వాగ్దానాలు తెచ్చిన చిక్కులు


Wed,June 18, 2014 01:39 AM


జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయగా వారంరోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అట్టహాసంగా పద వీ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇరువురూ పోటీపడి తమ ఎన్నికల ప్రణాళికల్లో ఆయా ప్రాంత ప్రజలకు లబ్ధిని చేకూర్చే అనేక ప్రజాకర్షక పథకాలను వాగ్దా నం చేశారు. కేసీఆర్ కన్నా ఒకడుగు ముందుకేసి చంద్రబాబు తాను ప్రకటిస్తున్న సంక్షేమ పథకాల అమలు ద్వారా ఏర్పడే ఆర్థికభారాన్ని సహితం ఊహించకుండా ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలపై వరాల వర్షం కురిపించారు.

ఒకదశలో కొందరు బాబు చేస్తున్న ఎన్నికలవాగ్దానాలను దష్టిలో పెట్టుకుని అతన్ని ఆల్‌ఫ్రీ బాబుగా ఎద్దేవా చేసిన సందర్భాలున్నాయి. అధికారం చేపట్టిన వీరివురు ఇప్పుడు ప్రజలకు చేసిన వాగ్దానాల అమలుకు శ్రీకారం చుట్టాల్సి వుంది. దాన్ని అనుసరించే బాబు ప్రమాణ స్వీకారం పిదప ఐదు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసింది. ఈ ఐదింటిలో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరిట 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందుబాటులోకి తేవడంతోపాటు నవ్యాంధ్ర ప్రదేశ్‌లో బెల్టుషాపుల రద్దు నిర్ణయాలు పెద్దగా ప్రాధాన్యం గల అంశాలు కావు. ఎందుకంటే వాటి అమలు కూడా సులభం.కానీ మిగతా మూడు మాత్రం కీలకమైనవి సంక్లిష్టమైనవి.
వాగ్దానాల అమలులో భాగంగా చంద్రబాబు సంతకాలు చేసిన ఫైళ్లలో అత్యంత కీలకమైనది రైతు ల పంట రుణాల మాఫీకి సంబంధించింది. ఎన్నికల సమయంలో బాబు పంట రుణాల మాఫీతోపా టు డ్వాక్రా మహిళల రుణాలను కూడా మాఫీ చేస్తామన్నారు.అందుకే అక్కడ మొత్తం రుణాలు 87612 కోట్లకు చేరుకున్నవి. ఒకవేళ లక్షలోపు రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని బాబు ప్రభుత్వం నిర్ణయించినా రాష్ట్రంపై పడే ఆర్థికభారం 51300 కోట్లుండే అవకాశముంది.

తెలంగాణలో మొత్తం వ్యవసాయ రుణాలు 49654 కోట్లుంటే ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానం ప్రకారం లక్షలోపు తీసుకున్న పంట రుణాలకే రుణమాఫీ వర్తిస్తుందంటే అవి 30120 కోట్లుండే అవకాశముంది. కేవలం 2013-14 ఆర్థిక సంవత్సరంలో తీసుకు న్న పంట రుణాలకే మాఫీ వర్తిస్తుందంటే తెలంగాణ రాష్ట్రంపై పడే ఆర్థికభారం 14897 కోట్లు వుండే అవకాశముంది. పదివేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ప్రారంభమవుతున్న తెలంగాణ రాష్ర్టానికి ఈ రుణమాఫీ అసాధ్యం కాదు కానీ 15900 కోట్ల లోటు బడ్జెట్‌తో ప్రారంభమవుతున్న ఆంధ్రరాష్ర్టానికి ఇది సాధ్యపడుతుందా అన్నది ప్రశ్న. ఎందుకంటే తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు గాడ్గిల్ ముఖ ర్జీ ఫార్ములా ప్రకారం ప్రత్యేక కేటగిరి రాష్ట్ర హోదా కూడా లభించే సూచనలు కనిపించటం లేదు. ప్రత్యేక హోదా రాష్ర్టానికైతే 90 శాతం గ్రాంటుగా 10 శాతం రుణంగా కేంద్రం నిధులను సమకూరుస్తుంది.

లేనిచో కేంద్రం సమకూర్చే నిధు లు 30 శాతం గ్రాంటుగా 70 శాతం రుణాలుగా లభిస్తాయి. అందుకే బాబు రుణమాఫీ అమలు విషయంలో జాప్యం చేస్తుంది. అందుకే రుణమాఫీ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయటానికి ఓ కమిటీని కూడా వేసింది. ఆ కమిటీ రుణమాఫీ విధి విధానాలను ఖరారు చేసేందుకు 45 రోజుల గడువు కూడా ఇచ్చింది. అంటే రుణమాఫీపై అంతిమ నిర్ణయం తీసుకునేందుకు బాబు రెండు మాసాల గడువు తీసుకుంటున్నారన్న మాట.

రైతు రుణాల మాఫీ అమలు విషయంలోనే కాదు బాబు జాప్యం చేస్తుంది వద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్ల పెంపుదల విషయంలో కూడా అతడు అవలంబిస్తున్న విధానం అదేవిధంగా వుం ది. ఇంగ్లాండు అమెరికా డెన్మార్క్ లాంటి దేశాల్లో ఈ పెన్షన్లు చాలా కాలం క్రితమే మొదలైనా మన దగ్గర మొదలైంది మాత్రం 1995లో. ప్రారంభం లో వద్ధాప్య వయోపరిమితి 65 సంవత్సరాలుగా వున్న దానిని మన రాష్ట్రంలో 2011లో 60 సంవత్సరాలకు కుదించడంతో పెన్షనర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

పెన్షనర్ల వయోపరిమితితో పాటు పెన్షన్ల విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా వున్నది. గోవా రాష్ట్రంలో చెల్లిస్తున్న పెన్షన్ నెలకు రెండు వేలుంటే తమిళనాడు ఢిల్లీలలో చెల్లిస్తుంది నెలకు 1000 రూపాయల చొప్పున. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానం మేరకు వద్ధాప్య వితంతు పెన్షను నెలకు 1000 గా వికలాంగుల పెన్షను నెలకు 1500 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఆంధ్రలో మొత్తంగా వున్న పెన్షనర్ల సంఖ్య 4441796. ఇందులో వద్ధులు 2556226 వితంతువులు 1045740 వికలాంగు లు 497056 పోగా మిగతా వారు చేనేత, కల్లుగీత వత్తులకు చెందినవారు. నెలసరి పెన్షను 200 రూపాయలుగా వున్నప్పుడు వీరి కోసం సాలీనా ప్రభుత్వ ఖజానాపై పడ్డ భారం 1100 కోట్లుగా వున్నది. ఇప్పుడు తాజాగా బాబు నిర్ణయంతో అది 5500 కోట్లకు చేరుకుంది. దీంతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాలీనా ఉచిత విద్యుత్‌పై 2200 కోట్లు బియ్యం సబ్సిడికి 1200 కోట్లు భరించాల్సి వుంటుంది.

వీటికి తోడు గత ప్రభుత్వం వదిలిపెట్టి వెళ్లిన స్కాలర్‌షిప్పుల భారం, ఫీజు రీయంబర్స్‌మెంటు భారం తడిసిమోపెడు అయినవి. అసలే లోటు బడ్జెట్‌తో వున్న నవ్యాంధ్రకు వీటి అమలు భారంగా మారే అవకాశముంది. ఈ ఆర్థికపరమైన ఇబ్బందులను దష్టిలో వుంచుకునే బాబు పెంచిన పెన్షన్లు అక్టోబరు నుంచి అమలులోకి వస్తా యని ప్రకటించింది. అక్టోబరు వరకు పెన్షనర్ల పెన్షన్లలో ఎలాంటి మార్పు వుండబోదన్నమాట. పెరిగే ది కేవలం అక్టోబర్‌లోనే. పెంచిన పెన్షన్ల అమలు అక్టోబర్‌లో అయినప్పుడు జూన్‌లో వాటి గురించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిం ది? అన్నది ప్రశ్న. పెంచిన పెన్షన్ల అమలుపై బాబు కల్పించుకుంటున్న ఈ నాలుగు నెలల వెసులుబా టు కేవలం తాను నూతన రాష్ట్రంలో ఎదుర్కోబో యే ఆర్థిక సమస్యలను అధిగమించడానికి తీసుకుంటున్న గడువు తప్ప వేరే కారణం లేదు.

ఇక చివరిదైన ఉద్యోగులు పదవీ విరమణ వయోపరిమితిని 58 నుంచి 60కి పెంచుట గురిం చి చూద్దాం. రాష్ర్టాల విభజన జరిగినప్పుడు వివిధ రంగాలలోని పంపకాలకు ప్రామాణికమైన నిబంధనలున్నాయి. ఆస్తులను అప్పులను పంచేప్పుడు జనాభాను ప్రాతిపదికగా తీసుకుని పంపకం చేస్తరు. ఉద్యోగస్తుల విషయంలోనైతే మన రాష్ట్రంలో వారి నియామకాల విషయంలో విధిగా పాటించవలసిన రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులో వున్నాయి. వీటికి రాజ్యాంగపరంగా చట్టబద్ధత కల్పించబడ్డది. ఉమ్మ డి రాష్ట్రంలోని ఉద్యోగస్తులకు ఈ ప్రాంతంలో అమలులోవున్న ఈ నిబంధనల ప్రకారం స్థానికత ఆధారంగా విభజించి ఎవరి ప్రాంతానికి వాళ్లను పం పా లి. స్థానికత ఆధారంగా ఎవరి ప్రాంతానికి వాళ్ళను పంపించాలనే ధ్యేయంతోటే ప్రభుత్వం కమలనాథన్ నేతత్వంలో కమిటీని వేసింది. కమిటీ ఇప్పటి వరకు ఉద్యోగుల విభజన విషయంలో పాటించవలసిన విధి విధానాలనే ఇంకా నిర్ధారించలేదు.

రాష్ట్రపతి ఉత్తర్వులు 610 జీవో లోకల్ క్యాడర్ మొదల గు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల్లో స్థానికులెవరో స్థానికేతరులెవరో నిర్ధారించాల్సి వుంటది. దీంతోపాటు దీనిపై ఉద్యోగస్తుల అత్యంతరాలను కూడా పరిశీలించి తుది జాబితా ప్రకటించాల్సి వుంటది. స్థానికత ఆధారంగా ఉద్యోగులను ఎవరి ప్రాంతానికి వాళ్లను పంపేందుకు కనిష్టంగా మూడునెలలు గరిష్టంగా పది మాసాల కాలం పడ్తుందని అధికారులే తేల్చి చెప్తున్నరు. ఎవరు ఏ ప్రాంత ఉద్యోగులో మొదట తేలిన తర్వాత పదవీ విరమణ వయోపరిమితి పెంచితే అర్థం వుంటది కానీ అది తేలక ముందే అక్కడి వారిక్కడ ఇక్కడి వారక్కడ పనిజేస్తున్నప్పుడు పదవీ విరమణ వయస్సు పెంచ డం అర్థరహితం.
ఈ మూడు అంశాలను ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కూడా అమలు చేయాల్సి వుంది.

ఎందుకంటే టీఆర్‌ఎస్ కూడా తమ ఎన్నిక ల ప్రణాళికలో వీటిని చేర్చి వాటిని అమలు పరుస్తానని ప్రజలకు వాగ్దానం చేసింది. అలాంటప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి రెండు ప్రాంతాలలో వీటి అమలు గురించి చర్చించి విధి విధానాలను సమష్టిగా రూపొందించుకుని అమలు చేసివుంటే ఒక మంచి సంప్రదాయం నెలకొని వుం డేది. అలాంటి నిర్ణయం నూతనంగా ఏర్పడిన రెం డు రాష్ర్టాలకు ఎంతగానో మేలు చేసేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలు వాటి ప్రభావం తెలంగాణపై వుంటాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తీసుకునే నిర్ణయాలు వాటి ప్రభా వం నవ్యాంధ్రప్రదేశ్‌పై వుంటాయన్న విషయాన్ని బాబు దష్టిలో పెట్టుకుని వ్యవహరించి వుంటే బాగుండేది. కానీ దానికి భిన్నంగా బాబు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం విచారకరం.

పొఫెసర్ జి. లక్ష్మణ్


1015

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష