ఓదార్పులేని ఒంటరితనం..


Sun,January 3, 2016 12:53 AM

వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగంలేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్పటికైనా మానవీయ సమాజం దిశగా ఆలోచించాలి. హైటెక్ అభివృద్ధి మార్గంలో దూసుకుపోతున్న భారతీయ సమాజంలో నెలకొన్న అమానవీయతను రూపుమాపేందుకు ఓ సామాజికోద్యమమే అవసరం ఉన్నది.

sama


అభివృద్ధి సంగతేమో కానీ.. మన సమాజం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నదని ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చెబుతున్నాయి. సినీ నటు డు రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఒక్కసారిగా తెలుగు సమాజాన్ని కుదిపేసింది. ఎక్కడ చూసినా ఆ ఘటన మీదే చర్చ సాగుతున్నది. ఎల్లప్పుడూ ఎంతో ఉత్సాహంగా, చైతన్యవంతంగా ఉంటూ.., సామాజిక కార్యక్రమాలు, ఉద్యమాల్లో యువకులతో పోటీ పడి ముందుండే ఓ 90 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధు డు రంగనాథ్ ఘటనపై తీవ్రంగా కలత చెందారు. ఏ పరిస్థితితుల్లోనైనా.. ఒక మనిషికి ఇలాంటి దుస్థితి రావడం మనుషులన్న వారిని ఆలోచింపజేయాలని అన్నారు. అలాగే ఈ సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించలేకపోతే.. రాబోయే రోజుల్లో మన సమాజం అమానవీయతకు ఆలవాలంగా మారిపోయే పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వృద్ధాప్యం మనిషికి శాపంగా మారే పరిస్థితి మన సమాజ గమనంలోని డొల్లతనాన్నే కాదు, నేటి సామాజిక సంక్షోభాన్ని చెప్పకనే చెబుతున్నదన్నారు. మానవ సంబంధాలు ప్రశ్నార్థకం కావడం నేటి సమాజ పోకడలే అయితే.. వాటిపై అందరూ ఆలోచించాల్సిందేనని అన్నారు.

రంగనాథ్‌కు ఇద్దరు బిడ్డలు. కూతురు, కుమారుడు. ఇద్దరూ బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేస్తూ వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆయనకు ఆర్థిక సమస్యలతో పాటు ఇతరత్రా సమస్యలు న్నట్లుగా కూడా లేదు. అయినా.. ఒంటరివాడై హృదయంలేని ఈ కాంక్రీట్ జంగల్‌లో దిక్కులేని ఒంటరి పక్షి అయి కాసింత ప్రేమాద రణ కోసం తపించాడు. అదీ అందక.. కనుచూపు మేరలో కనిపించక బలవంతంగా జీవి తం నుంచి విరమించుకున్నాడు. బలవన్మరణాన్ని కొనితెచ్చుకున్నాడు. ఇవ్వాళ రంగానథ్ ఒక్కరే బాధితుడు కాదు. నేడు వీధికొకరు.., ఇంటికొకరుగా అలాంటి నిర్భాగ్యులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందరూ ఉంటారు. కొడుకులూ, కూతుళ్ల సదువు సంధ్యలు అయిపోతాయి. పెద్ద ఉద్యోగాలు చేస్తూ.. ఎక్కడెక్కడో స్థిరపడతారు. అన్ని బాధ్యతలూ తీరుతాయి. ఇక అన్ని సమస్యలూ తీరాయనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా అతిపెద్ద సమస్య మీద వచ్చి పడుతున్నది. అదే ఒంటరితనం.

అందరూ ఉండి ఎవరూలేని అనాథలుగా మిగులుతున్నారు. సమకాలీన సామాజికాభివృద్ధి ఫలాలను అందిపుచ్చుకున్న మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాలతో పాటు అన్నివర్గాల వారూ ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. చదువులు, ఉద్యోగాలు అంటే.. అమెరికాలోనే అయిపోయిన పరిస్థితి ఒకటైతే, పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఉన్నత ఉద్యోగాలకు పంపడమనేది కూడా ఇవ్వాళ తల్లిదండ్రులు ఒంటరిగా మిగలడానికి కారణమవుతున్నది. మొత్తంగా చూస్తే.. నేటి ఆధునిక సమాజంలో తల్లిదండ్రులుగా, వృద్ధులుగా.. కన్న కడుపుకే భారమై పోయే కలికాలం దాపురించింది. దీనికి ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. పల్లె, పట్నం అనేతేడా లేకుండా సర్వత్రా ఎన్ని దీనగాథలైనా చెప్పుకోవచ్చు. అన్నీ ఉండి కూడా నా అన్నవారు లేక అలమటిస్తున్నవారు ఎందరో. మాట మాత్రంగా ప్రేమను పంచే వారులేక ప్రాణాలు తీసుకుంటున్న స్థితి నేటి సమాజ రోగగ్రస్థ దుస్థితికి నిదర్శనం.

అయితే ఇది ఒక్క మన దేశంలోనే ఉన్న సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలన్నింటా ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. కన్నబిడ్డలు రెక్కలొచ్చి ఎగిరిపోయిన తర్వాత.. గూడు చెదిరిన పక్షుల్లా అలమటించే వృద్ధ తరానికి కావాల్సింది సమాజం నుంచి కాసింత ప్రేమాదరణ, రక్షణ. కానీ ఈ సమస్యను సామాజిక సహజ విషయంగా చూసి, అర్థం చేసుకుని వ్యవస్థీకృతంగా సామాజికంగా పరిష్కారం చేసే ప్రయత్నం ఎక్కడా జరగడంలేదు. ప్రధానంగా అభివృద్ధి చెందిన యూరప్, అమెరికా, ఇంగ్లండ్ లాంటి పెట్టుబడి దారీ దేశాల్లో దీన్నొక మానవీయ, సామాజిక విషయంగా గుర్తించకుండా వ్యక్తుల సమస్యగా పరిగణించారు. వృద్ధతరాన్ని సంరక్షించే సామాజిక బాధ్యత నుంచి తప్పుకున్నారు. ఫలితంగా ఈ దేశాల్లో వృద్ధులు తీవ్రమైన సామాజిక నిర్లక్ష్యంతో అభద్రతకు లోనయ్యారు. దీంతో లక్షల సంఖ్యలో మానసిక ఒత్తిడులతో రోగగ్రస్థులయ్యారు.

స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి, వ్యక్తిగత భద్రత గురించి గొప్పలు చెప్పే పెట్టుబడిదారీ సమాజం వృద్ధుల సమస్యను గాలికొదిలేసి మానవ వికాస చరిత్రకు ఎనలేని అన్యాయం చేసింది. తీరని వ్యథను మిగిల్చింది. ఈ నేపథ్యంలోంచే.. అభివృద్ధిచెందిన దేశాలన్నింటా పిచ్చివాళ్లకోసం ప్రత్యేక జైళ్లు తెరిచారు. వారు (ఇక్కడమనం) ముద్దుగా వృద్ధాశ్రమాలని పిలుచుకుంటున్నవన్నీ అనాథాశ్రమాలే. మరో అర్థంలో వృద్ధులు నిర్బంధింపబడ్డ జైళ్లే. యాంత్రికమైన పెట్టుబడిదారీ వ్యవస్థ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, ప్రత్యామ్నాయ మానవసంబంధాల పూనికకు, మానవీయ సామాజ నిర్మాణానికి మార్గం వేయలేకపోవడం ఫలితంగానే ఇంతటి సామాజిక విధ్వంసం, విషాదం.
మనతో పోలిస్తే.. జీవన ప్రమాణాలు ఎంతో మెరుగ్గా ఉండే అభివృద్ధి చెందిన దేశాల్లోని పెద్దలు, వృద్ధుల పరిస్థితే అలా ఉంటే.. ఇక మనదేశంలో వృద్ధుల దుస్థితి దయనీయం.

కాలే కడుపుకు పిడికెడు అన్నం పెట్టలేక స్మశానంలో వదిలేస్తున్న కన్నకొడుకులున్న చోట.., పెద్దల బాధ్యతను భారంగా భావిస్తున్న వారు ఎంతో మంది. లేదా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పించి చేతులు దులుపుకుంటూ.. పెద్ద వారి కోసం తమ భవిశ్యత్తును పణంగా పెట్టలేం కదా అంటున్న డాలర్ బాబుల లోకం ఇది. ఇలా వ్యక్తిగతంగా తీసుకుని బాధ్యతల గురించి ఎంత చెప్పుకున్నా.. గోడమీది నీతి సూత్రా లు వల్లించిన చందమే అవుతుంది.చరిత్రలో తల్లిదండ్రులు, వృద్ధులకు ఇవ్వాల్సిన స్థానం, గౌరవం గురించి పురాణ ఇతిహాసాలూ, మత గ్రంథాలు ఎన్ని చెప్పినా వాస్తవంలో జరిగింది శూన్యం. రేణుకా ఎల్లమ్మను చెరబట్టిన పరశురాముని నుంచి.. రాజ్యాధికారం కోసం తండ్రులను వధించిన ఫ్యూడల్ రాజుల దాకా... చరిత్ర పొడవునా వృద్ధతరానికి దక్కాల్సిన గౌరవం దక్కలేదనే చెప్పాలి.

మానవ వికాస చరిత్రలో మానవానుబంధాలకు ప్రాధాన్యమిచ్చి వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా,బాధ్యతగా గుర్తించిందీ, ఆ క్రమంలో ఎంతో కొంత చేసి సాంఘికంగా మంచి ఫలితాలు సాధించిందీ.. సామ్యవాద వ్యవస్థలు మాత్రమే. సామ్యవాద వ్యవస్థలు నెలకొన్న సమాజాల్లో వృద్ధులు,పెద్దల రక్షణ, పోషణకు అత్యధిక ప్రాధాన్యమివ్వడమే కాదు, ఆయా వ్యవస్థల్లో ఆ బాధ్యతను సమాజమే తీసుకున్నది. వారికోసమే ప్రత్యేకంగా రిక్రియేషన్ క్లబ్బులు ఏర్పాటు చేశారు. వృద్ధుల అనుభవాన్ని, మేధస్సును నడిచి వచ్చిన సామాజపు తరగని గనిగా భావించడమే కాదు, గౌరవించారు. తగు రీతిలో వారికి సామాజిక గౌరవం,ప్రాధాన్యమిచ్చి పోషించి సరికొత్త మానవ సంబంధాలు, అనుబంధాలకు కొత్త అర్థాన్ని చెప్పారు.

ఈక్రమం మరికొంత కాలం సాగి ఉంటే.. ధ్వంసమైన కుటుంబవ్యవస్థ స్థానంలో సరికొత్త మానవానుబంధాల సమాజ నిర్మాణమొకటి సాధ్యమయ్యేదేమో. కానీ.. ఆ ప్రయత్నాలు, ఆచరణలు అర్థాంతరంగా ఆగిపోయే పరిస్థితులు రావడం ఓ చారిత్రక విషాదం. వృద్ధాప్యాన్ని సామాజిక విషయంగా చూడని ఆధునిక సమాజపు అమానవీయత గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. ఈ ఆచరణలు, అనుభవాల పునాదిగా ఇప్పటికైనా మానవీయ సమాజం దిశగా ఆలోచించాలి. హైటెక్ అభివృద్ధి మార్గం లో దూసుకుపోతున్న భారతీయ సమాజంలో నెలకొన్న అమానవీయతను రూపుమాపేందుకు ఓ సామాజికోద్యమమే అవసరం ఉన్నది. కట్టడాలు, నిర్మాణాలను చారిత్రక వారసత్వ సంపద పేర కోట్లాది రూపాయలు వెచ్చించి వాటిని సంరక్షిస్తున్న పాలకులు, మన వృద్ధ తరాన్ని మన జ్ఞానసంపదగా గుర్తించి గౌరవించే ఆలోచన ఎందుకు చేయరో అర్థం కాదు. ఇప్పటికైనా ఈ దిశగా మన సమాజం, ప్రభుత్వాలు కదలాల్సిన సమయం ఆసన్నమైంది.

1816

MALLA REDDY

Published: Wed,December 26, 2018 03:53 PM

మోత్కూర్ చూపుతున్న మార్గం

మన చదువుల్తో చిన్నవో, పెద్దవో ఉద్యోగాలు వస్తున్నాయేమో కానీ మానవత్వమున్న మనిషి రూపొందటం లేదు.అందుకనే మన చదువులతో ఎంత ఉన్నత చదువు

Published: Tue,July 12, 2016 12:05 AM

చిల్కాట్ విప్పిన నేరస్థుల చిట్టా

అనవసర, అన్యాయ యుద్ధం చేసి లక్షలాది మంది అమాయక ప్రజల హననానికి కారణమైన ఈ యుద్ధోన్మాద దేశాధినేతలను ఎవరు శిక్షించాలి? బుష్, టోనీ బ్ల

Published: Wed,December 26, 2018 03:34 PM

ఏదీ ప్రకృతి నియమం?

ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం ఆవురావురుమంటున్న ఓ పులి.. జింకను వేటాడుతున్న ది. మీరు దేని పక్షం..? దీంట్లో ఆలోచించడానికేముంది! కనీస

Published: Sun,June 19, 2016 01:37 AM

సమస్యంతా గుప్పెట్లో ఉన్నది!

ఏ ఇంట్లో, కుటుంబంలో అయినా.. బిడ్డలపై మురి పం కోసం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లను కొనిచ్చి మొబైల్ వాడకాన్ని ప్రోత్సహిస్తే దానితో మేలు

Published: Sun,June 12, 2016 01:04 AM

నవతరానికి నాణ్యమైన విద్య

చదువు లే(రా)ని వాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. కానీ నేడు న్న పరిస్థితుల్లో చదువున్న వాడే మరింత అమానవీయంగా పశువుగా ప్రవర్తిస్తు

Published: Sun,May 29, 2016 01:20 AM

ప్రాంతీయ భాషలకు నీట్ పరీక్ష

నీట్ అమలు ఈ విద్యాసంవత్సరం తప్పినా.., వచ్చే ఏడాదినుంచి అయినా ఎలా అమలు చేస్తారు? దానికి విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తారనేది అంతు

Published: Sun,May 22, 2016 01:17 AM

ఆ గ్రామాల స్ఫూర్తితో పునర్నిర్మాణం

రాష్ట్రం సాధించుకుని ఆధిపత్య వాదులు సృష్టించిన ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ రెండేళ్ల ప్రయాణం పూర్తికావస్తున్న తరుణంలో గ్ర

Published: Sun,May 15, 2016 01:04 AM

ఫాసిజం నీడలు

మతోన్మాదం ఏదైనా మానవాళి అస్తిత్వానికి, మానవీయతకు ప్రమాదమే. అయితే ముస్లిం మతోన్మాదం సంగతేంటని ప్రశ్నించవచ్చు. ఇలాంటి అతి తెలివికి స

Published: Sun,May 8, 2016 01:28 AM

సమిష్టి విజయానికి సంకేతం

ఒకరి కోసం అందరు-అందరికోసం ఒకరు అన్న నీతిని అనుసరిస్తూ..అభివృద్ధిపథంలో పయణిస్తున్నారు. ఈ అభివృద్ధి ప్రస్థానంలో.. గ్రామ ప్రజల వికా

Published: Wed,December 26, 2018 03:38 PM

సత్వర న్యాయం సాధ్యమెప్పుడు?

సత్వర న్యాయం అన్నది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. అలా సత్వర న్యాయం అందని పరిస్థితి ఉం టే.. అది ఎంతటి మహత్తరమైనది అయినా నిష్ప్రయోజనమ

Published: Sun,April 24, 2016 01:43 AM

మాతృభాషతోనే మనుగడ

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాద

Published: Wed,December 26, 2018 03:51 PM

చదువు-జ్ఞానం

మన వాళ్లు.. అక్షరాస్యత, అక్షరజ్ఞానం అని ఏ అర్థంలో అంటున్నారో కానీ.. ఇవ్వాళ్టి మన చదువులతో ఉద్యోగాలొస్తున్నాయి తప్ప, జ్ఞానం రావడం ల

Published: Sun,April 10, 2016 12:58 AM

సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు

సహజ సృజనశక్తులు, ప్రావీణ్యాలతో ఉన్న శిశువు పాఠశాలకు పోయి అన్నివిధాలా బండబారుతున్నాడు. సృజనాత్మకత నశించి పోతున్నది. సజీవంగా లేని తర

Published: Wed,December 26, 2018 04:44 PM

ప్రకృతిలోనే పాఠాలు

రాష్ట్రప్రభుత్వం నూతన విద్యావిధానప్రకటన చేసి ప్రాథమిక, ఉన్నత, విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుండటంతో విద్యావ్యవస్

Published: Sun,March 20, 2016 01:47 AM

దేశభక్తుల దేశంలో..

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్.. దళితులను, ఆదివాసులను నిర్వాసితులను చేసి వారి భూములను బహుళజాతికంపెనీలకు అప్పజ

Published: Wed,December 26, 2018 03:36 PM

అప్పిచ్చువాడు రోగి!

విజయ్ మాల్యా గురించి దేశంలో ఆసక్తికరమైన చర్చ సాగు తున్నది. మీడియాలోనూ, పార్ల మెంటులోనూ మాల్యా వ్యవహా రమే నడుస్తున్నది. బ్యాంకులకు

Published: Sun,March 6, 2016 12:43 AM

మానవీయతకే.. పరీక్ష

పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది. కానీ మన అధికారుల తీరు దానికి పూర్తి భిన్నంగా ఉంటున్న

Published: Sun,February 14, 2016 12:05 AM

ఆకలి తీర్చని అభివృద్ధి..

దేశం అన్నిరంగాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నా..అన్నం మాత్రం దూరమవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇది క్రమంగా నానాటికీ తీవ్రరూపం దాల

Published: Sun,January 17, 2016 01:00 AM

వస్తుమయ మాయాజాలం..

ఆధునిక వస్తూత్పత్తి సమాజంలో వస్తుమయవాదం (కన్స్యూమరిజం) గురించి, మానవ నాగరికతకూ, మానవీయతకు దాన్నుంచి దాపురించిన ప్రమాదం గురించి సామ

Published: Sun,January 10, 2016 01:54 AM

ప్రకృతి సేద్యమే పరిష్కారం

గ్రామీణ భారతంలోని అంతర్గత సంక్షోభాన్ని బహుముఖీయంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభాన్ని కేవలం గిట్టుబాటు ధరలకు కుదించి

Featured Articles