ఆప్షన్లవాదం బూటకం


Fri,March 28, 2014 12:20 AM

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగుణంగా జరిగినవా లేదా అన్నదే కమలనాథన్ కమిటీ పరిశీలించాల్సిన అంశం.రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి జరిగిన నియామకాలే స్థానిక ఉద్యోగులుగా పరిగణించాలి.

జూన్ రెండు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టా లు అధికారికంగా ఉనికిలోకి రాబోతున్నాయి. రెండు రాష్ర్టాల మధ్య జరగవలసిన పంపకాలు వేగం పుంజుకుంటున్నా యి. వివిధ రంగాలలో జరగవలసిన పంపకాల ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని ఈనెల 22న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రాష్ట్ర విభజన కమిటీల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల విభజన కీలకమైన అంశమని అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ఉద్యోగుల పంపకాల కోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి కమలనాథన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆకమిటీ త్వరలోనే ఉద్యోగుల పంపకాలలో పాటించవలసిన నియమ నిబంధనలను రూపొందిస్తుందని వాటినే ప్రామాణికంగా తీసుకుంటామని అన్నారు. జూన్ రెండో తేదీన రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు కొలువు తీరేందుకు వీలుగా మే నెల రెండవ వారంలోగా విభజన పూర్తిచేయాలని గవర్నర్ అధికారులను ఆదేశించారు.
రాష్ర్టాల విభజన జరిగినప్పుడు వివిధ రంగాలలో పంపకాలకు ప్రామాణికమైన నిబంధనలున్నాయి. వాటి ప్రకారమే లోగడ రాష్ర్టాల విభజన జరిగినప్పుడు పంపకాలు జరిగాయి. ఆస్తులను,అప్పులను పంచేప్పుడు జనాభాను ప్రాతిపదికగా తీసుకుని పంపకం చేస్తారు. ఉద్యోగస్తుల విషయంలోనైతే రాష్ట్ర విభజన పిదప ఏ రాష్ట్రంలో వుండాలని కోరుకుంటున్నారనే ఆప్షన్ కూడా అడుగుతారు. దాని ప్రకారమే ఉద్యోగుల పంపకాలు జరుగుతాయి.
ఉదాహరణకు ఉద్యోగ రంగాన్నే తీసుకుంటే మన రాష్ట్రంలో ఉద్యోగస్తుల నియామకాల విషయంలో విధిగా పాటించవలసిన రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. వీటికి రాజ్యాంగ పరంగా చట్టబద్ధత కల్పించారు. 32వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 371డీ ద్వారా వెలువడిన ఈ రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే మన దగ్గర ఉద్యోగ నియామకాలు విధిగా జరపాలనే ఆదేశాలు 1975లోనే వచ్చినవి. అంతేగాకుం డా ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించటానికి దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను కూడా నెలకొల్పడం జరిగింది.
నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగుణంగా జరిగినవా లేదా అన్నదే కమలనాథన్ కమిటీ పరిశీలించాల్సిన అంశం.రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి జరిగిన నియామకాలే స్థానిక ఉద్యోగులుగా పరిగణించాలి.
వాటికి విరుద్ధంగా జరిగిన నియామకాలను స్థానికేతరులుగా నిర్థారించాలి. ఉద్యోగుల పంపకాలు జరిగినప్పుడు స్థానికేతర ఉద్యోగస్థులను ఎవరి ప్రాంతానికి వారిని పంపించడం రాజ్యాంగాన్ని గౌరవించినట్టు. లేనిచో రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే. ఉద్యోగస్తులు ఏ ప్రాంతంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో తెలిపే స్వేచ్ఛ (ఆప్షన్స్) ఉద్యోగుల పంపకాలు ఇరు రాష్ర్టాల మధ్య జరుగుతుంది అనటం రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. ఈ విషయంలో ఉద్యోగస్తులకు ఎలాంటి స్వేచ్ఛగానీ ఆప్షన్స్‌గానీ వుండవు.
ఆప్షన్స్ ప్రకారం ఉద్యోగుల పంపకాలు జరగాలనే వారు ఇంకో వాదనను కూడా తెరపైకి తెస్తున్నరు. అదేమంటే జిల్లాస్థాయి, జోనల్ నాన్ గెజిటెడ్, జోనల్ గెజిటెడ్ ఉద్యోగులు ఎక్కడి వారు అక్కడే వుంటారట. వారిని ముట్టుకోకూడదట. ఎందుకంటే అవన్ని లోగడ రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి జరిగిన నియామకాలే అన్నది వీరి వాదన.
జిల్లా స్థాయి ఉద్యోగాలలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వు చేసిన ఉద్యోగాలుగా పరిగణిస్తూ మిగతా 20శాతం స్థానికేతరులకు రిజర్వు చేసిన ఉద్యోగాలుగా, అదే విధంగా జోనల్ నాన్‌గెజిటెడ్ ఉద్యోగాలలో 70 శాతం స్థానికులవిగా మిగతా 30 శాతం స్థానికేతరులవిగా, అదేవిధంగా జోనల్ గెజిటెడ్‌లో 60శాతం స్థానికులవిగా మిగతా 40 శాతం స్థానికేతరులవిగా పరిగణిస్తూ నియామకాలు చేయ టం తప్పు అని ప్రభుత్వం నియమించిన గిర్‌గ్లాని కమిటీ పేర్కొంది.
జిల్లా స్థాయిలో స్థానికేతరుల కోటాగా పరిగణించబడిన 20శాతం గానీ, జోనల్ నాన్ గెజిటెడ్‌లోని 30శాతం గానీ, జోనల్ గెజిటెడ్‌లోని 40శాతం ఉద్యోగాలు గానీ స్థానికేతరులకు రిజర్వు చేసిన ఉద్యోగాలు ఎంతమాత్రం కావు. వాటిని ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ చేయాలని, వాటికి అందరూ అర్హులేనని మెరిట్ ప్రాతిపదికపై వాటిని భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఈ నియమాలను పాటించకపోవడం మూలంగా 30 శాతం మంది స్థానికేతరులు తెలంగాణలోని ఐదు, ఆరు జోన్లలో పనిజేస్తున్నారు. తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు 4,03,002 మంది.
సాలీనా వాళ్లకు వేతనాల రూపంలో చెల్లిస్తున్నది 11,451 కోట్లు. ఇందులో 30 శాతం స్థానికేతరులు. ఉద్యోగస్తుల సర్వీస్ రిజిష్టర్లలో నమోదు అయిన స్థానికత, వాళ్ల విద్యాభ్యాసానికి సంబంధించిన సర్టిఫికెట్లు, వాళ్లు జన్మించిన ప్రాంతం మొదలగు వాటి ఆధారంగా ఎవరు ఎక్కడివారో నిర్ధారించి ఎవరి ప్రాం తానికి వాళ్లను పంపించడమే సమన్యాయం.
ఉద్యోగుల పంపకాల విషయంలో కొంతమంది మరో వితండవాదాన్ని తెరపైకి తెస్తున్నారు. వారి వాదన ప్రకారం జిలా ్లస్థాయి, జోనల్ నాన్ గెజిటెడ్, జోనల్ గెజిటెడ్ ఉద్యోగులు ఎక్కడి వారు అక్కడే ఉంటారట. రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించని కార్యాలయాలు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్ర వ్యాప్త పరిధిగల కార్యాలయాలు, స్టేట్ ఆఫీసెస్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంటు, మేజరు డెవలప్‌మెంటు ప్రాజెక్టులు వీటిలో పనిచేసే ఉద్యోగస్తులను మాత్రమే విభజించాల్సి వుంటదట. వీరి వాదన ప్రకారం ఈ కార్యాలయాల్లో మొత్తంగా వున్న పోస్టులు 72 వేలు.
వీటిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు 56 వేలమంది. ఈ 56వేలలో సీమాంధ్రకు చెందిన 2800 మంది తెలంగాణలో, తెలంగాణకు చెందిన 1200 మంది సీమాంధ్రలో పనిచేస్తున్నారని వారినే స్థానికేతరలుగా పరిగణించి వారికి ఆప్షన్స్ ఇచ్చి సమస్యను పరిష్కరించాలంటున్నారు. వీరి వాదన ఆక్షేపణీయమైనది. ఎందుకంటే ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన ఈ కార్యాలయాల్లో సీమాంధ్రుల అక్రమ నియామకాలు పెద్ద మొత్తంలో జరిగాయి.
ఉద్యోగుల పంపకాలప్పుడు ఎవరి స్థానికత ఆధారంగా వారిని వారివారి రాష్ర్టాలకు పంపాలి. లేనట్లయితే తెలంగాణ రాష్ట్రం మనదయినా పాలన మాత్రం పరోక్షంగా వాళ్లదే అవుతుంది. ప్రాంతం మనది పాలన వాళ్లదవుతుంది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే.. తెలంగాణ వివిధ జిల్లాలోని ట్రెజరీల ద్వారా పెన్షన్లు పొందుతుంది 2 లక్షల 39 వేలమంది. వీరికి సాలీనా చెల్లిస్తుంది 5004 కోట్లు. ఒక్క జంటనగరాలలోనే 92,302 మంది పెన్షనర్లు ఉన్నారు.
వీరికి సాలీనా చెల్లిస్తుంది 2070 కోట్లు. ఈ పెన్షనర్లలలో చాలామంది స్థానికేతరులున్నారు. ఈ పెన్షనర్ల స్థానికతను వాళ్ల సర్వీసు రిజిష్టర్ల ద్వారా నిర్ధారించి ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతపు ట్రెజరీల నుంచే పెన్షన్‌లు ఇవ్వాలి. రాష్ట్ర విభజన సందర్భంగానైనా ఉద్యోగుల పంపకాలు వారి స్థానికతను బట్టి ఎవరి ప్రాంతానికి వాళ్లను పంపించి సమన్యాయం చేయాలి.
పొఫెసర్ జి. లక్ష్మణ్
-టి. వివేక్, వాణిజ్యపన్నుల శాఖ
-టి. వెంకటేశ్వర్లు, వాణిజ్య పన్నులశాఖ
-ఎన్. అశోక్‌రెడ్డి, వాణిజ్యపన్నుల శాఖ

314

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష

Featured Articles