స్వరాష్ట్రంలోనే ఎన్నికలు


Sat,October 6, 2012 05:33 PM

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష్ట్రాలు నూతనంగా ఏర్పడ్డాయన్నమాట. ఈ 14 రాష్ట్రాలకు ఏరాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులు లేకుండానే ఏర్పడ్డాయి. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు గానీ లేదా నూతనంగా ఏర్పడిన 14 రాష్ట్రాలకు గానీ రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులు లేవు.
ఆధునిక కాలంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యుత్తమైనదని చారివూతకంగా రుజువైంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరాల్లు రాజకీయ పార్టీలు. ఈ రాజకీయ పార్టీలు తాము నిర్వహించవలసిన పాత్రను నిర్వహించినప్పుడే ప్రజలలో వాటిపై విశ్వసనీయ పెరుగుతుంది. తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ తెలంగాణ అంశం పట్ల అవి పోషించవలసిన పాత్రను కొంత ఆలస్యంగానైనా బాధ్యతాయుతంగా పోషిచినందుకు అభినందనీయం. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయినతెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను 137 మంది ప్రజావూపతినిధులు తమ రాజీనామాల ద్వారా తెలియపరచడం హర్షనీయం.

దేశచరివూతలో ఎప్పుడూలేని విధంగా అధికారపక్షం , ప్రతిపక్షాలు ఒకేమార్గం పట్టాయి. ఇది అరుదైన ఘటన. తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి ఇక్కడి ప్రజలు ఆశించింది కూడా ఇదే. తెలంగాణ అంశం పట్ల తెలంగాణ ప్రజలలో ఉన్న ఐక్యత నాయకులలో గతంలో లేదు. కానీ ఈ రాజీనాల ద్వారా ఐక్యత ప్రజలలోనే కాదు, తమలో కూడా ఉందని నిరూపించాయి. రాజీనామాలు సమర్పించిన ప్రజా ప్రతినిధులందరి డిమాండ్ ఒక్కటే. అది డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని, ప్రజావూపతినిధుల రాజీనామాలతో కేంద్రం ఉలికిపడింది. స్వపక్ష ప్రజావూపతినిధుల రాజీనామాలను కాంగ్రెస్ అధిష్ఠానం జీర్ణించుకోలేక పోయింది. అందుకే ఢిల్లీలోని పెద్దలు వితండ వాదనలకు దిగుతున్నారు.
రాజీనామాలు చేసిన ప్రజావూపతినిధులు ప్రణబ్ ముఖర్జీని కలిసినప్పుడు అతను అన్నమాటలు ‘దేశంలో ఏదైనా ఒక ప్రాంతం రాష్ట్రంగా ఏర్పడాలంటే దానికి రాష్ట్రాల పునర్విభజన కమిటి సిఫారస్‌లన్నా ఉండాలి, లేదా సంబంధిత శాసన సభ తీర్మానం అన్నా ఉం డాలి’ అని సెలవిచ్చారు. ప్రణబ్ అన్న ఈ మాటలు ఆశ్చర్యాన్నే కాదు , విడ్డూరం కల్గిస్తున్నాయి. ఎందుకంటే 1953 లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులేదు.శాసన సభ తీర్మానం కూడా లేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ తీర్మానం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి లేకుండానే రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం పార్లమెంట్‌కు గల రాష్ట్రాల పునర్విభజన అధికారంతో ఏర్పడ్డది అన్నది చారివూతక సత్యం. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని ఉమ్మడి మద్రాసు రాష్ట్రశాసనసభలో ప్రవేశపెట్టి ఆ తీర్మానం అసెంబ్లీ ఆమోదం పొందిన పిదప పార్లమెంటు ముందుకు పోతుంది. అక్కడ అది ఆమోదం పొందిన తర్వాతనే ఆంధ్రారాష్ట్రం ఏర్పడుతుందని ప్రణబ్ మాదిరిగా ఆరోజుల్లో ఎవరైనా వాదించి ఉంటే ఆంధ్రరాష్ట్రం 1953లో ఏర్పడి ఉండేది కాదు. ఎందుకంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 375 శాసనసభా స్థానాల్లో ఆంధ్రవూపాంతం నుంచి 140 మాత్రమే. అంటే ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన శాసనసభ తీర్మానం ఉమ్మడి మద్రాసు రాష్ట్రశాసనసభలో ఆమోదం పొందడం అసాధ్యమన్నమాట. అందుకే శాసనసభ తీర్మానం లేకుండానే పార్లమెంటులో బిల్లుపెట్టి 1953లో ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయం ప్రణబ్ ముఖర్జీకి తెలువదనుకోవాలా మనం. ప్రణబ్ అన్నట్లుగా తెంగాణ రాష్ట్రానికి సంబంధించిన తీర్మానం మన రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందుతదా అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మనరాష్ట్ర అసెంబ్లీ శాసనసభ్యుల సంఖ్య 294. అందులో తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు 119 పోగా , మిగతా 175 మంది శాసన సభ్యులు ఆంధ్ర, రాయలసీమ, ప్రాంతాలవారు. ఆంధ్ర , రాయలసీమ శాసన సభ్యుల మద్దతు లేకుండా అసెంబ్లీలో ఏతీర్మానం నెగ్గదు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తీర్మానాన్ని వ్యతిరేకించినప్పుడు అది నెగ్గటం అసాధ్యం.

ఇక నూతనంగా ఏదైనా రాష్ట్రం ఏర్పడాలంటే దానికి రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులు అవసరమంటున్నారు. రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష్ట్రాలు నూతనంగా ఏర్పడ్డాయన్నమాట. ఈ 14 రాష్ట్రాలకు ఏరాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులు లేకుండానే ఏర్పడ్డాయి. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు గానీ లేదా నూతనంగా ఏర్పడిన 14 రాష్ట్రాలకు గానీ రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులు లేవు. మరి తెలంగాణ విషయంలో ఆ సిఫారసుల అవసరం ఏమిటో ప్రణబ్ వివరించాలి.

ప్రజావూపతినిధులు రాజీనామాలు చేసినప్పుడు కేంద్ర హోంమంత్రి చిదంబరం స్పందించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించడమేకాదు , తెలంగాణ వాదులను రెచ్చగొట్టే విధంగా ఉంది. తెలంగాణ సమస్య సున్నితమైనదట, సంక్లిష్టమైయినదట. 9 డిసెంబర్ నాడు ‘భారత ప్రభుత్వం తరుపున నేను ఈ ప్రకటన చేస్తున్నాను.తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది’అని అన్నప్పుడు ఈ అంశం సున్నితమైనది, సంక్లిష్టమైంది అని తెలువదా? ఒకవేళ తెలువనట్లయితే ఏమీ తెలుసుకోకుండా అలాంటి ప్రకటన ఇచ్చిన చిదంబరం ఆ పదవిలో కొనసాగేందుకు అనర్హుడు.ఒకవేళ తెలిసి ఇచ్చినటె్లైతే ప్రభుత్వం తరుపున ఇచ్చిన ప్రకటన కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రక్రియను కాలయాపన చేయకుండా వెంటనే చేపట్టాలి.తెలంగాణ అంశము సున్నితమైంది, సంక్లిష్టమైంది అన్న విషయం 2004 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చినప్పుడు గానీ, కనీస ఉమ్మడి కార్యక్షికమంలో పెట్టినప్పుడుగానీ, ప్రధాని , రాష్ట్రపతులు తమతమ ప్రసంగాల్లో వినిపించినప్పుడు గానీ, పార్లమెంటు ఉభయసభల్లో అధికారికంగా 10 డిసెంబర్‌నాడు ప్రకటించనప్పుడుగానీ సోయికి రాలేదు అంటే ఎవరు నమ్ముతారు. ఇవి తప్పించుకునే మాటలు తప్ప మరేమీ కావు.

ఇక మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిఅయిన గులాంనభీ ఆజాద్ స్పందన ఎట్లా ఉందో ఓసారి చూద్దాం.‘ ఒకవేళ రాష్ట్రాన్ని విభజించ వలసి వస్తే రాష్ట్రాన్ని విభజించే ముందు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందట’. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజా ప్రతినిధులతో మాట్లాడాలట. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని మద్రాసు ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ మద్రాసు ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఉంటే .. ఆంధ్రరాష్ట్రం ఏర్పడి ఉండేదికాదు. ఆంధ్రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు మద్రాసు ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోనప్పుడు, తెలంగాణ విషయం వచ్చినప్పుడు ఆంధ్ర, రాయలసీమ ప్రజల మనోభావాలను తెలుసుకోవలసిన అవసరం ఏముంటుందో ఆజాద్‌కే తెలియాలి. అంతేకాదు, సూడాన్ ఈ రోజు రెండు ముక్కలైంది. ఉత్తర సూడాన్ నుంచి స్వాతంత్య్రం కావాలి, ప్రత్యేక దేశం కావాలని దక్షిణ సూడాన్‌లో గత రెండు దశాబ్దాలుగా ప్రజలు ఉద్యమించిండ్రు. దక్షిణ సూడాన్‌లో దేశవిభజనపై రెఫండం నిర్వహిస్తే 98.83 శాతం ప్రజలు దక్షిణ సూడాన్ ఏర్పాటుకు తమ సుముఖత తెలుపటంతో ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ దక్షిణ సూడాన్‌ను ఓ కొత్త దేశంగా అవతరించింది.

దక్షిణ సూడాన్ ఏర్పాటుకు దక్షిణ సూడాన్ ప్రజల మనోభావాలనే పరిగణనలోకి తీసుకున్నారు. అంతేకానీ.. ఉత్తర సూడాన్ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోలేదు.ఒకవేళ ఉత్తర సూడాన్ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని ఉంటే.. ఇవాళ దక్షిణ సూడాన్ దేశంగా ఏర్పడి ఉండేది కాదు. ఇవన్నీ ఆజాద్‌కు తెలియవనుకోవాలా! ప్రజాభివూపాయాన్ని గౌరవించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మౌళిక లక్షణం. తెలంగాణ ప్రాంతంనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 137 మంది ప్రజావూపతినిధుల రాజీనామాలు తెలంగాణ ప్రజల మనోభావాలకు ప్రతిబింబం. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది స్వరాష్ట్రం. ప్రజావూపతినిధులు రాజీనామాలు సమర్పించింది కూడా వారి కలలను సాకారం చేసేందుకే. తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణకు రాష్ట్ర ప్రతిపత్తి కోరుకుంటున్నారా లేదా అన్నది ప్రజా ప్రతినిధుల రాజీనామాల వల్ల తెలియడం లేదా!

ప్రజల నుంచి ప్రజా సంఘాలనుంచి వత్తిడి లేనప్పుడు ప్రజా వూపతినిధులు తాము సమర్పించిన రాజీనామాల ఆమోదానికి పట్టుబట్టరు. ప్రజావూపతినిధులు సమర్పించిన రాజీనామాలన్నింటిని గనుక ఆమోదింప చేసుకోగల్గితే కచ్ఛితంగా అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. ఆ వత్తిడి చాలు కేంద్రం తెలంగాణ వైపు అడుగులు వేసేందుకు.తెలంగాణ వచ్చేవరకు ఎన్నికలకు దూరంగా ఉంటేనే నిజమైన రాజ్యాంగ పరమైన సంక్షోభం ఏర్పడుతుంది. కానీ దీనికి భిన్నంగా రాజీనామాలు చేసిన ప్రజావూపతినిధులే తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికయితే మాత్రం ప్రయోజనం ఏమీ ఉండదు. రాజీనామాలు చేసినవాళ్లే తిరిగి అసెంబ్లీలోకి ప్రవేశిస్తారు. ప్రజలు ఆశించిన లక్ష్యం సాకారం కాదు. తెలంగాణ సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారవుతుంది. ప్రజలు ఆశించే లక్ష్యం సాకారం కావాలంటే ‘స్వరాష్ట్రంలోనే ఎన్నికలు’ అనే వాదానికి ప్రజావూపతినిధులు కట్టుబడి తెలంగాణ అంశంపట్ల తమ నిబద్ధతను చాటుకోవాలి. అదే ఢిల్లీలో కూర్చొని వితండవాదం చేస్తున్న నాయకులకు సరియైన సమాధానం.

పొ. జి.లక్ష్మణ్
కన్వీనర్, ఓయూ టీచర్స్ ఫోరం ఫర్ తెలంగాణ


35

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ