ప్రకృతి సేద్యమే పరిష్కారం


Sun,January 10, 2016 01:54 AM

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి చూస్తే అశాస్త్రీయమవుతుంది. వ్యవసాయానికి వ్యాపార పంటలు పునాది కాకుండా.., ఆహార పంటలు కేంద్రం కావాలి.జీవనాధార ఆహార పంటల సేద్యమే వ్యవసాయంగా భావించాలి.ప్రకృతి, భూమిని సంరక్షించడంతో పాటు పోషిస్తూ సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు వేయాలి.

sama


ఆధునికాభివృద్ధి ఫలితంగా గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ఊరూరుకు రోడ్డు పేర బాహ్య ప్రపంచంతో అవినాభావ సంబంధం ఏర్పడింది. గతంలో ఏ గ్రామానికా గ్రామం స్వయం సం పూర్ణ ఆర్థిక, జీవన విధానంతో ఉన్న గ్రామాలు ఇవాళ..మార్కెట్‌తో అనుసంధానింపబడటమే కాదు, మార్కెట్‌పై ఆధారపడ్డవిగా మారిపోయా యి. గ్రామీణ జీవితంలో వచ్చిన, వస్తున్న మార్పులతో పల్లె జీవితం అతలాకుతలం అవుతున్నది.
ఈ క్రమంలో గ్రామాలు ఎలా ఉన్నాయి? గ్రామాల్లో ఏం జరుగుతున్నది? రైతులు ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతున్నారు? అనేక రకాల అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఏదో మేర ఊరుదాకా చేరుతున్నా.. రైతు ఎందుకు ఒంటరై ఉరితాడుకు వేలాడుతున్నాడు? ఇట్లాంటి అనేకానేక ప్రశ్నలతో ఇవ్వాళ గ్రామీణ జీవితాన్ని అర్థం చేసుకోవడం సంక్లిష్ట విషయమైపోయింది.

ఈ నేపథ్యంలోనే అనేక అధ్యయనాలు, సర్వేలు జరిగాయి. నివేదికలెన్నో వచ్చి అనేక విషయాలను వెలుగులోకి తెచ్చాయి. సామాజిక శాస్త్రవేత్తలు వ్యవసాయ సంక్షోభాన్ని గురించి అధ్యయనాలతో ఎన్నో సూచనలు చేశారు. గిట్టుబాటు ధరలు మొదలు.., సాగునీటి అవసరాలు, దిగుబడులు- రాబడుల మధ్య అంతరాలు, అప్పులు.. అంతిమంగా ఆత్మహత్యల దాకా సంక్షోభ నివారణకు చేసిన, చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్నా రైతు ఆత్మహత్యలు ఆగిపోయినట్లుగా గానీ, కనీసం తగ్గుముఖం పట్టినట్లుగా గానీ కనిపించడం లేదు. వాస్తవంగా గ్రామీణ పల్లె జీవితంలో అంతర్లీనంగా ఏం జరుగుతున్నదో అంతుపట్టని విషయమైపోయింది. గోరటి వెంకన్న పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్ర ల.. పాటలో చెప్పినట్లుగా గ్రామీణ కులవృత్తులు నశించిపోయిన ఒక వాస్తవ చిత్రం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా.. వ్యవసాయరంగం, మొత్తంగా గ్రామీణ భారతాన్ని అంతర్గతంగా తొలిచేస్తున్నదేదో అర్థం కాని చిక్కుముడిగా ఉంటున్నది.

ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వ గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కు చెందిన జాతీయ నమూనా సర్వే నివేదిక గత డిసెంబర్ 4న వెలువరించింది. ఈ శాఖ గత ఆరు దశాబ్దాలుగా అధ్యయనాలు, సర్వేలు చేస్తూ కార్యక్రమాల అమలుకు దిశానిర్దేశం చేస్తున్నది. ఈ క్రమంలోనే భారతదేశంలో వ్యవసాయ కుటుంబాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు పేరుతో 70వ సర్వే నివేదిక వెలువరించింది. ఈ సర్వే ప్రకారం గ్రామీణ భారతంలో వ్యవసాయ కుటుంబాల సంఖ్య తొమ్మిది కోట్ల రెండు లక్షలు ఉండగా.. జనాభా 46కోట్ల రెండు లక్షలు. గ్రామీణ మొత్తం కుటుంబాల సంఖ్య 15కోట్ల 61 లక్షలు కాగా.. జనాభా 74 కోట్ల 24 లక్షలు అని తెలిపింది. అంటే గ్రామీణ భారతంలో చేసుకోవడానికి భూమి లేక, దినకూలీలుగా ఆరున్నర కోట్ల కుటుంబాలు, 30కోట్ల జనాభా ఉన్నదని ఆ సర్వే తెలిపింది.

అలాగే.. గ్రామాల్లో భూ కమతాల వారీగా వ్యవసాయం గురించి చెబుతూ.. రెండు నుంచి నాలుగు హెక్టార్ల లోపు భూములున్న చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కన్నా రాబడి తక్కువ ఉంటున్నదని తేల్చింది. ఫలితంగా నేడు గ్రామాల్లో చిన్న సన్న కారు రైతులంతా తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోతున్నారని తెలిపింది. దేశంలో నూటికి 70మందికి పైగా వ్యవసాయరంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ సంక్షోభాన్ని కేవలం వ్యవసాయరంగ సంక్షోభంగానే గాక సమాజ సంక్షోభంగా భావించాలి.

గ్రామాల అధ్యయనం గురించి ఎన్.వేణుగోపాల్ రాసిన ఊరుదారి గ్రామ అధ్యయనానికి ఓ వెలుగు దారి చూపిస్తున్నా.. ఆ స్థాయిలో అధ్యయనం చేయడానికి ఎంతో నేర్పు, ఓర్పు అవసరం. అంతకు మించి మ్యాన్ పవర్ అవసరం. ఆ స్థాయి లో అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఇరవైఐదు వ్యవసాయ కుటుంబాలున్న ఒక చిన్న గ్రామాన్ని యూనిట్‌గా ఎంచుకుని అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయనానికి ఇరవై ఏళ్ల అంతరంలో మానవ జీవితాన్ని ప్రాతిపదిక గా తీసుకుని ఆ గ్రామంలో మూడు తరాల మనుషుల జీవితాల్లో వచ్చిన మార్పులు, ఫలితాలను పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు అర్థమయ్యాయి. మనమంతా సాధారణంగా చెప్పుకుంటున్న అభివృద్ధిలోని డొల్లతనం తెలిసివచ్చింది.
మొదటితరంగా 1940 దశకం నాటి 25 రైతు కుటుంబాల్లో ముగ్గురు అక్షరజ్ఞానం ఉన్నవారు తప్పితే అందరూ నిరక్షరాస్యులు. అందరూ వ్యవసాయమే జీవనాధారంగా కుటుంబమంతా వ్యవసాయ పనుల్లోనే ఉన్నారు. 60 దశకం ఆరంభం దాకా మోటతోనే వరి పండించారు. మెట్టపంటలుగా సజ్జ, జొన్న, ఆముదం, వేరుశనగ, పెసళ్లు, కందులు, బొబ్బర్లు లాంటి తృణధాన్యాలన్నీ పండించారు.

అంతర పంటలుగా అన్ని రకాల కూరగాయలు పండించి, ఎప్పుడో కానీ అమ్మకానికి మార్కెట్‌కు తరలించేవారు. ఇంటికో పశువుల దొడ్డి, అరకటెడ్లు, పాడి పశువులు, మూడు నాలుగొందల పశు సంపదతో ఊరంతా కలకలాడింది. నిత్యావసర వస్తువులుగా బట్టలు, ఉప్పు, మంచి నూనె, కర్రు, పార లాంటి లోహ పరికరాలు బయటి మార్కెట్ నుంచి కొనాల్సినవే తప్ప అంతకు మించి మార్కెట్‌తో సంబంధం ఏమీ ఉండేది కాదు. నాడు అప్పు ఉండటం, చేయడం అంటే పెద్ద తప్పుగా భావించేవారు. వడ్లు, ఇతర ధాన్యాలు అప్పుగా నాగుకు విత్తనాలు అప్పుగా తెచ్చుకోవడమే నాటి రైతుల అప్పు. అదేక్రమంలో వ్యవసాయంలో వేసే రసాయన ఎరువులకు చేసే అప్పుగా మారి వెయ్యి, రెండువేల అప్పు చేయడంగా మారింది. ఊరు మొత్తం మీద 25 కుటుంబాల అప్పు వేలల్లో ఉంటే ఎక్కువ. ఎడ్ల బండ్లే ప్రయాణ సాధనాలు. బడికిపోయే పిల్లలకే సైకిళ్లు. ఊరు మొత్తం మీద ఐదారు సైకిళ్లు ఉండేవి. బండ్లబాట, డొంక, పానాదులే బాటలు. వ్యవసాయ పెట్టుబడులే తప్ప చదువులు, అనారోగ్యాల కోసం ఖర్చులు లేవనే చెప్పాలి. ఆ తరం మొత్తంలో క్యాన్సర్‌తో ఒకటే అకాల మరణం తప్ప అన్నీ సహజ మరణాలే.

1960 దశకం నాటి రెండో తరం వచ్చే నాటికి అయిదారుగురు తప్పితే అందరూ అక్షరాస్యులయ్యారు. వ్యవసాయంలో మోట స్థానంలో ఆయిల్ ఇంజిన్లు వచ్చాయి. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం క్రమంగా పెరగడం ప్రారంభమైంది. ఇద్దరు పది దాటి డిగ్రీ చదువుల దాకా చేరుకుని ఉద్యోగాలు చేసేదాకా ఎదిగారు. మిగతా అంతా పదో తరగతిలోనే ఇంటిముఖం పట్టి వ్యవసాయంలో ఇమిడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్షరజ్ఞానం వచ్చి వ్యవసాయంలో ఇమడలేని తనంతో జులాయి తనం పెరిగింది. డ్బ్భైల చివరి నాటికి కరెంటు వచ్చింది. ఆయిల్ ఇంజిన్ల స్థానంలో కరెంటు మోటార్లు వచ్చి కొంత భారం తగ్గినా వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల వాడకం పెరిగి అప్పులు సర్వసాధారణమైపోయాయి. అప్పులేని ఇల్లు లేకుండా అయ్యింది.
ఎనభైయవ దశకానికి చెందిన తరం వచ్చే నాటికి ఊరుకు రోడ్డు వచ్చింది.

యువ త అంతా రోడ్డెక్కి వ్యవసాయాన్ని వదిలేయడంతో వ్యవసాయం కునారిల్లిపోయింది. అరకటెడ్లు, పాడి పశువులు మాయమై పోయాయి. పశు సంపదంతా కనిపించకుండా పోయింది. మరోవైపు వ్యవసాయం అంటే వరి పంట మాత్రమే అయిపోయింది. చెల్కపంటలో తృణధాన్యాలు పండించడం పూర్తిగా తగ్గిపోయి ఎక్కువ లాభాలు వస్తాయని పత్తి పంట మాత్రమే పండించే స్థితి వచ్చింది. అంటే జీవనాధార ఆహార పంటల స్థానంలో వ్యాపార పంటలు వచ్చాయి. చదువుకున్న యువత అంతా వ్యవసాయం చేయడాన్ని తక్కువ పనిగా భావించే స్థితి వచ్చింది. వృద్ధతరం తప్ప యువతరంలో వ్యవసాయాన్ని జీవికగా, వృత్తిగా చేసుకున్న వారు తక్కువ కానే కాదు లేరనే చెప్పవచ్చు.

దీంతో అంతా పట్నం పట్టి లారీలు, బోరు బండ్లపై పనిచేయడం, అప్పు లు చేసి వాటిని కొనడం పరిపాటి అయ్యింది. ఇంటికో పాడి పశువు బదులు ఇంటికో హీరోహోండా వచ్చింది. ఇల్లువదిలి దేశాలు తిరిగే క్రమంలో హెచ్‌ఐవీ ఇద్దర్ని బలిగొన్నది. యాక్సిడెంట్లు మరో ఇద్దర్ని బలితీసుకున్నాయి. నగర జీవితానికి అలవాటు పడ్డ వారు ఉన్న భూమిని అమ్మి నగరంలో ఇల్లుకట్టుకుని నాగరికులమయ్యామని మురిసిపోయారు. ఈ క్రమంలో ఏ పనీ పాటా లేకుండా తిరిగే వారికి చెప్పుకోవడానికి రియల్ ఎస్టేట్ అనేది వృత్తిగా చెలామణి అవుతున్నది. అంతిమంగా చూస్తే.. పై పై మెరుపుల జీవితమంతా అప్పుల కుప్పగా తయారైంది.

ఈ 25 కుటుంబాల మూడు తరాల పరిణామ చరిత్ర గ్రామీణ భారతంలో జరిగిన విధ్వంసానికి, పరాయీకరణకు అద్దం పడుతున్నది. జీవనాధార ఆహార పంటల వ్యవసాయం అనేది మార్కెట్ ఆధారిత వ్యాపార పంటలమయం కావడంలోనే రైతు పరాధీనతకు పునాది పడింది. మార్కెట్ మాయాజాలంలో వ్యాపార పంటగా పత్తి పండించిన రైతు చిత్తయిపోయాడు. తరతరాలుగా జీవన సంస్కృతిగా ఉన్న వ్యవసాయ హీనమైనదిగా భావించే దుస్థితిలోనే వ్యవసాయ సంక్షోభానికి మూలం ఉన్నది. మరోవైపు కాలానుగుణంగా వస్తున్న మార్పుల్లో భాగంగా అనవసర వస్తువుల వినియోగం ఎక్కువైపోయి ఖర్చుల భారం పెరిగిపోయింది. గ్రామాల దాకా పాకిన వస్తుమయ, వినిమయ సంస్కృతి అనైతికతను పెంచి పోషించడమే కాదు, మనిషిని ఒంటరిని చేసింది.

ఇలాంటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి చూస్తే అశాస్త్రీయమవుతుంది. వ్యవసాయానికి వ్యాపార పంటలు పునాది కాకుండా.., ఆహార పంటలు కేంద్రం కావాలి. జీవనాధార ఆహార పంటల సేద్యమే వ్యవసాయంగా భావించాలి. ప్రకృతి, భూమిని సంరక్షించడంతో పాటు పోషిస్తూ సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు వేయాలి. అలాగే ప్రభుత్వాలు కూడా రైతుకు అన్ని విధాలా బాసటగా నిలవాలి. అగ్రరాజ్యం అమెరికా రైతులకు సాలీన లక్షా 30 వేల కోట్ల డాలర్ల సబ్సిడీ ఇస్తూ వ్యవసాయ రంగాన్ని సంరక్షిస్తున్నది. అదే మన దేశంలో వ్యవసాయ సబ్సిడీల గురించి మాట్లాడితే.. అదేదో అనవసర ఖర్చుగా భావించే దుస్థితి ఉన్నది. ఆధునిక వ్యవసాయ పరికరాలు, అవసరాలు కనీసం 70 శాతం సబ్సిడీతో అందించి వ్యవసాయాన్ని ఆధునీకీకరించడంలో రైతుకు ప్రభుత్వాలు అండగా నిలవాలి. అన్ని రకాల ఆహార పంటలు, తృణధాన్యాలు పండిస్తూ ప్రకృతి సేద్యాన్ని అలవర్చుకోవడమే నేటి వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారంగా ముందుకు సాగాలి.

1697

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 3, 2016 12:53 AM

ఓదార్పులేని ఒంటరితనం..

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్ప

Featured Articles