అవిశ్వాసం వెనుక ఆంతర్యం!


Sat,October 6, 2012 05:26 PM

రైతు కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం, రైతు కోసమే ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకోవడం... ఇదం తా రైతు కోసమేనా? రైతు కోసం సాగిన అసెంబ్లీ సమావేశం ఎంత మోసం? ఎంత దగాకోరుతనం? ఎవరి కాలంలో రైతు ఆత్మహత్యలులేవు? ఏ ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను ఆపగలిగింది? ఏ సర్కారు రైతుకు ప్రాధాన్యం ఇచ్చింది? ఏ రాజకీయ పార్టీ రైతును తలకెత్తుకుంది? కార్పొరేట్ సామ్రాజ్యాన్ని తలకెత్తుకుని, వాటి పాదల కింద రైతును అణచివేస్తున్న రైతు ను అణచివేస్తున్నాయి ఈప్రభుత్వాలు. రైతుకోసం రాజకీయ పార్టీలు పెడుతున్న కన్నీళ్లు అన్నీ మొసలి కన్నీళ్లే. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి రైతు పేరుతో పెట్టిన అవిశ్వాస తీర్మానం పెద్ద కుట్ర.

చంద్రబాబు స్కెచ్ వేశా రు. ముఖ్యమంత్రి స్కెచ్‌కు రంగు వేశారు. జగన్ ఆ స్కెచ్‌ను గోడకు అంటించా రు. ఇందులో ఓడిపోయింది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ శత్రువు ముందు సాగిలాపడ్డా రు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఈ ప్రాంత ప్రజ లు అక్కర్లేదని అవిశ్వాస తీర్మానం సందర్భంగా తేలిపోయింది. జగన్ బోర్లాపడ్డాని మీడియా వక్రీకరిస్తున్నది. కానీ అవిశ్వాస తీర్మానం మూలంగా ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు. దీనిద్వారా ఆయన రాజకీయ ఎత్తుగడ ఫలించింది. తన మూలంగా కిరణ్ సర్కార్ పడిపోకూడదు. అలాఅని కిరణ్‌సర్కారుకు మద్దతుగా కనిపించకూడదు, అన్నీ కార్డు ముక్కలు ఆయన పదిలంగానే ఉంచుకున్నారు. ఏది ఎప్పుడు వేయాలో ఆయనకు తెలిసినట్టుంది. గెలుపుపై పూర్తి నమ్మకం కలిగే వరకు ఆయన చెక్ పెట్టరు. జగన్ తన ఎమ్మెల్యేలను కాపాడుకొని ఆంధ్ర ప్రాంతంలో తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. దమ్ముంటే తన వెంట వచ్చిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేయాలని ప్రభుత్వానికి సవాల్ కూడా విసిరాడు. ఆయన సవాల్‌కు ప్రభుత్వం వెనకడుగు వేస్తే ప్రభుత్వ పతనం ప్రారంభమైనట్టే!

అవిశ్వాస తీర్మానంలో కిరణ్ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే తెలంగాణ వస్తుందని అందరూ నమ్మారు. రాజ్యాంగ సంక్షో భం ద్వారానే తెలంగాణ వస్తుందని విశ్వసిస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్ ముందు కు వచ్చింది. కానీ తెలంగాణ ప్రజా ప్రతినిధులందరూ ఆ నమ్మకాన్ని వమ్ముచేశారు. వారు చేసిన రాజీనామాల తంతు బోగస్ అని తేలిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రజావూపతినిధుల మాటలన్నీ బూటకమని అవిశ్వాస తీర్మానం ద్వారా తేలిపోయింది. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవించని ఆ పార్టీల విప్‌ను ధిక్కరిస్తే వారు హీరోలు అయ్యేవారు. కానీ పదవులకు దాసోహం అన్న రీతిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరించారు.

ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల పాచికలు విసురుతున్నా రు. కానీ ఇవన్నీ వట్టి మాటలే. ఎందుకంటే వైఎస్ ప్రవేశపెట్టి న సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదని జగన్ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కొత్త పథకా లు అంటే ఎవరు విశ్వసిస్తారు? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఘనం గా ప్రచారం చేసుకుంటున్న రూపాయికి కిలో బియ్యంపై ప్రజ ల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. పెరిగిన తగ్గించకుండా రూపాయికి కిలో బియ్యం ఎందుకంటున్నారు.

రైతు సమస్యల మీద అవిశ్వాస తీర్మానం పెట్టానని చంద్రబాబు ప్రకటించారు. దాదాపుగా నాలుగు గంటలు ప్రసంగించారు. ఇన్ని గంటల ప్రసంగంలో తెలంగాణ ఎక్కడా కనిపించలేదు. తెలంగాణ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరిని కూడా ఆయన ప్రశ్నించ లేదు. అలాగే రైతుల దయనీయ పరిస్థితికి చంద్రబాబే కార ణం. అంతేకాదు ఇతర రాష్ట్రాలలో కూడా రైతుల దుస్థితికి ఆయనే కారణం. చంద్రబాబు ముఖ్యమంవూతిగా ఉన్న కాలం లో ఆయన తెచ్చిన సంస్కరణలను చూసి, ఇతర రాష్ట్రాలు జబ్బలు చరుచుకున్నాయి. వ్యవసాయం చేస్తే ఏమోస్తుందని అన్నారు చంద్రబాబు. ఆ మాటలే రైతు జీవితాన్ని గోదారిలో కలిపాయి. ఇప్పుడు ఆయన నేను మారానని అంటున్నారు. నిజంగా ఆ మారి ఉంటే ప్రజాభివూపాయానికి తలొగ్గితే తెలంగాణను సమర్థించేవారు. కానీ ఆయనకు తెలంగాణ అన్నా, ఈ ప్రాంత ప్రజలు అన్నా చిన్నచూపే!

అవిశ్వాస తీర్మానంలో ఎవరి రాజకీయాలు వారికి ఉన్నా యి. రైతు కోసం అనేది ఒకసాకు మాత్రమే. రైతు గురించి మాట్లాడింది తక్కువ, రాజకీయాల బురద చల్లుకున్నది ఎక్కు వ. అయితే ఆంధ్రవూపదేశ్‌లో ఎవరి పాలనలో రైతుకు పెద్ద పీట వేశారన్నది ముఖ్యమైన ప్రశ్న. పేరు రైతుది ఊరు కార్పొరేట్ శక్తులది. అసెంబ్లీ లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు రైతు గురించి దొంగ కన్నీళ్లు కార్చారు. కానీ రైతుకు వీరు చేసిందేమైనా ఉందా? ఇవాళ గిట్టుబాటు ధర లేక రైతు అల్లాడుతున్నాడు. అప్పులతో సతమతమవుతున్నాడు. చిన్న రైతులు పెరిగిన ఎరువులు కొనలేసి స్థితిలో ఉన్నాడు. వారికి ఉచిత విద్యు త్ ఇస్తే లాభమేంటి?

అవిశ్వాస తీర్మానం విషయంలో రెండు విషయాలు అర్థం కావు. మన రాజకీయాలు అలాంటివి. అవిశ్వాస తీర్మాన జాబితాలో తెలంగాణ లేనప్పుడు టీఆర్‌ఎస్ ఎందుకు సమర్థించిం ది?ఢిల్లీలో లొల్లి చేసిన తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు, తెలంగాణపై హామీ లేకుండా అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు వ్యతిరేకించినట్టు? అవిశ్వాస తీర్మానం వెనుక జగన్‌ను దెబ్బతీసే కుట్ర పైకి కనిపిస్తున్నది. కానీ తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడం కనిపించని కుట్ర. అయితే ఈ రెండు సాధ్యమయ్యే పనికాకపోచ్చు. ఒకటి వ్యక్తిగత గ్లామర్‌తో ఎదుగుతున్న పార్టీ, రెండోది సెంటిమెంట్‌తో కూడిన ప్రజాఉద్యయాన్ని దెబ్బతీయడం ఎవరికీ సాధ్యం కాదు. వాస్తవానికి తెలంగాణకు కిరణ్‌కుమార్‌డ్డి, చంద్రబాబు, జగన్‌లు శత్రువులే. ఈ ముగ్గురు లేదా వారిలో ఒక్కరు రాజకీయాలను శాసిస్తున్నంత కాలం తెలంగాణకు అడ్డుపడుతూనే ఉంటారు. అయితే తెలంగాణ ప్రజలు సంఘటితంగా పోరాడితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిం చుకోవచ్చు.

-సిహెచ్. మధు
కవి, రచయిత

35

MADHU CH

Published: Sun,November 27, 2016 01:50 AM

మంచి ఆలోచనను పాడుచేసిన మోదీ

ఒక దశాబ్ద కాలం నుంచి నాలాంటి వాళ్లెందరో ఐదు వందల నోట్లు రద్దు చేయాలని, ఇవి ధనవంతుల దాచివేతకు ఉపయోగపడుతున్నాయని, విలువ ఎక్కువ గనుక

Published: Fri,September 6, 2013 12:50 AM

ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం

సీమాంధ్రులు మేం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని గొంతుచించుకుని అరుస్తున్నారు. అభివృద్ధి అంటే ఏమి టి? ఎవరి అభివృద్ధి జరిగింది? అసల

Published: Sun,March 10, 2013 12:56 AM

ఉగ్రవాదాన్ని అరికట్టలేమా?

దిల్‌సుఖ్‌నగర్ రోడ్డు మీద అమాయకుల శవాలు గుండెను మండిస్తాయి. గుండె కరిగిపోతున్నది. ఆ రాత్రి ఒక నిమిషం కూడా నిద్రరాలేదు. ఒక భయం ఒక

Published: Sat,October 6, 2012 05:23 PM

సంధికాలంలో సమష్టిపోరు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పనిచేస్తుందా అనుమానమే! అన్ని శాఖ లు నిర్లిప్తంగా ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? ఇంత అధ్వాన్నమైన ప్రభుత్వ

Published: Sat,October 6, 2012 05:24 PM

నీళ్లివ్వలేని నేతలు నీతులు చెప్పడమా?

చిదంబరం తానన్న మాటలకు సిగ్గుపడ్డారో లేదో తెలియదు కానీ, ఆయన మాటలకు జాతంతా సిగ్గుపడ్డది. మధ్య తరగతి ప్రజల గురించి ఆయన మాటల కు, ఆయన ఈ

Published: Sat,October 6, 2012 05:24 PM

ప్రణబ్ ఏ వర్గం ప్రతినిధి?

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన ప్రణబ్ ముఖర్జీ ఎవరికి నాయకుడు? ప్రజలకా? మామూలు ప్రజలకు ఆయన పేరు కూడా సరిగ్గా తెలియద

Published: Sat,October 6, 2012 05:25 PM

తరాలు మారినా అవే అంతరాలు!

స్వాతంత్య్రం వచ్చి అరవై ఐదేళ్లు దాటింది. జాతి మూడో తరంలోకి ప్రవేశించింది. మూడో తరం నాయకత్వం సింహాసనం మీదికి రాబోతున్నది. మూడో తరాన

Published: Sat,October 6, 2012 05:26 PM

గూడూరి సీతారాం ‘లచ్చి’ కథ

గూడూరి సీతారాం మన నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణ కథకుడు, తెలంగాణ భాషను విపరీతంగా ప్రేమించిన రచయిత గూడూరి సీతారాం వెళ్ళిపోయిన తర్వాత

Featured Articles