విభజన పై వితండవాదాలు


Wed,August 14, 2013 11:09 PM

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ప్రగా ఢ ఆకాంక్ష. అది సాకారం కాబోతున్న తరుణంలో దానికి వివిధ రకాల అడ్డంకులు సృష్టించడం అంటే మొత్తంగా తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరచడంతోపాటు అపహాస్యం చేయడమే అవుతుంది. అది అప్రజాస్వామికం. సమైక్యంగా ఉందామని మాలో ఎవ్వరు కోరుకోవటం లేదు. మూకుమ్మడిగా మేమంతా కోరుకుంటున్నది ఒక్కటే. అదే విభజన. మేము విడిపోతామంటే మీరు కలిసి వుందామంటున్నారు.ఎందుకు కలిసి ఉండా లో సహేతుక కారణం కూడా చెప్పరు. కలిసి వుండటం వల్ల మా నీళ్లు, నిధు లు, భూములు, కొలువులు అన్నీ మీ పాలైనవి. పోయినవి పోగా మిగతా వాటినైనా కాపాడుకోకుంటే మమ్ములను మా భావి తరాలు క్షమించవు. అందుకే మేము విభజన కోరుకునే ది. కలిసివుందామనే వాదనలోని మర్మం ‘మీది మీకే, మాది కూడా మీకే కావలన్న’ వక్రబుద్ధి తప్ప; ఆ వాదంలో బలం ఎక్కడుంది. భాష ఒక్కటైనంత మాత్రాన కలిసి వుండాలని లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వాడుతు న్న భాషగాని అతని వాదంగానీ కలిసి వుండేందుకు ఏమన్న దోహదపడే విధంగా ఉందా లేక విభజనకు తోడ్పడుతుందా?అతని వాదనంతా ఏకపక్షంగా లేదా? మీరు విడిపోతే మీరు మనుగడ సాధించలేరు. మీ దగ్గర జరిగే విద్యుత్ ఉత్పాదన మీ అవసరాలను తీర్చలేదు అంటున్నా రు. నిజమే మరి ఆవిధంగా చేసింది ఎవరు? విద్యుత్ ఉత్పాదనకు కావాల్సిన నీళ్లు, బొగ్గు మా దగ్గర లభిస్తే మీ దగ్గందుకు విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను నెలకొల్పింది.ఇది వక్రబుద్ధి కాదా! అందుకే మేము విడిపోవాలనుకునేది.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే ప్రాంతాలు వేరైనా ప్రజలందరి మధ్య మనమంతా ఒక్కటే అనే భావోద్వేగం ఉండాలి. ప్రాంతాలు వేరైనా అంతరంగాలలో మనమంతా ఒక్కటే అనే భావోద్వేగాన్ని రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి నేటి వరకు మీరు మాలో కల్గించలేక పోయిన్రు. సమైక్యతా భావాన్ని కల్గించకపోగా పైపెచ్చు మీరు మాకు కల్గించిన భావనలు మీరు వేరు మేము వేరు. మేమూ మీరు ఒక్కటి కాదు అన్న ఆధిపత్య ధోరణిని, తెలంగాణలో స్థిరపడిన స్థానికేతరులు మీతోపాటు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారు ఎందరో ఇక్కడ వున్నారు. వాళ్లంతా ఇక్కడి ప్రజలతో మమేకమై స్థాని క సమస్యలపై మాతోపాటు గళం కలుపుతూ మాలో ఒకరైనారు. అదే మీరు ఇక్కడే పుట్టామంటారు కానీ పాట ఇక్కడిది పాడరు. అందుకే మేము విడిపోవాలనుకుంటున్నాము. మాకు సహకరించండి.

మా తెలంగాణ పోరాటం ఆత్మగౌరవ పోరాటం. ఆత్మగౌరవం సమకూరేది స్వయం పాలనలోనే. అందుకే ‘మా పాలన మాకే’ అనే నినాదం తెరపైకి వచ్చింది. మా పాలన మాకే అన్న వాదానికి చారివూతక నేపథ్యం వుంది. కొన్ని వందల సంవత్సరాల కాలం నుంచి మా ప్రాంత ప్రజల్లో నాటుకుం టూ వచ్చింది ఒక దృఢ సంకల్పం. అదేమంటే మా పాలన మాకే కావాల ని. ఎందుకంటే చరివూతలో ఎప్పుడూ మేము పాలితులుగానే మిగిలిపో యాము గానీ పాలకులం కాలేకపోయామని. బహుమనీలు, కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీలు ఆ పిదప మీరు. చరివూతలో ఒక్కసారైనా పాలకులమై తే అదెట్లుంటదీ చూడాలని మాలో చాలాకాలం కితమే నాటుకున్న బీజం క్రమంగా ఎదిగి మొక్కగా మారి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షగా బలపడింది. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి చావాలని ఇక్కడి ప్రజలందరిలో వుంది. తమ ప్రాణం కన్నా రాష్ట్రం ముఖ్యమని ఇక్కడి ప్రజలు భావించడం వల్లనే రాష్ట్రం కోసం వెయ్యికి పైగా ఆత్మబలిదానాలు జరిగినవి. 2004 ఎన్నికలప్పుడు చంద్రబాబునాయున్ని నిలదీసిన పణికెర మల్లయ్య ఇదే విషయాన్ని ధృవీకరించిండు.

చంద్రబాబునాయున్ని తెలంగాణ విషయంలో తన వైఖరి చెప్పాలని నిలదీసిన మల్లయ్యను మీడియా వాళ్లు నీకు తెలంగాణ ఎందుకు కావాలి అని ప్రశ్నిస్తే, అతనిచ్చిన సమాధానం ‘ఇగో ఇప్పటి దాకా నేను కాంగ్రెస్ రాజ్యం చూసినా, తెలుగుదేశం రాజ్యం చూసినా, తెలంగాణ వొస్తే ఆ రాజ్యం ఎట్లుంటదీ చూడాలని వుంది అన్నడు. అంటే మల్లయ్య ఆశించి న మార్పు తెలంగాణ సమాజంలో అటు కాంగ్రెస్ పాలనలోగానీ లేదా తెలుగుదేశం పాలనలోగానీ రాలేదు. కనీసం ఆ మార్పు స్వయం పాలిత తెలంగాణలోనైనా వస్తుందో ఏమో అని ఆశిస్తున్నడు. అది అతని దృఢ విశ్వాసం. మనుషులను భౌతికంగా నిర్మూలించవచ్చు కానీ వారి మనస్సుల్లో ఉన్న విశ్వాసాలను, ఆకాంక్షలను, ఆశయాలను ఎవ్వరూ నిర్మూలించలేరు. మనుషులను నిర్మూలించే ఆయుధాలు ఇప్పటి వరకు కనుగొనబడినవి. వారి ఆకాంక్షలను విశ్వాసాలను నిర్మూలించే ఆయుధాలను ఏ అగ్రరాజ్యం కూడా ఇప్పటి వరకు కనిపెట్టలేదు. ప్రజావాక్కే దైవవాక్కుగా పరిగణించబడే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఆకాంక్షలను గౌరవించవలసిన కనీస బాధ్యత ప్రజలందరిపై వుంటది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది నాలుగు న్నర కోట్ల తెలంగాణ ప్రజలందరిదైనప్పుడు దాన్ని ప్రతి పౌరుడు విధిగా గౌరవించాల్సిందే. దాన్ని అడ్డుకోవటం అప్రజాస్వామికం.

రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచటమన్న విషయం 1971 ఎన్నికల్లోనే తేలిపోయింది. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రజలు పదే పదే నిరూపిస్తున్నరు. 1989 ఎన్నికల్లో ఎన్టీరామారావు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నియోజ క వర్గాల నుంచి ఎన్నికల బరిలోకి దిగితే రాయలసీమ, ఆంధ్రవూపాంతపు నియోజక వర్గాల నుంచి గెలిచిండు. కానీ తెలంగాణలోని కల్వకుర్తి నియోజకవర్గంలో మాత్రం ఘోరంగా ఓడిపోయిండు. అంతకు ముందు 1983 లో పర్వతనేని ఉపేంవూదకు కూడా ఇదే పరాభవం హిమయాత్‌నగర్ నియోజకవర్గంలో ఎదురైంది. అంటే ఈ ఎన్నికల్లో ఒక విషయం స్పష్టం అయింద న్న మాట. అదేమంటే తెలంగాణ ప్రజ లు స్థానికేతరులు తమ ప్రాంతం నుం చి చట్టసభల్లోకి ప్రవేశించే ప్రయత్నాన్ని ఈసడించుకుంటున్నారని, అలాంటప్పుడు ప్రజల్లో లేని సమైక్యత గురించి పాకులాడుటెందుకు?

హైదరాబాద్ సమస్యను తెరపైకి తెచ్చి హైదరాబాద్ అందరిది అంటున్నారు. ఒకప్పుడు మద్రాస్ కూడా మీకే కావాలన్నారు. మద్రాస్ మీకు దక్కిందా? మీకు దేనిపై హక్కు వుంటుందో దానిని కోరుకుంటే అది మీకు దక్కుతుంది తప్ప మీకు దేనిపైనైతే హక్కువుండదో దానిని కోరుకుంటే అది మీకెట్లు దక్కుతుందో మాకు ఓమానాన అర్థంకావటంలేదు. మాకే కాదు మీకు దప్ప అందరికి. ఉద్యోగస్తుల విషయంలో ఎవరో ఏమో అన్నారని రాద్ధాంతం చేస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం మానుకుని భాషా సిద్ధాంతాలను పక్కన బెట్టి, సమైక్యతా రాగాన్ని ఇకనైనా ఆపండి. ఎందుకంటే తెలంగాణ పై నిర్ణయం అయిపోయింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనే గాక యూపీఏ సమన్వయ కమిటీలో కూడా నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయం మారదు. ఇక మిగిలిందల్లా కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్రే. తెలంగాణ ఇవ్వడానికి కూడా అనేక కారణాలున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయపార్టీలు సహజంగా అనుసరించే ఓట్లు సీట్లు, కూడికలు తీసివేతలతోపాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకున్న అనివార్య నిర్ణయమిది. కాబట్టి ఈ నిర్ణయం మారదు. మారవలసింది మీరే.

పొఫెసర్ జి. లక్ష్మణ్, ప్రొఫెసర్ టి.కృష్ణారావు
పొఫెసర్ యస్. మల్లేష్, ప్రొఫెసర్ ఎ. జగన్

374

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Mon,June 24, 2013 11:18 PM

నేటికీ అవే చీకటి రోజులు

ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బా

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష