చైతన్య శిఖరం ఉస్మానియా


Tue,April 25, 2017 01:40 AM

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ,
అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్కీ ఉద్యమం, వందేమాతర ఉద్యమం, తెలంగాణ రాష్ర్టోద్యమం పురుడు పోసుకున్నది ఈ గడ్డపైనే. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేసిపెట్టిన ఘనత ఓయూది. దేశ చరిత్రలో తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిందంటే
అదిక్కడి విద్యార్థుల, ఉద్యోగస్తుల త్యాగాల మూలంగానే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.


laxman
యూనివర్సిటీ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన మహాలఖాబాయి పేరు చరిత్ర పుటల్లో కనుమరుగైపోకుండా
యూనివర్సిటీ ప్రవేశద్వారానికి, కోఠి మహిళా కళాశాలకు కూడా ఆమె పేరుతో నామకరణం చేయడం ఈ శతాబ్ది
ఉత్సవాల సందర్భంగా సముచితంగా ఉంటుంది. అలా చేయటం ద్వారా సామాజిక
బాధ్యతను నెరవేర్చిన వాళ్లమవుతాం.

దేశ చరిత్రలో ఒక ప్రాంతానికి రాష్ట్ర ప్రతిపత్తి కోసం ఉద్యమించి సాధించుకున్న ఘనత ఏ విశ్వవిద్యాలయానికి లేదు, అది కేవలం ఉస్మానియా సొంతం. జాతీయ అంతర్జాతీయస్థాయి లో పేరు గడించిన ఓయూకు వంద వసంతా లు. ఈ శుభ సందర్భంలో సింహావలోకనం..

హైదరాబాద్ సంస్థానంలో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ పాషా కాలంలో 1875లోనే జరిగాయి. నాటి ప్రముఖ విద్యావేత్తలు రఫత్‌యార్ జంగ్, జమాలుద్దీన్ అఫ్ఘానీలు దీనికోసం కృషిచేశారు. ఆరవ నిజాం వద్ద ప్రధానిగా పనిచేసిన రెండవ సాలార్జంగ్, వికార్ ఉల్ ఉమ్రాలు మొదటిసారి విశ్వవిద్యాలయానికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలు తయా రుచేశారు. ఆ తర్వాత ఇస్లామిక్ సాహిత్యాన్ని సంస్కృతిని అభిమానించే వీల్‌ఫర్డ్ బ్లంట్ ఈజిఫ్ట్‌లోని కైరో విశ్వవిద్యాలయం లాంటి దాన్ని హైదరాబాద్ సంస్థానంలో నెలకొల్పాలని 1884లో చేసిన ప్రతిపాదనలు అనేక కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. విశ్వవిద్యాల య స్థాయి విద్యకు అవసరమైన విద్యార్థులను అందించే ఇంటర్మీడియట్ కళాశాల లు సంస్థానంలో మూడే ఉండేవి. దీనికితోడుగా నిజాం కాలేజీ మద్రా సు యూనివర్సిటీకి అనుబంధంగా 1887లో నెలకొల్పబడటంతో విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనే ఆలోచనలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.
1917లో నాటి నిజాం ప్రధాని సర్ అక్బర్ హైదరీ ఉర్దూ బోధనా భాషగా ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు ఇచ్చారు. విశ్వవిద్యాలయ ఏర్పాటుకు సంబంధించిన ఫర్మానా 1917 ఏప్రిల్ 26న జారీ అయింది. 1857-1915 మధ్యకాలంలో ఐదు విశ్వవిద్యాలయాలు దేశంలో నెలకొల్పబడ్డాయి.

కలకత్తా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాలు 1857లో ఏర్పడ్డాయి. 1882లో పాకిస్థాన్‌లో పంజాబ్ యూనివర్సిటీ, 1887లో అలహాబాద్ యూనివర్సిటీ ఏర్పడ్డాయి. 1916లో బనారస్ హిందూ యూనివర్సిటీ, మైసూర్ విశ్వవిద్యాలయాలు, 1917లో పాట్నా ఉస్మానియా యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. మన దేశంలో మొదటి సారిగా విశ్వవిద్యాలయంలో ఒక దేశీయ భాషను బోధనా భాషగా ప్రవేశపెట్టాలని నిజాం తీసుకున్న నిర్ణయాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్లు హర్షించారు. విశ్వవిద్యాలయంలో బోధనాభాష ఉర్దూ కావటంతో వేలాది ఇంగ్లీష్ గ్రంథాలను ఉర్దూ భాషలోకి అనువదించవలసిన అవసరం ఏర్పడ్డది. మౌల్వీ అబ్దుల్ హక్ నేతృత్వం లో వేలాది గ్రంథాలను ఉర్దూలోకి అనువదించారు. ప్రథమ వైస్ చాన్స్‌లర్‌గా ప్రముఖ విద్యావేత్త మౌలానా హబీబుర్ రహ్మన్‌ఖాన్ షేర్వాని నియమితులయ్యారు. ఆర్ట్స్ కాలేజీ ఇతర కళాశాల భవనాలను వాస్తు శిల్పు లు నవాబ్ జైన్‌యార్ జంగ్ సయద్ అలీరజా రూపకల్పన చేశారు.

తొలి ఇంటర్మీడియెట్ బ్యాచ్ 1921లో, తొలి డిగ్రీ విద్యార్థుల బ్యాచ్ 1923లో, ఎం.ఏ, ఎల్.ఎల్.బి బ్యాచ్‌లు 1925లో తమ విద్యను యూనివర్సిటీలో పూర్తి చేసుకున్నాయి. వైద్య కళాశాల 1927లో, ఇంజి నీరింగ్, ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలు 1929లో ప్రారంభమయ్యా యి. అడిక్‌మెట్ ప్రాంత భూముల్లో యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి అవసరమైన 1510 ఎకరాల భూమిని నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. వాస్తు శిల్పులు నవాబ్ జైన్‌యార్ జంగ్ సయద్ అలీరజా లు ఏడవ నిజాం సూచనపై బ్రిటన్, యూరప్, జపాన్, అమెరికా, ఈజి ప్టు, సిరియా, టర్కీ దేశాల్లో పర్యటించి అక్కడి విశ్వవిద్యాలయ భవనాలను విద్యావ్యవస్థను అధ్యయనం జేసి యాస్పర్ అనే బెల్జియం దేశ వాస్తు శిల్పి నేతృత్వంలో ఆర్ట్స్ కళాశాల భవనంతో పాటు వివిధ భవనాలు, వసతి గృహాల నిర్మాణం చేపట్టారు. 1937 జూలై 5న ఉనికిలోకి వచ్చిన ఆర్ట్స్ కళాశాల భవనం తన 75 వసంతాలు పూర్తి చేసుకున్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వవైభవాన్ని క్రమంగా కోల్పోతూ వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడగానే స్థానిక తెలంగాణ వారిని కాదని రాయలసీమకు చెందిన దున్నగాని సదాశివరెడ్డిని (డి.యస్.రెడ్డి)ఉపకులపతిగా నియమించారు. 1956 నుంచి 1969 వరకు స్థానిక తెలంగాణ విద్యావేత్తను ఎవరినీ ఉపకులపతిగా నియమించలేదు. 1969 తెలంగాణ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ వారిని ఉపకులపతులుగా నియమించడం ప్రారంభమైంది. ఒకప్పుడు ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలలుగా ఉన్న గాంధీ, ఉస్మానియా మెడికల్ కళాశాలలను విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి బదలాయించారు. అదే విధం గా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్నటువంటి అగ్రికల్చర్, వెటర్నరీ డిపార్ట్‌మెంట్లను రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మార్చారు. అలాగే ఫైన్ ఆర్ట్స్ విభాగాన్ని జేఎన్టీయూకి బదలాయించారు. ఇలా విశ్వవిద్యాలయం కుదింపునకు గురైంది. దీనికితోడు గా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో అరకొర వసతులతో కొత్త విశ్వవిద్యాలయాలను నెలకొల్పడంతో ఒకప్పుడు మొత్తంగా తెలంగాణ ప్రాంతానికి విస్తరించిన దీని పరిధి కుదించుకుపోయి నేడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైంది. ఒకప్పుడు 1223 మంది బోధనా సిబ్బందితో పాటు 2500 మంది బోధనేతర సిబ్బందితో కళకళలాడిన విశ్వవిద్యాలయం ఇప్పుడు 642 మంది బోధనా సిబ్బందితో దినసరి వేతన బోధనా, బోధనేతర సిబ్బందితో నెట్టుకొస్తున్నది.

1956 తర్వాతనే యూనివర్సిటీ భూములు మూడు విధాలుగా అన్యాక్రాంతమైనవి.1.యూనివర్సిటీ భూముల్లో అనేక ప్రభుత్వ సంస్థ లు వెలిశాయి. అవి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, టెలిఫోన్ ఎక్ఛేంజీ, ఆర్టీసీ హాస్పిటల్, హుడా, స్టేట్ ఆర్కేవ్స్, దూరదర్శన్, రామంతపూర్ పబ్లిక్ స్కూల్ మొదలైనవి. 2. యూనివర్సిటీలో వెలిసిన ప్రయివేట్ సంస్థలు, ఆంధ్ర మహిళాసభ కళాశాల, తెలుగు భాషా సమితి, సురభారతి, సత్యసాయి పబ్లిక్ స్కూల్ మొదలైనవి ఉన్నా యి. 3. ప్రైవేటు భూ బకాసురులు కూడా యూనివర్సిటీ భూములను కబ్జా చేశారు. వీటన్నింటినీ తిరిగి ఓయూ పరం చేయాల్సిన అవసరము న్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం 2014లో సాకారమైంది. దీంతో విశ్వవిద్యాలయ కొత్త అధ్యాయం ప్రారంభమైం ది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలిరోజు నుంచే ఇక్కడ విద్యా ప్రమాణాలు దిగజారిపోతున్నట్లు విషప్రచారం ప్రారంభమైంది. ఇది అసత్యం.

ఇక్కడ దేశ, విదేశీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 79 దేశాలకు చెందిన 4000 మంది విద్యార్థులు చదువు కుంటున్నారు. వివిధ రకాలైన పోటీ పరీక్షల్లో విద్యార్థులు కనబరుస్తున్న ప్రతిభ తక్కువేమి లేదు. విద్యాప్రమాణాలతో పాటు సామాజిక బాధ్యతలను భుజం మీద వేసుకొని ముందుకు నడుస్తున్న ప్రపంచంలోని గుర్తింపు ఉన్న కొన్ని అరుదైన విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా ఒకటి.

వందవ వసంతం శుభ సందర్భంలో దీన్ని మరింత బలోపేతం చేసేందుకు బ్లాక్ గ్రాంట్ నిధులు పెంచి ఉద్యోగ ఖాళీలను భర్తీచేయాలి. యూనివర్సిటీ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన మహాలఖాబాయి పేరు చరిత్ర పుట ల్లో కనుమరుగైపోకుండా యూనివర్సిటీ ప్రవేశద్వారానికి, కోఠి మహిళా కళాశాలకు కూడా ఆమె పేరుతో నామకరణం చేయడం ఈ శతాబ్ది ఉత్సవా ల సందర్భంగా సముచితంగా ఉంటుంది. అలా చేయటం ద్వారా సామాజిక బాధ్యతను నెరవేర్చిన వాళ్లమవుతాం.

585

Professor G. Laxman

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష

Featured Articles