మంచి ఆలోచనను పాడుచేసిన మోదీ


Sun,November 27, 2016 01:50 AM

ఒక దశాబ్ద కాలం నుంచి నాలాంటి వాళ్లెందరో ఐదు వందల నోట్లు రద్దు చేయాలని, ఇవి ధనవంతుల దాచివేతకు ఉపయోగపడుతున్నాయని, విలువ ఎక్కువ గనుక నకిలీ నోట్లు విపరీతంగా వస్తున్నాయని, ఆర్థిక అంతరాలకు దోహదం కలిగిస్తాయని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ ఆదర్శమనుకున్నారో, సాహసం అనుకున్నారో, యూపీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆయుధమనుకున్నారో కానీ అకస్మాత్తుగా ఓ రాత్రి పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు.

ప్రధానికి సలహా ఇచ్చిన ఆర్థిక నిపుణులు మూడు విషయాలు ఆలోచించలేదు. ఒకటి కొత్త నోట్లు ప్రింటు కాకుండా, పాత నోట్ల మార్పిడి సాధ్యమా? రెండు దేశంలో కొన్ని లక్షల గ్రామాలున్నాయి. కానీ కొన్ని వేల బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. ఫలితంగా ఈ చర్య వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడరా? మూడు 125 కోట్ల పై చిలుకు జనంలో కొన్ని లక్షల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. ఇలాంటివి
ఆలోచించకుండా ప్రధాని నోట్లు రద్దు చేసి అనవసర కల్లోలం సృష్టించారు.

ఏముంది? ఏ ఆయుధాలు లేకుండా శత్రువు మీద విరుచుకపడినట్టుగా అనిపించింది. అసలైన శత్రువు తప్పించుకున్నాడు. సామాన్య ప్రజలు బలయ్యారని అనిపించింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి పక్షం రోజులు దాటింది.అప్పటినుంచి సామాన్యులు ఇబ్బందులకు గురవుతూ అష్టకష్టాలు పడుతున్నారు. తొంభై శాతం సామాన్య జనం ఎన్నడూ అనుభవంలేని దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. మోదీ బాణం నల్ల కుబేరులకు తగుల లేదు. గురితప్పి, సామాన్య జనం గుండెలకు తగిలింది. ప్రధాని ఒక మంచి పనిని పూర్తిగా పాడు చేశారు. సరైన పట్టులేక, యంత్రాంగం సహకారం అందక మొత్తం చెడగొట్టారు. ప్రజ లు బలి పశువులయ్యారు. జనం బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల ముందు క్యూ కట్టింది.

ఇలా ఎందుకు జరిగింది? అనేది పెద్ద ప్రశ్న. పెద్ద నోట్ల రద్దు ఆలోచన, ఆచరణ, ఆ తర్వాత పరిణామాలను గమనిస్తే ప్రధాని ఒక స్వాప్నికుడిగా, ఒక ఆదర్శవాదిగా కనిపిస్తున్నారు. శ్రమ దీక్ష, పట్టుదల గల కార్యశూరుడిగా కనిపించడం లేదు. ఇందులో ఎవరి తప్పులున్నా ఒక విషయం స్పష్టం. బాధ్యత ప్రధానిది మాత్రమే! ఒక మంచి పనిని, దేశ ఆర్థిక వ్యవస్థను కొంతైన బాగుచేసే పనిని ఒక ప్రణాళిక లేక పూర్తిగా చెడగొట్టారు. ముందుచూపు, ప్రణాళిక, దేశంలో కార్పొరేట్ స్వభావం, బ్యాంకులు లేని వేలాది గ్రామాలు, ప్రజల, దేశ శ్రామిక సంస్కృతి, మనస్తత్వం బతుకులు తెలియని ప్రధాని ఒక మంచిపనిని పూర్తిగా ఎం దుకూ పనికిరాకుండా చేశారు. ప్రధానికి పెద్ద నోట్ల రద్దు ఆలోచన ఎం దుకు వచ్చిందో అర్థం కాదు. ఎన్నికల ప్రణాళికలో ఆ మాట ఉన్నట్టు లేదు. విదేశీ బ్యాంకుల్లో లక్షల కోట్ల నల్లధనం ఉందని, అది తెచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు పంపిస్తానని మోదీ చేసిన వాగ్దానం పెండింగ్‌లో ఉన్నది. అది నెరవేరదని తేలిపోయింది. ఆయన ప్రధాని కాకముందు ఆదర్శ దృష్టితో, సంస్కరణల భ్రమతో నల్లధనం గూర్చి మాట్లాడినట్టున్నారు. ప్రధాని అయిన తర్వాత ఎవరి డబ్బు విదేశీ బ్యాంకుల్లో మూలుగుతుందో లిస్టు చూసిన ప్రధానికి బహుశా దిక్కుతోచకపోవ చ్చు. అందులో కార్పరేట్ సామ్రాజ్యం, రాజకీయరంగ ప్రముఖులు, బడా కాంట్రాక్టర్లు, బడా బాబుల పేర్లు ఉన్నట్టున్నాయి.

వాటి జోలికి పోతే తన కుర్చీ కదులుతుందని మోదీకి తెలుసు. ఆయన ఆలోచనలలోనే ఆధునికత పేరుతో దోపిడీ ఆలోచనలుంటాయి. వీటినే బూర్జువా గుణాలంటారు. అందులో భాగమే వ్యవసాయ దేశాన్ని డిజిటల్ ఇండి యా అంటున్నారు. అవసరంలేని బుల్లెట్ రైళ్ళ కలలు చూపిస్తున్నారు. ఏటీఎంలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ రంగం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవస్థ వంటి మోదీ ఆలోచనలన్నీ కింది తరగతి ఆలోచనలు కావు. ఆధునిక యంత్రాల మోజులో పడిన మోదీ, ఆయన ప్రభుత్వం, అధికారులు దేశంలో లక్షల సంఖ్యలో గ్రామాలున్నాయనే సంగతి, వేల సంఖ్యలో బ్యాంకులున్నాయనే సంగతి మర్చిపోయి పెద్దనోట్ల రద్దుకు శ్రీకారం చుట్టారు. నోట్లు రద్దు చేయడం తప్పు కాదు. ఎలా చేయాలి? ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఈ ఘన కార్యాన్ని ఎలా విజయవంతం చేయా లి? నల్లధనాన్ని తేలికగా పట్టుకోవడానికి ఏ విధమైన వ్యూహం అనుసరించాలి? అనే విషయంలో దారితప్పారు. దీంతో మామూలు ప్రజ లు బలి పశువులయ్యారు. పెద్ద నోట్ల రద్దుతో నిద్రలేని రాత్రులు గడుపాల్సిన నల్ల కుబేరులు హాయిగా నిద్రపోయారు. కానీ సామాన్య జనానికి మాత్రం నిద్ర కరువైంది. ప్రధాని మోదీ పూర్తి గా మాటల రాజకీయవేత్త తప్ప రాజనీతిజ్ఞుడు కాదని తేలిపోయింది.

పెద్ద నోట్లు రద్దు కావల్సిందే! పెద్ద నోట్లు 90 శాతం చెలామణిలో ఉండటం వల్ల కోటీశ్వరుల పరోక్ష దోపిడీ పెరిగింది. దేశంలో పేద-ధనికుల మధ్య ఆర్థిక అంతరాలు విపరీతమయ్యాయి. పెద్ద నోట్ల విలువ ఎక్కువ కనుక దొంగనోట్ల ప్రచురణకు అవకాశం దొరికింది. విపరీతంగా దొంగనోట్లు చెలామణిలోకి వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు మంచి కాదని ఎవరూ అనలేరు. ముందు చూపులేక, స్వార్థంతో రాజకీయ ప్రయోజనం దృష్టితో, వ్యక్తిగత ఇగోయిజంతో నిర్ణయం తీసుకోవడంతో పూర్తిగా చెడిపోయింది. ప్రధాని దేశ ప్రయోజనాల దృష్టితో, ప్రజాస్వామ్య దృక్పథంతో, సామాన్య జనం దృష్టి కోణం తో పారదర్శకంగా అమలుచేస్తే బాగుండేది. రహస్యంగా, హటాత్తుగా అర్ధరాత్రి నిర్ణయంతో అంతా తారుమారైంది. ఈ రద్దు నిర్ణయం ముందే కొంద రు కోటీశ్వరులకు తెలియదనుకోలేం. వాళ్లు జాగ్రత్త పడినట్టున్నారు. లేకపోతే ఇప్పటికే వాళ్ల అసమ్మతి ప్రతిధ్వనించేది. నష్టాల్లో ఉన్న పరిశ్రమలు, బ్యాం కుకు బాకీ పడిన పరిశ్రమలు నోట్ల రద్దు కారణంతో మూసేసేవారు. కార్పొరేట్ సామ్రాజ్యం కలత పడినట్టుగా కనిపించడం లేదు. ఇందులో కాంగ్రెస్ ఇత ర రాజకీయపక్షాల విమర్శల మీద సానుభూతి అవసరం లేదు. పెద్ద నోట్లు సృష్టించింది కాంగ్రెసే. ఇప్పుడు వీధికెక్కితే లాభమేమిటి? ఇతర ప్రతిపక్షాలు ఇంతకాలం ఏం చేశాయి? పెద్ద నోట్ల రద్దుకు ఎందుకు పోరాటం చేయలేదు? రద్దు తర్వాత ప్రజలకు ఇబ్బంది పేరుతో అల్లరి చేయటం వెనుక మతలబు ఉన్నది.

పెద్ద నోట్ల రద్దు అపజయం పాలుకావడానికి కారణం ప్రధాని మోదీ తప్పిదం. పెద్ద నోట్ల రద్దు వల్ల రద్దు కాని నోట్ల విలువ ఐదు లక్షల కోట్లు ఉంటుందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇది ప్రభుత్వానికి లాభం కావ చ్చు. బ్యాంకులకు వరం కావచ్చు. మొండి బకాయిల కిందికి పోవచ్చు. కానీ పెద్ద నోట్ల రద్దు మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదమున్నది. షేర్ మార్కెట్ నేల జారుతుంది. రూపాయి మారకం విలువ ఇంకా దిగజారుతుంది. ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ప్రజ ల్లో నోట్ల చెలామణి తగ్గి, వస్తు వినియోగం తగ్గి మార్కెట్ దిగజారుతుందా? రైతు ఉత్పత్తి వ్యయం పెరిగి గిట్టుబాటు ధర తగ్గుతుందా? రాష్ర్టాలకు లాభమా? నష్టమా? సామాన్య ప్రజలు పడే ఇబ్బందులేమిటి? ఇటువంటివేమీ ఆలోచించకుండా ప్రధాని పెద్ద నోట్ల తలుపులు మూసివేశారు. ఆర్‌బీఐ గవర్నర్, ప్రధాని ఆర్థిక సలహాదారు ఎవరి సలహానేమో గాని మొత్తం వాళ్లు పాతా ళం లోతుల్లోకి వెళ్లి దేశాన్ని, దేశ ప్రజలను లాక్కెళ్లారు. ఇదంతా ఈత రానివాడు నీళ్లలో దిగినట్టుగా ఉన్నది. దిగేవారు దిగకుండా దేశాన్ని దించారు. దేశం ఎటుపోతుందో అర్థం కావడం లేదు.

ప్రధానికి సలహా ఇచ్చిన ఆర్థిక నిపుణులు మూడు విషయాలు ఆలోచించలేదు. ఒకటి కొత్త నోట్లు ప్రింటు కాకుండా, పాత నోట్ల మార్పిడి సాధ్యమా? రెండు దేశంలో కొన్ని లక్షల గ్రామాలున్నాయి. కానీ కొన్ని వేల బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. ఫలితంగా ఈ చర్య వల్ల గ్రామీణ ప్రాం త ప్రజలు ఇబ్బంది పడరా? మూడు 125 కోట్ల పై చిలుకు జనంలో కొన్ని లక్షల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. ఇలాంటివి ఆలోచించకుండా ప్రధాని నోట్లు రద్దుచేసి అనవసర కల్లోలం సృష్టించారు. సామాన్య ప్రజలను దుఃఖం పాలు చేశారు. శాస్త్రీయ దృష్టి లేకుండా, శస్ర్తాలు, అస్ర్తాలు లేకుండా యుద్ధాన్ని నిర్మించకుండా, యుద్ధ వ్యూహం నిర్మించకుండా నేనున్నానని ప్రధాని సామాన్య జనాన్ని యుద్ధ రంగంలోకి దించారు. ఒక మంచి పనిని అడ్డదిడ్డంగా చేసి మోదీ కార్పొరే ట్ సామ్రాజ్యానికి, నల్ల కుబేరులకు ఆనందం, మంచి అవకాశం కలిగించారు. ఒక మంచి పని నవ్వుల పాలైంది. సామాన్య ప్రజల దుఃఖానికి కారణమయింది.
-సీహెచ్ మధు

4993

MADHU CH

Published: Fri,September 6, 2013 12:50 AM

ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం

సీమాంధ్రులు మేం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని గొంతుచించుకుని అరుస్తున్నారు. అభివృద్ధి అంటే ఏమి టి? ఎవరి అభివృద్ధి జరిగింది? అసల

Published: Sun,March 10, 2013 12:56 AM

ఉగ్రవాదాన్ని అరికట్టలేమా?

దిల్‌సుఖ్‌నగర్ రోడ్డు మీద అమాయకుల శవాలు గుండెను మండిస్తాయి. గుండె కరిగిపోతున్నది. ఆ రాత్రి ఒక నిమిషం కూడా నిద్రరాలేదు. ఒక భయం ఒక

Published: Sat,October 6, 2012 05:23 PM

సంధికాలంలో సమష్టిపోరు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పనిచేస్తుందా అనుమానమే! అన్ని శాఖ లు నిర్లిప్తంగా ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? ఇంత అధ్వాన్నమైన ప్రభుత్వ

Published: Sat,October 6, 2012 05:24 PM

నీళ్లివ్వలేని నేతలు నీతులు చెప్పడమా?

చిదంబరం తానన్న మాటలకు సిగ్గుపడ్డారో లేదో తెలియదు కానీ, ఆయన మాటలకు జాతంతా సిగ్గుపడ్డది. మధ్య తరగతి ప్రజల గురించి ఆయన మాటల కు, ఆయన ఈ

Published: Sat,October 6, 2012 05:24 PM

ప్రణబ్ ఏ వర్గం ప్రతినిధి?

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన ప్రణబ్ ముఖర్జీ ఎవరికి నాయకుడు? ప్రజలకా? మామూలు ప్రజలకు ఆయన పేరు కూడా సరిగ్గా తెలియద

Published: Sat,October 6, 2012 05:25 PM

తరాలు మారినా అవే అంతరాలు!

స్వాతంత్య్రం వచ్చి అరవై ఐదేళ్లు దాటింది. జాతి మూడో తరంలోకి ప్రవేశించింది. మూడో తరం నాయకత్వం సింహాసనం మీదికి రాబోతున్నది. మూడో తరాన

Published: Sat,October 6, 2012 05:26 PM

అవిశ్వాసం వెనుక ఆంతర్యం!

రైతు కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం, రైతు కోసమే ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకోవడం... ఇదం తా రైతు కోసమేనా? రైతు కోసం సాగిన అసెంబ

Published: Sat,October 6, 2012 05:26 PM

గూడూరి సీతారాం ‘లచ్చి’ కథ

గూడూరి సీతారాం మన నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణ కథకుడు, తెలంగాణ భాషను విపరీతంగా ప్రేమించిన రచయిత గూడూరి సీతారాం వెళ్ళిపోయిన తర్వాత

Featured Articles