కరెంటు సమస్యకు కారకులెవరు?


Fri,November 21, 2014 12:51 AM

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం వుంటే, 131 మిలియన్ యూనిట్ల విద్యు త్తు మాత్రమే అందుబాటులో వున్నది.ఈ కొరతను కరెంటు కోతల ద్వారా కొంత నివారించుకుని, మిగతాది
పక్క రాష్ర్టాలైన ఒడిశా, కర్ణాటకల నుంచి కొనుగోలుచేసి సర్దుబాటు చేస్తున్నరు.

lakshman-g-prof

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ను ఊపిరి సలపకుండా చేయాలనే ధోరణి ఇంకా సీమాంధ్ర పాలకులలో కొనసాగుతున్నట్టు తాజాగా శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిపై రగులుతున్న రచ్చే దీనికి ఉదాహరణ.
రాష్ట్రంలో సాగు కింద వున్న భూమి 42,32, 435 హెక్టార్లు. ఇందులో చెరువుల కింద 2,38, 056, కాలువల కింద 2,73,579 హెక్టార్లు, బోరుబావుల కింద 40 లక్షల ఎకరాలుంది.

వలస పాలకులు సాగునీటిని ప్రాజెక్టుల కాలువల ద్వారా చెరువులు కుంటల ద్వారా వ్యవసాయ రంగానికి ఇవ్వడంలో వివిక్ష కొనసాగించారు. దీంతో గత్యంతరం లేక ఇక్కడి రైతులు బోరుబావుల సేద్యంపై ఆధారపడాల్సిన పరిస్థితి అనివార్యమైంది. 1985 నుంచి ఈ ప్రాంతంలో బోరుబావుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. దీంతో కరెంటు వినియోగం కూడా పెరిగిపోయింది. 1995 నాటికి ఇక్కడి వ్యవసాయం పూర్తిగా కరెంటుపై ఆధారపడే స్థాయికి చేరుకున్నది. అధికారిక లెక్కల ప్రకారం మనరాష్ట్రంలో 19 లక్షల బోరుబావులున్నాయి. వీటి కింద 40 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నట్టు అంచనా. ఇందులో 80 శాతం పైగా సన్నకారు రైతులే. తెలంగాణ రైతాంగ సమస్యలను, విద్యుత్ వినియోగాన్ని, డిమాండ్‌ను దృష్టిలో వుంచుకునే రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014లో ఈ విధంగా పేర్కొన్నారు.

సమైక్య రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలు ఏ ప్రాం తానివి ఆ ప్రాంతానికే చెందుతాయి. కానీ వాటి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ మాత్రం ప్రాంతాల వారీగా వినియోగాన్ని బట్టి కేటాయించాలి. ఈ నిబంధన ప్రకారం సమైక్యరాష్ట్రంలో ఉత్పత్తయ్యే మొత్తం విద్యుత్‌లో 53.89 శాతం తెలంగాణకు 46.11 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు వినియోగించుకోవాలి. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నింటిని నూతనంగా ఏర్పడిన రెండు రాష్ర్టాలు గౌరవించాలి అనే నిబంధన వున్నా.. వీటన్నింటిని ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం గర్హనీయం.

రెండు రాష్ర్టాల్లో జరుగుతున్న విద్యుత్ ఉత్పాదన మొత్తం ఎంత? అందులో విభజన బిల్లు ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన 53.89 శాతం విద్యుత్ ఇస్తున్నారా అన్నది ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ఉల్లంఘనతో రాష్ర్టానికి రావల్సిన 923 మెగావాట్ల విద్యుత్తు రావటం లేదు. దీంతో తెలంగాణ తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దీనికి కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగాన్ని ప్రాతిపదికగా చేసుకుని పంపకాలు చేయటాన్ని తప్పుపడుతున్నది. రాష్ర్టాల విభజన జరిగినప్పుడు పంపకాలు హేతుబద్ధంగా జరగాలి. ఆస్తులు, అప్పు లు ఉద్యోగులను పంచేటప్పుడు జనాభాను ప్రాతిపదికగా తీసుకుని పంపకాలు జరుపుతరు. కానీ విద్యు త్ పంపిణీలో మాత్రం వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకుని పంపకాలు ప్రాంతాలవారీగా చెయ్యాలి అనేది గాడ్గిల్ ఫార్ములా. ఈ ఫార్ములాను ప్రాతిపదికగా చేసుకునే విద్యుత్ పంపకాలను మధ్యప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల మధ్య చేసిండ్రు. ఇదే సూత్రాన్ని ఉత్తరప్రదే శ్ రాష్ట్ర విభజనలోనూ పాటించారు. విద్యుత్ వినియోగం ఆధారంగా విద్యుత్ పంపిణిని చేపట్టాలనే నిబంధన కొత్తగా వచ్చిందేమికాదు. ఈ విషయాలు బాబుకు తెలియవనుకోవాలా!

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం వుంటే, 131 మిలియన్ యూనిట్ల విద్యు త్తు మాత్రమే అందుబాటులో వున్నది. ఈ కొరతను కరెంటు కోతల ద్వారా కొంత నివారించుకుని, మిగ తాది పక్క రాష్ర్టాలైన ఒడిశా, కర్ణాటకల నుంచి కొనుగోలు చేసి సర్దుబాటు చేస్తున్నరు. ప్రతి రోజు 7 గంటల పాటు పగటిపూట, 4 గంటలు రాత్రిపూట, 3 గంటల పాటు దశల వారీగా ఇవ్వాలి అంటే.. 35 మిలియన్ యూనిట్లు అవసరం. ఇప్పుడు ప్రతి రోజు వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అతి కష్టంగా 20 -25 మిలియన్ యూనిట్ల వరకు మాత్రమే సమకూర్చగలుగుతున్నది. ఇప్పుడు శ్రీశైలంలో కొనసాగుతు న్న విద్యుత్ ఉత్పత్తిని గనుక ఆపితే ఇప్పుడున్న 30 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కొరత 50 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది. ఇంత కొరత వున్నప్పు డు విద్యుత్ సరఫరా చేయ్యాలంటే 18 గంటల విద్యుత్ కోతను తెలంగాణ అంతటా విధించాలి. ఇదేనా బాబుకోరుకుంటున్నది?

విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం పవర్ స్టేషన్ నుంచి తెలంగాణకు రావల్సిన విద్యుత్ వాటా రావ టం లేదు. ఆరు నెలల కిందటే ఉత్పత్తికి సిద్ధంగావున్న ఈ ప్రాజెక్టులో తెలంగాణకు వాటా ఇవ్వాల్సి వస్తుందన్న నెపంతో సాంకేతిక కారణాల సాకుతో ఇప్పటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం లేదని పేర్కొంటూ; ప్రయోగాత్మక విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ట్లు చెప్తున్నారు.

కానీ రహస్యంగా ఇక్కడ 300 మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో తెలంగాణకు రావల్సిన వాటాను ఏపీ ఇవ్వడం లేదు. ఎగువ దిగువ సీలేరులలో ఉత్ప త్తి అవుతున్న విద్యుత్‌ను మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మే వినియోగించుకుంటున్నది. సీలేరులో ఉత్ప త్త య్యే విద్యుత్‌తో పాటు గతంలో సమైక్య రాష్ట్రంలో కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గౌరవించాలని కేంద్ర విద్యు త్ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి న నీరజా మాథూర్ కమిటీ పేర్కొన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఖాతరు చెయ్యటం లేదు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఉపసంహరించుకోవటం సరికాదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. తాజాగా హిందూజా లాంటి ప్రయివేటు ప్రాజెక్టులపై తెలంగాణకు విద్యుత్ ఇవ్వకుండా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. బాబు అవలంబిస్తున్న విధానాలతో తెలంగాణ తీవ్ర విద్యుత్ కొరత ను ఎదుర్కొంటున్నది.

తెలంగాణలోని పంటలను ఆదుకోవడానికే ఇక్క డి ప్రభుత్వం శ్రీశైలంలో అనివార్యమైన పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నది. దీన్ని తప్పు పడ్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరుకుందని, జీవో నెంబరు 107 ప్రకారం విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని కోరుతూ కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఆశ్రయించింది. లేకపోతే రాబోయే నెలల్లో రాయలసీమకు తాగుసాగునీటి ఇబ్బందులు ఏర్పడుతాయని అంటు న్నది. అక్కడ విద్యుత్ ఉత్పత్తిని ఆపితే తెలంగాణ అవసరాలకు 300 మెగావాట్లు విద్యుత్తును ఇచ్చేందుకు తాము సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు. విభజన బిల్లు ప్రకారం తెలంగాణకు హక్కుగా రావల్సిన విద్యుత్తును రాకుండా చేసి, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపితే 300 మెగావాట్లు తెలంగాణకు ఇస్తామనడం హాస్యాస్పదంగా వున్నది.1996 జూన్ 15 న బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జీవో నెంబరు 69ని జారీ చేశారు. దాని ప్రకారం శ్రీశైలం 834అడుగుల వరకు నీటిని విద్యు త్ ఉత్పత్తికి వాడుకోవచ్చు. అదే ఏడాది బాబు హయాంలో 779 అడుగుల వరకు విద్యుత్ ఉత్పతి కి వాడుకున్నారు. 1996-2004 వరకు బాబు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో శ్రీశైలంలోని నీటిని జీవో నెంబరు 69ని అనుసరించే చేపట్టింది.

కృష్ణానదిపై శ్రీశైలం నిర్మాణం వల్ల తెలంగాణలో 117 గ్రామాలు ముంపుకు గురై 2.5 లక్షల మంది నిర్వాసితులయ్యారు. కానీ శ్రీశైలంలోని 216 టీఎం సీల్లో ఒక్క నీటి చుక్క కూడా తెలంగాణకు ఇవ్వటం లేదు. కృష్ణానదిలోని నికర జలాలను కోస్తాంధ్ర మిగులు జలాలను రాయలసీమ సమైక్య రాష్ట్రంలో నే భద్రపరుచుకున్నాయి. మిగులు జలాల ఆధారం గా సీమలో నిర్మించిన గాలేరునగరి, హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు ద్వారా 100 టీఎంసీలకు పైగా వాడుకుంటున్నరు. శ్రీశైలం నీటి వినియోగంలో తాగు,సాగు అవసరాలకే ప్రాధాన్య మివ్వాలని, తాగుసాగునీటికి సంక్షోభం ఏర్పడే స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని ఖర్చు చేయరాదనే వాదనను తెరపైకి తెస్తున్నరు.

ఇది ఎంతవరకు సమంజసం? శ్రీశైలంలోని జలాలను తెలంగాణ వాడుకుంటున్నది తాగుసాగునీటి అవసరాలకు కాదు, విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే. అక్కడి విద్యుత్తు తో తెలంగాణ రైతులు తాగుసాగునీటి వనరులను తీర్చుకుంటున్నారు. విద్యుత్ ఉత్పత్తి తర్వాత శ్రీశై లం జలాలు కృష్ణాడెల్టాకే కదా ఉపయోగపడేది. దానికి ఇంత రాద్ధాంతం దేనికి! శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి తాగు సాగునీటి అవసరాలకే తప్ప పక్క రాష్ర్టాలకు అమ్ముకోవడానికి కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమైన సమస్యలను విభజన బిల్లులోని నిబంధనల ప్రకా రం పరిష్కరించుకోవాలి. దీనికి కేంద్రం చొరువ తీసుకుని రెండు రాష్ర్టాల్లో విద్యుత్ ఉత్పత్తి ఎక్కడ జరిగినా తెలంగాణకు 53.83, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం కేటాయించి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వాటి గడువు పూర్తయ్యేదాకా అవి అమల్లో ఉండేలా చూడాలి.

1272

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష

Featured Articles