పల్లెలు ప్రగతికి పునాదులు


Sat,August 22, 2015 12:41 AM

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే విషయాన్ని దృషి ్టలో ఉంచుకునే గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ వ్యవస్థకు రూపకల్పన చేసింది. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు నాంది. ప్రభుత్వ పాలనలో ప్రజలు పాల్గొనేలాచేసి ప్రజల భాగస్వామ్యంతోటే ప్రభుత్వ ఆశయాలు నెరవేరేందుకు మార్గాన్ని సుగుమం చేసే వ్యవస్థే పంచాయతీరాజ్ వ్యవస్థ. గాంధీ జీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలంటే అది పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠ పరచడం ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే అనేక గ్రామీణాభివృ ద్ధి పథకాలకు రూపకల్పన చేశారు. తగినన్ని ఆర్థిక వనరులు అధికారాలు లేనప్పుడు గ్రామీణాభివృద్ధిని సాధించలేం. తగినన్ని నిధులు అధికారాలున్నప్పుడే గ్రామీణాభివృద్ధి సాధ్యం. గ్రామీణాభివృద్ధిని లక్ష్యంగా ప్రభుత్వాలు చేపట్టే పథకాలతో ప్రజలను భాగస్వాములుగా చేసి, ఆ పథకాలకు ప్రజల మద్దతు కూడగట్టి, వాటి అమలుకు అవసరమైన నిధులను సమకూర్చినప్పుడే అవి ప్రభుత్వా లు ఆశించిన ఫలితాలనిస్తాయి.

laxman


ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేపట్టిన శ్రమదానం, జన్మభూమి, ప్రజల వద్దకు పాలన లాంటి పథకాలేవి ఆశించిన ఫలితాలివ్వలేదు. దీని కి ప్రధాన కారణం ప్రకటించిన కార్యక్రమాలకు స్పష్టమైన విధివిధానాలు లేకపోవడంతోపాటు నిధుల కొరత. దీంతో తెలంగాణ గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొన్ని మాసాలకే ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిపై దృష్టిసారించింది. మన ఊరు -మన ప్రణాళిక లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నా దానికి నిర్దిష్టమైన విధి విధానాలను రూపొందించలేదు. మన ఊరు-మన ప్రణాళిక అమలులో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలలోని లొసుగులను నివారిస్తూ తాజాగా ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలతో గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 8685 గ్రామాలను ప్రగతిబాటన నిలబెట్టాలని, పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయాలని తద్వారా గ్రామపంచాయతీలు స్వయం సమృద్ధి సాధించేలా కృషిచేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతి కార్యక్రమం లక్ష్యం.

సాలీనా ఐదువేల కోట్ల చొప్పు న రాబోయే నాలుగేళ్లలో 25 వేల కోట్లను ఈ కార్యక్రమం కింద ఖర్చు చేయాల ని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ అవసరాలను నిధులను దృష్టిలో ఉంచుకు ని గ్రామ ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఈ నెల 17న లాంఛనంగా ప్రారంభమైన గ్రామజ్యోతి కార్యక్రమం 24 తేదీ వరకు అన్నిస్థాయిల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజల సహకారంతో భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొంది. గ్రామం మొదలుకుని జిల్లాస్థాయి వరకు ఎవరెవరు ఏయే విధులు నిర్వహించాలనే విషయంలో స్పష్టత ఇచ్చింది. గ్రామంలో ఏమున్నాయి? ఇంకా ఏం కావాలి అన్న విషయాలను దృష్టిలో పెట్టు కొని రాబోయే నాలుగేళ్లలో గ్రామంలో చేపట్టవలసిన పనులకు సంబంధించిన ప్రణాళికలను గ్రామసభల్లో తయారు చేసుకుని ప్రాధాన్య క్రమంలో చేపడ్తారు. ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధిపై చేపట్టిన పథకాలకు తాజాగా ప్రభుత్వం ప్రకటించిన గ్రామజ్యోతి పథకం ఏ విధంగా భిన్నంగా ఉండటంతోపాటు మెరుగ్గా వుందో ఓసారి పరిశీలించాల్సిన అవసరమున్నది.

ఎన్నో ఏండ్లుగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పథకాలకు, వాటికి సంబంధించిన ప్రభుత్వ శాఖల ద్వారా నిధులు మంజూరు జరిగేది. కానీ వాటి వినియోగంలో పారదర్శకత కొరవడి అవి ఆశించిన ఫలితాలివ్వలేదు. దాంతోపాటు చేపట్టిన పనులు నిర్ణీత కాలంలో పూర్తికాకపోవడం, నాణ్యత లోపించడం జరిగింది. ఇప్పటి వరకు గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పథకాల రూపకల్పన మంజూరు నిధుల విడుదలను సంబంధిత శాఖలు స్వతంత్రంగా నిర్వహిస్తూ వస్తున్నాయి. ఇందులో గ్రామపంచాయతీలకు గానీ పంచాయతీరాజ్‌శాఖ పాత్ర గానీ నామమాత్రంగానే ఉండేది. గ్రామాల్లో మంచినీటి పథకాలకు ఆర్‌డబ్లూఎస్, రోడ్ల నిర్మాణానికి ఆర్‌అండ్‌బి పంచాయతీరాజ్ శాఖలు, పాఠశాల భవన నిర్మాణానికి విద్యాశాఖ ఈ విధంగా పథకాల పనులకు మంజూరులు నిధు ల విడుదలను ఆయా శాఖలే నిర్వహించేది. వివిధ శాఖల మధ్య సమన్వయం కొరవడి పనులు ఇష్టారాజ్యంగా జరిగేవి. దీంతో గ్రామ పంచాయతీలు సాధికారత జవాబుదారీతనాన్ని కోల్పోయాయి. అభివృద్ధి జరిగినా ఆశించినమేర జరుగలేదన్నది వాస్తవం. గ్రామజ్యోతి పథకంలో గ్రామాభివృద్ధి ప్రణాళికలు క్షేత్రస్థాయిలో రూపొందిస్తారు.

దీనితో సంబంధమున్న శాఖల క్షేత్రస్థాయి అధికారులంతా గ్రామ పంచాయతీలు నిర్వహించే గ్రామసభలకు విధిగా హాజరుకావాలి. అక్కడ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటది. గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా పంచాయతీరాజ్‌శాఖ అన్ని శాఖలను ఒకే గొడుగు కిందకు తెచ్చి గ్రామపంచాయతీలను బలపేతం చేయాలని సంకల్పించింది. గ్రామ సభల తీర్మానాలకనుగుణంగా సుమారు 15 శాఖలు సమన్వయంతో ఇకముందు పను లు జరుగుతాయి. దీంతోపాటు నిధులు ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా ఖర్చుచేసేందుకు, ఉత్తమ ప్రణాళికలు రూపొందించుకోవటానికి గ్రామస్థాయి లో వివిధ కమిటీలు ఏర్పాటు చేస్తారు. గ్రామజ్యోతిలో పది ప్రధాన అంశాలపై దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పది అంశాలలో నూరుశాతం లక్ష్యాలను సాధించాలనేది ప్రభుత్వ సంకల్పం. పారిశుద్ధ్యం, పన్నుల వసూలు, హరితహారం, అక్షరాస్యత, పిల్లలకు టీకాలు ఆసుపత్రిలో ప్రసవాలు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులను గుర్తించడం, 6-14 ఏళ్లలోపు పిల్లలందరిని పాఠశాలల్లో చేర్పించడం వంటి పది అంశాల్లో పూర్తి ఫలితాలు సాధించాలి. ఈ అంశాలపై గ్రామాల్లో కమిటీలు వేస్తారు. ప్రతి కమిటీలో ప్రజాప్రతినిధులు అధికారులు స్వయం సహాయక సంఘాల సభ్యులుంటారు. నిధులను పారదర్శకంగా ఖర్చుచేసేందుకు, గ్రామ ప్రణాళికలు రూపొందించుకోవటానికి, గ్రామజ్యోతిలో చేపట్టిన పనులను పర్యవేక్షించేందుకు, నిర్ధేశించిన లక్ష్యాల సాధనకు, గ్రామ ప్రజలను భాగస్వాములుగా చేసి జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఈ కమిటీలు అవసరమే.

గ్రామాభివృద్ధిపై గతంలో ప్రభుత్వాలు చేపట్టిన పథకాలకంటే గ్రామజ్యోతి కార్యక్రమం మెరుగైనదని నిస్సందేహంగా చెప్పవచ్చు. మనరాష్ట్రంలోని గంగదేవిపల్లెను, గుజరాత్ రాష్ట్ర సబరకాంతా జిల్లాలోని పున్సారి గ్రామాన్ని, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా హివారే బజార్ గ్రామాలను ఆదర్శంగా తీసుకొని మనరాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. దీనికి నిధుల సమీకరణ పెద్ద మొత్తంలో జరగాలి. ఎందుకంటే పున్సారి గ్రామాభివృద్ధిపైన ఎనిమిది సంవత్సరాలలో ఖర్చు చేసింది 16 కోట్లు. ప్రభుత్వం చేపట్టిన ఈ గ్రామజ్యోతి పథకం విజయవంతం కావడానికి ముఖ్యంగా కావల్సింది నిధుల సమీకరణ. రాష్ట్రంలోని 8685 గ్రామాల్లో ఒకేసారి ఈ పథకాన్ని చేపట్టడంకన్నా ప్రతి సంవత్సరం ప్రతిమండలంలోని 25 శాతం గ్రామాలను ఎంపికచేసి గ్రామాభివృద్ధి పనులకు పూనుకుంటే మెరుగైన ఫలితాలు సమకూరుతాయి. ఈ పథకం విజయవంతం కావాలంటే నిధులతోపాటు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు చిత్తశుద్ధితో క్రియాశీలంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విధిగా మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసినప్పుడే ఆశించిన ఫలితాలు సమకూరుతాయి.

గ్రామాభివృద్ధిపై గతంలో ప్రభుత్వాలు చేపట్టిన పథకాలకంటే గ్రామజ్యోతి కార్యక్రమం మెరుగైనదని నిస్సందేహంగా చెప్పవచ్చు. మనరాష్ట్రంలోని గంగదేవిపల్లెను, గుజరాత్ రాష్ట్ర సబరకాంతా జిల్లాలోని పున్సారి గ్రామాన్ని, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా హివారే బజార్ గ్రామాలను ఆదర్శంగా తీసుకొని మనరాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ సంకల్పం.

1335

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష

Featured Articles