నేటికీ అవే చీకటి రోజులు


Mon,June 24, 2013 11:18 PM


ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాక్, సభా స్వాతంవూత్యా లు జీవన గమనంలో బాగమయ్యాయి. స్వతంత్ర భావాలు, అభివూపాయాల అమలు కోసం పోరాడే స్వేచ్ఛకు భారత రాజ్యాంగం హామీనిచ్చింది. ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులను హరించడానికి ప్రభుత్వాలు అనాదిగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కులు తమ యిష్టానుసార పాలనకు ఆటంకంగా భావిస్తున్నాయి. హక్కులను నిరాకరించడానికి పాలకులు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారుపాథమిక హక్కులను తాత్కాలికంగా నిలిపివేయడానికి ప్రత్యేక పరిస్థితుల్లో, దేశ భద్రత దృష్ట్యా ‘ఎమ్జన్సీ’ విధించే రాజ్యాంగం అవకాశాన్ని కల్పించింది. దీన్ని సాకుగా తీసుకుని నియంతృత్వ పాలనను కాపాడుకోవడానికి ‘ఎమ్జన్సీ’ ప్రకటిస్తున్నారు. యుద్ధ సమయాలలో ప్రకృతి వైపరీత్యాలలో విధించాల్సిన అత్యవసర పరిస్థితి (ఆర్టికల్ 351)ని తన స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు.

1971లో అలహాబాదు లోక్‌సభ ఎన్నికలలో రాజ్య యంత్రాంగాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినందుకు అలహాబాదు హైకోర్టు జస్టిస్ జగన్ మోహన్ లాల్ సిన్హా ఇందిరాగాంధీని ఆరేళ్లపాటు ఎన్నికలలో పాల్గొనకుండా నిషేధిస్తూ, జూన్ 12, 1975లో తీర్పు వెలువరించారు. దీంతో తన రాజకీయ జీవితానికి విఘాతం ఏర్పడిందని అనుకున్న ఇందిరాగాంధీ జూన్ 15, 1975న ‘ఎమ్జన్సీ’ విధించి భారత దేశంలో చీకటిరోజులు అనే అధ్యాయా న్ని 21నెలల పాటు కొనసాగించింది. లక్షలాదిగా ఉద్యమకారులను, రాజకీయ ప్రత్యర్థులను జైళ్లలో పెట్టింది. పోలీసుల చేత హింసించిం ది. ఉద్యమకారులను ‘ఎన్‌కౌంటర్’లతో చంపించింది.

21 నెలల్లో 70 మందిని బూటకపు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. అత్యవసర పరిస్థితి ప్రకటించి న వెంటనే మెదక్ జిల్లా గిరాయిపల్లె అడవిలో మొదటి ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో సూరపనేని జనార్ధన రావు, లంకా మురళీ మోహన్‌డ్డి, కొలిశెట్టి ఆనందరావు, వనపర్తి సుధాకర్‌లు అమరులయ్యారు. బొంబా యి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎం. తార్కుండె నాయకత్వాన తార్కుండె కమిటీ వాస్తవాలు సేకరించి ‘ఎన్‌కౌంటర్ బూటక’మని తేల్చి చెప్పింది. ఇంకా ఇందిరా ప్రభుత్వం బలవంతపు కుటుంబ ఆపరేషన్‌లతో ప్రజలను వేధించింది. బుల్‌డోజర్లతో గుడిసెలను నేలమట్టం చేసిం ది. ఇందిరాగాంధీ సాగించిన అక్రమాల గురించి ‘షా’ కమిషన్ విచారించి అక్రమాలను బహిర్గత పరచింది.

చివరికి అణచివేత బెడిసికొట్టి ఆమె అధికారానికే ముప్పు వచ్చింది. ఫలితంగా ఇందిరాగాంధీ ‘ఎమ్జన్సీ’ని ఇందిరా ఎత్తి వేసింది. ఆ తర్వాత 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో మార్పు వచ్చింది. ఎమ్జన్సీ ప్రకటించినా పౌరుల ప్రాథమిక హక్కులను పూర్తిగా తొలగించడం సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. బాధామయ గాధలు ఎన్నో ఉన్నా, ‘ఎమ్జ్జన్సీ’ కాలం మనందరికి ఎన్నో విలువైన పాఠాలను కూడా నేర్పిం ది. భవిష్యత్తులో ఎమ్జన్సీ చీకటిపాలన రాకుండా పోరాడాల్సిన అవసరాన్ని తెలియజేసింది. పాలకులు కూడా మరోరకం గుణపాఠాన్ని నేర్చుకున్నారు.అణచివేత ప్రయోగించడానికి ‘ఎమ్జన్సీ’యే ప్రకటించాల్సిన అవసరం లేదని గుర్తించారు. ప్రాథమిక హక్కులు నిరాకరించడానికి రాజ్యాంగ ఆమోదం అక్కర్లేదని అర్థం చేసుకున్నారు. ‘ఎమ్జన్సీ’ అని అనకుండానే నిర్బంధకాండను అమలు చేస్తున్నారు.

సరిహద్దుల్లో దేశరక్షణ కోసం పనిచేయాల్సిన మిలటరీ బలగాలను సొంత బిడ్డల మీద, ఆదివాసీల మీదికి పంపుతున్నారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో లక్షలాది మిలటరీ, పారమిలటరీ బలగాలను మోహరించి, ఆదివాసులు, పోరాడుతున్న వారి హననానికి పాల్పడుతున్నారు. సల్వాజు డుం, కోబ్రాల లాంటి చట్టవ్యతిరేక సంస్థలను ఏర్పాటు చేసి గ్రామాలలో ఇళ్లు కూల్చి వేయడం,పంట పొలాలను విధ్వంసం చేయడం లాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ప్రజా రాజకీయాలకు, ఉద్యమ సంస్థలకు ఉనికి లేకుండా చేస్తున్నారు. ఉద్యమాలతో సంబంధాలున్నాయం టూ వేలాది ప్రజలను, ఆదివాసీలను జైలుపాలు చేస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యకాండ పరాకాష్టకు చేరుకున్నది. పోయేకాలం దాపురించింది. ముఖ్యమంత్రి ‘తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వను’ ఏం చేసుకుంటారో చేసుకోండి అని తెలంగాణ ప్రజలను అసెంబ్లీ సాక్షిగా రెచ్చగొడుతున్నాడు. కిరణ్ కుమార్, అనురాగ శర్మల బూటుకాళ్ళ చప్పుళ్ళ కింద తెలంగాణ అణగదొక్కబడుతున్నది. తెలంగాణ గొంతులను చిదిమేస్తున్నారు. పాలకుల మోసపు మాటలకు గుండె చెదిరి ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి శవాలను కూడా ప్రజల కంటబడకుండా ఎత్తుకుపోతున్నారు. ఉద్యమకారులపై లాఠీలు, టియర్ గ్యాసులు, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చలో అసెంబ్లీ ఉద్యమంలో పాల్గొంటే నెలసరి పెన్షన్‌లు, రేషన్ వస్తువులను నిలిపి వేస్తామని బ్లాక్‌మెయిల్ చేశారు. జూన్ 14, 2013 నాటి ‘చలో అసెంబ్లీ’ రోజున ఎటువంటి సెలవు ఇవ్వకుండా బెదిరించారు. బస్సులు, రైళ్ళు మొత్తం రవాణా యంత్రాన్ని నిలిపివేశారు. హైదరాబాదులో ఇళ్ళ లో దూరి అరెస్టులు చేశారు.

అసెంబ్లీ చుట్టూ నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించారు. హైదరాబాద్ నగరమం తా పోలీసు మయం చేశారు. లక్షకు పైగా కేంద్ర బలగాను వినియోగించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ముఖ్య ఘట్టాలైన మిలియన్ మార్చ్, సడక్‌బంద్, సాగర హారం, చలో అసెంబ్లీపై అమలు చేయబడ్డ నిర్బంధం నాటి ‘ఎమ్జన్సీ’ని తలదన్నిందిపజా స్వామికం గా సాగుతున్న ఉద్యమాలను కూడా నిర్బంధకాండతో అణచాలని చూస్తున్నారు. అయితే కిరణ్ సర్కారు చరిత్ర పాఠాలు చదివితే తెలుస్తుంది. ఇందిరాగాంధీ లాంటి వారే ప్రజాక్షిగహం ముందు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. అధికారం నుంచి చెత్తకుప్పల మీదికి విసిరివేయబడ్డారు. లాఠీలు, తూటాలపై ఆధారపడి పాలన సాగిస్తున్న నేటి పాలకులకూ అదే గతి పడుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. చెర సాలలు ఉరికొయ్యలు ఉద్యమాలను ఆపలేవు. ప్రజా పోరాటాల ఉద్యమ చైతన్యంలోంచే కొత్త వెలుగులు ప్రసరిస్తాయి. ప్రజాస్వామిక విలువలు పుష్పిస్తాయి.

పొఫెసర్ లక్ష్మణ్ గడ్డం
ఆంధ్రవూపదేశ్ పౌరహక్కుల సంఘం

35

Professor G. Laxman

Published: Tue,April 25, 2017 01:40 AM

చైతన్య శిఖరం ఉస్మానియా

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యా ప్రమాణాల పరంగానే కాకుండా ఉద్యమాల పరంగా కూడా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నది. ముల్క

Published: Sun,September 27, 2015 05:57 AM

ప్రైవేటు వడ్డీని నియంత్రించాలె

ప్రభుత్వం ప్రకటించిన 17000 కోట్ల రుణమాఫీ వర్తించేది బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్న రైతులకే వర్తిస్తుంది తప్ప ప్రైవేటు వడ్డీ వ్యాపార

Published: Sat,August 22, 2015 12:41 AM

పల్లెలు ప్రగతికి పునాదులు

దేశ జనాభాలో 70 శాతం పైగా ప్రజలు నివసించేది గ్రామాల్లోనే. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాలు, దేశం అభివృద్ధి చెం దుతాయి అనే వి

Published: Sat,March 21, 2015 01:58 AM

కౌన్సిల్ ఆశయాలు నెరవేరాలంటే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన శాసనమండలి- రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట

Published: Wed,February 25, 2015 11:54 PM

ప్రజాకాంక్షను ఆప్ నెరవేర్చాలె!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అం తర్భాగంగా కీలకపాత్ర పోషించే ఎన్నికల్లో ఓటు అనే పదానికున్న అర్థం అభిప్రాయం అని. ఈ వ్యవస్థలో జరిగే ఎన్నికల

Published: Sat,February 14, 2015 01:23 AM

విద్యుత్ సమస్యలు-పరిష్కారాలు

ఇండ్లలో ప్రస్తుతం వాడుతున్న బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను,వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లు వాడటం ద్వారా విద్యుత్‌ను పెద్ద మొత్త

Published: Fri,November 21, 2014 12:51 AM

కరెంటు సమస్యకు కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న విధానాలు తెలంగాణను విద్యుత్ సంక్షోభానికి గురిచేస్తున్నాయి. రోజూ తెలంగాణలో 161 మిలియన్ యూనిట్ల విద్యుత్త

Published: Sat,October 11, 2014 12:36 AM

నిరుద్యోగ నిర్మూలన ఎట్లా?

అధికశాతం ఉద్యోగాలు లభించేది ఐటీ రంగంలోనే అన్నది నిర్వివాదాంశం. మనకున్న విద్యా నైపుణ్యాలను బట్టి అక్కడ ఉద్యోగాలుండవు. అక్కడి ఉద్యోగ

Published: Sun,August 10, 2014 02:40 AM

కమలనాథన్ కాకి కబుర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఎట్టకేలకు ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేస

Published: Sat,July 12, 2014 12:07 AM

నవ తెలంగాణకు నాంది ఐటీఐఆర్

ఐటీ ఐఆర్ ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఐటీ పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్గించాలి. అప్పుడే ఐటీ పరిశ్రమల్లో

Published: Wed,June 18, 2014 01:39 AM

వాగ్దానాలు తెచ్చిన చిక్కులు

జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఉనికిలోకి వచ్చాయి. అదేరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Published: Fri,March 28, 2014 12:20 AM

ఆప్షన్లవాదం బూటకం

నేడు తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 4,03,002. ఈ ఉద్యోగస్తుల నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలకు అనుగు

Published: Wed,March 19, 2014 02:59 AM

పొంచివున్న కరెంటు కష్టాలు

సుమారు 1,14,4,100 హెక్టార్ల తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో సాగవుతున్న భూమి 42,32,345 హెక్టార్లు మాత్రమే. సాగు విస్తీర్ణం ప్రతియేటా త

Published: Tue,March 11, 2014 03:17 AM

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం నిర్బంధా న్ని ప్రయోగిస్తుంది. ప్రజలకు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రంలో అంగన

Published: Wed,August 14, 2013 11:09 PM

విభజన పై వితండవాదాలు

సోదరులారా ఇది మీకు భావ్యం కాదు. ముమ్మాటికి కాదు. ఎందుకం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది మాలో ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు. అది నాలుగున్

Published: Thu,May 2, 2013 04:51 PM

ఎంతకాలం బాల‘శిక్ష’!

ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం పేద రాష్ట్రాల్లో ఒరి స్సా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పొట్టచేతపట్టుకుని రాష్ట్రంలోని ఇతర జిల్ల

Published: Thu,October 11, 2012 12:27 AM

బాబుది అధికార ఆరాటమే

మనసులో దాగున్న మర్మం చేతల్లో బయటపడుతుంది. చంద్రబాబు చేస్తున్న పాద యాత్ర అధికారం కోసమేనని ప్రారంభవేదికగా ఎంచుకున్న హిందూపురమే చెబ

Published: Sat,October 6, 2012 05:32 PM

కార్మికుల కష్టానికి గుర్తింపు ఏదీ?

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న బొగ్గు ప్రయోజనం, ప్రాధాన్యాన్ని ఈస్ట్‌ఇండియా కంపెనీ ప్రతినిధులు మన దేశంలో మొద

Published: Sat,October 6, 2012 05:32 PM

మా ఆకాంక్షపై మాదే తీర్పు..

తెలంగాణ అంశం మీద బీజేపీ ప్రతిపాదించిన సావధాన తీర్మానం ఈ నెల 5వ తేదీన లోక్‌సభలో చర్చకు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెలంగ

Published: Sat,October 6, 2012 05:33 PM

స్వరాష్ట్రంలోనే ఎన్నికలు

రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసులను అనుసరించి 1956లో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి సంఖ్య 28 కి చేరింది. అంటే మరో 14 రాష

Featured Articles