ఉగ్రవాదాన్ని అరికట్టలేమా?


Sun,March 10, 2013 12:56 AM


దిల్‌సుఖ్‌నగర్ రోడ్డు మీద అమాయకుల శవాలు గుండెను మండిస్తాయి. గుండె కరిగిపోతున్నది. ఆ రాత్రి ఒక నిమిషం కూడా నిద్రరాలేదు. ఒక భయం ఒక వణుకు గుండె నిండా దుఃఖం. మనసునిండా చీకటి. భవిష్యత్ మీద భయం. ఏపాపం చేసుకున్నారు ఈ అమాయకులు పాపం! భారత్‌లో పుట్టడమే పాపమా? నా దేశాన్ని గురించి నేను గర్వంగా చెప్పుకుంటాను. అమాయకులైన శవాలు కూడా బతికున్నప్పుడు గర్వంగానే చెప్పుకున్నాయి. ‘నా దేశం గొప్ప దేశం ఈ దేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను’ అని. దిల్‌సుఖ్‌నగర్ ఘటన తర్వా త కూడా గర్విస్తున్నాను. నా భారత్ మహాన్ ఈ దేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను’ అదే గర్వం నా గుండెల్లో తొణికిసలాడుతున్నది. చనిపోయే వరకు గర్వముంటుంది. ఆ గర్వంతోనే ఇంకో ప్రశ్న కూడా ఉదయిస్తున్నది. ‘ఈ వ్యవస్థ దిల్‌సుఖ్‌నగర్ రోడ్డు మీద శవాలైన అమాయకులను ఎందుకు రక్షించలేకపోతుంది? ’ దిల్‌సుఖ్‌నగర్ రోడ్డు మీద శవాలేకాదు. పదుల సంఖ్యలో క్షతగావూతులు వందల సంఖ్యలో భయకంపితులు. ఈ భయంలో కాలు చెయ్యి విరగొట్టుకున్న అమాయకులు. ఈ దృశ్యాలు కనుల ముందు నుంచి చెదిరిపోవటం లేదు. చాలాకాలం వర కు చెదిరిపోవు. ఏ పాపం చేసుకున్నారు వీళ్లు? వీరు ఏపాపం చేశారని ఈపాపానికి ఒడిగట్టారు రాక్షసులు? ఇంత రాక్షసత్వమా? వీరు మనుష్యులేనా? మానవ రూపంలో ఉన్న రక్తం రుచిమరిగిన దుర్మార్గులా? రాజకీయానికి, రాజకీయ కక్షకు, ఒకదేశం మీద ప్రతీకారానికి ఇంత దుర్మార్గానికి ఒడిగడుతారా- వీరు తీవ్రవాదులు. ఉగ్రవాదులు ఎవరైనా కావచ్చు నరరూపరాక్షసులు. ఎంటువంటి ఉగ్రవాదులైనా కావచ్చు. ఇంత క్రూరంగా ఎలా వుంటారనేది? పూర్తి అమాయకులను చంపటానికి వారికి చేతులు ఎలా వచ్చాయి? దిల్‌సుఖ్‌నగర్ బాంబు ప్రేలుడంలో మరణించిన వారికి క్షతగావూతులైన వారికి కసబ్ ఉరితో సంబంధం లేదు. కాశ్మీర్ అంశంతో సంబంధంలేదు. అఫ్జల్‌గురు ఉరిలో ప్రమేయంలేదు. పూర్తి అమాయకులు వారు. రాజకీయాలు తెలిసినా వాటి జోలికి వెళ్లినవారు కాదు. చట్టం- తీర్పులు- ఉరి సంగతి తెలిసినా వాటిలో వేలు పెట్టిన వారు కాదు. ప్రపంచీకరణ వ్యవస్థలో తమ బతుకులను మైలు రాళ్లు దాటించటానికి మహా ప్రయాసతో బ్రతుకులు ఈడుస్తున్నవారు. తమ బ్రతుకు ప్రయాణంలో బతు కు ముళ్ల దారిలో దిల్‌సుఖ్‌నగర్ రోడ్డు మీద ఉన్నవారు. వారు చేసిన తప్పువుందా? రోడ్డుపైకి రావటం బతుకు తప్పనిసరి. సాయంకాలం ఏడుగంటల సమయంలో వచ్చారు. లక్షలాదిమంది ఆ సమయంలో రోడ్డుమీద ఉంటారు. దిల్‌సుఖ్‌నగర్ జనసమ్మర్థం గల ఒక వ్యాపార కూడలి. ఈ క్రూరులు ఆప్రాంతాన్ని ఎంచుకున్నా రు. సైకిల్‌కు బాంబులు పెట్టి పేల్చేశారు. అమాయకులు నేలకొరిగారు. మరికొందరు అమాయకులు క్షతగావూతులయ్యారు.

రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో ఇప్పుడు భయం తారల్లాడుతున్నది. ఈ పరిస్థితికి, భయానికి, భయంకర సంఘటనకు కారకుపూవరు? ఎవరు బాధ్యులు? ఉగ్రవాద చర్య అని ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. కొన్ని లక్షలు పరిహారం ఇచ్చి ఇంతే సంగతులంటుంది. నేరస్తులను పట్టుకుంటామని హామీ ఇస్తుంది. మన ప్రభుత్వం తక్కువ శక్తిగలది కాదు. ముందు జాగ్రత్త విషయంలో అనుమానమేగానీ సంఘటన తర్వాత భలేగా పనిచేస్తుంది. పట్టుకొంటుంది, చట్టానికి అప్పగిస్తుంది. చట్టం తన పని తాను చేస్తుంది. ఉరిశిక్ష జీవితకాలం ఖైదు శిక్షలు వేస్తుంది. శిక్షల తర్వాత ప్రతీకారం. మళ్లీ మొదలు.. మళ్లీ ఇటువంటి బాంబు దాడులు.. మళ్లీ అమాయకుల మృతి. మళ్లీ ఇదే దుఃఖం. మళ్లీ ఇదే గుండెకోత.. ఈ వ్యవహారం.. ఇలా ఎంతకాలం? ఇలా ఎంతకాలం అమాయకుల మృతి? అసలు సమస్య కాశ్మీర్, అది పరిష్కారం కాదు. అసలు సమస్య పాకిస్తాన్.. ఆ దేశంలో స్నేహం సాధ్యంకాదు. స్నేహానికి అటు ఇటూ ఎవరూ ముందుకు రారు. ముందుకు వచ్చినా అడ్డంకిగా మళ్లీ కాశ్మీర్. అది పరిష్కారం కాదు. ఏది పరిష్కారం కాదు. అమాయకుల చావులు ఎంతకాలం? ‘పెళ్లి అయితే తప్ప పిచ్చి కుదరదు. పిచ్చి కుదిరితే తప్ప పెళ్లికాదు’ ఇలా వుంది పరిస్థితి. కాశ్మీర్ సమస్యకు ఉగ్రవాదానికి సంబంధముంది. కాశ్మీర్ సమస్యకు పాకిస్తాన్‌తో సంబంధాలకు, అమాయకుల చావులకు సంబంధముంది.

నిజానికి అమాయకుల చావుకు కాశ్మీర్ సమస్యకు సంబంధం లేదు. కానీ అంటగడుతున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో చనిపోయిన అమాయకులకు కాశ్మీర్ సమస్యకు సంబంధమేముంది? ఉగ్రవాదం దారితప్పింది. ఉగ్రవాదం’ ప్రతీకారాన్ని కోరుకుంటున్నది. ఇక్కడే కాదు అంతటా అదే పరిస్థితి. మీడియా వ్యాఖ్యానాలను దృష్టి లో ఉంచుకుని మనం అంచనాకు రావచ్చు. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటనలను దృష్టిలో పెట్టుకుని దిల్‌సుఖ్‌నగర్ హత్యల మీద ఓ అంచనాకు రావ చ్చు. కసబ్ ఉరిశిక్షకు, అఫ్జల్‌గురు ఉరిశిక్షకు ప్రతీకారంగా దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదుల బాంబులు పేలవచ్చు. ఫలానా ఉగ్రవాద సంస్థ కారణం కావచ్చునని ప్రభుత్వమే అంటుంది. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అన్నారు. రెండు రోజుల ముందే సమాచారం అందింది. ఇటువంటి దాడులు జరుగుతాయని’ ఇంకేం సాక్ష్యాలు కావాలి? ఉగ్రవాదులు అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. దాన్ని ఖండించాల్సిందే! వారు నరరూప రాక్షసులు వారిని ఏరివేయాల్సిందే! సాధ్యం కావటంలేదు. ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నారు. చేసిన వారిని పట్టుకుంటాం చట్టం ముందు నిలబెడతాం, శిక్షవేస్తాం, ఉరితీస్తాం...సమస్య తీరుతుందా? చెట్టు వేళ్లు మొదలు నాశనమౌతా యా? అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవటం ఆగుతుందా?ఉగ్రవాదుల దొంగదెబ్బలు ఆగిపోతాయా? సమస్య లోతులలోకి వెళ్లకుండా చట్టం... శిక్ష... అంటే ఉగ్రవాదం నేలమట్టం కాగలదా? పేలుళ్ళు పదే పదే జరుగుతున్న భారతదేశంలోని వివిధ స్థలాలలో ఉగ్రవాద సంస్థల దాడులకు పాకిస్తాన్ కారణమంటు న్నాం. పాకిస్తాన్‌తో స్నేహం పటిష్టవంతం కానంతవరకు ఉగ్రవాదం ఆగదు. కాశ్మీర్ సమస్య పరిష్కారం జరిగేవరకు పాకిస్తాన్‌తో స్నేహం పటిష్టవంతం కాదు. ఇవి జరి గే వరకు ఉగ్రవాదుల దాడులు జరుగుతూనే ఉంటాయి. అమాయకుల ప్రాణాలు నేలరాలుతూనే ఉంటాయి.

ఎన్ని జరిగాయి ఇలా... బొంబాయి, మలేంగావ్, పార్లమెంట్ దాడి, దేశంలోని వివిధ ప్రాంతాల విషయం అలా ఉండనిద్దాం. హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో జరిగాయి. 2007 ఆగస్టు 25న లుంబినీ పార్క్‌లోని లేజర్ షో ఆడిటోరియంలో, కోఠిలోని గోకుల్ చాట్‌బండార్‌లో బాంబులు పేలాయి. ఇది ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు సృష్టించిన దారుణం. 44 మంది అమాయకులు మృతి చెందారు 70 మంది గాయపడ్డారు. 2007 మే 18న మక్కా మసీదు సెల్‌ఫోన్ బాంబు పేలుళ్ల లో పదిమంది మృతి చెందారు. యాభైమంది గాయపడ్డారు. 2006 మే 7న ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ఓడియన్ సినిమా థియేటర్‌లో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 2005 అక్టోబర్ 12 సోమాజిగూడ టాస్క్‌ఫోర్స్ కమిషన ర్ కార్యాలయం వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో ఇద్దరు మృతి చెందారు. 2004 నవంబర్ 1న సరూర్‌నగర్‌లో బాంబుపేలి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 2002 సాయిమందిరం వద్ద 21 నవంబర్‌న బాంబు పేలింది. ఒక మహిళ మృతి చెందింది. 25 మందికి పైగా మృతి చెందారు. హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోనే 14 తీవ్రవాద సంస్థలున్నాయని పత్రికలు రాస్తున్నాయి. వీటికి విరుగుడు ప్రభుత్వం వద్ద వుందా? అమాయకుల ప్రాణాలను రక్షించగలదా?

2002 నుంచి ఇప్పటి దిల్‌సుఖ్‌నగర్ హత్యాకాండ దాకా పయనించాం! అంటే పదకొండు ఏళ్లలో మూడు నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మారాయి. కేంద్రంలో కూడా రెండు ప్రభుత్వాలు మారాయి. 2002 నవంబర్ బాంబు పేలుడులో ఒక మహిళ మృతి చెంది 25 మంది గాయపడ్డారు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో పదిహేడు మంది చనిపోయారు. 80 మందికి పైగా గాయపడ్డారు. ఇది పురోగతి! 2002 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగా ఆరు ఉగ్రవాద దాడులలో సుమారు 82 మంది మృతి చెందగా 229 మందికి గాయాలయ్యాయి. ఇది ఉగ్రవాద అభివృద్ధి. ఉగ్రవాదానిది రాక్షసత్వ అభివృద్ధి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం సాధించినట్టు? ప్రకటనలు.. హడావుడి.. హంగా మా.. శిక్షలు ఉరిశిక్షలు.. వీటిలో సాధించిదేమిటీ? అనేది ప్రశ్న . ఈ ప్రభుత్వాలు అమాయకుల ప్రాణాలు ఉగ్రవాదుల రాక్షసత్వంలో బలికాకుండా ఆపగలుగుతున్నాయా?పార్లమెంట్‌పై దాడి జరిగింది. నేరస్తులను పట్టుకున్నాం, శిక్షించాం. ఉరిశిక్ష వేస్తాం. మన వ్యవస్థ చాలా గొప్పగా ఉంది. మన భద్రతా దళాలు భేషుగ్గా ఉన్నా యి. మన చట్టం నేర పరిశోధన ప్రశంసనీయం. రహస్యంగా ఉరితీయటం ఇంకా గొప్పదే. హోంమంవూతులలో కెల్లా షిండే ఉరిశిక్షలలో ఉక్కు మనిషి. ఏమి సాధించినట్టు? కసబ్, అఫ్జజ్‌గురు ఉరిశిక్షలకు వాళ్లు దిల్‌సుఖ్‌నగర్‌లో అమాయకులను చంపి కక్ష తీర్చుకున్నారు. దాడులు జరిగే అవకాశముందని రెండు రోజుల ముందే తెలుసని షిండే అంటున్నారు. ‘రెండు రోజుల ముందే తెలుసు. రాష్ట్రాలకు వర్తమానం పంపాం’ ఇదీ ఆయన ధోరణి. ఆయన చేతిలో భద్రతా దళాలు లేవు. వర్తమానం పంపాం.. అఫ్జల్‌గురును ఉరితీస్తున్నామని స్పీడ్ పోస్టులో పంపాం అంటున్నారు. మనం హోంమంవూతిని పోస్టుమెన్‌గా భావించగలమా? ఉగ్రవాదుల దాడుల నుంచి అమాయకులను రక్షించాలంటే పాకిస్తాన్‌ను దారికి తెచ్చుకోవాలి. అదెలా? పాకిస్తాన్‌ను, ఉగ్రవాదులను చావుదెబ్బతీయాలి. అదెలా? మన విదేశాంగ విధానమేమిటో అర్థం కాదు. చుట్టు ఉన్నవన్నీ చిన్నదేశాలే! అన్నీ మనకు శత్రు దేశాలే! మనను అనుమానంగా చూస్తున్న దేశాలే!

-సీహెచ్.మధు

35

MADHU CH

Published: Sun,November 27, 2016 01:50 AM

మంచి ఆలోచనను పాడుచేసిన మోదీ

ఒక దశాబ్ద కాలం నుంచి నాలాంటి వాళ్లెందరో ఐదు వందల నోట్లు రద్దు చేయాలని, ఇవి ధనవంతుల దాచివేతకు ఉపయోగపడుతున్నాయని, విలువ ఎక్కువ గనుక

Published: Fri,September 6, 2013 12:50 AM

ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం

సీమాంధ్రులు మేం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని గొంతుచించుకుని అరుస్తున్నారు. అభివృద్ధి అంటే ఏమి టి? ఎవరి అభివృద్ధి జరిగింది? అసల

Published: Sat,October 6, 2012 05:23 PM

సంధికాలంలో సమష్టిపోరు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పనిచేస్తుందా అనుమానమే! అన్ని శాఖ లు నిర్లిప్తంగా ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? ఇంత అధ్వాన్నమైన ప్రభుత్వ

Published: Sat,October 6, 2012 05:24 PM

నీళ్లివ్వలేని నేతలు నీతులు చెప్పడమా?

చిదంబరం తానన్న మాటలకు సిగ్గుపడ్డారో లేదో తెలియదు కానీ, ఆయన మాటలకు జాతంతా సిగ్గుపడ్డది. మధ్య తరగతి ప్రజల గురించి ఆయన మాటల కు, ఆయన ఈ

Published: Sat,October 6, 2012 05:24 PM

ప్రణబ్ ఏ వర్గం ప్రతినిధి?

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన ప్రణబ్ ముఖర్జీ ఎవరికి నాయకుడు? ప్రజలకా? మామూలు ప్రజలకు ఆయన పేరు కూడా సరిగ్గా తెలియద

Published: Sat,October 6, 2012 05:25 PM

తరాలు మారినా అవే అంతరాలు!

స్వాతంత్య్రం వచ్చి అరవై ఐదేళ్లు దాటింది. జాతి మూడో తరంలోకి ప్రవేశించింది. మూడో తరం నాయకత్వం సింహాసనం మీదికి రాబోతున్నది. మూడో తరాన

Published: Sat,October 6, 2012 05:26 PM

అవిశ్వాసం వెనుక ఆంతర్యం!

రైతు కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం, రైతు కోసమే ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకోవడం... ఇదం తా రైతు కోసమేనా? రైతు కోసం సాగిన అసెంబ

Published: Sat,October 6, 2012 05:26 PM

గూడూరి సీతారాం ‘లచ్చి’ కథ

గూడూరి సీతారాం మన నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణ కథకుడు, తెలంగాణ భాషను విపరీతంగా ప్రేమించిన రచయిత గూడూరి సీతారాం వెళ్ళిపోయిన తర్వాత

Featured Articles