తరాలు మారినా అవే అంతరాలు!


Sat,October 6, 2012 05:25 PM

AkhileshYadavస్వాతంత్య్రం వచ్చి అరవై ఐదేళ్లు దాటింది. జాతి మూడో తరంలోకి ప్రవేశించింది. మూడో తరం నాయకత్వం సింహాసనం మీదికి రాబోతున్నది. మూడో తరానికి ప్రతినిధి అఖిలేశ్ యాదవ్. నిన్నటి వరకు ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు రాజకీయ వారసత్వంతో ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి.
ఒకవైపు జాతి చీకట్లో దుఃఖిస్తున్న సమయం. ధనిక, పేద అంతరాలు పెరి గి పేదోడు ఉరితాడు వెతుక్కుంటున్న సమయం. ఈ పరిస్థితుల్లో వారస త్వ రాజకీయాలు ముందుకొస్తున్నాయి. ఇది దురదృష్టకరమైన విషయం. అఖిలేశ్ యాదవ్ మంచి పాలన అందించగలరా? లేదా? అనేది వేరే విషయం. షేక్ అబ్దుల్లా కొడుకు కాశ్మీర్‌లో మార్పులు తేగలిగారా? ఫరూక్ అబ్దుల్లా కొడుకు మార్పు తెచ్చాడా? వారసత్వ రాజకీయాలు మన జాతికి మంచివేనా? అవి ఏ మార్పు తేగలవు? జాతి ఏ మార్పును కోరుకుంటున్నది?

రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, అఖిలేశ్‌యాదవ్, ఒమర్ అబ్దుల్లా, జగన్, లోకేశ్‌లు రాజకీయ వారసులు. వీళ్లు రాజకీయాలలో కుర్చీ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం మరొకటి ఉన్నది. మంచివాళ్లు, నిజాయితీగల మేధావులు ఇప్పటి రాజకీయాలం అసహ్యించుకుంటున్నారు. ఈ రాజకీయాలలో మేము ఇమడలేమంటున్నారు. ఈ వారసత్వ యువ నాయకత్వం మాత్రం కుర్చీ కోసం ఎంతకైనా తెగిస్తున్నది. రాజకీయాలలోకి యువత ప్రవేశించిన తర్వాత సీనియర్లను పక్కన పెట్ట డం జరుగుతున్నదే. సీనియర్లను పక్కనబెట్టటం అంటే జాతి లో మిగిలిన కనీస విలువలను కూడా పక్కనపెట్టడమే. రాజకీయాల్లో సీనియర్లు విలువలకు కట్టుబడి ఉన్నారని కాదు. లాలు ప్రసాద్ పశువుల దానా మేస్తే, గాలి జనార్ధన్‌డ్డి మైనింగ్ బంగారాన్ని మేశారు. కరుణానిధి గీత దాటకుండానే వ్యవహారం నడిపితే, కణిమొళి, రాజాలు గీత దాటేశారు. రాజశేఖర్‌డ్డి కంటే జగన్ నూరుపాళ్లు ఎక్కువని కొందరంటున్నారు. మన చరిత్ర, సంస్కృతి, ప్రజాసమస్యలు, పోరాటాలు, ఉద్యమాలు, సామాజిక అంతరాలు, ఆర్థిక అంతరాలు యువనాయకులకు తెలుసా?

దేశంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న దోపిడీతో పోటీపడడంలో తమ నాన్నలు వెనుకబడి ఉన్నారని, వీరు ముందుకొస్తున్నట్టున్నారు. కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన యువకులు, తమ తోటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తాము ఆడిందే ఆట, పాడిందే పాట అనుకుంటున్నారు. అఖిలేశ్ విషయంలోనూ ఇదే జరిగింది. మూడో తరం నాయకత్వంతో ప్రజలకు ఒరిగేదేమిటి? నేడు దేశం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నది. అభివృద్ధి అనేది మేడిపండులా మారిపోయింది. కొందరి అభివృద్ధి అందరి అభివృద్ధి కాదు. అలాగే ప్రతి కడుపు ఆకలితో మాడుతున్నది. అప్పులతో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. విశ్వవిద్యాలయాలు నిండుగా కనిపిస్తాయి. బయటికి వస్తే ఉద్యోగాలుండవు. ఇదే అభివృద్ధి! దీనికి నాయకులు అఖిలేశ్ యాదవ్. తరాలు మారుతున్నా మళ్లీ మొదటికే వస్తున్నది. అందరూ కార్పొరేట్ శక్తుల ప్రతినిధులే. కాంగ్రెస్, బీజేపీ, సంకీర్ణ ప్రభుత్వాలు దేశాన్ని ఏలుతున్నాయి. దేశంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. పేదవాడు పేదవానిగానే మిగిలిపోయాడు. ధనవంతులు మరింత ధనవంతులుగా మారిపోయా రు. శ్రామిక జనం బతుకులు అథోగతికి చేరుకున్నాయి. వీటన్నిటికి కారణం ఎవరు? దీనికి అఖిలేశ్ ఏమి చేయగలరు?

యూపీ ప్రజలు తిరిగి మొదటికే వచ్చారు. ములాయంను కాదని మాయావతిని, ఇప్పుడు ఆమెను కాదని అఖిలేశ్‌ను ఎన్నుకున్నారు. ములాయం చేయలేని పనిని ఆయన వారసుడు ఏం చేయగలరు? కుల, మత రహిత సమాజంగా మార్చవలసిన పాలకులు వాటిని ఉపయోగించుకు ని అధికారంలోకి వస్తున్నారు. ఎన్నికలు అనేవి ఆధిపత్య వర్గాల మధ్య పోటీ మాత్రమే. అందు లో గెలిచినవాడు రాజు. ఎప్పుడైనా ఓడినవాళ్లు ప్రజలే. అది యూపీ కావొ చ్చు, ఏపీ కావొచ్చు. ప్రజల చైతన్యం, బలహీనత రెండూ రాజకీయ పక్షాలకు బాగా తెలుసు. మన చట్టాలలోని లొసుగులు, ఎన్నికల విధానంలోని బలహీనత తెలుసుపజలకు కొత్త ముఖాన్ని చూపించి ఓట్లు లాగుతున్నారు. అదే అఖిలేశ్ విషయంలో జరిగింది. రాజకీయ శక్తుల ఈ పాచికకు సరైన మందు ప్రజల వద్ద లేదు. రాహుల్ గాంధీ విషయంలోనూ అదే పాచిక విసరాలని కాంగ్రెస్ ప్రయత్నం. నెహ్రూ కుటుంబాన్ని చూపించి ఓట్లు లాగాలనేది వీరి ఎత్తుగడ. అయితే ఇది ఫలించ లేదు.

మూడోతరం నాయకత్వం ప్రజల గురించి అంచనావేస్తున్నప్పుడు యూపీ, ఏపీనే ఉదాహరణగా తీసుకోవాలి. బహుజన నాయకత్వం, అణగారిన వర్గాల నాయకత్వం అంటున్నారు. అగ్రవర్ణాలను ఓడించి అణగారిన వర్గాలకు నాయకత్వం వస్తే అంతా మారిపోతుందని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందంటున్నారు. ఇది నిజమయిందా? ప్రపంచం మారుతున్నట్టుగా మనం మారాలి. ‘ఆధునికత’ ద్వారా అభివృద్ధి సాధించాలి. దీన్ని కొందరు మేధావు లు ఇప్పటికే అంటున్నారు. ఇది నిజమయిందా? దేశంలో పెద్ద రాష్ట్రం యూపీ. మనది నిచ్చెనమెట్ల కుల సమాజమని, తరతరాలుగా అగ్ర కులాలు రాజ్యాధికారం చెలాయిస్తున్నాయని, అణగారిన వర్గాలు అధికారంలోకి వస్తే అంతా మారిపోతుందని బహుజన సిద్ధాంతం చెబుతున్నారు. సోషలిస్టు సమాజాన్ని వీరు ద్వేషిస్తారు. కమ్యూనిజాన్ని వీరు వ్యతిరేకిస్తారు. సమాజం ఉన్నవారు, లేనివారు అనే రెండు వర్గాలుగా ఉందనే సూత్రాన్ని అంగీకరించరు. వీరి సిద్ధాంతం ఉత్తరవూపదేశ్‌లో అమలయింది. అక్కడ ములాయం నాయకత్వంలో బీసీల రాజ్యం వచ్చింది. మాయావతి నాయకత్వంలో అణగారిన వర్గాలకు అధికారం వచ్చింది. అయితే ప్రజల జీవన విధానంలో ఏమైనా మార్పు జరిగిందా? మాయావతి అధికారం అనేది ఒక సైద్ధాంతిక ఆవిష్కరణ.

ఆమె రేపటి భారత ప్రధాని అన్నారు. కానీ ఏం జరిగింది? ఇక్కడ తేలాల్సింది ఏమంటే.. ఏ సిద్ధాంతం గొప్పది? కులాల సమీకరణతో ఓట్లు సంపాదించి అధికారంలోకి వస్తే, అణగారిన వర్గాల ఆకలి తీర్చలేము. వారి ఆర్థి క వ్యవస్థను మెరుగుపర్చలేము. వాటి మూలాలు తెలుసుకోకుండా ఇలా రాజ్యం చేతులు మారినంత మాత్రాన పేద ల బతుకులు మారవు.

ఆంధ్రవూపదేశ్‌లో తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, హైటెక్కులు ప్రజల బతుకులను మెరుగుపరుస్తాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఫలితంగా పల్లెలు ధ్వంసం అయ్యాయి. రైతాంగం ఆత్మహత్యల పాలయ్యింది. చేనేత కార్మికులకు ఉరితాడే మిగిలింది. కుటీర పరిక్షిశమలు గంగలో కలిసిపోయాయి. బాబు పాలనలో ఉపాధి కరువై లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇది ఎవరి తప్పు? అఖిలేశ్ ముఖ్యమంత్రి కాగానే ముఖ్య సమస్య గూండాగిరి అన్నారు. గూండాలను ఏరివేస్తే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందా? పేదల కన్నీళ్లు కరిగిపోతాయా? ప్రజలను పక్కదారి పట్టించడానికే సంస్కరణలు, కుంభకోణాలు, కుట్రలు, కృత్రిమ పోరాటాలు, ఉద్యమాలు , సీబీఐ దర్యాప్తులు. వీటితో ప్రజా సమస్యలు తీరవు. అవినీతి తగ్గిపోదు. మౌలిక మార్పుకో రే ఉద్యమాల ద్వారానే సకల సమస్యలకు పరిష్కారం.
-సిహెచ్. మధు

35

MADHU CH

Published: Sun,November 27, 2016 01:50 AM

మంచి ఆలోచనను పాడుచేసిన మోదీ

ఒక దశాబ్ద కాలం నుంచి నాలాంటి వాళ్లెందరో ఐదు వందల నోట్లు రద్దు చేయాలని, ఇవి ధనవంతుల దాచివేతకు ఉపయోగపడుతున్నాయని, విలువ ఎక్కువ గనుక

Published: Fri,September 6, 2013 12:50 AM

ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం

సీమాంధ్రులు మేం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని గొంతుచించుకుని అరుస్తున్నారు. అభివృద్ధి అంటే ఏమి టి? ఎవరి అభివృద్ధి జరిగింది? అసల

Published: Sun,March 10, 2013 12:56 AM

ఉగ్రవాదాన్ని అరికట్టలేమా?

దిల్‌సుఖ్‌నగర్ రోడ్డు మీద అమాయకుల శవాలు గుండెను మండిస్తాయి. గుండె కరిగిపోతున్నది. ఆ రాత్రి ఒక నిమిషం కూడా నిద్రరాలేదు. ఒక భయం ఒక

Published: Sat,October 6, 2012 05:23 PM

సంధికాలంలో సమష్టిపోరు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పనిచేస్తుందా అనుమానమే! అన్ని శాఖ లు నిర్లిప్తంగా ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? ఇంత అధ్వాన్నమైన ప్రభుత్వ

Published: Sat,October 6, 2012 05:24 PM

నీళ్లివ్వలేని నేతలు నీతులు చెప్పడమా?

చిదంబరం తానన్న మాటలకు సిగ్గుపడ్డారో లేదో తెలియదు కానీ, ఆయన మాటలకు జాతంతా సిగ్గుపడ్డది. మధ్య తరగతి ప్రజల గురించి ఆయన మాటల కు, ఆయన ఈ

Published: Sat,October 6, 2012 05:24 PM

ప్రణబ్ ఏ వర్గం ప్రతినిధి?

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన ప్రణబ్ ముఖర్జీ ఎవరికి నాయకుడు? ప్రజలకా? మామూలు ప్రజలకు ఆయన పేరు కూడా సరిగ్గా తెలియద

Published: Sat,October 6, 2012 05:26 PM

అవిశ్వాసం వెనుక ఆంతర్యం!

రైతు కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం, రైతు కోసమే ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకోవడం... ఇదం తా రైతు కోసమేనా? రైతు కోసం సాగిన అసెంబ

Published: Sat,October 6, 2012 05:26 PM

గూడూరి సీతారాం ‘లచ్చి’ కథ

గూడూరి సీతారాం మన నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణ కథకుడు, తెలంగాణ భాషను విపరీతంగా ప్రేమించిన రచయిత గూడూరి సీతారాం వెళ్ళిపోయిన తర్వాత

Featured Articles