కమలనాథన్ కాకి కబుర్లు


Sun,August 10, 2014 02:40 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఎవరు లోకల్, ఎవరికి ఆప్షన్లు,ఎవరిని ఎలా పరిగణిస్తారు అనే అంశాలపై కమి టీ తన అభిప్రాయాలను తెలిపింది. కమిటీ ప్రకటించిన మార్గదర్శకాలపై సీమాంధ్ర ఉద్యోగులు హర్షం వెలిబుచ్చితే తెలంగాణ ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసనను వెలిబుచ్చాయి. కమిటీ తాను ఉద్యోగుల స్థానికతను నిర్ధా రించుటలో ఆర్టికల్ 371డీ మేరకు రూపొందించిన రాష్ట్రపతి ఉత్తర్వులను స్ఫూర్తి గా తీసుకునే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంటు యాక్ట్ 1975కు లోబడి ఉద్యోగి సర్వీసు రికార్డులో నమోదైన లేక అధీకృత అధికారి ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం ఉద్యో గి స్థానికతను నిర్ధారిస్తున్నట్లు పేర్కొంటూ, తాము రూపొందించిన విదివిధానాలపై ఉద్యోగుల్లో ఎవరికైనా అభ్యంతరాలున్నా లేదా సూచనలు చేయాలనుకున్నా ఆగస్టు 5 లోపు పంపాలని పేర్కొంది.

స్థూలంగా కమిటీ ఉద్యోగుల విభజనపై రూపొందించిన విధి విధానాను ఒకసారి పరిశీలిస్తే అవి ఎంత వరకు ఆర్టికల్ 371డీ కి అనుగుణంగా ఉద్యోగుల నియామకాలకు సంబంధించి విధిగా పాటించవలసిన రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి వున్నవి లేనిది స్పష్టం అవుతుంది. కమలనాథన్ కమిటీ సిఫారసు చేసిన మార్గనిర్దేశాలలో ప్రధానమైన వాటిని కొన్నింటిని పరిశీలిస్తే అవి సీమాంధ్ర ఉద్యోగులకు మేలుచేసే విధంగా తెలంగాణ ఉద్యోగులకు కీడు చేసే విధంగా వున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. సారంలో కమల్‌నాథన్ కమిటీ మార్గనిర్దేశాలన్నీ రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా వుండటం విచారకరం.

మొదటగా కమలనాథన్ కమిటీ తమ ముసాయిదా మార్గనిర్దేశాల్లో ఉద్యోగులకిచ్చే ఆప్షన్ల విషయంలో ఎమన్నదో ఓసారి చూద్దాం. తాము ఏ రాష్ట్రంలో పనిచేయాలనుకుంటున్న విషయాన్ని ఉద్యోగులు తమ ఆప్షన్ల ద్వారా తెలియపరచవచ్చు. కానీ వాటిన్నింటిని పరిగణనలోకి తీసుకోరు. కేవలం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల, ఇద్దరూ ఉద్యోగులైన భార్యాభర్తల కేసులు, వితంతువులు, విడాకులు పొంది విడిగా ఒంటరిగా జీవిస్తున్న మహిళా ఉద్యోగులు, 40శాతానికి పైగా అంగ వైకల్యం వున్న వారు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకిచ్చే ఆప్షన్లను మాత్ర మే పరిగణనలోకి తీసుకుంటారు.

ఇది సహేతుకమైన నిర్ణయం కాదు. ఎందుకంటే ఉద్యోగ నియామకాల్లో విధిగా పాటించాల్సిన రాష్ట్రపతి ఉత్తర్వులు స్థానిక రిజర్వేషన్ల విధానం ఉమ్మడి రాష్ట్రంలో 1975లో అమలులోకి వచ్చాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇరు రాష్ర్టాల కోరిక మేరకు ఈ ఉత్తర్వులు రెండు రాష్ర్టాల లో కొనసాగుతునే వున్నాయి. ఉద్యోగస్తుల్లో ఎవరు స్థానికులు ఎవరు స్థానికులుకారో నిర్ధారించేందుకు కొలమానం ఈ ఉత్తర్వులే. ఇవి అమలులో వున్నప్పుడు ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడం అనేది కుదరదు.

ఉద్యోగస్తుల నియామకాలు ఈ ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగుణంగా జరిగాయా అన్నదే కమలనాథన్ కమిటీ పరిశీలించాల్సిన అంశం. రాష్ట్రపతి ఉత్తర్వులలోని స్థానిక రిజర్వేషన్ల విధానానికి లోబడి జరిగిన నియామకాలనే స్థానిక ఉద్యోగులుగా పరిగణించి వారి సంబంధిత రాష్ట్రానికి వారిని పంపించాలి. దీనికి భిన్నంగా జరిగిన నియామకాలను స్థానికేతరులవిగా నిర్ధారించి ఎవరి రాష్ట్రానికి వాళ్లను పంపించాల్సిన బాధ్యత కమలనాథన్ కమిటీది. కానీ దీనికి భిన్నంగా, లేని ఆప్షన్ల వెసులుబాటు సీమాంధ్ర ఉద్యోగులకు కల్పించి సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ రాష్ర్టానికి బదలాయించడం సహేతుకం ఎంతమాత్రం కాదు. ఉద్యోగి సర్వీసు రికార్డులో నమోదైన లేక అధీకృత అధికారి ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా ఉద్యోగి స్థానికతను నిర్ధారించి ఎవరి రాష్ర్టానికి వాళ్లను పంపాలి తప్ప ఆప్షన్ల ద్వారా ఎంత మాత్రం కాదు.

కమలనాథన్ కమిటీ తన ముసాయిదా మార్గనిర్దేశాల్లో ఓ ఆసక్తికరమైన విషయా న్ని తెరపైకి తెచ్చింది. అదేమంటే ఉమ్మడి రాష్ట్రంలో వున్న పోస్టులు 12.41 లక్షలు. వీటిలో ఖాళీలు 2.16 లక్షలు. రాష్ట్రస్థాయి పోస్టులు 76 వేలు. రాష్ట్రస్థాయి పోస్టుల ను ఖాళీలను మినహాయించగా మిగిలేది 9.09 లక్షలు. వీళ్ళంతా క్షేత్రస్థాయి ఉద్యోగస్థులట. వీరంతా జూన్ రెండు నాటికి వాళ్ళు పనిజేస్తున్న చోట వుంటారట. అంటే వీళ్లంతా ఎక్కడి వారక్కడే వుంటారట.

ఎందుకంటే కమిటీ దృష్టిలో ఇవన్నీ రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని స్థానిక రిజర్వేషన్ విధానానికి అనుగుణంగా జరిగిన నియామకాలేనా? అలాంటప్పుడు వారిని విభజించాలనడంలో అర్థం లేదని స్పష్టం చేసింది. కమిటీ అభిప్రాయపడినట్లు రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనలకు లోబడి ఈ నియామకాలు తెలంగాణ జోన్లయినటువంటి 5,6 లలో జరిగాయా అన్నది ప్రశ్న. అలా జరగలేదని సాక్షాత్తు 610 జీవో తోపాటు ప్రభుత్వం నియమించిన గిర్‌గ్లాని కమిటీ లాంటివి స్పష్టం చేసినవి.

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగ నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ విధానం ఈ విధంగా ఉంటది. జిల్లాస్థాయి పోస్టుల్లో 80 శాతం స్థానికులకు పోగా మిగతా 20 శాతం ఓపెన్ కోటా కింద, జోనల్ నాన్ గెజిటెడ్ పోస్టుల్లో 70 శాతం స్థానికులకు పోగా మిగతా 30 శాతం ఓపెన్ కోటా కింద, జోన ల్ గెజిటెడ్ పోస్టుల్లో 60 శాతం స్థానికులకు మిగతా 40 శాతం ఓపెన్ కోటా కింద భర్తీ చేయాలి. జిల్లాస్థాయిలో ఓపెన్ కోటాగా పరిగణించిన 20 శాతం గానీ, జోనల్ నాన్‌గెజిటెడ్‌లోని 30 శాతం గానీ, జోనల్ గెజిటెడ్‌లోని 40 శాతం గానీ స్థానికేతరులకు రిజర్వు చేసిన ఉద్యోగాలు ఎంతమాత్రం వావు. వాటిని ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ చేయాలి.

వాటికి అందరూ అర్హులే. మెరిట్ ప్రాతిపదికపై వాటిని భర్తీ చేయాలి. ఈ నిబంధనలు పాటించకపోవడం మూలంగా 30 శాతం స్థానికేతరులు తెలంగాణ జోన్లయినటువంటి 5,6లలో పనిజేస్తున్నట్లు అంచనా వేయబడ్డది. రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోకి వచ్చినాటి నుంచి రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఉపాధ్యా య ఉద్యోగ నియామకాలను పరిశీలిస్తే జిల్లా స్థాయి ఉద్యోగాల్లో కూడా స్థానికేతరులు ఎంతమంది వున్నారో తెలిసిపోతుంది. రంగారెడ్డి జిల్లాలో 1979 -2000 సంవత్సరాల మధ్యకాలంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాలు మొత్తం 5229.

వీటిలో స్థానికులు 3770 మంది, స్థానికేతరులు 1459 మంది. ఈ 1459 మంది స్థానికేతర ఉపాధ్యాయుల్లో 144 మంది జోన్ ఒకటికి చెందినవారు, 245 మంది జోన్ రెండుకు చెందినవారు, మరో 245 మంది జోన్ మూడువారు. జోన్ నాలుగువారు 122 మంది పోగా మిగతావారు ఐదవ జోన్‌కు చెందిన వారు. స్థానికేతర ఉద్యోగులు అత్యధికంగా వున్న తెలంగాణ జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం. నేడు తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు 4, 03, 002 మంది. పదవి విరమణ జేసిన ఉద్యోగులు 2,34,00 మంది. మొత్తం ఉద్యోగులు 6,37,002 మంది. వీరందరిని క్షేత్రస్థాయి ఉద్యోగస్తులుగా పరిగణిస్తూ, ఇక్కడే పనిజేస్తున్నారు కాబట్టి వాళ్లంతా ఇక్కడే వుంటారనడం తప్పు. వారి స్థానికతను సర్వీస్ రికార్డుల ఆధారంగా నిర్ధారించి ఎవరి రాష్ర్టానికి వారిని పంపిచాల్సిన బాధ్యత కమిటీది. దీన్ని విస్మరించడం విచారకరం.

కమలనాథన్ కమిటీ సిఫారసుల్లో వివాదస్పదమైన 18 (ఎఫ్) అంశం తెలంగా ణ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కల్గిస్తుననది. 18 (ఎఫ్) చెప్పే విషయం ఏమిటంటే ఏ రాష్ట్రంలోనైనా ఏ కేటగిరిలోనైనా పోస్టులకు సరిపడా ఉద్యోగులు లేకుంటే ఎక్కువున్న చోట నుంచి తక్కువున్న రాష్ర్టానికి సర్దుబాటు చేయాలన్నది దాని సారాం శం.ఈ సిఫార్సు మూలంగా కనీసంగా ఐదువేల మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ అయ్యే అవకాశమున్నది. దీంతో ఇక్కడి ఉద్యోగుల పదోన్నతులపై తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన ఉద్యోగ నియామకాలపై తీవ్ర ప్రభావం వుంటుంది.

మన రాష్ట్రం విషయంలో ఇలాంటి నిబంధనలు చెల్లుబాటు కావని లోగడ పెక్కు కమిటీలు నిర్ధారించడం జరిగింది. లోగడ గణితం, భౌతిక శాస్త్రం బోధించే ఆధ్యాపకులు తెలంగాణలో అవసరానికి సరిపడాలేరని, అవసరానికి మించి కోస్తాంధ్రలో వున్నారని అదనంగా వున్న ఆ అధ్యాపకులను తెలంగాణకు బదిలీ చేయటం జరిగింది. ఈ విధంగా చేయటం రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందని లోగడ పెక్కు కమిటీలు నిర్ధారించడం జరిగింది. రాష్ట్రం ఉమ్మడిగా వున్నప్పుడు ఇలాంటి సర్దుబాట్లు ఇరుప్రాంతాల అంగీకారంతో జరుపుకోవచ్చునేమో కానీ రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాల అంగీకారం లేకుండా ఇది సాధ్యపడుతుందా, రెండు రాష్ట్రాలు దీనికి అంగీకరిస్తాయా? అంతేగాకుండా స్థానిక రిజర్వేషన్లకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు ఇరు రాష్ట్రాల్లో అమలులో వున్నప్పుడు ఇలాంటి సర్దుబాట్లు సాధ్యమేనా అన్నది ప్రశ్న. 18 ఎఫ్‌కు బదులుగా సూపర్ న్యూమరి పోస్టులు ఏర్పాటు చేసుకోవడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అన్న విషయాన్ని కమిటి గ్రహించాలి.

laxmanరాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగస్తులు వారి స్థానికతను బట్టి ఎక్కడి వారినక్కడ పంపిస్తారని తద్వారా తెలంగాణలో పెద్ద మొత్తంలో ఉద్యోగ ఖాళీలు ఏర్పడుతాయని ఇక్కడి నిరుద్యోగులు ఉద్యోగ సంఘాలు ఆశించాయి. కానీ దీనికి భిన్నంగా ఇక్కడ పనిజేస్తున్న అక్కడి ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని వారికి స్థానచలనం జరగకుండా, అక్కడి వారిని అక్కడనే ఉండేటట్లుగా కమలనాథన్ కమిటీ విధి విధానాలను రూపొందించినట్లుగా స్పష్టం అవుతుంది. ఇది విచారకరం. లోగడ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉద్యోగుల విభజనలో ఏ నిబంధనలను అధికారులు పాటించారో వాటినే కమలనాథన్ ప్రామాణికంగా తీసుకోవడం విచారకరం. ఎందుకంటే లోగడ విభజన జరిగిన రాష్ర్టాల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి రాజ్యాంగపరమైన మార్గనిర్దేశాలు ఆ రాష్ర్టాల్లో లేవు. కానీ మన దగ్గర ఉద్యోగ నియామకాల్లో విధిగా పాటించవలసిన రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనలు అమలులో వున్నా యి. ఉద్యోగుల విభజన గురించి రూపొందించిన విధి విధానాలు ఈ ఉత్తర్వులకు అనుగుణంగానే వుండాలి తప్ప వాటికి భిన్నంగా కాదు అన్న విషయాన్ని కమిటీ గమనించాలి.

1506

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష