సంధికాలంలో సమష్టిపోరు


Sat,October 6, 2012 05:23 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పనిచేస్తుందా అనుమానమే! అన్ని శాఖ లు నిర్లిప్తంగా ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? ఇంత అధ్వాన్నమైన ప్రభుత్వాన్ని ఇంత వరకు చూడలేదు. ఎవరిపనివారిది. ఎవరి భయం వారిది. వీటిమధ్య పసిపిల్లల మరణాలు, ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల లొల్లులు, కరెంట్‌కోత.. అంతా అస్తవ్యస్తం. ఇవన్నీ ప్రజల బాధలు. ప్రభుత్వానికి పట్టింపు లేదు. ప్రభుత్వాధినేతలకు, అధికారులకు సమన్వయం ఉన్నదా? మంత్రుల మధ్య సయోధ్య ఉన్నదా? అధికారులు స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారా? అసలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి ప్రభుత్వంపై పట్టులేదు. దీనివల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. వైద్యం అందక సర్కార్ ఆస్పవూతుల్లో పసిపిల్లల మరణాలు ఎంత అన్యాయం! ప్రభుత్వ అసమర్థత వల్ల పసి పిల్లలు చనిపోతున్నారు. ముఖ్యమంవూతితో సహా కాంగ్రెస్ పెద్దలు మంత్రులు అవసరం ఉన్నా లేకున్నా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఆంధ్రవూపదేశ్‌లో ఏమి జరుగుతున్నదో ఢిల్లీ పెద్దలకు తెలియదు. తెలిసినా పట్టించుకునే స్థితిలో లేరు. ఎవరి స్వార్థం వారిది. ఎవరి భయం వారిది. ప్రజల గురించి, వారి సమస్యల గురించి పట్టించుకునే సమయం వారికి లేదు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి ఆత్మవిశ్వాసం చెదిరింది. ఢిల్లీ తన ను పదవీలో ఉంచుతుందో ఊడబెరుకుతుందో ఆయనకు అర్థం కావడం లేదు. వైఎస్‌ఆర్ చేపట్టిన ప్రభుత్వ పథకాల స్థానంలో ఎన్ని కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ప్రజలు ఆమోదం లభించటం లేదు. ధర్మాన ప్రసాదరావు రాజీనామా ఆమోదానికి దమ్ముచాలటం లేదు. ధైర్యంగా ధర్మాన రాజీనామా ఆమోదించి, కొత్తవారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే పరిస్థితి మరోలా ఉండేదేమో. రాష్ట్రాన్ని, మూడు ప్రాంతాలను సమన్వయ పరుస్తూ ముందుకు పోవడం కిరణ్‌కుమార్‌డ్డికి చేతకావడంలేదు. పైగా ఆయన ఢిల్లీనుంచి దిగుమతి అయిన ముఖ్యమంత్రి. ఆయన చెపితే ఎవరు ఎందుకు వింటారు? రాజకీయ సంక్షోభం రావాలని పదవులు ఆశిస్తున్న రాజకీయనాయకులకు ఉన్నది. ఎన్నికలు రావాలని మరికొందరికి ఉన్నది. కాబట్టి ఎవరి ఇష్టారాజ్యం వారిదైంది. మరోవైపు తెలంగాణ ఉద్యమ సెగ ఉండనే ఉన్నది. దాన్నుంచి తప్పించుకోలేక, దాన్ని పరిష్కరించలేక ముఖ్యమంత్రి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్వపక్షంలోనే విపక్షం ఉండటంతో.. కాలు కదుపలేక, స్థిరంగా ఉండలేక సతమతమవుతున్నాడు.

సీఎంగా కిరణ్‌కుమార్‌డ్డిని చూసి కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఎవరూ ఎందుకు భయపడతారు? 2014 లో గెలిపించేది ఆయనకాదు. టిక్కెట్లు ఇచ్చేది కూడా ఆయనకాదు. అప్పటి దాకా ఉంటారో తెలియదు. అంతా ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉన్నది. సీబీఐ పుణ్యమా అని ఆంధ్రవూపదేశ్‌లో రాజకీయ అస్థిరత్వం నెలకొన్నది. అయితే దర్యాప్తు పూర్తి అయిన తర్వాత, చార్జిషీట్‌లు, అరెస్టులు ఒకేసారి చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. నిరంతరం భయపెట్టడం, భయపడే పద్ధతులు అవలంబించటం సరైన పద్ధతి కాదు. అయితే ప్రజల ఇబ్బందులు చూడాల్సిన మంత్రులే ఇప్పుడు ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. రేపు తమ భవిష్యత్ ఏమవుతుందో తెలియని పరిస్థితులలో మంత్రులు ఎలా పనిచేయగలరు? ప్రజల గురించి ఏమి ఆలోచించగలరు? సీబీఐ దర్యాప్తులో కిరణ్‌మంవూతివర్గంలో ఎందరు దోషులని తేల్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితిది.

ఆంధ్రవూపదేశ్ అస్థిరత్వానికి లోనుకావడానికి మరో కారణం ఉన్నది. తెలంగాణ సమస్యను తేల్చకుండా ఏళ్లతరబడి నాన్చటం. బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వాల కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఉంటుందో, ప్రత్యేక రాష్ట్రంగా అవుతుందో తెలియని పరిస్థితుల్లో పరిపాలన ఎలా ఉంటుంది? మంత్రులైనా అధికారులైనా ఏ నిర్ణయాన్ని ఎలా తీసుకోగలరు? ప్రభుత్వ అస్థిరత్వం ప్రజల పాలిట శాపంగా మారింది.
ఆంధ్రవూపదేశ్ గురించి ఆలోచించే తీరిక ప్రధానికి లేదు. సోనియాగాంధీ వ్యక్తిగత కక్ష తీర్చుకోవటంలో దృష్టి పెట్టారు. ప్రజల సంగతి గాలికి వదిలారు. చిదంబరం హోం మంత్రిగా ఓ మెట్టెక్కినా ఆయన కార్పొరేట్ సామ్రాజ్య ప్రతినిధి. ఆయనకు ప్రజలు గుర్తుండరు. ఆంటోనీ రాజభక్తుడు. అహ్మద్‌ప సోనియా భక్తుడు. ఈ పరిస్థితిలో.. ప్రజలంతా సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా సాగాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలు సమష్టి పోరాటం ద్వారా తమ ఆకాంక్షను నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఒక సంధికాలం లాగా కనిపిస్తున్నది. ఇదే తరుణంలో తెలంగాణ ప్రజలు తమదైన పోరాట పటిమతో ముందుకు సాగాలి. తెలంగాణ సాకారం చేసుకోవాలి.

-సీహెచ్ మధు

35

MADHU CH

Published: Sun,November 27, 2016 01:50 AM

మంచి ఆలోచనను పాడుచేసిన మోదీ

ఒక దశాబ్ద కాలం నుంచి నాలాంటి వాళ్లెందరో ఐదు వందల నోట్లు రద్దు చేయాలని, ఇవి ధనవంతుల దాచివేతకు ఉపయోగపడుతున్నాయని, విలువ ఎక్కువ గనుక

Published: Fri,September 6, 2013 12:50 AM

ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం

సీమాంధ్రులు మేం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని గొంతుచించుకుని అరుస్తున్నారు. అభివృద్ధి అంటే ఏమి టి? ఎవరి అభివృద్ధి జరిగింది? అసల

Published: Sun,March 10, 2013 12:56 AM

ఉగ్రవాదాన్ని అరికట్టలేమా?

దిల్‌సుఖ్‌నగర్ రోడ్డు మీద అమాయకుల శవాలు గుండెను మండిస్తాయి. గుండె కరిగిపోతున్నది. ఆ రాత్రి ఒక నిమిషం కూడా నిద్రరాలేదు. ఒక భయం ఒక

Published: Sat,October 6, 2012 05:24 PM

నీళ్లివ్వలేని నేతలు నీతులు చెప్పడమా?

చిదంబరం తానన్న మాటలకు సిగ్గుపడ్డారో లేదో తెలియదు కానీ, ఆయన మాటలకు జాతంతా సిగ్గుపడ్డది. మధ్య తరగతి ప్రజల గురించి ఆయన మాటల కు, ఆయన ఈ

Published: Sat,October 6, 2012 05:24 PM

ప్రణబ్ ఏ వర్గం ప్రతినిధి?

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన ప్రణబ్ ముఖర్జీ ఎవరికి నాయకుడు? ప్రజలకా? మామూలు ప్రజలకు ఆయన పేరు కూడా సరిగ్గా తెలియద

Published: Sat,October 6, 2012 05:25 PM

తరాలు మారినా అవే అంతరాలు!

స్వాతంత్య్రం వచ్చి అరవై ఐదేళ్లు దాటింది. జాతి మూడో తరంలోకి ప్రవేశించింది. మూడో తరం నాయకత్వం సింహాసనం మీదికి రాబోతున్నది. మూడో తరాన

Published: Sat,October 6, 2012 05:26 PM

అవిశ్వాసం వెనుక ఆంతర్యం!

రైతు కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం, రైతు కోసమే ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకోవడం... ఇదం తా రైతు కోసమేనా? రైతు కోసం సాగిన అసెంబ

Published: Sat,October 6, 2012 05:26 PM

గూడూరి సీతారాం ‘లచ్చి’ కథ

గూడూరి సీతారాం మన నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణ కథకుడు, తెలంగాణ భాషను విపరీతంగా ప్రేమించిన రచయిత గూడూరి సీతారాం వెళ్ళిపోయిన తర్వాత

Featured Articles