పొంచివున్న కరెంటు కష్టాలు


Wed,March 19, 2014 02:59 AM

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా తగ్గుతున్నది. సాగు విస్తీ ర్ణం తగ్గుదలకు కారణాలు అనేకం ఉన్నా ప్రధాన కారణాలు మాత్రం పట్టణీకరణ, పారిశ్రామీకరణ, రియల్ ఎస్టేట్, సెజ్ లు మొదలగునవి. తెలంగాణలో సాగుభూమి విస్తీర్ణం 1956 లో 46,57,22 హెక్టార్లుగా వున్నది. 2002 నాటికి 40,2,37 హెక్టార్లకు పడిపోయింది.
ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే వ్యవసాయానికి అనువైన భూమి 60 ఏళ్లల్లో దాదాపు 30శాతం వ్యవసాయేతర అవసరాలకు బదిలీ అయింది. తెలంగాణ ప్రాంతంలోని మొత్తం భూకమతాలలో ఐదు ఎకరాల లోపు భూ కమతాలు కలిగి వున్న రైతులు 75 శాతం. వారి దగ్గర వున్న భూమి 40 శాతం. ఈ ప్రాంతంలో జరిగిన భూపోరాటాలు, రక్షిత కౌలుదారు, సీలింగ్ చట్టాలు, భూ పంపిణీల వల్ల గత 60 ఏళ్లలో భూస్వామ్య మధ్య తరగతి రైతుల నుంచి వ్యవసాయ భూమి పేద రైతుల చేతుల్లోకి మారింది.
ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారి చేతుల్లోకి, గత 70 ఏళ్లనుంచి తెలంగాణలో జమాబందీ జరగక పోవటం వల్ల వాస్తవ స్థితికి భూమి రికార్డుల మధ్య పొంతన లేకుండా పోయి వీరి మధ్య భూసంబంధ సమస్యలు పెద్ద మొత్తంలో చోటుచేసుకుం టున్నాయి. దీనికి తోడు వీరి వ్యవసాయ క్షేత్రాలకు నీటి వసతులు సరిగా లేకపోవటంతోపాటు వ్యవసాయ ఖర్చులు పెరగడం, కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుల మందులు, పండిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించకపోవడం, చాలీచాలని భూకమతాలు వుండటం మూలంగా చాలామంది రైతులు సాగు నుంచి తప్పుకుని కూలీలుగా మారుతున్నారు.
1956 నాటికే తెలం గాణలో వున్నటువంటి లక్షకు పైగా చెరువులు కుంటల ద్వారా 5 లక్షల 30 వేల హెక్టార్ల భూమికి సాగునీటి సౌకర్యం కల్పించబడింది. ఉమ్మడి రాష్ట్రం లో పాలకుల వివక్షకు గురైన చెరువులు, కుంటలు ధ్వంస కావటంతో వాటి కింద పారకం నేడు 2 లక్షల హెక్టార్లకు పడిపోయింది. తెలంగాణలో నీటి వసతి గల భూమిలో 1 శాతం ప్రాజె క్టుల కింద 15 శాతం చెరువులు కుంట కింద వుండగా 64 శాతం బోర్లు బావుల కింద వున్నది.
మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో ప్రాజెక్టుల కింద సాగవుతున్న భూమి 11శాతం లోపే వుందంటే అతిశయోక్తి కాదు. ప్రాజె క్టుల ద్వారా నీటివసతి కల్పించబడిన భూమి సగటున మనదేశంలో 30 శాతం కాగా ఇది తెలంగాణలో 1శాతం లోపే వున్నది. ప్రాజెక్టులు కట్టి కాల్వల ద్వారా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నీటి వసతి కల్పించకపోగా పాలకులవివక్షతో వున్న చెరువులు కుంటల వ్యవస్థ కూడా ధ్వంసం కావడంతో రైతులు అనివార్యంగా గత్యం తరం లేక బోరుబావులపై ఆధారపడు తున్నారు. రైతులు తమ భూకమతా లకు నీటి వసతికై బోరుబావుల వైపు మళ్లడం190లో క్రమంగా ప్రారంభ మయింది. 1956లో తెలంగాణలో 16 శాతం భూమికి సాగునీటి సౌకర్యం బావుల కింద వుంటే ఇప్పుడది తోట్ల బావుల కింద సుమారు 64 శాతం చేరుకుంది.
దీంతో తెలంగాణలోని వ్యవసాయం పూర్తిగా విద్యుత్‌శక్తిపై ఆధారపడి నడుస్తున్నది. విద్యుత్ వుంటేనే తెలంగాణలో వ్యవసాయం అది లేకుంటే ఇక్కడి వ్యవసాయం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలోని విద్యుత్ పంపు సెట్లలో 60 శాతంపైగా పంపుసెట్లు తెలంగాణ లోనే వున్నవి. తెలంగాణలో వున్న 1 లక్షల పంపుసెట్ల కింద సాగవుతున్న భూమి 35 లక్షల ఎకరాలు. ఈప్రాంతంలో సాగునీటి వసతి 64శాతం విద్యుత్‌శక్తి ఆధారంగానే లభిస్తుంది.
వ్యవసాయానికి ప్రభుత్వం రోజుకు మొత్తంగా 7 గంటలపాటు విద్యుత్ సరఫరాను దశలవారీగా 3 గంటలకు ఒకసారి 4 గంటలు ఒకసారి గా ఇస్తుంది. మొత్తంగా తెలంగాణలోని పంపు సెట్లకు వినియోగిస్తున్న విద్యుత్తు సుమారు 11000 మెగా యూనిట్లు. ఈఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీలు రైతులకు తొమ్మిదిగంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తును ఇస్తామని వాగ్దానం చేసినా అవి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోగలమా అన్నది ప్రశ్న.
ఇప్పటి వరకు తెలంగాణలో చేపట్టిన ఏభారీ నీటిపారుదల ప్రాజెక్టు నేటికి పూర్తికాలేదు. జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాంతంలో 13 భారీ నీటిపారు దల ప్రాజెక్టులతో పాటు 40కి పైగా మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. వీటి ద్వారా తెలంగాణలో అదనంగా 40 లక్షల ఎక రాలు సాగులోకి వస్తుందని నిపుణుల అంచనా. జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులలో అధికభాగం ఎత్తిపోతల పథకాలే.
ఈ నీటి పారు దల ప్రాజెక్టులన్నీ రాబోయే ఐదేళ్లలో పూర్తి అయ్యే అవకాశముంది. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికి 500 మెగావాట్ల విద్యుత్తు అవసరమ వుతుం ది. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలకే సుమారు 600 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే తెలంగాణలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుంది.
దీనికి తోడుగా నేడు జంట నగరాల లో వినియోగిస్తున్న విద్యుత్తు 1500 మెగావాట్లు. 2020 నాటికి అది 5000 మెగావాట్లకు చేరుకుంటుందని నిపుణుల అంచనా. దీంతో పాటు తెలంగాణలో, జంటనగరాలలో నడిచే రైళ్లకు 1000 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుంది. ఈవిధంగా తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రాబోయే ఐదేండ్లలో అనూహ్యంగా పెరిగే అవకాశముంది. దీంతో డిమాండ్ సప్లయ్‌ల మధ్య వ్యత్యాసం కూడా భారీగానే వుండే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని నిబంధనల ప్రకారం తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు తెలంగాణకే చెందుతుంది. స్టేటు, సెంట్రల్, ప్రైవేటు సెక్టార్ల నుంచి తెలంగాణకు ప్రస్తుతం అందుబాటులో వున్న విద్యుత్తు 5000 మెగావాట్లు. ఇందులో ధర్మల్ 2500 మెగావాట్లు జలవిద్యుత్తు 2300 మెగావాట్లు.
ధర్మల్ విద్యుత్పాదన సాలీనా జరిగినా జలవిద్యుత్పాదన మాత్రం సాలీనా జరగదు. ఏడాదిలో 90-100 రోజుల లోపే జలవిద్యుత్పాదన జరిగేది. తెలంగాణలో మొత్తంగా అందుబాటులో వున్న విద్యుత్తు 5000 మెగావాట్లు అయితే వినియోగం 500 మెగావా ట్లు. లోటు 3500- 4000 మెగావాట్లు వుండే అవకాశముంది. సాలీనా ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లకు 1500 కోట్లు భరించాలి. 2020 నాటికి తెలంగాణలో విద్యుత్ అవసరాలు 20 వేల మెగావాట్లకు చేరుకునే అవకాశ ముంది.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పాలకులు విద్యుత్ రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక్కడ థర్మల్ విద్యుత్ ఉత్పాదనకు కావల్సిన వనరులు, బొగ్గు, నీళ్లు పుష్కలంగా వున్నా వివక్షతో పాలకులు విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను మాత్రం ఆశించిన స్థాయిలో నెలకొల్పలేదు. 300 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంగల వివిధ థర్మల్ కేంద్రాలు నిర్మాణం నత్తనడకన నడుస్తున్నది. వాటిని యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలి. వీటితోపాటు 3100 మెగావాట్ల సామర్థ్యంగల గ్యాస్ ఆధారిత కేంద్రాలై న శంకర్‌పల్లి,కరీంనగర్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులు చేయించుకుని వాటిని శీఘ్రంగా పూర్తి చేసుకోవాలి. వీటితోపాటు రెండు అల్ట్రా మెగాపవర్ ప్లాంట్ల ను 2020లోపే పూర్తి చేసుకోకుంటే కరెంటు కోతలు కష్టాలు తప్పవు.
పొఫెసర్ జి. లక్ష్మణ్, ప్రొఫెసర్ ఉమేష్
పొఫెసర్ మధుకర్‌పొఫెసర్ భాస్కర్

356

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష