అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?


Tue,March 11, 2014 03:17 AM

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లు మళ్ళీ ఉద్యమిస్తున్నారు. వీరి పోరాటం ఈనాటిది కాదు. దాదాపుగా రెండు దశాబ్దాలుగా వీరి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వం నియమించిన ఉద్యోగుల శ్రేణిలో అతితక్కువ జీతభత్యాలతో అతి చిన్న ఉద్యోగులు వీరే. ఈ చిరుద్యోగుల చిన్న డిమాండ్లను పరిష్కరించలేని ప్రభుత్వ సమర్ధ త ఏపాటిదో తెలిసిపోతున్నది.

అంగన్‌వాడీలకు కనీస వేతనం 10వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద అంగన్‌వాడీ టీచర్లకు లక్ష, ఆయా లకు 50వేలు ఇవ్వాలనే డిమాండ్లు పరిష్కరించలేని ఆర్థిక సమస్య ఏమీ కాదు. ప్రభుత్వానికి వివేచన, చిత్తశుద్ధిలేక పోవడమే వారికి శాపంగా మారిం ది. పైగా వారిపై వివక్ష, అణచివేతలకు గురి చేస్తున్నది. ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్లకు నెలకు 4,200,ఆయాలకు 2,200 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. అవి కూడా ఆర్నెళ్ళకొకసారి ఇస్తుండటం వల్ల అప్పుల పాలవుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వాలు అదుపు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందడం వల్ల వీరి జీవన ప్రమాణాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి.

ప్రభుత్వపరంగా జరుగుతున్న వైఫల్యాల నేపథ్యంలో ఏ విన్నపాలు లేకుండానే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. అభ్యర్థనలన్ని పెడచెవిన పెట్టడంతో ఇచ్చిన హామీలన్ని గాలిలో కల్సిపోవడంతో అంగన్‌వాడీలు ప్రత్యక్ష చర్యలకు దిగుతున్నారు. జిల్లా స్థాయిలోను, ప్రాజెక్టు స్థాయిలోను అనేక ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. వేలాది ఉత్తరా లు ముఖ్యమంత్రికి, స్త్రీ శిశు సంక్షేమ మంత్రికి, కమిషనర్‌కు రాశారు. లక్షల సంతకాలు సేకరించి ప్రధానికి వినతి పత్రాలు పంపించారు. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేల చేత కూడా ఉత్తరాలు రాయించారు. ఫలితం లేకపోవడంతో 1996 ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద జరిగిన సభలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగన్‌వాడి ఉద్యోగుల డిమాండ్లను అంగీకరిస్తూ ప్రకటన చేశా రు.

అంగన్‌వాడి సెంటర్ల అద్దెలు పెంచడానికి, 15 రోజుల వేసవి సెలవులు ఇవ్వడానికి, 4 నెలల ప్రసూతి సెలవులివ్వడానికి, వంటకట్టెలకు ఇచ్చే మొత్తాలను 40 శాతం పెంచేందుకు అంగీకరించారు. అలాగే అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వడానికి, ఇళ్ళ స్థలాలు గహనిర్మాణాలు, రేషన్ కార్డు లు, వారి పిల్లలకు హాస్టళ్ళలో సీట్లు ఇవ్వడానికి, స్త్రీ శిశు సంక్షేమశాఖలో ఏర్పడిన ఖాళీలలో 50 శాతం అంగన్‌వాడి ఉద్యోగులకు కేటాయింపు చేయడానికి ఆనాడు బాబు అంగీకరించారు.

చంద్రబాబు హామీలు ఇచ్చినంత వేగంగా మర్చిపోతే.. నాలుగేళ్ళ తర్వా త అంగన్‌వాడి ఉద్యోగులు తిరిగి ఉద్యమించి 2000మార్చి 30న హైదరాబాద్‌లో వేలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని శాంతియుతంగా ప్రదర్శన జరిపిన మహిళలపై బ్రిటీష్ వారిని మరిపించే రీతిలో లాఠీచార్జ్ చేశారు. గుర్రాలతో తొక్కించా రు. టియర్‌గ్యాస్ వదిలారు. వాటర్ పంపులతో ఊపిరాడకుండా చేశారు. అనేకమందికి తలలు పగిలాయి. కాళ్ళు చేతులు విరిగాయి. చంద్రబాబు పాలన ఎంత ఫాసిస్టుగా సాగిందో ఇందిరాపార్కు సమీపంలో ఆనాడు అంగన్‌వాడి మహిళలపై జరిగిన పాశవిక దాడే నిదర్శనం. సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కారాలను పోలీసుల బల ప్రయోగాలకు వదిలివేయటానికి అలవాటు పడిన ప్రభుత్వాలు ఇప్పటికీ గుణపాఠాలు నేర్చుకోలేదు. దీర్ఘ కాలం గా అపరిష్కతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడి ఉద్యోగులు 2014 ఫిబ్రవరి 17నుంచి తిరిగి సమ్మెకు పూనుకున్నారు. దీంతో ప్రభుత్వం కంటితుడుపుగా పెంచి చేతులు దులుపుకున్నది.

గ్రామీణ, గిరిజన, పట్టణ మురికివాడల్లోని పేద మహిళలు, పిల్లల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అనేక పథకాల అమలులో అంగన్‌వాడీ ఉద్యోగులు విశేషంగా కషి చేస్తున్నారు. గ్రామ సీమల్లో పేద ప్రజల వివరాలు కావాలన్నా, ఓటర్ల జాబితాలు కావాలన్నా, ప్రభుత్వ పథకాలు అమలు కావాలన్నా, ప్రభుత్వాలు అంగన్‌వాడీ ఉద్యోగులపైనే ఆధారపడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1.82 లక్షల మంది అంగన్‌వాడీ ఉద్యోగులు గ్రామ సీమల్లో పనిచేస్తున్నారు. వీరంతా ఫిబ్రవరి 17 నుంచి సమ్మెకు దిగడంతో పసిపిల్లల, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడింది. 1975లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సమగ్ర శిశు అభివద్ధి పథకం కింద గర్భిణీ స్త్రీల, బాలింతల, పసిపిల్లల ఆరోగ్య సంరక్షణ బాధ్యత అంగన్‌వాడీ ఉద్యోగులు నిర్వహిస్తున్నారు.

ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహార ప్రాముఖ్యంపై అవగాహన కల్పిస్తూ, పిల్లలకు చదువులు చెప్తారు. తల్లిదండ్రులు, వ్యవసాయ పనుకెలెళ్ళినపుడు, పిల్లలకు టీకాలు వేయించడం, మహిళలకు ఆరోగ్య పరీక్షలు, అనారోగ్య సమస్యలపై నిపుణులైన డాక్టర్లను సమకూర్చ డం వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పిల్లలకు చదువు, క్రమశిక్ష ణ, దేశభక్తి, ఆటలు, పాటలు, నేర్పించి, పాఠశాల పూర్వ అవగాహన సమగ్రంగా పెంపొందించి, పిల్లలను సమర్ధవంత విద్యార్థులుగా సాంప్రదాయ పాఠశాలలో చేర్పిస్తున్నారు. దీనికి తోడు ఓటర్ల నమోదు, ఇందిరా అమత హస్తం లాంటి గ్రామీణ ప్రాంతాలను ఉద్దేశించిన పథకాలను వీరితో అమలు చేయిస్తూ పనిభారం పెంచింది. కానీ వీరి జీతాలను మాత్రం పెంచలేదు. దీంతో గ్రామీణ నిరుపేద పిల్లలను రేపటి సమర్ధ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యం తో నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలోను, రాష్ట్రంలోను తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం వీరికి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. అపరిష్కతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి గ్రామీణ పేద, శిశు, మహిళ సంక్షేమంపై తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.
పొఫెసర్ లక్ష్మణ్ గడ్డం
పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షులు

522

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష

Featured Articles