ప్రణబ్ ఏ వర్గం ప్రతినిధి?


Sat,October 6, 2012 05:24 PM

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన ప్రణబ్ ముఖర్జీ ఎవరికి నాయకుడు? ప్రజలకా? మామూలు ప్రజలకు ఆయన పేరు కూడా సరిగ్గా తెలియదు. వాళ్లకు ఆయన చేసింది కూడా ఏమీ లేదు. ప్రణబ్ ప్రధాని పదవిని కూడా ఆశించారు. మన దేశంలో ప్రధాని పదవికి, ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా? అనుమాన మే! ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ప్రబలమైన ఆకాంక్ష అయినా ప్రధానికి ఉండాలి. ప్రజల ప్రాథమిక హక్కులకు ఆయన భరోసా ఇవ్వాలి. వారు మా హక్కులను రక్షిస్తారు అనే నమ్మకం ప్రజల్లో కలగాలి. అటువంటి వారు కరువైన మన దేశంలో ప్రణబ్ ముఖర్జీ ప్రధా ని పదవి ఆశించడంలో తప్పులేదు. తాబేళ్ల మధ్య పోటీ. ఏ తాబేలు ముందుగా వెళితే దానికి నాయకత్వం. మన్మోహన్ ఎవరికి నాయకుడు. ఆయ న ప్రధానిగా ఉండాలని కార్పొరేట్ సామ్రాజ్యం కోరుకుంటుంది. ఎందుకంటే తమ దోపిడీకి గ్రీన్ సిగ్నల్‌గా భావిస్తారు. తమకు ఎదురు ఉండకూడదని సోనియాగాంధీ అదే కోరుకుంటారు. ఇందులో ప్రజల ప్రమే యం లేదు. వారి అభివూపాయానికి విలువలేదు. ఇప్పుడు ప్రణబ్ ప్రధాని పదవి కంటే అత్యున్నత పదవిని అధిష్టించబోతున్నారు. రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్ష పదవి అత్యున్నత పీఠం. కానీ అది రబ్బర్ స్టాంప్ అనే అభివూపాయం ఉంది.

మంచో, చెడో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే సంతృప్తితో బతుకుతున్నాం. ప్రజాస్వామ్యం అంటే ‘ఓటు’ మాత్రమేనా? ప్రజల ఆకాంక్షలు నెరవేరడం ప్రజాస్వామ్యంలో తేలాల్సిన విషయమే. ప్రణబ్ ముఖర్జీ అధ్యక్ష పీఠం లో కూర్చోవడం ప్రజల ఆకాంక్ష కాదు. ఆయన కార్పొరేట్ సామ్రాజ్యానికి దగ్గరి స్నేహితుడు. మన దేశం వ్యవసాయక దేశం. రైతాంగం ఇక్కడ ప్రధానమైన వర్గం. ఉత్పత్తి శక్తులు వారే! ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత, లక్షల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనికి కారకులైన పాలక వర్గాల్లో ప్రణబ్ ఒకరు. ఆయనను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి నిర్ణయించడంలో వారి రాజకీయాలు వారివి. కాంగ్రెస్ రాజకీయాపూప్పుడూ ప్రజలకు సంబంధించినవి కావు. అవి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేవి కావు. అలా భావిస్తే ఎప్పుడో తెలంగాణ ఇచ్చేవారు. కాంగ్రెస్‌ను అర్థం చేసుకోవడంలో ప్రజలు విఫలమయ్యారు. కానీ ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ ఎప్పుడూ విఫలం కాలేదు. నమ్మితే నట్టేట ముంచ డం కాంగ్రెస్ నైజం. అందుకే వారి రాజకీయాల దోపిడీకి అనుగుణంగా ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిగా ఎంచుకున్నారు.

అయితే ఇందులో ప్రతిపక్షాల పాత్ర ఏమిటి? ప్రణబ్‌ను సమర్థించడానికి వారు ఉరుకులు, పరుగులు ఎందుకు పెడుతున్నారు? దేశాభివృద్ధిలో ఆయన పాత్ర ఎంత? ఏ అభివృద్ధికి ప్రణబ్ నిచ్చెనలు వేశా రు. చివరికి సీపీఎం లాంటి పార్టీ కూడా ప్రణబ్‌కు సాగిలాపడి దండా లు ఎందుకు పెడుతున్నదో అర్థం కాదు. సీపీఎం ఇప్పటికీ పోరాటాల గురించి మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజల పోరాట ఆకాంక్ష మాత్రం ఆ పార్టీ గుర్తించదు. కానీ ప్రణబ్ ముఖర్జీని గుర్తిస్తుంది.

మన దేశంలో రాష్ట్రపతిని రాజ్యాంగ రక్షకుడుగా భావిస్తాం. ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేది ఆయనేనని భావిస్తాం. ఏ రాజ్యాంగ రక్షణ కోసం ప్రణబ్ పోరాడారనేది వర్తమాన చరివూతలో ఎంత వెతికినా కనిపించదు. ఎమ్జన్సీని వ్యతిరేకించలేదు. అవినీతిని వ్యతిరేకించలేదు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటాన్ని సానుభూతిగా చూశా రా? లేదు పైగా అణచాలని చూశారు. ప్రాథమిక హక్కులను ధ్వంసం చేసే నల్ల చట్టాలను వ్యతిరేకించలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోలేదు. కానీ దాన్ని అణచివేయడానికి అన్ని రాజకీయ ఎత్తుగడలను వినియోగించుకున్నారు. కానీ ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంవూతుల మీద సీబీఐ కొరడా ఝుళిపించడానికి తన వంతు ముద్రవేసిన వ్యక్తి ప్రణబ్.
రాష్ట్రపతి పదవికి రాజకీయాలకు అతీతంగా దేశానికి సేవ చేసిన ఎవరినో ఒకరిని ఎంపిక చేస్తే ఇంత చర్చ జరిగి ఉండేది కాదు. దేశ ఆర్థికమంత్రిగా పనిచేస్తున్న ప్రణబ్‌ను ఈ పదవికి నిలబెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉంది. సోనియాగాంధీ దేశాన్ని మొత్తం తన గుప్పిట్లో ఉంచుకోవాలనే ప్రయత్నంలో రాష్ట్రపతి పీఠం కూడా అందులో భాగంగా ఉండాలనే ఈ ఎత్తుగడ. అందుకు కొంతమంది ప్రతిపక్ష నాయకుల వత్తాసు. అయితే ప్రణబ్ సుదీర్ఘ రాజకీయ అనుభవం గురించి ప్రస్తావిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ప్రణబ్ కాంగ్రెస్ పార్టీకి జీవితకాల సేవకుడు. ఈ దేశ పరిస్థితి కారణం కాంగ్రెస్ పార్టీ. విచ్చలవిడి అవినీతి, సామాజిక, ఆర్థిక అంతరాలు పెరగడానికి, దేశంలో పెట్టుబడి సామ్రా జ్యం పెరగడానికి కాంగ్రెసే కారణం. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ విధానాలు రూపొందించిన వ్యక్తులలో ప్రణబ్ ప్రముఖుడు. అలాంటి వ్యక్తి రాష్ట్రపతి కాబోతున్నాడు. సంతోషిద్దామా?

ఆర్థిక మంత్రిగా ప్రణబ్‌కు మంచి పేరు ఉంది అంటారు. విశేష రాజకీయ అనుభవం ఉన్నదని ఆయనపై పొగుడుతున్నారు. అయితే ఆయన ఆర్థిక మంత్రిగా ప్రజలకు ఏం చేశారు. ఆయన అనుసరించి న ఆర్థిక విధానాల మూలంగా ధనికుల, పేదల మధ్య అంతరాలు తగ్గ లేదు. కానీ కొందరు వేల కోట్లకు అధిపతులయ్యారు. కోట్లాది మంది ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రజలకు పంచాల్సిన వేలాది ఎకరాల భూములు కార్పొరేట్ సామ్రాజ్యం చేతుల్లోకి వెళ్లిపోయాయి. అభివృద్ధి వెలుగుల పేరుతో ప్రజలను వంచించిన వారిలో ప్రణబ్ ఒకరు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి, చమురు ధరలు పదిసార్లు పెంచడానికి, రూపా యి విలువ పడిపోవడానికి ప్రణబ్ మఖర్జీయే కారణం. ఆయన అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల విద్య, వైద్యం సామాన్యులకు అందకుండాపోయాయి. ప్రతిభావంతుడని ప్రణబ్‌కు ఎన్నో కమిటీలకు సారథ్య బాధ్యతలు అప్ప గించారు. ఆ కమిటీలు కాలయాపన కమిటీలుగా మారిపోయాయి. తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆయన సారథ్యంలో ఒక కమిటీ వేశారు. అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా తయారైంది. ఇవ్వాళ తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోకపోవడానికి కూడా కారణం ఆయనే. ఫలితంగా ఎనిమిది వందలమందికి పైగా మరణానికి ప్రణబ్ బాధ్యత కూడా ఉంది. ఇదీ ప్రణబ్ ప్రతిభ!

-సీహెచ్. మధు

35

MADHU CH

Published: Sun,November 27, 2016 01:50 AM

మంచి ఆలోచనను పాడుచేసిన మోదీ

ఒక దశాబ్ద కాలం నుంచి నాలాంటి వాళ్లెందరో ఐదు వందల నోట్లు రద్దు చేయాలని, ఇవి ధనవంతుల దాచివేతకు ఉపయోగపడుతున్నాయని, విలువ ఎక్కువ గనుక

Published: Fri,September 6, 2013 12:50 AM

ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం

సీమాంధ్రులు మేం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని గొంతుచించుకుని అరుస్తున్నారు. అభివృద్ధి అంటే ఏమి టి? ఎవరి అభివృద్ధి జరిగింది? అసల

Published: Sun,March 10, 2013 12:56 AM

ఉగ్రవాదాన్ని అరికట్టలేమా?

దిల్‌సుఖ్‌నగర్ రోడ్డు మీద అమాయకుల శవాలు గుండెను మండిస్తాయి. గుండె కరిగిపోతున్నది. ఆ రాత్రి ఒక నిమిషం కూడా నిద్రరాలేదు. ఒక భయం ఒక

Published: Sat,October 6, 2012 05:23 PM

సంధికాలంలో సమష్టిపోరు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పనిచేస్తుందా అనుమానమే! అన్ని శాఖ లు నిర్లిప్తంగా ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? ఇంత అధ్వాన్నమైన ప్రభుత్వ

Published: Sat,October 6, 2012 05:24 PM

నీళ్లివ్వలేని నేతలు నీతులు చెప్పడమా?

చిదంబరం తానన్న మాటలకు సిగ్గుపడ్డారో లేదో తెలియదు కానీ, ఆయన మాటలకు జాతంతా సిగ్గుపడ్డది. మధ్య తరగతి ప్రజల గురించి ఆయన మాటల కు, ఆయన ఈ

Published: Sat,October 6, 2012 05:25 PM

తరాలు మారినా అవే అంతరాలు!

స్వాతంత్య్రం వచ్చి అరవై ఐదేళ్లు దాటింది. జాతి మూడో తరంలోకి ప్రవేశించింది. మూడో తరం నాయకత్వం సింహాసనం మీదికి రాబోతున్నది. మూడో తరాన

Published: Sat,October 6, 2012 05:26 PM

అవిశ్వాసం వెనుక ఆంతర్యం!

రైతు కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం, రైతు కోసమే ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకోవడం... ఇదం తా రైతు కోసమేనా? రైతు కోసం సాగిన అసెంబ

Published: Sat,October 6, 2012 05:26 PM

గూడూరి సీతారాం ‘లచ్చి’ కథ

గూడూరి సీతారాం మన నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణ కథకుడు, తెలంగాణ భాషను విపరీతంగా ప్రేమించిన రచయిత గూడూరి సీతారాం వెళ్ళిపోయిన తర్వాత