రభుత్వాలు ఏదో చర్యలు తీసుకుంటామంటాయి. కాలక్రమంలో కొరతకూ, పెరిగిన ధరలకూ జనం అలవాటు పడిపోతారు! కాలం సద్దుమనుగుతుంది. పెరుగుతున్న ధరలకు నిరసనగా మీడియాలో పెద్ద విమర్శనోద్యమ మే నడుస్తుంది. ధరల పెరుగుదల, నిత్యావసర సరకుల కొరత దశాబ్దాలుగా క్రమం తప్పకుండా వేధిస్తూనే ఉన్నది. ఇప్పటికైనా నిత్యావసర సరకుల ధరలు ముఖ్యంగా పప్పుదినుసులు, కూరగాయల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో, పరిష్కారాలేమిటో ఆలోచించాలి.

ఆధునిక ప్రపంచానిదంతా అభివృద్ధి మంత్రం. 1980వ దశకం నుంచి దేభాభి వృద్ధి బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్నది. అనేకానేక మౌలిక వనరులు, వసతుల కల్పన జరుగుతున్నది. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో అందుబాటులోకి వచ్చిన వస్తు సేవలు, ఐటీ సేవలు పల్లెను పట్నాలకు అనుసంధానం చేశాయి. ప్రపంచాన్ని కుగ్రామం చేశాయి. ఈ క్రమంలో మనం చాలాదూరం ప్రయాణం చేశాం. అటు పాలకులు, ఇటు ప్రజలు అభివృద్ధి జిలుగు వెలుగుల్లో తేలిపోతున్న సమయంలోనే అసలు సమస్య సాక్షాత్కరిస్తున్నది. కాలే కడుపు కోల్పోయిన దాని గురించి గుర్తు చేస్తున్నది.

అభివృద్ధిలో అన్నం లేమి కళ్లకు కడుతున్నది.మన ప్రభుత్వాలు అనుసరించిన విధానాల పుణ్యమాని వ్యవసాయ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.1960వ దశకంలో ప్రవేశపెట్టిన హరిత విప్లవం కారణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిన దుష్టాంతం తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, భవిష్యత్తరాల కోసం వ్యవసాయరంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి ముందుచూపు మన పాలకులకు లోపించింది. ఫలితంగా ప్రతి సంవత్సరం వ్యవసాయోత్పత్తులు తగ్గిపోతున్నా పట్టించుకోలేదు. దేశవ్యాప్తంగా చూసినా 50వ దశకం నుంచి క్రమంగా ప్రతిఏటా ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఎనభైయవ దశకం నుంచి ఇది మరింత వేగంగా పడిపోయింది. 1986-97 మధ్య కాలంలో ఆహారధాన్యాల వృద్ధిరేటు మూడు శాతం ఉంటే.. 1996-2008 మధ్య కాలంలో అది 0.93కి పడిపోయింది.

ఇక నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత.. 2013-14 సంవత్సరంలో 265.04 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు పండిస్తే.., 2014-15లో 251.12 మి.టన్నుల ధాన్యాలను పండించారు. అంటే.. 13.92 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు తగ్గుదల. బియ్యం కూడా ఈ సంవత్సరాల్లోనే 4.11 మి.ట. తగ్గిపోయాయి. ఇలాగే.. ఏటా.. గోధుమలు-5.07, తృణధాన్యాలు-2.87, చక్కెర-4.42 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గిపోయింది.

మన రాష్ట్ర విషయానికి వస్తే.. దీనికి భిన్నంగా ఏమీ లేదు. రాష్ట్రంలో కోటి 63 లక్షల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ఉంటే.., అందులో కోటి మూడు లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నారు. ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. వ్యవసాయం దండగన్న గత పాలకులు అనుసరించిన అభివృద్ధి విధానాల ఫలితంగా వ్యవసాయం పనికిరానిదైపోయింది. మన యువతకు వ్యవసాయం జీవనవృత్తిగా గాక, రియల్ ఎస్టేట్ మాత్రమే వృత్తి అయిపోయింది. మారుమూల పల్లెల్లోనూ పంటభూములను బీడు భూములుగా మార్చే రియల్‌ఎస్టేట్ భూతం విస్తరించింది. ఫలితంగా గత ఐదేళ్లలోనే ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం 34. 92 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. 2010-11లో సాగు విస్తీర్ణం 86.07లక్షల ఎకరాలు ఉంటే.., 2015-16 నాటికి 51.15లక్షల ఎకరాలకు కృశించింది. అంటే 34లక్షల 92వేల ఎకరాలు తగ్గింది.

పప్పుధాన్యాల సాగు 2010-11లో 18.92 లక్షల ఎకరాలుంటే, 2015-16లో 11. 37లక్షల ఎకరాలకు తగ్గింది. అంటే ఏడు లక్షల 55 వేల ఎకరాలకు పడిపోయింది. కందిపప్పు 2010-11లో లక్షా 51వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయితే, 2015-16లో లక్షా మూడువేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయ్యింది. ఈ విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రతి సంవత్సరం తగ్గిపోతున్న ఫలితం ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావాన్ని కలుగజేస్తున్నది. ముఖ్యంగా గ్రామీణ, పేద ప్రజానీకం ఆకలి తీర్చుకోలేని దయనీయ స్థితికి నెట్టేయబడుతున్నారు. ఉదాహరణకు 1951లో రోజుకు ఒక మనిషి 60 గ్రాముల పప్పుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే.., అది 2011నాటికి 40 గ్రాములకు తగ్గిపోయింది. ఈ విధంగా తీసుకునే ఆహారం కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయి ప్రజలంతా అర్ధాకలితో అలమటించే రోజులొచ్చాయి.

ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతంలోని 30 శాతం మంది పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారు. గ్రామీణ స్త్రీలలో 60 శాతానికి పైగా పౌష్టికాహార లోపం, రక్తహీనతతో పీడింపబడుతున్నారు. ఇక చిన్నపిల్లలు, విద్యార్థులు అయితే తక్కువ బరువు, పౌష్టికాహార లోపం, విటమిన్-ఏ లోపంతో సగానికి సగం మంది బాల బాలికలు బాధపడుతున్నారు. ఇలా ప్రతి ఏటా ప్రభుత్వాలు చేస్తున్న అధ్యయనాల ప్రకారమే.. ప్రజలు తీసుకుంటున్న ఆహార పరిమాణం క్రమంగా తగ్గిపోతున్నది. ఈ స్థితి అనేకానేక సామాజిక పరిణామాలకు దారితీస్తున్నది. రోగ నిరోధక శక్తి తగ్గి గ్రామీణ, పట్టణ ప్రజానీకమంతా రోగగ్రస్థ సమాజంగా మారిపోతున్నది.

ప్రభుత్వ లెక్కల ప్రకారమే నేటికీ జనాభాలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశాభివృద్ధికి వ్యవసాయమే కీలకమనీ, దేశానికి రైతే వెన్నెముక అని ఎన్ని చెప్పుకున్నా వ్యవసాయం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నదన్నది తేటతెల్లం అవుతన్నది. ప్రతి ప్రణాళికలోనూ గణాంకాల్లో కేటాయింపులు జరుగుతున్నా, వ్యవసాయ రంగానికి సబ్సిడీలు కేటాయిస్తున్నట్లు చెబుతున్నా ఆ నిధులు ఏ మాత్రం వ్యవసాయరంగాన్ని రక్షించలేకపోతున్నాయి. దీనికి రైతుల ఆత్మహత్యలే తార్కాణం. దీనికంతటికీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అండగా నిలవకపోవడం మూలంగానే జరుగుతున్నదని సామాజిక శాస్త్రవేత్తలతో సహా, స్వామినాథన్ కమిటీ కూడా తెలిపింది. అమెరికాలో వ్యవసాయంపై కేవలం ఐదు శాతం మంది ఆధారపడి జీవిస్తుంటే.. ప్రతి ఎకరాకు అక్కడ 32 డాలర్ల సబ్సిడీ ఇస్తున్నారు. చైనాలో 24శాతం మంది ఆధారపడి ఉంటే.. అక్కడ 30 డాలర్లు సబ్సిడీగా ఇస్తున్నారు. జపాన్‌లో వ్యవసాయంపై నాలుగు శాతం మంది ఆధారపడి ఉంటే అక్కడ 35 డాలర్లు సబ్సిడీగా ఇస్తున్నారు.

అదే మన దేశంలో 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటే.. ప్రతి ఎకరాకు 14 డాలర్లు సబ్సిడీ ఇస్తున్నారు. అంటే కేవలం రెండు శాతం అన్నమాట. మరోవైపు గ్రామీణ భారతంలో నిరుద్యోగం పెరిగిపోతున్నది. వ్యవసాయమే జీవనవృత్తిగా జీవిస్తున్న వారి చేతుల్లోంచి భూమి పరాయిపాలు అవుతున్నది. 1973-74లో గ్రామాల్లో భూమిలేని వారు 25.1 శాతం ఉంటే.., 1993-94 వచ్చే నాటికి అది 38.7 శాతానికి పెరిగింది. అదే 2004-05 సంవత్సరానికి 43.1 శాతానికి చేరుకున్నది. అంటే గ్రామాల్లో సగం మంది భూమిలేని వారుగా, దినకూలీలుగా మారిపోయిన స్థితి ఏర్పడింది.

ఒకవైపు దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా.. అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్ర రూపం దాలుస్తున్నది. ఈస్థితి నుంచి దేశం బయటపడాలంటే.. ఇంటింటికీ ఇంటర్నెట్ అంటున్న పాలకులు ప్రతి ఇంట పాడి పంట అన్న నినాదంతో ముందుకుపోవాలి. అన్నం లేని అభివృద్ధి అమానవీయమైనది. కూడు, గూడుకు దూరం చేసే అభివృద్ధి విధానాల్లో మార్పురావాలి. మనిషి కేంద్రంగా, మానవ వికాసానికి దోహదం చేసేదిగా అభివృద్ధి ఉండాలి.

వస్తూత్పత్తి, వినియోగం పట్ల ఉన్న శ్రద్ధ, మోజు జీవనాధార పంటలపై పెట్టాలి. ఆహారపంటలు పండించే రైతులే అన్నమో రామచంద్ర అనే దుస్థితిపోవాలి. సామాజిక అభివృద్ధి ఫలాలు పల్లె ప్రజలకు అందేట్లు చేయడంతో పాటు, పల్లె వికాసానికి మూలాధారమైన వ్యవసాయరంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఇతోధిక ప్రోత్సాహకాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. జీవనాధార ఆహారపంటలను ప్రోత్సహించి గిట్టుబాటు ధరలు కల్పించాలి. ఈ విధమైన వ్యవసాయ ప్రోత్సాహక విధానాలతోనే.. దేశాన్ని ఆకలి బాధలనుంచి విముక్తి చేయవచ్చు. ఆహార పదార్థాల కొరతను తీర్చి అందరికీ ఆరోగ్యాన్నీ, ఆనందాలను పంచవచ్చు. ఇదే మన భవిష్యత్తు బంగారు బాట.

1374

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప