ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం


Fri,September 6, 2013 12:50 AM


సీమాంధ్రులు మేం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని గొంతుచించుకుని అరుస్తున్నారు. అభివృద్ధి అంటే ఏమి టి? ఎవరి అభివృద్ధి జరిగింది? అసలు మిమ్ముల రమ్మ న్న వారెవరూ? మీరు అంటున్న అభివృద్ధి అడిగిన వారెవరు? హైదరాబాద్ అభివృద్ధి నీడలో జరిగిన విధ్వంసం వల్ల మా తెలంగాణ పల్లెలు బోసిపోయాయి. కన్నీరు కారుస్తున్నాయి. తెలంగాణకు పల్లెలే ప్రాణం. మీరు వచ్చి ‘అభివృద్ధి’ పేరుతో పల్లెకు పట్నానికి మధ్య దూరం పెంచారు. మా పట్నంలో కార్పొరేట్ సంస్కృతిని పెంచి పోషించారు. దీనివల్ల తెలంగాణ సమస్త విలువలు ధ్వంసమయ్యాయి. మీరు చేసిన హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణలో సామాజిక, ఆర్థిక అంతరాలను పెంచింది. అన్నికంటే ముఖ్యంగా అభివృద్ధి పేరుతో మీ విశృంఖల దోపిడీ కొనసాగింది. మీ దోపిడీకి అడ్డుకావచ్చని విప్లవ సూర్యులను దూరంగా తరిమేశారు. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో మీరు అభివృద్ధి చెందారు. మీము అభివృద్ధి చేశాం. మమ్ములను పొమ్మంటారా? అని గోల చేస్తున్నారు. కానీ అభివృద్ధి అంటే ఏమిటి? విభజన జరిగితే మీ కార్పొరేట్ సామ్రాజ్యానికి వచ్చిన నష్టమేమిటో అర్థం కావడం లేదు. భౌగోళికంగా విభజన తప్ప రాజకీయంగా మీ పట్టు పోతుందనా? దానికోసమే, మీ కోసమే కార్పొరేట్ సామ్రాజ్యాన్ని రక్షించడానికే కాంగ్రెస్ కుట్ర అటు ఇటు నిప్పులు రాజేస్తున్నది. ఆ పట్టు కోసమే చంద్రబాబు లేఖస్త్రాలు, నటన. ఎన్టీఆర్‌ను మించిన నటుడు చంద్రబాబు. అందుకే ఆయన నూతన రాష్ట్ర రాజధానికి ఐదు లక్షల కోట్లు అడిగారు. ఇవి కార్పొరేట్ సామ్రాజ్యం కోసమే.

సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రోడ్డపైకి వస్తున్నారు. వారి భావన పట్ల సానుభూతి చూపించాల్సిందే. తెలుగు ప్రజలంతా ఒకటే అనే నినాదం కింద వాళ్లు ఈ విభజనను వ్యతిరేకిస్తున్నారు. ఒకరకంగా ఇది తెలంగాణను వ్యతిరేకించడం కాదు. ‘తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉన్నాం. ఒకటిగా ఉండాలని వారి వాంఛ’. ఈ ఆకాంక్ష ఆశయం గొప్పదే అయితే ఈ పరిస్థితులు ఎందుకొచ్చాయి? ఎవరి తప్పువల్ల ఈ పరిస్థితులు వచ్చాయి? సమైక్యత కోరుకుంటున్న ప్రజలకు విజ్ఞప్తి- మా తెలంగాణ మాకు కావాలని ఈ ప్రాంత ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలని మీ రాజకీయ నాయకులను నిలదీయండి. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌డ్డి, జగన్‌ను, కావూరిని, లగడపాటిని నాలుగున్నర కోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని 1969 నుంచి ఎందుకు కోరుకుంటున్నారో చెప్పమనండి. 2001 నుంచి కేసీఆర్ నాయకత్వంలో ఎందుకు ఉద్యమిస్తున్నారని నిలదీయండి. సీమాంధ్ర ప్రజలారా మీకు వాస్తవం తెలియాలి. దోపిడీ రాజకీయ శక్తుల, కార్పొరేట్ శక్తుల (ఇద్దరూ ఒకటే) కుతంవూతాలు మీకు తెలియాలి. వారు ఒకే ఒక సమాధానం చెబుతా రు. ‘పదవి కోసం కేసీఆర్ చేస్తున్న రాజకీయం’ అనేస్తారు! మీరు నమ్ముతారా? ఇప్పటి సీమాంధ్ర ఉద్యమాన్ని, హైదరాబాద్‌లో తమ ఆస్తులను నిలుపుకోవడానికి కార్పొరేట్ శక్తులు ఆడుతున్న నాటకంగా మేమంటే మీకెంత రోషయంగా ఉంటుంది? తెలంగాణ మీద తమ రాజకీయ పెత్తనం నిలుపుకోవడానికి సీమాంధ్ర నేతల కుట్రగా మేమంటే మీకు ఎంత కోపంగా ఉంటుంది. అందరిదీ ఒకటే రాజకీయం. అందుకే అంటున్నాం. ఇరు ప్రాంతాల ప్రజలు ఒకటి. రాజకీయ నేతలంతా ఒకటి. మనం జాగ్రత్తగా ఉందాం. భౌగోళికంగా రాష్ట్ర విభజన జరుగుతుంది. మానసికంగా కలి సే ఉంటాం. ఎక్కడి వారిమి అక్కడే ఉంటాం. ఎవ్వరినీ వెళ్లగొట్టే ప్రశ్న ఉండదు. ఎవరి కడుపు కొట్టే ప్రశ్న ఉండదు. ఎవరి బతుకు దెరువుకు దోఖా ఉండదు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎక్కడైనా జీవించవచ్చు. ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. ఇది ప్రాథమిక హక్కు. ఉమ్మడి కుటుంబం నుంచి ఒక తమ్ముడు విడిపోవాలనుకుంటున్నాడు. విడిగా బతకాలనుకుంటున్నా డు. ఇది మామూలు విషయం. అన్నదమ్ముల్లా విడిపోవాలి. హాయిగా కలిసి ఉండాలి. ఒకరి అభివృద్ధి కోసం ఒకరు చేయూతనివ్వాలి. పం పకంలో ఎవరికీ నష్టం రాకూడదు. అది చూసుకొండి.

తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని కోరుకోవడం వెనుక మీ రాజకీయ నాయకుల పాత్ర ఉన్నది. వారి దోపిడీ, మోసం, కుట్రలు దీనికి కారణం. ఇందులో ప్రజల తప్పు ఏమీ లేదు. 1956లో తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకుండా ఎందుకు కలుపుకున్నారని ప్రశ్నించండి. విలీన సమయంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఎందుకు అమలుచేయలేదని అడగండి. 1969 ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఓటు వేశారు. అప్పుడు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని నిలదీయండి. ఒప్పందం ప్రకారం తెలంగాణకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించండి. తెలంగాణ యాసను ఎందుకు అవమానించారని, 1969 తర్వాత ఆ ప్రాంత ప్రజల అసంతృప్తిని తొలగించడానికి ఎందుకు ప్రయత్నించలేదని అడగండి. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. అలాంటి పార్టీతో 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ తెలంగాణ ఇస్తామని పొత్తు ఎందుకు పెట్టుకున్నవో నిలదీయండి. 2009లో అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ అనుకూల ప్రకటన ఎందుకు చేశారో అడగండి. మీ ప్రాంత నాయకులు చేసిన తప్పులకు తెలంగాణ ఆకాంక్షను బలిపెట్టడం న్యాయమా? ఇంకో ప్రశ్న అడగండి. విభజనకు ముందు పరిష్కరించుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత. దీనిపై ఆ పార్టీని నిలదీయండి. అంతే తప్ప సమైక్యాంధ్ర ముందు తెలంగాణ వద్దు అనడం సరికాదు. నాయకుల తప్పులకు తెలంగాణ ప్రజల ఆకాంక్షను ముడిపెట్టకండి.

అలాగే తెలంగాణ డిమాండ్ దశాబ్దాలుగా ఉన్నది. తెలంగాణ ఇవ్వక తప్పదనే ఆలోచనలు ముసురుకున్నాయి. విజయవా డ, కర్నూలు, విశాఖపట్నం, గుం టూరు లాంటి పట్టణాలను హైదరాబాద్‌తో సమానంగా ఎందుకు అభివృద్ధి చేయలేదో అడగండి. ఇక హైదరాబాద్ అభివృద్ధి గురిం చి పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ అభివృద్ధి సంపన్న వర్గాలదే తప్ప వేరే కాదు. అన్ని ప్రాంతాలకు ముఖ్యంగా పేద ప్రజలకు చెంది న హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాల భూములన్నీ కొంతమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అభివృద్ధి అంటే ఏమిటి? మనిషికి మనిషికి మధ్య అంతరాలు పెరగటమా? మీరంటున్న ‘అభివృ ద్ధి’ నీడలో మనిషి యాంత్రికమయ్యాడు. తెలంగాణ సంస్కృతి వేరు హైదరాబాద్ సంస్కృతి వేరుగా మార్చేశారు. ఇది అభివృద్ధి కాదు విధ్వంసం. ‘అభివృద్ధి’ అనేది ఏమైనా జరిగింది అంటే..అది నిజాం నవాబు కాలంలోనే జరిగింది. ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సాలార్‌జంగ్ మ్యూజియం, అసెంబ్లీ ఇవీ అభివృద్ధికి చిహ్నాలు. ఆంధ్రవూపదేశ్‌లో మూడు ప్రాంతాలున్నాయి. తెలంగాణ ప్రజలు మా రాష్ట్రం మాకు కావాలంటున్నారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు సమైక్యత కోరుకుంటున్నాయి ఎందుకు? తెలంగాణను ఇంకా దోచుకోవడానికి మాత్రమే. అటు సంఖ్యాబలం- ఇటు తెలంగాణ ఆకాంక్ష. ధర్మం తెలంగాణ వైపున్నది. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది.

-సీహెచ్. మధు

146

MADHU CH

Published: Sun,November 27, 2016 01:50 AM

మంచి ఆలోచనను పాడుచేసిన మోదీ

ఒక దశాబ్ద కాలం నుంచి నాలాంటి వాళ్లెందరో ఐదు వందల నోట్లు రద్దు చేయాలని, ఇవి ధనవంతుల దాచివేతకు ఉపయోగపడుతున్నాయని, విలువ ఎక్కువ గనుక

Published: Sun,March 10, 2013 12:56 AM

ఉగ్రవాదాన్ని అరికట్టలేమా?

దిల్‌సుఖ్‌నగర్ రోడ్డు మీద అమాయకుల శవాలు గుండెను మండిస్తాయి. గుండె కరిగిపోతున్నది. ఆ రాత్రి ఒక నిమిషం కూడా నిద్రరాలేదు. ఒక భయం ఒక

Published: Sat,October 6, 2012 05:23 PM

సంధికాలంలో సమష్టిపోరు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పనిచేస్తుందా అనుమానమే! అన్ని శాఖ లు నిర్లిప్తంగా ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? ఇంత అధ్వాన్నమైన ప్రభుత్వ

Published: Sat,October 6, 2012 05:24 PM

నీళ్లివ్వలేని నేతలు నీతులు చెప్పడమా?

చిదంబరం తానన్న మాటలకు సిగ్గుపడ్డారో లేదో తెలియదు కానీ, ఆయన మాటలకు జాతంతా సిగ్గుపడ్డది. మధ్య తరగతి ప్రజల గురించి ఆయన మాటల కు, ఆయన ఈ

Published: Sat,October 6, 2012 05:24 PM

ప్రణబ్ ఏ వర్గం ప్రతినిధి?

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన ప్రణబ్ ముఖర్జీ ఎవరికి నాయకుడు? ప్రజలకా? మామూలు ప్రజలకు ఆయన పేరు కూడా సరిగ్గా తెలియద

Published: Sat,October 6, 2012 05:25 PM

తరాలు మారినా అవే అంతరాలు!

స్వాతంత్య్రం వచ్చి అరవై ఐదేళ్లు దాటింది. జాతి మూడో తరంలోకి ప్రవేశించింది. మూడో తరం నాయకత్వం సింహాసనం మీదికి రాబోతున్నది. మూడో తరాన

Published: Sat,October 6, 2012 05:26 PM

అవిశ్వాసం వెనుక ఆంతర్యం!

రైతు కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం, రైతు కోసమే ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకోవడం... ఇదం తా రైతు కోసమేనా? రైతు కోసం సాగిన అసెంబ

Published: Sat,October 6, 2012 05:26 PM

గూడూరి సీతారాం ‘లచ్చి’ కథ

గూడూరి సీతారాం మన నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణ కథకుడు, తెలంగాణ భాషను విపరీతంగా ప్రేమించిన రచయిత గూడూరి సీతారాం వెళ్ళిపోయిన తర్వాత

Featured Articles