కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే


Sat,March 21, 2015 01:58 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో కూడా కొనసాగేందుకు అవకాశం కల్పించబడ్డది. దీంతో 40 మంది సభ్యులతో కూడిన శాసనమండలి తెలంగాణలో ఏర్పడ్డది. ఎగువ సభగా పిలుస్తున్న ఈ శాసన మండలి శాశ్వత సభ. ఇందులో ప్రతిరెండు సంవత్సరాలకోసారి మూడవవంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. దీంతో ప్రతిరెండేళ్లకోసారి శాసన మండలికి ఎన్నికలు నిర్వహించాలి. తెలంగాణలోని ఆరు జిల్లాలకు చెందిన రెండు పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి శాసన మండలికి ఎన్నికైన సభ్యుల పదవీకాలం ముగియటంతో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. నూతనంగా రాష్ట్రం ఏర్పడిన పిదప శాసనమండలికి జరుగబోతున్న తొలి ఎన్నికలవి. ఈ సందర్భంగా పార్లమెంరీ వ్యవస్థలో ఎగువ సభగా పిలువబడుతున్న శాసన మండలి రూపకల్పన ఏ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని చేసిన్రో దానికున్న చారిత్రక నేపథ్యంతోపాటు దాని అధికారాలను, ప్రస్తుతం మారిన సామాజి క రాజకీయ స్థితిగతులను బట్టి దాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిన అవసరముంది.

దేశంలో రాష్ట్రాల పునర్విభజనకు పూర్వం పెద్ద రాష్ట్రాలుగా వున్నటువంటి బొంబాయి. బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ అస్సాం రాష్ట్రాలలోని ప్రజలమధ్య జాతి, తెగ, మతం, భాష, ప్రాంతం మొదలైన అంశాలలో వైవిధ్యాలు అధికంగా నెలకొని ఉండటం మూలంగా ఆయా రాష్ట్రాలలో 1935 భారత చట్టాన్ని అనుసరించి ఎగువ సభలను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత తమ రాష్ట్రాలలో ఎగువ సభ అక్కరలేదని ఒడిషా, అస్సాం, మధ్యప్రదేశ్, బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు తీర్మానించాయి. దాంతో ఆయా రాష్ట్రాల్లో ఎగువ సభలు రద్దయినయి. 1953కు పూర్వం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళం తెలుగు మలయాళం భాషలు మాట్లాడే మూడు ప్రాంతాల ప్రజలున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మద్రాసు రాష్ట్రానికి ఎగువసభను ఏర్పాటు చేశారు. 1 అక్టోబరు 1953న ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రంగా అవతరించినాయి. ఆ విధంగా నూతనంగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రానికి ఎగువ సభలేదు.

మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు శాసనమండలి సభ్యులుగా కొనసాగిన ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నాయకులు 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి శాసనమండలి లేకపోవడంతో రాజకీయ నిరుద్యోగులుగా మారారు. ఈ రాజకీయ నిరుద్యోగుల ఒత్తిడి మూలంగానే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నెలరోజులకే 1956 డిసెంబర్ 5న రాజ్యాంగంలోని 169వ నిబంధనను అనుసరించి విధాన పరిషత్తు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాసనసభ తన తొలి సమావేశాల్లోనే తీర్మానించింది. దీంతో 1జూలై1959న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధాన పరిషత్తు ఏర్పాటైంది. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన వెంటనే విధాన పరిషత్తును రద్దుచేయాలని చేసిన శాసనసభ తీర్మానం పార్లమెంటు ఆమోదం పొంది 1 జూన్ 1985న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎగువ సభ రద్దయింది. మళ్లీ 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎగువ సభను పునరుద్ధరించాలని చేసిన శాసనసభ తీర్మానం పార్లమెంటు ఆమోదం పొంది 90 మంది సభ్యులతో కూడిన విధాన పరిషత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది.

షెడ్యూల్డ్ కులాలు తెగలవారికి శాసనసభ,లోకసభలలో ప్రాతినిధ్యం కల్పించే
నిమిత్తం రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ శాసన మండలికి అలాంటి రిజర్వేషన్లు
లేకపోవటం మూలంగా వారికి సముచిత ప్రాతినిధ్యం లభించలేదు. ఈ ఎగువ
సభలలోని సభ్యులు అత్యధికంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్నత వర్గాల
నుంచి వచ్చిన వారే. షెడ్యూల్డు కులాలు తెగలవారికి రాజ్యాంగబద్ధమైన
రిజర్వేషన్లు కల్పించి వారికి అందులో ప్రాతినిధ్యం కల్పించాలి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి రాష్ట్ర విభజనచట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కొనసాగేందుకు అవకాశం కల్పించబడ్డది. దీంతో 40 మంది సభ్యులతో తెలంగాణలో 50 మంది సభ్యులతో కూడిన శాసనమండలి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డవి. విధాన పరిషత్తు నిర్మాణం రాజ్యాంగ నిబంధన 171 ప్రకారం రాష్ట్ర విధానసభ సభ్యుల మొత్తం సంఖ్యకు 1/3వ వంతు సభ్యులతో ఏర్పాటవుతుంది. దీనిని అనుసరించే మన విధాన పరిషత్తు సభ్యులలో 14 మందిని శాసనసభ మరో 14 మందిని స్థానిక సంస్థల నియోజకవర్గాలు, ముగ్గురిని పట్టభద్రుల నియోజక వర్గాలు మరో ముగ్గురిని ఉపాధ్యాయ నియోజక వర్గాల నుండి ఎన్నుకోవడం జరుగుతుంది. మిగిలిన 6మందిని రాష్ట్ర గవర్నర్ నామనిర్దేశ పద్ధతిలో నియమిస్తారు.
ఇక శాసన మండలి అధికారాలను పరిశీలిస్తే అది అవసరమా అనిపించక మానదు. విధాన సభ సభ్యులకు రాజ్యసభ సభ్యులనుగానీ, రాష్ట్రపతినిగానీ ఎన్నుకునేందుకు ఓటుహక్కు ఉంటుంది. కానీ విధాన పరిషత్తు సభ్యులకు ఉండదు. శాసనమండలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాణాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినా ప్రభుత్వంపై దాని ప్రభావం ఉండదు. ఈ సభ ఎంత బలహీనమైనదంటే తనకు ఇష్టంకాని బిల్లులను చట్టం కాకుండా విధాన పరిషత్తు అడ్డుకోజాలదు. కేవలం జాప్యం చేయగలదు.

షెడ్యూల్డ్ కులాలు తెగలవారికి శాసనసభ,లోకసభలలో ప్రాతినిధ్యం కల్పించే నిమిత్తం రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ శాసన మండలికి అలాంటి రిజర్వేషన్లు లేకపోవటం మూలంగా వారికి సముచిత ప్రాతినిధ్యం లభించలేదు. ఈ ఎగువ సభలలోని సభ్యులు అత్యధికంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్నత వర్గాల నుండి వచ్చిన వారే. షెడ్యూల్డు కులాలు తెగలవారికి రాజ్యాంగబద్ధ మైన రిజర్వేషన్లు కల్పించి వారికి అందులో ప్రాతినిధ్యం కల్పించాలి.
ప్రపంచ దేశాలలో అన్నిచోట్లా ఎగువసభ సమాజంలోని వైవిధ్యతకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించిందన్నది చారిత్రక సత్యం. అయితే మన రాజ్యాంగం సూచించే శాసనమండలి నిర్మాణం స్థానిక సంస్థలు పట్టభద్రులకు మరియు ఉపాధ్యాయులకు మాత్రమే ప్రాతినిద్యం కల్పిస్తుంది. మారుతున్న సామాజిక వైవిధ్యతలకు అది ఏమేరకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నది అన్నది ప్రశ్న. రాజ్యాంగ సవరణ ద్వారా ఇప్పుడున్న ప్రాతినిధ్యం పద్ధతిని మార్చి మారుతున్న సామాజిక వైవిధ్యతలను దృష్టిలో వుంచుకుని కార్మిక వర్గం రైతు వర్గాలకు వెనుకబడిన కులాలకు, మహిళలకు స్థానం కల్పించాలి. అప్పుడే ఎగువ సభకు సమున్నత గౌరవం లభిస్తుంది. రాజ్యాంగం ఆశించిన ఆశయాలు నెరవేరుతాయి.

1399

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష

Featured Articles