నీళ్లివ్వలేని నేతలు నీతులు చెప్పడమా?


Sat,October 6, 2012 05:24 PM

చిదంబరం తానన్న మాటలకు సిగ్గుపడ్డారో లేదో తెలియదు కానీ, ఆయన మాటలకు జాతంతా సిగ్గుపడ్డది. మధ్య తరగతి ప్రజల గురించి ఆయన మాటల కు, ఆయన ఈదేశ హోంమంత్రి అయినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను. బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి తన దేశ ప్రజలను కించపరుస్తూ మాట్లాడడం దురదృష్టకరం. ఈ దేశ దౌర్భాగ్యం. చిదంబరం మావోయిస్టుల గురించి, 2జీ స్కాం గురించి, అవినీతి గురించి, తెలంగాణ గురించి ఎన్ని మాట్లాడినా, ఎన్ని బొంకినా సరే ఆయన ధోరణిని అర్థం చేసుకోవచ్చు. వాళ్ల రాజకీయాలు అలాంటివని సర్దుకోవచ్చు. వారి దోపిడీ వ్యవస్థ లక్షణాలను అర్థంచేసుకోవచ్చు. ఆ వర్గ రాజకీయ స్వరూపమే అలాంటిదని సర్దుకుపోవచ్చు లేదా పోరాటం చేయవచ్చు. అయితే చిదంబరం మధ్యతరగతి ప్రజలు తాగే నీళ్ల బాటిల్స్ గురించి మాట్లాడడం బాధ కలిగించే విషయం. ఆయన తన మా టలతో మధ్యతరగతి ప్రజానీకాన్ని వెక్కిరించారు.అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టమవాల్సి ఉన్నది. ఉన్నత, మధ్య, నిమ్న వర్గాలు.. ఎవరైనా నీళ్లు తాగకుండా ఉండగలరా? ఉండలేరు. అయితే.. ప్రకృతి ధర్మంగా వర్షం కురుస్తుంది. భూమిలోకి నీరు చేరుతుంది. ఆ నీటిని మార్కెట్ సరుకుగా మార్చిందెవరు? ఇది తేలాల్సిన విష యం. నీటిని వ్యాపారం చేసి, ఇప్పుడు మధ్యతరగతి ప్రజ లు నీళ్ల బాటిళ్లకోసం ఖర్చుపెడతారని వెక్కిరించడం ఎందు కు? ప్రజలను వెక్కిరించడం గాక మరేమిటి? ప్రజలంటే ఇంత చులకనా? రాజకీయ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడడం, ప్రవర్తించడం, ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం అలావాటుగా మారింది. ప్రభుత్వాల వైఖరే వ్యవస్థలోని అన్ని అవస్థలకు మూల కారణం. అస్సాంలో 17 ఏళ్ల అమ్మాయిని ఓ గుంపు రాక్షసంగా వేధించడం, దాన్ని ప్రజలు ఓ షోగా చూడటం, ఓ మహిళా ఎంపీని బహిరంగంగా అవమానపర్చడం సామాజిక హింసాప్రవృత్తిని,బాధ్యతా రాహి త్యాన్ని చెప్పుతున్నది. ఛత్తీస్‌గఢ్‌లో అమాయక పౌరులను, పిల్లలను మావోయిస్టుల సాకుతో హతమార్చడం ప్రభుత్వ దమననీతిని, వర్గనీతిని చాటుతున్నది. ఈ ఘటనలన్నింటికి హోంశాఖ బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? వీటన్నింటిని చిదంబరం ఏ నీతితో..,ఎవరి ప్రయోజనాలు నెరవేర్చడానికి సమర్థించుకుంటున్నారు? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైళ్లో ఉన్నవ్యక్తికి బెయిల్ కోసం కొందరు న్యాయమూర్తులు కోట్లాది రూపాయల లంచానికి పోటీపడడం ప్రజాస్వామ్య పరిపాలనకు నిదర్శనమా? నేటి అవినీతి, దళారీ పాలన వల్లే సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

మాయ మాటలతో ప్రజలను ఎంతో కాలం వంచించ లేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తమదైన పద్ధతుల్లో నిరసనను తెలుపుతున్నారు. పోరాడుతున్నారు. ఆదివాసుల ఊచకోతకు, ప్రజలను హేళన చేస్తూ చిదంబరం తాను అన్న మాటలకు నైతిక బాధ్యత వహించి పదవీ నుంచి తప్పుకోవాలి.చిదంబరం దృష్టిలో మధ్య తరగతి ప్రజలు మంచినీళ్ల బాటిల్స్ కొనడం తప్పు. ఎందుకంటే.. మినరల్ వాటర్ తాగే అర్హత ఈ దేశంలో తనలాంటి ‘ఉన్న’వారికే ఉన్నదని ఆయన భావిస్తునట్టున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు, అల పొందుతున్న మీలాంటి వారికే మినరల్ వాటర్ తాగే అర్హత ఉన్నాదా! మీరే అన్నారు ‘ప్రజలు బియ్యం ధర పెంచితే సహించరు. కానీ మినరల్ వాటర్ తాగడానికి మాత్రం ఇష్టడపతార’ని. వీటిని చిదంబరం వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించలేము. ఈ మాటలను నేటి పాలక వర్గాల నీతిగా చూడాలి. అది ఈ వ్యవస్థ లక్షణం. సంపదలను చేజిక్కించుకుని, అందలం ఎక్కినవారే సర్వ సుఖాలకు అర్హులని ఈ పాలకులు భావిస్తున్నారు. అభివృద్ధి ఫలాలను ఏమాత్రం బడుగుజీవులు అనుభవించాలని అనుకున్నా అది నేటి పాలకులకు విపరీతంగా కనిపిస్తున్నది. అందుకే పాలకులు ప్రజలను అంత చులకనగా చూస్తున్నా రు. సర్వసంపదలను సృష్టిస్తున్న తమకు ఫలాలెందుకు దక్కడం లేదని అడిగితే.. వారిని తీవ్రవాదులుగా ముద్రవేస్తున్నా రు. అలా అడుగుతున్న ప్రజలను శత్రువులుగా భావిస్తూ అణచివేతను అమలు చేస్తున్నారు. అయితే దేశంలో ‘మంచినీరు’ ఎందుకు వ్యాపారంగా మారింది? ప్రజలకు కనీసం తాగునీరు అందించలేని సర్కారు చేతకాని తనంతో మధ్య తరగతి ప్రజలు మంచినీరు ఖరీదు చేసే దుస్థితి దాపురించింది. దీనికి ప్రజలను వెక్కిరించడం కాదు, ఈ పరిస్థితి ఉన్నందుకు పాలకులే సిగ్గుతో తలదించుకోవాలి.స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా ప్రజలకు తాగునీరు అందించలేని చేతగాని ప్రభుత్వాలు ఇవి. మంచినీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తున్నది. పట్టణాల్లోనూ అదే పరిస్థితి. పాలకులకు కార్పొరేట్ సంస్థల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు. నీటి వ్యాపారాన్ని అరికట్టి ప్రజలకు తాగునీటిని అందించలేని పాలకులు ప్రజలను వెక్కిరించడం క్షమించరాని నేరం.

-సీహెచ్ మధు

35

MADHU CH

Published: Sun,November 27, 2016 01:50 AM

మంచి ఆలోచనను పాడుచేసిన మోదీ

ఒక దశాబ్ద కాలం నుంచి నాలాంటి వాళ్లెందరో ఐదు వందల నోట్లు రద్దు చేయాలని, ఇవి ధనవంతుల దాచివేతకు ఉపయోగపడుతున్నాయని, విలువ ఎక్కువ గనుక

Published: Fri,September 6, 2013 12:50 AM

ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం

సీమాంధ్రులు మేం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని గొంతుచించుకుని అరుస్తున్నారు. అభివృద్ధి అంటే ఏమి టి? ఎవరి అభివృద్ధి జరిగింది? అసల

Published: Sun,March 10, 2013 12:56 AM

ఉగ్రవాదాన్ని అరికట్టలేమా?

దిల్‌సుఖ్‌నగర్ రోడ్డు మీద అమాయకుల శవాలు గుండెను మండిస్తాయి. గుండె కరిగిపోతున్నది. ఆ రాత్రి ఒక నిమిషం కూడా నిద్రరాలేదు. ఒక భయం ఒక

Published: Sat,October 6, 2012 05:23 PM

సంధికాలంలో సమష్టిపోరు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పనిచేస్తుందా అనుమానమే! అన్ని శాఖ లు నిర్లిప్తంగా ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? ఇంత అధ్వాన్నమైన ప్రభుత్వ

Published: Sat,October 6, 2012 05:24 PM

ప్రణబ్ ఏ వర్గం ప్రతినిధి?

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన ప్రణబ్ ముఖర్జీ ఎవరికి నాయకుడు? ప్రజలకా? మామూలు ప్రజలకు ఆయన పేరు కూడా సరిగ్గా తెలియద

Published: Sat,October 6, 2012 05:25 PM

తరాలు మారినా అవే అంతరాలు!

స్వాతంత్య్రం వచ్చి అరవై ఐదేళ్లు దాటింది. జాతి మూడో తరంలోకి ప్రవేశించింది. మూడో తరం నాయకత్వం సింహాసనం మీదికి రాబోతున్నది. మూడో తరాన

Published: Sat,October 6, 2012 05:26 PM

అవిశ్వాసం వెనుక ఆంతర్యం!

రైతు కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం, రైతు కోసమే ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకోవడం... ఇదం తా రైతు కోసమేనా? రైతు కోసం సాగిన అసెంబ

Published: Sat,October 6, 2012 05:26 PM

గూడూరి సీతారాం ‘లచ్చి’ కథ

గూడూరి సీతారాం మన నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణ కథకుడు, తెలంగాణ భాషను విపరీతంగా ప్రేమించిన రచయిత గూడూరి సీతారాం వెళ్ళిపోయిన తర్వాత

Featured Articles