గూడూరి సీతారాం ‘లచ్చి’ కథ


Sat,October 6, 2012 05:26 PM

గూడూరి సీతారాం మన నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణ కథకుడు, తెలంగాణ భాషను విపరీతంగా ప్రేమించిన రచయిత గూడూరి సీతారాం వెళ్ళిపోయిన తర్వాత మీడియా తగినంత గుర్తింపు ఇచ్చి ట్టుగా నా కనిపిస్తుంది. పొరపాటు కావచ్చు. నేనెక్కడో నిజామాబాద్‌లో ఓ మూల నుంటాను కనుక ‘స్పందన’ నా వరకు రాకపోవచ్చు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు కీర్తించినా కీర్తించకపోయినా, ఎవరు సంతాపం తెలిపినా తెలుపకపోయినా, ఎక్కడ సంతాప సమావేశాలు జరిగినా జరుగకపోయినా, ఎవరు సంపాదకీయాలు రాసిన రాయకున్నా గూడూరి సీతారాం మంచి తెలంగాణ రచయిత, మంచి తెలంగాణ కథకుడు.

బహుశా తెలంగాణ రచయితగా గూడూరి సీతారాం పుట్టడం మనకు గర్వకారణం కావచ్చు కానీ తెలుగు సాహిత్యలోకం ఆయన చనిపోయిన తర్వాత తగిన గుర్తింపు ఇవ్వకపోవడానికి కారణం ఆయన తెలంగాణ వారు కావడం కావచ్చు. ఎవరూ గుర్తించినా గుర్తించకపోయినా తెలంగాణ అనేది పెద్ద గర్వకారణం. నేను తెలంగాణ లో పుట్టినందుకు గర్విస్తున్నాను.ఇది గూడూరి సీతారాం రాసిన ‘లచ్చి’ కథ గురించి ఇది 1957లో రాసిన కథ. ఇంచుమించు 55 సంవత్సరాల క్రితం. అంటే స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో, తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత, అప్పటికీ స్వాతంత్య్రం మీద ఆశలు సన్నగిల్లలేదు. స్వతంత్ర భారతదేశం రేపు స్వర్ణ భారతంగా స్వేచ్ఛాభారతంగా, సత్యం, శాంతి, విల్లసిల్లే దేశంగా ఉంటుందని నమ్మే రోజులవి. ఇప్పుడు (60) సంవత్సరాల తర్వాత మన ఆశలన్నీ ఎప్పుడో నీరుగారిపోయాయి.

ఇంకా ఈ దేశం బాగుపడదని నమ్ముతున్న రోజులివి. కోట్ల పేదలున్న భారతే శం ఇపుడు ధనవంతుల దేశంగా, అగ్రరాజ్యాల సరసన నిలుచున్న దేశంగా పోజులు కొట్టడం మింగుడు పడని వాస్తవం. 1957లో ఆ పరిస్థితి అంటే స్వతంత్ర భారతదేశంపై అంత అపనమ్మకం అప్పుడే అందరి గుండెల్లో ఏదో ఉంది. గూడూరి సీతారాం అప్పుడే స్వతంత్ర భారతదేశం అస్తవ్యస్త ధోరణిని గుర్తుపట్టారు. కలలు అప్పటికే కల్లలయినట్టుగా సీతారాం ‘లచ్చి’ కథ రాశారు.

లచ్చి కథాంశం చాలా చిన్నది. కానీ మారుతున్న విశాల భారతదేశానికి నిదర్శనం అది. పేదోడి బ్రతుకు ఎక్కడ చిక్కుకపోతుందో, వాడి జీవితం ఎక్కడ పల్టీలు కొడుతుందో చెప్పేకథ అది. వాడి జీవితం పల్టీలు కొట్టడానికి వ్యవస్థ కారణమని అప్పటికే గుర్తించి రాసిన కథ ‘లచ్చి’
ఇది బిచ్చగాళ్ల కథ. గూడూరు సీతారాం బిచ్చగాళ్ల పక్షాన నిల్చి వ్యవస్థకు వ్యతిరేకంగా ఆ కథ రాసారు. అక్కడే ఆయన గొప్పతనముంది. ఆయన ఎవరి పక్షాన నిల్చారో ‘లచ్చి’ కథ ఒక నిదర్శం.
1957లో ఓ పల్లెలో బిచ్చమెత్తుకొని జీవిస్తున్న లచ్చి కుటుంబం హాయిగా ఉంది. అప్పులేదు. ఆకలి లేదు. బిచ్చమెత్తుకోవటం కడుపునిండా తినటం.

ఏ బాధ లేదు. హాయిగా నిద్రపోవటం అప్పు లేకపోతే అలుమగల మధ్య ఘర్షణ ఉండదు.మగవాడికి పాడు అలవాట్లు లేకపోతే అలుమగల మధ్య ఘర్షణకు అస్కారం ముండది. పోలీసులు అప్పుడు ఇప్పుడు ఒకటే అప్పటికీ పోలీసు నిజస్వరూపాన్ని సీతారాం అర్థం చేసుకున్నాడు. లచ్చి భర్తను పోలీసులు అనవసరంగా అరెస్టు చేయటంతో ‘ లచ్చి’ కుటుంబం స్థిరత్వం దెబ్బతిన్నది. పోలీసుల భయంతో లచ్చి , ఆమె భర్త పిల్లలు ఆ పల్లె వదిలి పట్నం వెళ్తారు. ‘ పట్నం’ నిజ స్వరూపం ‘లచ్చి’ కి అర్థమవుతుంది. ‘ పట్నం’ దగాకోరు సంస్కృతిని, మోసం నిజ స్వరూపాన్ని సీతారాం కథలో చెప్పారు. కథకు జీవం అది.

పట్నం వెళ్ళిన లచ్చి కుటుంబం అప్పులపాలవుతుంది. బిచ్చం వేసే వాళ్లు తక్కువ . బిచ్చం లాభం లేదని సంపాదించవచ్చని అప్పుచేసి లచ్చి భర్త రిక్షా కొంటాడు. రాత్రింబగల్లు రిక్షా లాగినా అప్పు పెరుగుతుంది. దీనికితోడు పట్నం సంస్కృతి ‘లచ్చి’ మొగన్ని అలుముకుంటుంది. నగర నాగరికతలో మనిషి మాయమయ్యాడు. తెలియనిదేదో సవారీ చేయడం మొదలు పెట్టింది. కోర్కెలు పెరిగి, అత్యాశలు ఆకాశాన్నంటాయి. ఆలోచనలకు తగ్గ ఆదాయం అందక ఆకుకు అందని పోకకు పొందని ఆలోచనలతో ఆగమయ్యాడు. తాగుడు, అబద్దాలాడుడు, భార్యను కొట్టుడు. ఆఖరుకు భార్య నిజాయితీని అనుమానించటం ఇదే కథ.

1957లోనే పోలీసులు అనవసరంగా అరెస్టు చేస్తారని సీతారాం చెప్పారు. బీదలు పల్లెలు విడిచి పట్నం వలస వెళ్ళటం తప్పనిసరి అవుతుందని ఈ స్వాతంత్య్రం గురించి ఆనాడే పసిగట్టారు. పట్నం వెళ్ళిన పేద బతుకులు అప్పుల పాలవుతాయని ‘అప్పు’ అనేది స్వాతంత్య్రం ఇచ్చిన కానుకగా సీతారాం అనాడే పసిగట్టారు. బీద మగవాళ్లు మద్యపానానికి బానిసలయి ఇల్లును గుల్ల చేసుకుంటారని భార్యలను చిత్రహింసల పాలు చేస్తారని, అనుమానిస్తారని 1957లోనే సీతారాం కథ రాసారంటే, ఈ స్వాతం త్య్రం మీద ఆయనకున్న ముందుచూపు అర్థమైతుంది.గూడూరి సీతారాం ‘లచ్చి’ కథలో తెలంగాణ భాషను అద్భుతంగా వాడారు.

‘ఎండ్ర కాయలు, చేపలు పట్టటానికి వెల్తాడు’
‘పెండ్లానికి కూడా బుద్ది పుట్టినపుడు ఓ బుంగడంత కల్లు తీసుకొస్తాడు’
‘రంగని మనుసంతా కలికలి అయి’
‘రోజు అడుక్కొస్తున్న గంజి, అంబలి’
‘ఎన్గడి వడ్లు దంచబోతే’
‘ఎన్ని సురగంగలు ఉప్పొంగనాయో’
ఇలా తెలంగాణ భాష అద్భుతంగా వాడారు. మొత్తం తెలంగాణ భాషలో చెప్పిన కథ .
‘లచ్చి’ తన జన్మలోనే కాక తన అమ్మమ్మ జన్మలో కూడా కట్టెలు కొని ఎరుగదు ’
స్వాతంత్య్రం వచ్చిన తొమ్మిది సంవత్సరాలకే రాసిన కథ . స్వాతంత్య్ర ఫలితాలపైన చెప్పారు సీతారాం.

- సి.హెచ్. మధు

35

MADHU CH

Published: Sun,November 27, 2016 01:50 AM

మంచి ఆలోచనను పాడుచేసిన మోదీ

ఒక దశాబ్ద కాలం నుంచి నాలాంటి వాళ్లెందరో ఐదు వందల నోట్లు రద్దు చేయాలని, ఇవి ధనవంతుల దాచివేతకు ఉపయోగపడుతున్నాయని, విలువ ఎక్కువ గనుక

Published: Fri,September 6, 2013 12:50 AM

ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం

సీమాంధ్రులు మేం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని గొంతుచించుకుని అరుస్తున్నారు. అభివృద్ధి అంటే ఏమి టి? ఎవరి అభివృద్ధి జరిగింది? అసల

Published: Sun,March 10, 2013 12:56 AM

ఉగ్రవాదాన్ని అరికట్టలేమా?

దిల్‌సుఖ్‌నగర్ రోడ్డు మీద అమాయకుల శవాలు గుండెను మండిస్తాయి. గుండె కరిగిపోతున్నది. ఆ రాత్రి ఒక నిమిషం కూడా నిద్రరాలేదు. ఒక భయం ఒక

Published: Sat,October 6, 2012 05:23 PM

సంధికాలంలో సమష్టిపోరు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పనిచేస్తుందా అనుమానమే! అన్ని శాఖ లు నిర్లిప్తంగా ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? ఇంత అధ్వాన్నమైన ప్రభుత్వ

Published: Sat,October 6, 2012 05:24 PM

నీళ్లివ్వలేని నేతలు నీతులు చెప్పడమా?

చిదంబరం తానన్న మాటలకు సిగ్గుపడ్డారో లేదో తెలియదు కానీ, ఆయన మాటలకు జాతంతా సిగ్గుపడ్డది. మధ్య తరగతి ప్రజల గురించి ఆయన మాటల కు, ఆయన ఈ

Published: Sat,October 6, 2012 05:24 PM

ప్రణబ్ ఏ వర్గం ప్రతినిధి?

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన ప్రణబ్ ముఖర్జీ ఎవరికి నాయకుడు? ప్రజలకా? మామూలు ప్రజలకు ఆయన పేరు కూడా సరిగ్గా తెలియద

Published: Sat,October 6, 2012 05:25 PM

తరాలు మారినా అవే అంతరాలు!

స్వాతంత్య్రం వచ్చి అరవై ఐదేళ్లు దాటింది. జాతి మూడో తరంలోకి ప్రవేశించింది. మూడో తరం నాయకత్వం సింహాసనం మీదికి రాబోతున్నది. మూడో తరాన

Published: Sat,October 6, 2012 05:26 PM

అవిశ్వాసం వెనుక ఆంతర్యం!

రైతు కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం, రైతు కోసమే ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకోవడం... ఇదం తా రైతు కోసమేనా? రైతు కోసం సాగిన అసెంబ