నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?


Sat,October 11, 2014 12:36 AM

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగాలను బట్టి మన విద్యా నైపుణ్యాలుంటేనే మనకు వాటిలో ప్రవేశం దక్కేది. అందుకే ప్రతిపాదిత ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని దాదాపు ఐదు ిలియన్ల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలపై నిరుద్యోగులకు అవగాహన కల్పించాలి.

ఆధునిక సమాజం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ముఖ్యమైనది. నిరుద్యోగ్యం అంటే ఉద్యోగం చేయడానికి అర్హతలున్నా ఉద్యోగం లేకుండా ఉండటం. నిరుద్యోగం వ్యక్తుల లో నిరాశ నిస్పృహలతో పాటు అభద్రతా భావాన్ని కల్గిస్తే, ఉద్యోగం వ్యక్తులలో ఆత్మవిశ్వాసాన్ని, భద్రతా భావాన్ని, సమాజంలో గుర్తింపుతోపాటు స్థాయిని కూడా సమకూర్చి పెడుతుంది. ఉద్యోగం అనేది మనిషికి ఓ జీవనాధారం. ఆ జీవనాధారం కోసమే యువత ఎప్పుడూ ఆరాటపడేది. అసఫ్‌జాహీల కాలంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకూడా తెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించలేదు. తెలంగాణ రాష్ట్ర డిమాండుకు గల కీలకమైన అంశాల్లో ఉద్యోగ నియామకాల సమస్యే ప్రధానమైనది. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పాటైతే తమకు ఉద్యోగాలు లభిస్తాయనే అభిప్రాయమే యువతను ఉద్యమాల్లో పాల్గొనెలా చేసింది.

imageఅంతిమంగా తాము ఎదుర్కుంటున్న ఈ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం స్వరాష్ట్రం తప్ప మరో మార్గం లేదని నమ్మారు. దీంతోనే ఆరు దశాబ్దాల కాలం నుంచి తెలంగాణ ప్రజలు కోరుకుంటు న్న రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరింపబడుతుందని ఇక్కడి నిరుద్యోగ యువత ఆశిస్తున్నది. ఆశిస్తున్న స్థాయిలో నిరుద్యోగ సమస్య కు పరిష్కారం లభిస్తుందా అన్నది ప్రశ్న. దీంతోపాటు అసలు తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రత ఏవిధంగా వున్నది, సమస్య తీవ్రతకు గల కారణాలు, దాని పరిష్కార మార్గాలు, పరిష్కారం ఏ మేరకు సాధ్యమన్న విషయాలను పరిశీలించాల్సిన అవసరమున్నది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు దశాబ్దాల కాలంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానా ల మూలంగానే తెలంగాణలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది.

ఉపాధి కల్పనా కార్యాలయాల సమాచా రం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదైన నిరుద్యోగుల వివరాలు సమస్య తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి. మొత్తం తెలంగాణ జిల్లాల్లోని నిరుద్యోగుల సంఖ్య 11,68,235. అనధికారిక లెక్కల ప్రకారం ఉపాధి కల్పనా కేంద్రాల్లో తమపేర్లు నమోదు చేసుకునే నిరుద్యోగులు కేవలం 30 శాతం మాత్రమే. మిగతా 70 శాతం మంది వివిధ కారణాలవల్ల తమపేర్లు నమోదు చేసుకోవడం లేదు. వీరిలో 45 శాతం పైగా గ్రాడ్యుయేట్లు, 25 శాతం పైగా ఇంటర్ పాసైన వాళ్లు. వీళ్లుపోగా మిగతా వారం తా డిగ్రీ, ఆపై చదువులు,వృత్తివిద్యల వారు. మొత్తం నిరుద్యోగుల్లో 70 శాతం ఇంటర్,డిగ్రీ వరకు చదివిన వారు. గడిచిన పదిహేనేళ్ల కాలంలో తెలంగాణ ప్రాం తంలో భర్తీ అయిన పోస్టులు దాదాపు 35వేలు మాత్రమే. ఇందులో సగానికి పైగా ఉద్యోగాలు పోలీసులు, టీచర్ పోస్టులకు చెందినవే. 1996లో అధికారం చేపట్టిన చంద్రబాబు ఉద్యోగాల నియామకాలపై అప్రకటిత నిషేధాన్ని అమలు చేసిండు.

1999 లో రెండోసారి అధికారం చేపట్టిన పిదప ఉద్యోగుల్లో స్వచ్ఛంద పదవీ విరమణను (గోల్డెన్ షేక్ హ్యాండ్) ప్రోత్సహించిండు. దీంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పేరుతో ఆధునిక యంత్ర పరికరాలను దిగుమతి చేసుకోవడం, కంప్యూటర్లను ప్రవేశపెట్ట డం, గుత్త సంస్థలను ఆహ్వానించడం, వీటికి తోడుగా ప్రపంచ బ్యాంకులాంటి సంస్థలు విధిస్తున్న షరతులను సూచనలను పాటిస్తూ ప్రపంచీకరణ ప్రయివేటీకరణలలో భాగంగా వచ్చిన నూతన సరళీకృత ఆర్థిక విధానాలతో ఉద్యోగుల సంఖ్యను ప్రతియేటా తగ్గిస్తూ పోయాడు. నిర్ణయించడంతో 1991- 2001 మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం తరుగుదల నమోదైంది. అప్పటి నుంచి ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

సంస్కరణల్లో భాగం గా గత ప్రభుత్వాలు మొత్తం ఉద్యోగాలను కోర్, నాన్‌కోర్‌లుగా వర్గీకరించారు. ఉన్నత స్థాయి పర్యవేక్షణ అధికారాలతో కూడిన వాటిని కోడ్ ఫంక్షనల్ ఉద్యోగాలుగా పరిగణించారు. ఇవి పరిమిత సంఖ్య లో ఉండే ఉద్యోగాలు. వీటి రిక్రూట్‌మెంటును ప్రభు త్వం తమ అవసరాలను బట్టి చేపడ్తుంది. ఇవిగాక గ్రూప్-3, గ్రూప్-4, క్లాస్-4 ఉద్యోగాలన్నింటిని నాన్‌కోర్ ఫంక్షనల్ ఉద్యోగాలుగా పరిగణించి, ప్రభు త్వం వీటికి ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతుల్లో నియామకాలు చేపట్టింది. ఈ విధానాలను అవలంబించిన గత ప్రభుత్వాలు శాశ్వత ఉద్యోగ నియామకాలకు స్వస్తిపలికి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టినయి. సాధారణంగా సర్వీసు రంగాల్లోనే ఉద్యోగావకాశాలు ఎక్కు వ. సర్వీసు రంగాలైనటువంటి రైల్వే, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, పోస్టల్ వంటి రంగాల్లో కూడా ఉద్యోగుల సంఖ్యను కుదించేందుకు 1995లోనే శ్రీకారం చుట్టిండ్రు. ఒకప్పుడు రెండు మిలియన్ల ఉద్యోగస్థులతో కళకళలాడిన భారత రైల్వేలు సంస్కరణల పుణ్యమా అని నేడు 13 లక్షలకు చేరుకున్నది.

కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థలో కూడా అదే జరిగింది. సంస్కరణల పేరిట ప్రభుత్వాలకు లాభసాటిగా లేని ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయాలని లేదా సిబ్బందిని గణనీయంగా తగ్గించాలని నిర్ణయించా రు. సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణల మూలంగా ఉపాధి అవకాశాలు పెరగకపోగా వున్న వి కాస్తా తగ్గిపోయినయి. దీంతోపాటు ఉద్యోగ భద్రత, సర్వీస్ బెనిఫిట్స్, పెన్షన్ వంటివి కనుమరుగై పోయినవి. ఇవన్నీ 2004 నుంచే ఆచరణలోకి వచ్చినయి.

గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వీఆర్వో, వీఆర్‌ఏ, పంచాయతి సెక్రటరీ పోస్టులు తప్పిస్తే గత మూడేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్‌మెంట్ లేదు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే దానిపై స్పష్టతలేదు. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో లక్షా ఏడువేల పోస్టు లు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తున్నది. వాస్తవానికి కమలనాథన్ కమిటి మార్గదర్శకాలు అమల్లోకి వచ్చి ఉద్యోగుల విభజన కేటాయింపులు పూర్తి అయితేగానీ ఈ లెక్క కచ్చితంగా తెలువదు. తాజాగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నేపథ్యంలో ఖాళీల సంఖ్యలో మార్పు రావొచ్చు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఏదో ఒక ప్రభుత్వ శాఖలో ఐదేళ్లకు పైగా సర్వీసును పూర్తిచేసి, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ అర్హతలుంటాయో ఆ అర్హతలన్నీ వుండి రోస్టరు విధానాన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటిస్తూ క్రమపద్ధతిలో నియమితులైన వారినే రెగ్యులరైజ్ చేస్తారు తప్ప అందరిని కాదు.

imgsఅంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్లో రెగ్యులరైజ్ అయ్యేది కొందరే తప్ప అందరూ కాదన్నమాట. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల సౌకర్యంవున్న ఎస్సీ, ఎస్టీలకు 1950లో 100కి 30 ఉద్యోగ అవకాశాలుండగా నేడవి ముగ్గురికి మాత్రమే లభ్యమవుతున్నాయంటే సమస్య తీవ్రత ఏ స్థాయి లో వున్నదో అర్థం చేసుకోవచ్చు.
నిరుద్యోగం మధ్య తరగతిలో ఎక్కువగా ఉంటు న్నది. ఈ సమస్య ప్రజాస్వామ్య విధానాల ఉనికికే ప్రమాదంగా పరిణమించవచ్చు. దీనికి పరిష్కార మార్గం కనుక్కోక పోతే యువకులు అనుచిత మార్గా లు పట్టవచ్చు. ఏ సమాజంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తుందో ఆ సమాజం దారిద్య్రంతో, అరాచకంతో, అవినీతితో సతమతమవుతూ అభివృద్ధి చెందదు. నిరుద్యోగం సమ్మెలకు దారితీస్తుంది. ఇది రాజకీయ వ్యవస్థకే గొడ్డలిపెట్టు. ఇప్పటికే వున్న నిరుద్యోగులకు తోడుగా ప్రతియేటా రెండు నుంచి మూడు లక్షల మంది నిరుద్యోగులు పెరుగుతున్నా రు.

ఈ సమస్యను పరిష్కరించేదెట్ల? నూతన రాష్ట్రం లో ఉద్యోగాలు లభిస్తాయని ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల ఆశలను నెరవేర్చేదెట్లా? ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు లభ్యమయ్యేది అతి తక్కువ. ఉద్యోగాలు పెద్ద మొత్తంలో లభించేది ప్రయివేటు రంగంలోనే. అందులో అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగాలను బట్టి మనవిద్యా నైపుణ్యాలుంటేనే మనకు వాటిలో ప్రవేశం దక్కేది.

అందుకే ప్రతిపాదిత ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని దాదాపు ఐదు మిలియన్ల ప్రత్య క్ష పరోక్ష ఉద్యోగాలపై నిరుద్యోగులకు అవగాహన కల్పించాలి. కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థకు స్వస్తి పలి కి, కేరళ తమిళనాడు రాష్ర్టాల్లాగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టా లి. దాంతోపాటు ఉత్పాదక రంగమైన పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు చేపట్టి, వ్యవసాయ రంగంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి భూ సంస్కరణలు అమలు పరచడం ద్వారా ఆశించిన స్థాయిలో నిరుద్యోగ సమస్యను అధిగమించవచ్చు. కానీ సమస్యకు సంపూర్ణ పరిష్కారం ఒక్క రోజులో రాదు.

3226

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష