విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు


Sat,February 14, 2015 01:23 AM

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. విద్యుత్ వినియోగంలో పొదుపు చర్యలను విధిగా అన్ని రంగాలలో పాటించాలి. విద్యుదుత్పత్తి ఎంత ముఖ్యమో దాన్ని పొదుపుగా వాడటం కూడా
అంతే ముఖ్యం. విద్యుత్ వినియోగంలో పొదుపు చర్యలు పాటించనపుడు విద్యుదుత్పత్తి ఎంత జరిగినా ఫలితం ఉండదు.

ఆవిరి యంత్రం ఆవిష్కరణ పారిశ్రా మిక విప్లవానికి దారితీసి ప్రపంచంలో ఒక నూతన వర్గం (కార్మిక) ఆవిర్భావానికి దారితీసింది. చేతి వృత్తులూ కుటీర పరిశ్రమల నుంచి పరిశ్రమల స్థాపన కు ఆవిరి యంత్రం పునాదులు వేస్తే విద్యుత్ ఆవిష్కరణ ఆవిరి యంత్రాల స్థానాన్ని ఆక్రమించి ఉత్పత్తిని పెంచడంతో పాటు దాని వినియోగం మానవ సమాజంలో వివిధ రంగాలలో విస్తరించింది. అటు పరిశ్రమల నుంచి గృహావసరాలకు వ్యవసాయానికి సేవరంగాలలో ఇలా అన్నింటిలో విస్తరించి విద్యుత్ లేనిదే మనిషి మనుగడే అసాధ్యమన్న స్థాయికి తెచ్చింది.నేడు వివిధ రంగాలకు సంబంధించిన ఉత్ప త్తులన్నీ విద్యుత్తుతో ముడిపడి వున్నాయి. అభివృద్ధి చెందిన సమాజానికి కొలమానం విద్యుత్ వినియో గం. ఏ సమాజంలోనైతే విద్యుత్ వినియోగం ఆశించిన స్థాయిలో వుండదో అక్కడ అభివృద్ధి స్తంభించిపోతుంది. ఒక ప్రాంతం అభివృద్ధి చెందా లంటే ఆ ప్రాంత అవసరాలకన్నా అధికంగా విద్యు త్తు ఉత్పత్తి ఉంటేనే అది సాధ్యమవుతుంది.

laxman


పెట్టుబడిదారులు పరుగులు తీసేది మిగులు విద్యుత్ వున్న ప్రాంతాలకే. పారిశ్రామికీకరణకు కీలకాంశమైన విద్యుత్ సమాజాభివృద్ధితో కీలకపాత్ర పోషిస్తుందన్నమాట. దేశంలో విద్యుదుత్పత్తి దాని వినియోగం ఏ విధంగా వుందో పరిశీలిద్దాం. అధికారిక గణాంకాల ప్రకారం 1947లో 1362 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగితే నేడు దేశంలోని విద్యుత్ కేంద్రాల వ్యవస్థాపక సామర్థ్యం 2,55,012 మెగావాట్లకు చేరుకుంది. విద్యుత్ కేంద్రాల వ్యవస్థాపక సామర్థ్యం 2,55,012 మెగావాట్లున్నా గరిష్ఠ స్థాయిలో ఉత్పత్తి జరుగకపోవడంతో పాటు సరఫరా, పంపిణీ వ్యవస్థలలో వాటి ల్లే నష్టాల మూలంగా గరిష్ఠంగా 1,51,901 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. సెంట్రల్ సెక్టార్ వ్యవస్థాపక సామర్థ్యం 68,993 మెగావాట్లు రాష్ట్ర సెక్టారు 94,153 మెగావాట్లు ప్రయివేటు సెక్టారు 91,866 మెగావాట్లు. ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో 35 శాతం పరిశ్రమలు, 21 శాతం వ్యవసాయం, 28 శాతం గృహావసరాలు, 9 శాతం వాణిజ్య సంస్థలు,7 శాతం ఇతర అవసరాలకు వినియో గం జరుగుతున్నది.

మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సగం వినియోగం గృహావసరాలకు, వ్యవసాయ రం గంలోనే జరుగుతుంది. అది కూడా దశల వారీగా విద్యుత్ ఇచ్చినపుడు ఉత్పత్తిలో 70 శాతం ఈ రెండు రంగాలకే సరిపోతుంది. దేశంలో 95.82 శాతం విద్యుద్దీకరణ జరిగింది. దేశంలో ఉన్న 5,97,464 గ్రామాల్లో విద్యుద్దీకరణ జరిగిన గ్రామాలు 5,72,519. జాతీయ సగటు కన్నా తక్కువ విద్యుద్దీకరణ జరిగిన రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, ఒడిషా, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్. అరుణాచల్‌ప్రదేశ్‌లో అతి తక్కువగా 69.3 శాతం విద్యుద్దీకరణ జరిగింది. ఇప్పటికీ దేశంలో 300 మిలియన్ల ప్రజలకు విద్యుత్ అందుబాటులోకి రాలేదు. వ్యవసాయరంగంలో 1,91,63,766 పంప్‌సెట్లకు విద్యుత్ ఇవ్వబడింది.

సాలీనా సగటు తలసరి విద్యు త్ వినియోగం మన దేశంలో 917 కిలోవాట్లుంటే ప్రపంచ సగటు 2,600కిలో వాట్లుగా కొన్ని యూరోపియన్ దేశాల్లో ఇది 6,200 కిలో వాట్లుగా ఉంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలలో విద్యుదుత్పత్తి డిమాండుకు తగినట్లుగా లేదు. విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు గత కొంతకాలంగా పెట్టుబడిదారులను ఆకర్షించడంలో విఫలమవుతున్న మూలంగా పారిశ్రామీకీకరణ స్తంభించిపోయింది. మిగులు విద్యుత్ వున్న రాష్ట్రాలు పెట్టుబడిదారులను ఆకర్షించి తద్వారా పరిశ్రమలను స్థాపించి అభివృద్ధి చెందుతున్నాయన్న విషయం ఇటీవల ముగిసిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్, వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమ్మిట్‌లు రుజువు చేస్తున్నాయి.

ప్రపంచీకరణ ప్రయివేటీకరణలలో భాగంగా ఆర్థిక సంస్కరణలను ఆకలింపు చేసుకున్న మోడీ గుజరాత్‌ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ది దాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచవచ్చు అని భావించి ప్రణాళికాబద్ధంగా కృషి చేసిండు. ఫలితంగా నేడు దేశంలో మిగులు విద్యుత్ వున్న రాష్ట్రం గా గుజరాత్ నిలదొక్కుకుంది. నేడు ఆ రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల వ్యవస్థాపక సామర్థ్యం 28,423 మెగావాట్లు. రాష్ట్రంలోని మొత్తం విద్యుత్‌లో స్టేట్ సెక్టారులో 7,596 మెగావాట్లు సెంట్రల్ సెక్టారులో 3,631 మెగావాట్లుంటే ప్రయివేటు సెక్టారులో 17,194 మెగావాట్ల ఉత్పత్తి అవుతుంది. దేశంలో అత్యధికంగా ప్రయివేటు సెక్టారులో విద్యు దుత్పత్తి జరుగుతున్నది. ఇక్కడే కచ్ జిల్లాలోని ముంద్రాలో రెండు ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్లున్నా యి.

ఒకటి ఆదాని గ్రూప్‌కు చెందినది దాని సామర్థ్యం 4,620 మెగా వాట్లు. రెండవది టాటాది దాని సామర్థ్యం 4,000 మెగా వాట్లు. ఈ రెండింటి సామర్థ్యం 8,620 మెగా వాట్లు. ఇది బెంగాల్‌లో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌తో సమానమంటే విద్యుత్ రంగంలో గుజరాత్ ఏ స్థాయికి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు మిగులు విద్యుత్ వున్న రాష్ట్రంగా గుజరాత్‌ను తీర్చిదిద్దుతూ రెండో వైపు పెట్టుబడిదారులను ఆకర్షించే నిమిత్తం వైబ్రంట్ గుజరాత్‌కు రూకల్పన చేసిండు. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తూ ఇప్పటివరకు ఏడు నిర్వహించి మొత్తం దేశంలోకి ప్రవహిస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులను గుజరాత్ ఒక్కటే తన్నుకుపోతుందంటే ఆ రాష్ట్రం పారిశ్రామికంగా ఏ స్థాయిలో అభివృద్ధి పథంలో ఉన్నదో తెలుస్తున్నది.

మొదటి వైబ్రంట్ గుజరాత్‌ను 2003లో నిర్వహించినప్పడు దాన్ని అవహేళన చేసిన రాష్ట్రాలే నేడు గుజరాత్‌ను అనుసరించడం మొదలు పెట్టాయి. అందులో బెంగాల్ ఒక టి. ఇటీవల ఆ రాష్ర్టం బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌ను నిర్వహించింది. వైబ్రంట్ గుజరాత్‌కు వచ్చిన స్పందన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు రాలేదు. దీనికి కారణాలనేకం. అందులో ప్రధానమైనది ఆ రాష్ట్రంలో మిగులు విద్యుత్ లేకపోవడం. ప్రస్తుతానికి బెంగాల్ విద్యుత్ కేంద్రాల వ్యవస్థాపక సామర్థ్యం 9,890 మెగావాట్లు. ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్ కేంద్రాల వ్యవస్థాపక సామర్థ్యం కన్నా తక్కువ.

మిగులు విద్యుత్‌ను బెంగాల్ కలిగి వుండకపోవడంతో పాటు ఆ రాష్ట్రం అవలంబిస్తున్న పారిశ్రామిక విధానం, ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు విశ్వాసం కొరవడడం, స్థానిక రాజకీయ నాయకుల అనవసర జోక్యాలు, శాంతిభద్రతలు మొదలగు అనేక కారణాలవల్ల ఆ రాష్ట్రం పెట్టుబడులను ఆశించిన స్థాయిలో ఆకర్షించడంలో విఫలమైంది. అంతేగాక ప్రతిపక్షంలో వున్నప్పుడు మమతా బెనర్జీ టాటాల నానో కార్ల పరిశ్రమ బెంగాల్‌ను వదిలిపెట్టి పోయేంతవరకు అవిశ్రాంతంగా ఉద్యమించిన ఉదంతాన్ని పారిశ్రామికవేత్తలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నరు.

బెంగాల్‌ను వదిలిన టాటాలను ఆహ్వానించి పలు రాయితీలు ఇచ్చి సకాలంలో నానో కార్ల ఉత్పత్తి జరిగేలా సహకరించింది గుజరాత్ ప్రభుత్వం. అందుకే గుజరాత్‌ను పారిశ్రామికవేత్తలు అధికంగా ఆశ్రయిస్తున్నది. పెట్టుబడులను ఆకర్షించడంలో విఫలమవుతుంది ఒక్క బెంగాల్ రాష్ట్రమే కాదు, ఉత్తరప్రదేశ్ బీహార్‌లతో పా టు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న ప్రతి రాష్ట్రానిది ఇదే పరిస్థితి.

దేశంలో మిగులు విద్యుత్ వున్న రాష్ట్రాలు, కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రాల అభివృద్ధి లో చోటుచేసుకుంటున్న ఈ అసమానతలను నిర్మూ లించాలంటే విద్యుత్ కొరత వున్న రాష్ర్టాలకు మిగు లు విద్యుత్ వున్న రాష్ట్రాల నుంచి విద్యుత్ సరఫరా జరిగేలా వాటి మధ్య లైన్లుండాలి. మిగలు విద్యుత్ వున్న ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణకు విద్యుత్ సైప్లె చేయాలంటే రెండింటి మధ్య సరఫరా లైన్లు లేవు. ఈ పరిస్థితి దేశంలోని ఏ రాష్ట్రాల మధ్య కూడా ఏర్పడకూడదు. అందుకేై దేశంలోని అన్ని రాష్ట్రాలను అనుసంధానపరుస్తూ సరఫ రా లైన్లను ఏర్పాటు చేయాలి. నదుల అనుసంధానం ఎంత ముఖ్యమో ఇదీ అంతే ముఖ్యం. అప్పుడే విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కొంత ఉపశమనం కలుగుతుంది. విద్యుద్పుత్తి ఆ ప్రాంత అవసరాలకనుగుణంగా లేనప్పుడు చేపట్టాల్సిన చర్యలు మూడు. అవి 1.విద్యుదుత్పత్తి సామ ర్థ్యాన్ని పెంచడం.

దక్షిణాది రాష్ట్రాలలో విద్యుత్ డిమాండ్ 41,677 మెగావాట్లుంటే ఈ రాష్ట్రాల్లోని విద్యుత్ కేంద్రాల వ్యవస్థాపక సామర్థ్యం 32,428 మెగావాట్లు మాత్రమే వుంది. ఇదే పరిస్థితి ఉత్తరాది రాష్ట్రాలలో కూడా నెలకొంది. విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో కేంద్రం అల్ట్రా పవర్ ప్లాం ట్లను నెలకొల్పి వాటిని ఆదుకోవాలి రాష్ర్టాలు సౌర విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చి ప్రయివేటు రంగం లో విద్యుదుత్పత్తిని ప్రోత్సహించాలి. 2.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యుత్ సరఫరా పంపిణీ రంగాలలో వాటిల్లుతున్న విద్యుత్ నష్టాలను అరికట్టాలి. అధికారిక గణాంకాల ప్రకారం మన దగ్గర విద్యుత్ సరఫరా పంపిణీ వ్యవస్థలలో 32 శాతం నష్టాలు వాటిల్లుతున్నాయి. విద్యుత్ నిపుణులు ప్రస్తుతానికి ఈ విద్యుత్ నష్టాలను 26 శాతానికి తీసుకువచ్చారు. దీన్ని 15 శాతానికి తీసుకువస్తే పది శాతానికి పైగా విద్యుత్ ఆదా అవుతుంది.

3. విద్యుత్‌ను పొదుపుగా వాడటం. ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బు ల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను, వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. విద్యుత్ వినియోగంలో పొదుపు చర్యలను విధిగా అన్ని రంగాలలో పాటించాలి. విద్యుదుత్పత్తి ఎంత ముఖ్యమో దాన్ని పొదుపుగా వాడటం కూడా అంతే ముఖ్యం. విద్యుత్ వినియోగంలో పొదుపు చర్యలు పాటించనపుడు విద్యుదుత్పత్తి ఎంత జరిగినా ఫలితం ఉండదు.

1771

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష